చైనా మాంజా విక్రేతల అరెస్ట్
చాంద్రాయణగుట్ట: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ వర్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఉప్పుగూడ అశోక్‌నగర్‌కు చెందిన కందాడి ఉదయ్ కిరణ్, శివగంగానగర్‌కు చెందిన పిట్టల సుమిత్, అక్రమంగా చైనా సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ మంజా (చైనా మాంజా)లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 24 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చైనా మంజాను నిషేధించారని, దీని కారణంగా ప్రజలు, చిన్న పిల్లలు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని, పర్యావరణానికి హాని కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. ఎవరూ చైనా మాంజాను కొనడం విక్రయించడం చేయరాదన్నారు.


