మహీంద్రా సరికొత్త మోడల్స్ ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన రెండు ఐకానిక్ మోడళ్లు ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ, ఎక్స్‌ఈవీ 9ఎస్‌లను గురువారం సోమాజిగూడలోని ది పార్క్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ 2021లో ప్రారంభమైనప్పటి నుంచి 3 లక్షల మందికి పైగా కస్టమర్లను సొంతం చేసుకుందని, దీని ప్రారంభ ధర రూ.13.66 లక్షలు (ఎక్స్–షోరూమ్) ఉందని నిర్వాహకులు తెలిపారు. ఎక్స్‌ఈవీ 9ఎస్ ప్రారంభ ధర రూ.19.95 లక్షల (ఎక్స్–షోరూమ్)తో భారతదేశపు బిగ్ న్యూ ఎలక్ట్రిక్‌గా అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్‌ఈఏఎల్ జోనల్ మేనేజర్ అభిషేక్ కుమార్, ఆటో డివిజన్ రీజినల్ మేనేజర్ స్వాతిక్, ఎమ్‌ఈఏఎల్ రీజినల్ మేనేజర్ నవేద్ ఖాన్‌తో పాటు డీలర్ భాగస్వాములు ఆటోమోటివ్ మహీంద్రా సీఈఓ నారాయణ, వీవీసీ మహీంద్రా ఎండీ వీరెన్, ల్యాండ్‌మార్క్ సీఈఓ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


