చిన్న కార్ల కోట.. బద్దలు కొట్టడం కష్టమే! | Seven of the top 10 used cars are hatchbacks, says Gears of Growth 2025 | Sakshi
Sakshi News home page

చిన్న కార్ల కోట.. బద్దలు కొట్టడం కష్టమే!

May 24 2026 5:28 AM | Updated on May 24 2026 5:28 AM

Seven of the top 10 used cars are hatchbacks, says Gears of Growth 2025

టాప్‌–10 యూజ్డ్‌ కార్లలో ఏడు హ్యాచ్‌బ్యాక్‌లే 

రెండు సెడాన్‌లు.. ఏకైక ఎస్‌యూవీగా ‘క్రెటా’ 

యూజ్డ్‌ ఎస్‌యూవీలకు డిమాండ్‌ పెరిగినా.. సరఫరా కొరత 

సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్లో ఇంకా మైలేజ్, మెయింటెనెన్స్‌కే ప్రాధాన్యత 

భారత యూజ్డ్‌ కార్ల మార్కెట్‌పై ‘గేర్స్‌ ఆఫ్‌ గ్రోత్‌ 2025’ నివేదిక విశ్లేషణ

భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్లో ఇప్పుడు స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) కార్ల హవా కొనసాగుతోంది. కొత్త కార్ల కొనుగోళ్లలో ఎస్‌యూవీలు భారతీయుల తొలి ప్రాధాన్యతగా మారుతున్నాయి. అయితే సెకండ్‌హ్యాండ్‌ (యూజ్డ్‌) కార్ల మార్కెట్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్‌ కార్ల ఆధిపత్యమే నడుస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా కొనుగోలు చేసే టాప్‌–10 యూజ్డ్‌ కార్ల జాబితాలో హ్యుందాయ్‌ క్రెటా మాత్రమే ఏకైక ఎస్‌యూవీగా చోటు దక్కించుకుంది. కార్స్‌ 24 – టీమ్‌–బీహెచ్‌పీ విడుదల చేసిన ‘గేర్స్‌ ఆఫ్‌ గ్రోత్‌ 2025’ నివేదికలో ఈ ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం...

భారత్‌లో సెకండ్‌హ్యాండ్‌ ఎస్‌యూవీ కార్లకు డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. యూజ్డ్‌ కార్ల మార్కెట్లో 2023లో 15 శాతంగా ఉన్న ఎస్‌యూవీల వాటా.. 2025 నాటికి 32 శాతానికి చేరుకుంది. మరోవైపు, ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన సెడాన్‌ కార్ల వాటా 28% నుంచి 16 శాతానికి పడిపోయింది. మార్కెట్లో ఎస్‌యూవీల డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ, మోడళ్ల వారీగా చూస్తే హ్యాచ్‌బ్యాక్‌ కార్ల ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌–10 యూజ్డ్‌ కార్లలో ఏకంగా ఏడు స్థానాలను హ్యాచ్‌బ్యాక్‌ కార్లే ఆక్రమించాయి. 

చిన్న కార్లదే ఆధిపత్యం.. స్విఫ్ట్‌ టాప్‌ 
కస్టమర్లు కొనుగోలు చేస్తున్న టాప్‌–10 యూజ్డ్‌ కార్లలో ఏడు హ్యాచ్‌బ్యాక్‌లు, రెండు సెడాన్‌లు, ఒకే ఒక్క ఎస్‌యూవీ మాత్రమే ఉన్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చు, నమ్మకమైన పనితీరు, నగర రహదారులకు అనువుగా ఉండటం వంటి కారణాలతో హ్యాచ్‌బ్యాక్‌లు ఇప్పటికీ యూజ్డ్‌ కార్ల మార్కెట్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాయి. ‘గేర్స్‌ ఆఫ్‌ గ్రోత్‌ 2025’ నివేదిక ప్రకారం మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ 4.93 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. 

ఆ తర్వాత మారుతీ సుజుకీ వేగన్‌ ఆర్‌  (3.47%), హ్యుందాయ్‌ ఐ10 (3.46%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అనంతరం హోండా సిటీ, మారుతీ స్విఫ్ట్‌ డిజైర్, మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్‌ గ్రాండ్‌  ఐ10, హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ20లు స్థానాలు దక్కించుకున్నాయి. సుమారు 2.05% వాటాతో తొమ్మిదో స్థానంలో హ్యుందాయ్‌ క్రెటా(ఎస్‌యూవీ) నిలవగా... పదో స్థానంలో  రెనో క్విడ్‌ నిలిచింది. మొత్తం పది స్థానాల్లో ఏకంగా ఏడు స్థానాలను హ్యాచ్‌బ్యాక్‌ కార్లే కైవసం చేసుకోవడం చూస్తుంటే.. భారతీయులు సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్లో ఖర్చు, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

డిమాండ్‌ ఉంది.. కానీ సప్లై లేదు: 
గడిచిన రెండేళ్లలో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లో ఎస్‌యూవీల వాటా 15% నుండి 32% కి పెరిగింది. ఇదే సమయంలో సెడాన్‌ కార్ల వాటా 28% నుండి 16% కి పడిపోయింది. అంటే ఎస్‌యూవీలపై క్రేజ్‌ పెరిగిన మాట వాస్తవమే. కానీ, టాప్‌–10 లో ఎక్కువ ఎస్‌యూవీలు లేకపోవడానికి ప్రధాన కారణం ‘‘సప్లై కొరత’’. సాధారణంగా ఒకరు కొత్త కారు కొన్నాక, కొన్ని ఏళ్ల తర్వాతే దాన్ని అమ్ముతారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఎస్‌యూవీల ట్రెండ్‌ నడుస్తోంది, కానీ అవి యూజ్డ్‌ కార్‌ మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే మార్కెట్లో తక్కువ సమయం వాడిన ఎస్‌యూవీల లభ్యత పరిమితంగా ఉంది. 

డిమాండ్‌ పెరిగినా.. సరఫరా కొరత 
గడిచిన రెండేళ్లలో యూజ్డ్‌ కార్ల మార్కెట్లో ఎస్‌యూవీల వాటా 15 శాతం నుంచి 32 శాతానికి పెరగడం.. ఈ విభాగంపై ఆసక్తి ఎంతగా పెరిగిందో చూపిస్తోంది. అయితే టాప్‌–10లో మరిన్ని ఎస్‌యూవీలు కనిపించకపోవడానికి ప్రధాన కారణం సరఫరా కొరతేనని నివేదిక విశ్లేíÙంచింది. సాధారణంగా కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత కొన్ని ఏళ్లకే అది సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్లోకి వస్తుంది. ప్రస్తుతం కొత్త కార్ల మార్కెట్లో ఎస్‌యూవీలకు భారీ డిమాండ్‌ ఉన్నప్పటికీ.. అవి యూజ్డ్‌ కార్ల మార్కెట్లోకి పూర్తిస్థాయిలో రావడానికి ఇంకా సమయం పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఎస్‌యూవీల ట్రెండ్‌ నడుస్తోంది, కానీ అవి యూజ్డ్‌ కార్‌ మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే మార్కెట్లో తక్కువ సమయం వాడిన ఎస్‌యూవీల లభ్యత తక్కువగా ఉంది.

ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్‌లే ‘బ్యాక్‌బోన్‌’ 
‘గేర్స్‌ ఆఫ్‌ గ్రోత్‌ 2025’ నివేదిక ప్రకారం భారత యూజ్డ్‌ కార్ల మార్కెట్లో ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్‌లదే కీలక పాత్ర. ప్రస్తుతం మొత్తం మార్కెట్లో 52 శాతం వాటాతో హ్యాచ్‌బ్యాక్‌లు ప్రధాన ఆధారంగా కొనసాగుతున్నాయి. అయితే భవిష్యత్తులో ప్రస్తుతం కొత్తగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలు యూజ్డ్‌ కార్ల మార్కెట్లోకి ప్రవేశించే కొద్దీ.. టాప్‌–10 జాబితాలో మరిన్ని ఎస్‌యూవీలు చోటు దక్కించుకునే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం మాత్రం హ్యాచ్‌బ్యాక్‌ల ఆధిపత్యం మధ్య టాప్‌–10లో నిలిచిన ఏకైక ఎస్‌యూవీగా క్రెటా ప్రత్యేక గుర్తింపు పొందింది.

క్రెటా సృష్టించిన ప్రీమియం మ్యాజిక్‌ 
ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, భద్రతా ప్రమాణాలు, బ్రాండ్‌పై నమ్మకం వంటి అంశాల కారణంగా హ్యుందాయ్‌ క్రెటా టాప్‌–10లో చోటు దక్కించుకుంది. ఎక్కువ సంఖ్యలో కొనుగోలు అవుతున్న కార్ల జాబితాలోనే కాకుండా, ప్రీమియం యూజ్డ్‌ కార్ల జాబితాలో కూడా క్రెటా ముందంజలో నిలుస్తోంది. హోండా సిటీ, టాటా నెక్సాన్, హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ20 వంటి  మోడళ్లతో కలిసి క్రెటా ప్రీమియం విభాగంలో బలమైన డిమాండ్‌ను నమోదు చేసింది.కొత్త కార్ల మార్కెట్లో ఎన్నో ఏళ్లుగా నంబర్‌ వన్‌ ఎస్‌యూవీగా ఉన్న క్రెటా.. ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లోనూ నమ్మకమైన బ్రాండ్‌గా అవతరించింది.

Advertisement
 
Advertisement
Advertisement