రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థిని దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థిని దుర్మరణం

Dec 8 2025 10:38 AM | Updated on Dec 8 2025 10:38 AM

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థిని దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థిని దుర్మరణం

మేడిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిరిసిల్ల పట్టణం శివానగర్‌కు చెందిన దాసరి భాస్కర్‌ కుమార్తె హాసిని (18) ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతూ..హాస్టల్‌లో ఉంటోంది. శనివారం తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి బైకుపై ఉప్పల్‌కు వెళ్లారు. తిరిగి రాత్రి రెండు గంటల సమయంలో ఘట్‌కేసర్‌ వైపు వస్తుండగా నారపల్లి సమీపంలో బైకు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న హాసిని కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్పగాయాలైన అక్షయ్‌ని సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ అసుపత్రిలో చేర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement