జలమండలి ఎండీకి వినతిపత్రం
సాక్షి, సిటీబ్యూరో: వాటర్‌బోర్డు పరిధిలోని ఔట్‌సోర్సింగ్ మీటర్ రీడర్‌ల పోస్టుల మంజూరుపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. గురువారం జలమండలి ప్రధానం కార్యాలయం ముందు సుమారు 673 మంది ఔట్‌సోర్సింగ్ మీటర్ రీడర్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మాయంక్ మిట్టల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన వారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఔట్ సోర్సింగ్‌జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల బాలకష్ణ రెడ్డి ,దేశపాక శ్రీనివాస్, టీజేఎస్ పార్టీ నాయకులు,రమేష్,ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.


