breaking news
Hyundai Crete
-
హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్‌ను తీసుకొస్తోంది. 2025 జనవరి–మార్చి మధ్య ఈ మోడల్ దేశీ రోడ్లపై పరుగులు తీస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో క్రెటా ఈవీ రూపుదిద్దుకుంటోందని సమాచారం. ధర రూ. 22–26 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం భారత్‌లో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ప్రణాళిక. వీటిలో మాస్ మార్కెట్ మోడల్‌తోపాటు హైఎండ్, ప్రీమియం ఈవీలు సైతం ఉన్నాయి. ఈవీ విభాగంలో కంపెనీ ప్రస్తుతం దేశంలో అయానిక్ 5, కోనా ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 17.5 శాతం వాటా విక్రయించాలన్నది సంస్థ లక్ష్యం. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించనుంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్.. బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్ ఈవీ, ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఈవీ, మైల్డ్ హైబ్రిడ్ ఈవీ, ఫ్యూయల్ సెల్ ఈవీలను తయారు చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం కోసం కంపెనీ గతేడాది తమిళనాడులో రూ.20,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. చెన్నై ప్లాంటును ఈవీలు, ఎస్‌యూవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. -
నవంబర్‌లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే!
Here Are the Top 10 Best-Selling Cars From November: భారతదేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడవుతున్న పది కార్ల జాబితాలో ఏడు స్థానాలను మారుతి సుజుకి ఇండియా ఆక్రమించింది. ఇండో-జపనీస్ కార్ల తయారీ కంపెనీ నవంబర్ నెలలో మొత్తంగా 9 శాతం అమ్మకాలు పడిపోయినప్పటికీ, జాబితాలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిగిలిన మూడు హ్యుందాయ్, కియా, టాటా మోటార్స్ కు చెందిన ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. నవంబర్‌లో భారతదేశంలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మారుతి వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకికి చెందిన వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. మారుతి నవంబర్ 2021లో 16,853 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. ఇది నవంబర్ 2020లో విక్రయించిన 16,256 యూనిట్ల కంటే కొంచెం ఎక్కువ. 2. మారుతి స్విఫ్ట్ ఈ జాబితాలో మారుతి సుజుకికి వచ్చిన మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో తక్కువ రేటింగ్ పొందినప్పటికి అమ్మకాల పరంగా దూసుకెళ్లింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో స్విఫ్ట్ 14,568 యూనిట్లను విక్రయించింది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మారుతి 2020 నవంబర్ నెలలో 18,498 యూనిట్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. 3. మారుతి ఆల్టో ఈ జాబితాలో మూడవ స్థానంలో కూడా మారుతి సుజుకికి చెందిన మారుతి ఆల్టో నిలిచింది. ఇది అక్టోబర్ నెలలో అగ్ర స్థానాన్ని కలిగి ఉంది, కానీ ఈసారి దీనిని వ్యాగన్ఆర్ ఓడించింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో 13,812 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 15,321 యూనిట్ల కంటే తక్కువ. 4. మారుతి విటారా బ్రెజ్జా విటారా బ్రెజ్జా, భారతీయ మార్కెట్లలోకి ప్రవేశించిన మొట్టమొదటి సబ్-కాంపాక్ట్ ఎస్యువీ కారు. మారుతీ గత నవంబర్ నెలలో 10,760 యూనిట్ల బ్రెజ్జాను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో విక్రయించగలిగిన 7.838 యూనిట్ల కంటే చాలా ఎక్కువ. మారుతి రాబోయే రోజుల్లో బ్రెజ్జా యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే, కార్‌మేకర్ ఇంకా నిర్దిష్ట లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించలేదు. 5. హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో కనిపించిన మొదటి నాన్-మారుతి కారు హ్యుందాయ్ క్రెటా మాత్రమే. గత కొంత కాలంగా చిప్ సంక్షోభం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నప్పటికీ హ్యుందాయ్ నవంబర్‌లో 10,300 యూనిట్ల క్రెటా కాంపాక్ట్ ఎస్యువీని విక్రయించింది. గతేడాది నవంబర్‌లో హ్యుందాయ్ క్రెటా 12,017 యూనిట్లను విక్రయించింది. 6. మారుతి బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో 6వ స్థానంలో మారుతి బాలెనో నిలిచింది. మారుతి నవంబర్ 2020లో 17,872 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2021లో 9,931 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. ఈ కారు కూడా లాటిన్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో తక్కువ రేటింగ్ పొందింది. 7. టాటా నెక్సన్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో నిలిచిన ఏకైక కారు టాటా మోటార్స్ నెక్సాన్ మాత్రమే. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ యువి300 కార్ల నుంచి భారీ పోటీని ఎదుర్కొన్నప్పటికీ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. 2021 నవంబరులో టాటా 9,831 యూనిట్ల నెక్సన్ కార్లను విక్రయించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో 10,096 యూనిట్లతో పోలిస్తే ఇది తక్కువ. 8. మారుతి ఈఈసీఓ ఈ జాబితాలో కనిపించిన ఏకైక వ్యాన్ మారుతి ఈఈసీఓ. మారుతి నవంబరులో 9,571 యూనిట్ల ఈకో కార్లను విక్రయించింది, ఇది సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఈఈసీఓ నాన్ కార్గో వేరియెంట్ల ధరలను మారుతి రూ.8,000 పెంచింది. ధరల పెంపు నవంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. 9. మారుతి ఎర్టిగా మారుతి ఎర్టిగా నవంబరులో ఏడు సీట్ల ఎంపివి విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 9వ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి నవంబరులో 8,752 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది, అక్టోబర్ నెలలో విక్రయించిన యూనిట్ల కంటే గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది. 10. కియా సెల్టోస్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 10వ స్థానంలో కియా సెల్టోస్ నిలిచింది. 2020 నవంబరులో విక్రయించిన 9,205 యూనిట్లతో పోలిస్తే కియా నవంబర్ 2021లో 8,659 యూనిట్ల సెల్టోస్ ఎస్‌యూవీని విక్రయించింది. -
హ్యుందాయ్ క్రెటాకు 10 వేల ముందస్తు బుకింగ్‌లు
- వచ్చే వారమే మార్కెట్లోకి... న్యూఢిల్లీ: హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి 10 వేలకు పైగా ముందస్తు బుకింగ్‌లు వచ్చాయి. వచ్చే వారంలో(బహుశా జూలై 21) ఈ మాస్ మార్కెట్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్‌ను మార్కెట్లోకి తేవాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా యోచిస్తోంది. విడుదలకు ముందే 28,500కు పైగా ఎంక్వైరీలు వచ్చాయని, 10,000 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్-మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఐదు సీట్ల ఈ ఎస్యూవీ అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సానో టెర్రానో, మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ500, టాటా సఫారి స్టార్మ్ ఎస్‌యూవీలకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వీటి ధరలు రూ.6.75 లక్షల నుంచి రూ.15.99 లక్షల రేంజ్లో ఉన్నాయి. కాగా క్రెటా ఎస్యూవీ ధర రూ.8-12 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. భారత ఎస్యూవీ సెగ్మెంట్లో క్రెటా కొత్త ప్రమాణాలను సృష్టించబోతోందని శ్రీవాత్సవ చెప్పారు. క్రెటా ఎస్‌యూవీని కొరియాలోనే డిజైన్ చేసి డెవలప్ చేశారని, హ్యుందాయ్ ఇండియాకు చెందిన హైదరాబాద్, చెన్నై ఇంజినీర్లు ఇతోధికంగా తోడ్పడ్డారని వివరించారు.