ఉత్సాహంగా సాగినసీఎం కప్ టార్చ్ ర్యాలీ
ఖైరతాబాద్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహర నుంచి తెలంగాణ సచివాలయం మీదుగా ఎల్‌బీ స్టేడియం వరకు సీఎం కప్ 2025–26 టార్చ్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలపై అవగాహన పెంచడంతో పాటు అన్ని గేమ్స్ పట్ల ఆదరణ పెంపొందించి, వీటి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నాయని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. టార్చ్ ర్యాలీలో జాతీయ స్థాయి స్కేటర్లు, స్విమ్మర్లు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు.


