మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. | Mahindra Scorpio N Facelift 2026 Launched India Price features | Sakshi
Sakshi News home page

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..

Aug 5 2026 7:14 PM | Updated on Aug 5 2026 7:32 PM

Mahindra Scorpio N Facelift 2026 Launched India Price features

భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-ఎన్‌కు 2026 అప్‌డేట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.13.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్-ఎండ్ Z8L డీజిల్ ఆటోమేటిక్ 4WD వేరియంట్ ధర రూ.25.49 లక్షలకు చేరింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త స్కార్పియో-ఎన్‌లో ప్రధానంగా ఇంటీరియర్, టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లను అప్‌గ్రేడ్ చేయగా.. బయటి డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు.

డిజైన్, ఇంజిన్‌ అలాగే..

స్కార్పియో-ఎన్‌కు ఉన్న బాక్సీ, ఎత్తైన, రగ్డ్ డిజైన్‌ను మహీంద్రా కొనసాగించింది. ముందు భాగంలోని గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీ-ఆకారంలోని డీఆర్‌ఎల్‌లు, బంపర్, టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రధాన డిజైన్ అంశాలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. అయితే, టాప్‌ వేరియంట్లలో కొత్త 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు.

ఇక 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్లే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 203hp పవర్, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 175hp పవర్, 400Nm టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లకూ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లలో మహింద్రా 4XPLOR 4WD సిస్టమ్‌ కొనసాగుతోంది.

అసలు అప్‌గ్రేడ్ ఇంటీరియర్‌లోనే..

స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పులు క్యాబిన్‌లో కనిపిస్తాయి. పాత 8-అంగుళాల యూనిట్ స్థానంలో 12.3-అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ HD ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వచ్చింది. దీనికి ఆరు ఫిజికల్ షార్ట్‌కట్ బటన్లు ఇచ్చారు. అలాగే, గతంలో ఉన్న సెమీ-డిజిటల్ క్లస్టర్ స్థానంలో 10.25-అంగుళాల పూర్తిస్థాయి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, అడ్రినాక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలెక్సా బిల్ట్-ఇన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు వరుసలో 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే USB టైప్-C పోర్ట్ కూడా చేరింది.

పనోరమిక్ సన్‌రూఫ్, 540-డిగ్రీ కెమెరా

కొత్త స్కార్పియో-ఎన్‌లో తొలిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ 540-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా. ఇందులో బ్లైండ్-వ్యూ మానిటర్ కూడా ఉంటుంది. పార్కింగ్ సమయంలో వాహనం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మరింత స్పష్టంగా గమనించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇవే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12-స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-డిమ్మింగ్ IRVM, పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.

అడ్వెంచర్ స్టాటిస్టిక్స్

ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌ను ఇష్టపడే వారికి ‘అడ్వెంచర్ స్టాటిస్టిక్స్’ (Adventure Statistics) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో ఇంజిన్ పనితీరు, రోల్, పిచ్, కంపాస్, ఆల్టీమీటర్, జీ-ఫోర్స్ వంటి వివరాలను డ్రైవర్ చూడవచ్చు.

లెవల్-2 అడాస్‌ సేఫ్టీ

భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆల్-వీల్ డిస్క్ బ్రేకులు, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్, ISOFIX వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ Z8L వేరియంట్‌లో లెవల్-2 ADAS లభిస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై-బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


కొత్త స్కార్పియో-ఎన్ ధరలు

2026 మహీంద్రా స్కార్పియో-ఎన్‌ను Z2, Z4, Z6, Z8S, Z8, Z8T, Z8L వేరియంట్లలో అందిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లలో 4WD కూడా లభిస్తుంది. వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..

వేరియంట్పెట్రోల్ MTపెట్రోల్ ATడీజిల్ MTడీజిల్ ATడీజిల్ 4WD MTడీజిల్ 4WD AT
Z2రూ.13.69 లక్షలురూ.14.19 లక్షలు
Z4రూ.15.57 లక్షలురూ.17.16 లక్షలురూ.16.12 లక్షలురూ.17.68 లక్షలురూ.18.03 లక్షలు
Z6రూ.17.17 లక్షలురూ.18.82 లక్షలు
Z8Sరూ.17.79 లక్షలురూ.19.26 లక్షలురూ.18.79 లక్షలురూ.19.89 లక్షలు
Z8రూ.19.86 లక్షలురూ.21.41 లక్షలు
Z8Tరూ.20.38 లక్షలురూ.21.75 లక్షలురూ.20.65 లక్షలురూ.22.25 లక్షలురూ.22.86 లక్షలురూ.24.39 లక్షలు
Z8L 7-సీటర్రూ.21.31 లక్షలురూ.22.87 లక్షలురూ.21.99 లక్షలురూ.23.49 లక్షలురూ.24.25 లక్షలురూ.25.49 లక్షలు
Z8L 6-సీటర్రూ.21.69 లక్షలురూ.23.05 లక్షలురూ.22.47 లక్షలురూ.23.80 లక్షలు

పాత మోడల్‌తో పోలిస్తే ఎంట్రీ లెవల్ Z2 పెట్రోల్ మాన్యువల్ ధర రూ.20,000 పెరిగింది. టాప్-ఎండ్ Z8L డీజిల్ 4WD ఆటోమేటిక్ ధర రూ.54,000 అధికమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement