పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకూ తమ ప్రాంతాలను నుండే శత్రు దేశంలోకి దాడి చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ లెవల్లో తమ దేశ ఆర్మీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌పై పదాతిదళాల ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ధృవీకరించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా టార్గెట్‌గా దక్షిణ లెబనాన్‌లోకి దూసుకెళుతున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అమెరికా కేవలం కంబాట్ దాడులే చేసిందని అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్‌కు పంపిస్తాం. ప్రత్యక్ష యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌పై మండిపడ్డారు. ఇరాన్ ప్రతి సారి అబద్ధం చెబుతోంది. ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేసే మిసైల్ వ్యవస్థ ఉంది. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌లో ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుంది. అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు.
ఇరాన్ సుప్రీం ఖమేని మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇరాన్‌కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామన్నారు. ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తెలిపారు. ఇదివరకే అమెరికా ఇరాన్ నావికాదళాన్ని తుడిచిపెట్టిందని ఇక ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తామని తెలిపారు. అయితే ఇరాన్ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచిందని వాటిని చేధించడం అమెరికా,ఇజ్రాయెల్ సైన్యాలకు పెనుసవాల్‌గా మారిందన్నారు. అయితే ఇరాన్ సైతం తీవ్రమైన ప్రతి దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా విరుచుకపడుతుంది.


