వరకట్న వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
ఉప్పల్: వరకట్న వేధింపుల కారణంగా ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది..ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు.. సూర్యపేట జిల్లా తిరుమలగిరి ప్రాంతానికి చెందిన శ్రీహరి కూతురు శ్వేతశ్రీ (28) వివాహం జూన్ నెల జనగాం జిల్లా దేవరుప్పల ప్రాంతానికి చెందిన దామెర శ్రీనివాస్‌తో వివాహాం జరిగింది. వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం ఇచ్చారు. దంపతులు రామంతాపూర్ ఆర్టీసి కాలనీలో నివాసముంటున్నారు.కొంత కాలం నుంచి శ్రీనివాస్ అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే విషయాన్ని శ్వేత తల్లిదండ్రులకు చెప్పి బాధపడేది.
ఈ క్రమంలో ఈ నెల 10న ఇంట్లోని హాల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వచ్చి స్థానికుల సహకారంతో కిందికు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తన అల్లుడి వరకట్న వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


