కొకై న్ తరలిస్తూ ఇద్దరు యువకులు..
మణికొండ: డ్రగ్స్‌తో ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్(46), గోవాకు చెందిన విజయ్‌లు పుప్పాలగూడలోని గోల్డెన్ టెంపుల్ వద్ద డ్రగ్స్‌తో సంచరిస్తున్నారనే సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరపగా వారి వద్ద ఏడు గ్రాముల కొకై న్ లబించింది. ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా శ్రీనివాస్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దాంతో వారిద్దరితో పాటు లబించిన కొకై న్, రెండు సెల్ ఫోన్లను నార్సింగి పోలీసులకు అప్పగించారు. వారు ఎవరికి కొకై న్ సరఫరా చేసేందుకు వచ్చారు..ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు, వీరితో పాటు వారి గ్యాంగ్‌లో మరెంత మంది ఉన్నారనే కోణంలో ఎస్‌ఓటీ పోలీసులతో పాటు నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


