భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ నెల 13న జరిగే ఫుట్‌బాల్ పోటీలో ప్రఖ్యాత ప్లేయర్ మెస్సీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటుండటంతో గురువారం డీజీపీ శివధర్ రెడ్డి,రాచకొండ సీపీ సుధీర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపులు, రవాణ సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, డీజీ స్వాతి లక్రా పాల్గొన్నారు.


