పుస్తక పఠనం ద్వారానే జ్ఞానం సాధ్యం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చంటి ప్రసన్న కేంద్రం ఆధ్వర్యంలో పలువురు రచయితలు రూపొందించిన తెలంగాణ ఉమెన్ ఎంపవర్మెంట్ పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతి సిన్హా మాట్లాడుతూ.. మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళల సాధికారతే దేశానికి శ్రీరమరక్ష అని చెప్పారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్. రాములు, డాక్టర్ వనమాల, నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ ఆనందాచారి, డాక్టర్ అరుణ పరందాములు తదితరులు పాల్గొన్నారు.


