సాక్షి,ఢిల్లీ: ఎమ్మెల్యే హరీశ్ రావు ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పి తర్వాతే నీతి మాటలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ప్రకటన పై ఘాటుగా మండిపడ్డారు. కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడమే తనకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. ఈ రోజు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం, పట్టిసీమ, రాయలసీమ ఎత్తిపోతలపై బీఆర్‌ఎస్ ఎందుకు మౌనం పాటించిందని 12 ఏళ్లుగా ప్రతి GRMB సమావేశంలో ఏపీ ఇదే అభ్యంతరాలు చెబుతోందని ఇందులో కొత్తేం లేదన్నారు
ఏపీ అభ్యంతరాలను తిప్పికొట్టి సీతమ్మసాగర్–సీతారామకు TAC అనుమతి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని 67 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించిందన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటును సమయస్ఫూర్తితో అడ్డుకున్నామని సమ్మక్క సాగర్ NOC కోసం ఛత్తీస్‌గఢ్ సీఎంను మూడుసార్లు కలిశాం… నెలాఖరులో NOC వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హాయాంలో ఒక్కసారైనా ఛత్తీస్‌గఢ్ సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ISM, IP క్లియరెన్స్‌ల కోసం గత ప్రభుత్వం ప్రయత్నించలేదని కాంగ్రెసే ముందుకు తీసుకవచ్చిందన్నారు.
PBLPపై వెంటనే స్పందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం, సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్, IAలు దాఖలు చేశాం న్యాయపోరాటం కొనసాగుతోందని KWDT ముందు స్వయంగా హాజరై తెలంగాణ తరఫున వాదనలు వినిపించామన్నారు. RDS ఆధునీకరణకు ఏపీ, కర్ణాటక సీఎంలను ఒప్పించామని… బీఆర్‌ఎస్ ఏం చేసింది? తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ నీటి హక్కులు కాపాడలేని వాళ్లు… ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.


