న్యూ జోష్
● 2025కు వీడ్కోలు..
2026కు స్వాగతం
● నగరంలో వెల్లువెత్తిన నూతనోత్సాహం
కాల గమనంలో మరో ఏడాది కనుమరుగైపోయింది. నూతన వత్సరానికి నగరం స్వాగతం పలికింది. బుధవారం అర్ధరాత్రి నుంచి న్యూ ఇయర్ వేడుకల సంబరాలు అంబరాన్నంటేలా సాగాయి. యూత్ ఫుల్ జోష్‌తో ఆనంద సాగరంలో మునిగితేలింది. నగర వ్యాప్తంగా పలు రిసార్టులు, క్లబ్బులు, కేఫ్‌లు, ఆడిటోరియంలు కిటకిటలాడాయి. సినీ సెలబ్రిటీలు సిటిజనులతో కలిసి ఆటాపాటలతో సందడి చేశారు. తరలివచ్చిన టాప్ డీజేలు, బ్యాండ్స్, స్టాండప్ కమెడియన్స్.. వినోదాన్ని పంచారు. సాగర్ రోడ్‌లోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని సునీత, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌లు సంగీతం హోరులో ఓలలాడించారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ యూత్‌ని ఉర్రూతలూగించారు. తాజా సంగీత సంచలనం, గాయకుడు రామ్ మిరియాల కూడా ఇదే ఈవెంట్‌లో తన గానంతో అలరించారు. మాదాపూర్‌లోని క్వేక్ ఎరీనాలో నిర్వహిస్తున్న న్యూఇయర్ పార్టీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ హోస్ట్‌గా ఫీస్ట్‌ని రక్తికట్టించారు. గచ్చిబౌలిలోని ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్ కార్యక్రమంలో సిటీకి చెందిన టాప్ బ్యాండ్ క్యాప్రిసియో సంగీత ప్రియులకు వీనుల విందు పంచింది. దీనికి ముంబై నుంచి వచ్చిన టాప్ లేడీ డీజే పరోమా జోరు తోడైంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కిండ్‌డమ్ క్లబ్‌లో జరిగిన ఈవెంట్‌లో ముంబై డీజే అలీ మర్చంట్‌కు తోడుగా కయీలు సంగీతం ఆకట్టుకుంది. ఈ ఒరవడి నగరవ్యాప్తంగా కొనసాగింది.
– సాక్షి, సిటీబ్యూరో
హైటెక్స్‌లో
సన్నీ లియోన్
కంట్రీ క్లబ్‌లో సినీ నటి ప్రజ్ఞానయన్
న్యూ జోష్
న్యూ జోష్
న్యూ జోష్
న్యూ జోష్
న్యూ జోష్
న్యూ జోష్
న్యూ జోష్
న్యూ జోష్
న్యూ జోష్


