ఒక్క చార్జ్‌తో 526 కి.మీ. జర్నీ | Kia Syros EV unveiled with 526 km range, lifetime battery warranty | Sakshi
Sakshi News home page

ఒక్క చార్జ్‌తో 526 కి.మీ. జర్నీ

Jul 16 2026 5:59 AM | Updated on Jul 16 2026 5:59 AM

Kia Syros EV unveiled with 526 km range, lifetime battery warranty

కియా సైరోస్‌ ఈవీ వచ్చేసింది

బ్యాటరీపై లైఫ్‌టైమ్‌ వారంటీ 

రూ. 25,000తో ప్రీ–బుకింగ్‌  

న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ ‘కియా ఇండియా’ మధ్య తరగతి, ప్రీమియం ఈవీ కస్టమర్లను లక్ష్యంగా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘కియా సైరోస్‌ ఈవీ’ని ఆవిష్కరించింది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. 51.4 కేడబ్ల్యూహెచ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ బ్యాటరీ మోడల్‌.. సింగిల్‌ చార్జ్‌పై ఏకంగా 526 కిలోమీటర్ల (ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్‌) మైలేజీని ఇస్తుంది. 42 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ సింగిల్‌ ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 

 100 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌ సహాయంతో బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లోనే 10% నుంచి 80%కి ఛార్జ్‌ చేసుకోవచ్చు. దేశంలోనే మొదటిసారిగా లైఫ్‌టైమ్‌ హై–వోల్టేజ్‌ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. అష్యూర్డ్‌ బైబ్యాక్‌ ప్రోగ్రా మ్, బ్యాటరీ–యాజ్‌–ఎ–సర్వీస్‌ (బాస్‌) ఫైనాన్సింగ్‌ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. రూ.25,000 టోకెన్‌ అమౌంట్‌ చెల్లించి కియా  వెబ్‌సైట్‌ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న కియా డీలర్‌షిప్‌లలో ప్రీబుక్‌ చేసుకోవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement