lebanon
-
లెబనాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పొడిగింపు
వాషింగ్టన్: సరిహద్దుల్లో తాజా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, లెబనాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికా జరిపిన కీలక మధ్యవర్తిత్వ చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది."సరిహద్దుల్లో మరింత పురోగతిని సాధించేందుకు వీలుగా.. ఏప్రిల్ 16 నాటి శత్రుత్వాల నిలిపివేత (కాల్పుల విరమణ) ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించాం" అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ తాత్కాలిక గడువు ఆదివారంతో ముగియాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఊరట లభించింది.శాశ్వత శాంతి వైపు అడుగులు..రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పేందుకు అమెరికా ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తదుపరి చర్యలు ఇలా ఉండనున్నాయి..మే 29న రెండు దేశాల సైనిక ప్రతినిధులతో పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. జూన్ 2, 3 తేదీల్లో ఇరు దేశాల మధ్య శాశ్వత రాజకీయ ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో అమెరికా విదేశాంగ శాఖ ఉన్నత స్థాయి చర్చలు జరపనుంది."ఈ చర్చలు ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతికి దారితీస్తాయని మేము ఆశిస్తున్నాము. ఒకరి సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను మరొకరు పూర్తిగా గౌరవించుకుంటూ.. భాగస్వామ్య సరిహద్దు వెంబడి నిజమైన రక్షణను ఏర్పాటు చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం" అని టామీ పిగోట్ ఆశాభావం వ్యక్తం చేశారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుమరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే, ఇజ్రాయెల్ రక్షణ దళాలు లెబనాన్‌లోని పలు లక్ష్యాలపై మళ్లీ దాడులు చేశాయి. అయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు ఈ కాల్పుల విరమణ అమలులోనే ఉందని భావిస్తున్నాయి.కాగా, ఇరాన్‌కు సంఘీభావంగా తమపై దాడులు చేస్తున్న షియా సాయుధ బృందం 'హిజ్బుల్లా'ను లక్ష్యంగా చేసుకునే తాము ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే వాషింగ్టన్లో జరుగుతున్న ఈ శాంతి చర్చల్లో హిజ్బుల్లా భాగస్వామిగా లేదు. -
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
బీరూట్: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన దాడుల్లో ఏడుగురు చనిపోయారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పరస్పర దాడులు ఆగకపోవడం గమనార్హం. మొత్తం 9 గ్రామాల ప్రజలను వెంటనే నివాసాలు వదిలివెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది.కెఫర్ దజాల్లో ఓ కారుపై జరిగిన దాడిలో ఇద్దరు, ల్వైజాహ్ గ్రామంలోని నివాసంపై జరిగిన దాడిలో ముగ్గురు, షౌకిన్పై దాడిలో మరో ఇద్దరు మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. సరిహద్దుల్లోని యరౌన్లోని కేథలిక్ చర్చిలోని కొంత భాగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు నిర్వాహకులు ఆరోపించారు.కాగా, హెజ్బొల్లా లక్ష్యంగా 24 గంటల వ్యవధిలో సుమారు 50 వైమానిక దాడులను చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. శనివారం తీర ప్రాంతంలోని బయెద్ అనే గ్రామంలోని ఓ ఇంట్లో చేరిన ఇజ్రాయెల్ బలగాలే లక్ష్యంగా డ్రోన్ దాడి చేసినట్లు హెజ్»ొల్లా సైతం ప్రకటించుకుంది. -
ఇజ్రాయెల్–హెజ్బొల్లా కాల్పుల విరమణ
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణను మరో మూడు వారాలపాటు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికాలోని ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారుల మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన రెండో విడత చర్చల్లో ఈమేరకు ఒప్పందం కుదిరిందన్నారు. లెబనాన్‌కు హెజ్బొల్లా నుంచి అవసరమైన భద్రతను అమెరికా కల్పిస్తుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. -
ఇజ్రాయెల్ దాడిలో మహిళా జర్నలిస్టు మృతి
బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మహిళా జర్నలిస్టు అమల్ ఖలీల్ ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్–హెజ్బోల్లా యుద్ధ సంబంధ వార్తలను సేకరించేందుకు విధి నిర్వహణలో భాగంగా యుద్ధక్షేత్రంలో ఉన్న ఉన్నప్పుడు అమల్ ఖలీల్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమెతోపాటు వచ్చి యుద్ధం ఫొటోలు తీస్తున్న ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ జినాబ్ ఫరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్‌లోని అల్–అఖ్బర్ వార్తాపత్రికలో పనిచేస్తున్న 43 ఏళ్ల ఖలీల్, ఫోటోగ్రాఫర్ ఫరాజ్ ఇద్దరూ ఒకే వాహనంలో ప్రయాణిండగా వీళ్ల సమీపంలోని మరో వాహనంపై దాడి జరిగింది. దీంతో ఆ వాహనంలోని ఇద్దరు ప్రాణాలుకోల్పోయారు. ఇది చూసి వీరిద్దరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సమీప ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. అయితే తర్వాత ఆ ఇంటి మీద సైతం వైమానిక దాడి జరిగింది. దీంతో ఇల్లు ధ్వంసమైంది. విషయం తెల్సి లెబనాన్ ఆర్మీ, పౌర రక్షణ బలగాలు, లెబనాన్ రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు. ఆరుగంటల తర్వాత శిథిలాల నుంచి ఖలీల్ మృతదేహాన్ని బయటకుతీశారు. దక్షిణ లెబనాన్‌లోని అల్–తిరీ గ్రామంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. -
ఇక చాలూ.. ఇజ్రాయెల్‌పై ట్రంప్ అసహనం
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. మిత్రదేశం ఇజ్రాయెల్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా లెబనాన్‌పై దాడులు కొనసాగించడం సరికాదన్నారు. ఈ క్రమంలో దాడులు ఇకనైనా ఆపాలంటూ ట్రంప్ సూచించారు.‘‘లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఇక దాడులు చేయడానికి వీల్లేదు. వాళ్లు దాడులు చేయకుండా అమెరికా నిషేధం విధించింది. ఇక చాలు..’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం తర్వాతే హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచేందుకు అంగీకరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రెండు వారాల యుద్ధ విరమణ.. శాంతి చర్చలకు ఇరాన్-అమెరికాలు ముందుకు వచ్చాయి. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో ఇరాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దాడులు ఆగకుంటే శాంతి చర్చలు ముందుకు సాగవని చెబుతూ వచ్చింది. ఇజ్రాయెల్ ఏమో.. లెబనాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న హెజ్బొల్లా గ్రూపులతో తమ దేశానికి ముప్పు ఉందని చెబుతూ దాడులు కొనసాగించింది. దీంతో లెబన్నాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చల కోసం అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది.ట్రంప్ తాజా హెచ్చరికలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ వార్నింగ్ కంటే ముందే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. దక్షిణ లెబనాన్‌లో తమ సైన్యం మోహరింపు కొనసాగుతుందని ప్రకటించారు. ‘‘రాకెట్ దాడులు, డ్రోన్ల ముప్పు ఇంకా ఇజ్రాయెల్ తొలగిపోలేదు. అందుకే మేం చేయాలనుకున్నది చేస్తాం. అదేంటో ఇప్పుడు నేను మీ ముందు చెప్పలేను’’ అని మీడియా ముందు నెతన్యాహు ప్రకటించారు.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. 38 రోజుల తర్వాత ఇరు దేశాలకు శాంతి చర్చలకు అంగీకరించాయి. అయితే లెబనాన్ కూడా ఈ కాల్పుల విరమణలో భాగమని ఇరాన్ చెబుతుండగా.. అదసలు వేరే అంశమని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఎల్లుండి ఇస్లామాబాద్ వేదికగా రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 22వ తేదీతో ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. -
ఇరాన్ యురేనియం మా చేతికి
వాషింగ్టన్/దుబాయ్/బీరూట్/ఇస్లామా బాద్: భీకర దాడుల దెబ్బకు ఇరాన్ తమ డిమాండ్లకు తల ఊపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక కీలక పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ భూగర్భ అణు కేంద్రాల్లోని దాచిపెట్టిన అత్యంత శుద్ధమైన 450 కేజీల యురేనియం నిల్వలపై అమెరికా బీ2 బాంబర్లు భారీ బాంబును పడేసి సర్వనాశనం చేశాయి. దీంతో యురేనియం రేణువులుగా మట్టిలో కలిసిపోయింది. ఆ అణుమట్టి మా చేతికి రాబోతోంది. ఈ మట్టిని అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుంది. ఇందుకోసం ఎలాంటి నగదు చేతులు మారబోదు’’అని అన్నారు. శుద్ధ యురేనియం అప్పగింతపై మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్, పాకిస్తాన్‌గానీ ఇటు ఇరాన్‌గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మరోదఫా చర్చలకు పాకిస్తాన్ రంగం సిద్ధంచేస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా గత వారం జరిగిన చర్చలు విఫలమవడంతో ఈసారి వినూత్న ప్రతిపాదనలతో ముందుకెళ్లి ఎలాగైనా రెండో దఫా చర్చలను విజయవంతంచేయాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఖతర్, సౌదీ అరేబియాల అగ్రనేతలతో చర్చలు ముగించుకుని గురువారమే టెహ్రాన్‌కు చేరుకుని ఇరాన్ అగ్రనాయకత్వంతో విస్తృతంగా చర్చించారు. ఆదివారం లేదా వచ్చే వారం పాక్‌లోని ఇస్లామాబాద్ లేదా రావల్పిండిలో అమెరికా–ఇరాన్ చర్చలు జరిగే ఆస్కారముంది. కాల్పులవిరమణ ఒప్పందం గడువు ఏప్రిల్ 22వ తేదీన ముగిసేలోపే శాశ్వత శాంతి ఒప్పందం ఖరారుచేయాలని మధ్యవర్తిత్వ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చర్చలు సఫలమైతే శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. చర్చలు సానుకూలంగా సాగుతుంటే, తప్పదనుకుంటే కాల్పుల విరమణ గడువును పొడిగిస్తానని ట్రంప్ చెప్పారు. నేరుగా చర్చలొద్దు: హెజ్భొల్లా ఇజ్రాయెల్‌తో నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగకూడదని లెబనాన్ ప్రభుత్వాన్ని హెజ్భొల్లా సాయుధులు హెచ్చరించారు. ‘‘నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగితే దక్షిణ లెబనాన్ సరిహద్దు ఆక్రమిత ప్రాంతాల్లో శాశ్వతంగా తిష్టవేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుంది. అలా జరక్కుండా చూడాల్సిన బాధ్యత మీదే. అసలే మీది అసమర్థ ప్రభుత్వం. అనాలోచితంగా మీరు తీసుకునే నిర్ణయాలు లెబనాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయి’’అని హెజ్భొల్లా పార్లమెంటరీ విభాగ నాయకుడు హసన్ ఫదలల్లాహ్ హెచ్చరించారు. దక్షిణ లెబనాన్‌పై దాడిచేస్తే మేం చూస్తూ ఊరుకోబోమని హెజ్భొల్లా పునరుద్ఘాటించింది. మరోవైపు లెబనాన్– ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ట్రంప్ ముక్కుసూటి, దౌత్యనీతితో ఈ కాల్పుల విరమణను సుసాధ్యంచేశారు’’అని షెహబాజ్ పొగిడారు. ఒప్పందానికి తూట్లు! ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కుదిరిన పదిరోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి శుక్రవారం ఇజ్రాయెల్ తూట్లు పొడిచింది. బిన్ట్ జబేయిల్ జిల్లాలోని కౌనిన్ గ్రామంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిచేసింది.ఈ ఘటనలో ఒక సిరియన్ మూలాలున్న వ్యక్తి చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. దాడిలో కారు, బైక్ ధ్వంసమయ్యాయి. దక్షిణ లెబనాన్‌పై పలు చోట్ల మోర్టార్ దాడులు జరిగాయని లెబనాన్ ఆర్మీ, అమెరికా శాంతిదళ సభ్యులు శుక్రవారం తెలిపారు. దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ కాల్పులవిరమణ వేళ కవి్వంపు చర్యలకు దిగినా తాము దీటుగా దాడులతో సమాధానం చెప్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు రాకెట్లు, క్షిపణులతో ఉన్న సాయుధ హెజ్భొల్లాను పూర్తిగా నిర్వీర్యంచేస్తేగానీ తమ లక్ష్యం నెరవేరదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకొచ్చామని, వెనుతిరిగే ప్రసక్తే లేదని తెలిపారు. బలగాల ఉపసంహరణ ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టంచేశారు. కాగా లెబనాన్‌పై ఇప్పటికే అతిగా దాడులుచేశారని, ఇక ఆపేయాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ శుక్రవారం సూచించారు. తిరిగొస్తున్న స్థానికులు.. లెబనాన్‌లో పదిరోజులపాటే కాల్పులమోత ఆగుతుందని తెల్సి కూడా గతంలో వలసపోయిన వేలాది మంది స్థానికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లిటానీ నది మీదుగా ఖాస్మియే వంతెన మీదుగా దక్షిణ లెబనాన్‌కు వేలాది మంది జనం కార్లు, వాహనాల్లో బయల్దేరడంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరుపులు, సూట్‌కేసులు, నిత్యావసర వస్తువులతో వాహనాలు నిండిపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 2,294 మంది చనిపోయారని లెబనాన్ ప్రకటించింది. -
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచానికి శుభవార్త అందిస్తూ హర్మూజ్ జలసంధిని ఎట్టకేలకు తెరిచింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ల సీజ్ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఆ దేశాల మధ్య సీజ్ఫైర్ కొనసాగేంతవరకూ హర్మూజ్ తెరిచే ఉంటుందని పేర్కొంది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటనతో నౌకల రాకపోకలు యధావిధిగా కొనసాగనున్నాయి. అదే సమయంలో హర్మూజ్‌ను తెరిచామన్న ఇరాన్ ప్రకటన అనంతరం చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇక హర్మూజ్‌ను తెరిచినందుకు ఇరాన్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్నిగురువారం రాత్రి(భారత కాలమాన ప్రకారం) ట్రంప్ తెలిపారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానంగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఫోన్ చేసి చర్చలు జరిపారు. అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం అవి సత్ఫలితాల్ని ఇవ్వడం గమనార్హం. -
ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల విరమణ
కైరో/వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: దశాబ్దాలుగా శత్రుత్వంతో రగిలిపోయిన ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. పదిరోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇరుదేశాల మధ్య అమల్లోకి రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకిరానుంది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ జరిపిన చర్చలు ఫలించాయని ట్రంప్ తన సొంత సామాజికమధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. ‘‘లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌తో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఇప్పుడు చక్కటి సంభాషణ పూర్తయింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఇద్దరూ అంగీకరించారు. 34 ఏళ్ల తర్వాత వాషింగ్టన్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డేన్ రెజీన్ కెయిన్‌లు ఇరుదేశాల నేతలను సమన్వయ పరుస్తూ శాశ్వత శాంతికి కృషిచేస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 9 యుద్దాలను ఆపే అదృష్టం నాకు దక్కింది. ఇది పదోది. తదుపరి చర్చల కోసం శ్వేతసౌధానికి రావాలని ఔన్, నెతన్యాహూలను ఆహ్వానించా’’అని ట్రంప్ ప్రకటించారు. ఆగని కాల్పులు! ఓవైపు కాల్పులు మరికొన్ని గంటల్లో ఆగిపోతాయని ట్రంప్ చెబుతుంటే మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ బలగాలు పరస్పర కాల్పుల్లో బిజీగా మారాయి. గురువారం సైతం ఇరువైపులా కాల్పులు, బాంబుల మోత మోగింది. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులోని ప్రాంతాలపై హెజ్»ొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడిచేసింది. లెబనాన్‌లోని బీరూట్ సహా టైర్, నబాతేహ్, బిన్ట్ జబేయిల్‌లపై ఇజ్రాయెల్ దాడులను ఉధృతంచేసింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య తొలి దఫా శాంతి చర్చలు విఫలంకావడంతో మరో దఫా చర్చలకు పాకిస్తాన్ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. పాక్ సాయుధబలగాల చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ గురువారం ఇరాన్‌లోని టెహ్రాన్‌కు చేరుకుని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్తో చర్చలు జరిపారు. ఈయన వెంట పాక్ అంతర్గత మంత్రి మొహ్సీన్ నఖ్వీ సైతం చర్చల్లో పాల్గొన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కారŠప్స్(ఐఆర్జీసీ) ప్రధానకార్యాలయం ‘ఖాతమ్ అల్–అన్బియా’ను మునీర్ బృందం వెళ్లి ఆర్మీ కమాండర్లతో కాల్పుల విరమణపై చర్చించారు. తర్వాత మునీర్ నేరుగా అమెరికా వెళ్లి ట్రంప్‌తో చర్చిస్తారని వార్తలొచ్చాయి. మరోవైపు ఖతర్ ద్వారా మధ్యవర్తిత్వాన్ని మరింత ఉధృతంగా కొనసాగించేందుకు పాక్ ప్రయతి్నస్తోంది. ఇందుకోస పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం ఖతర్‌కు వచ్చారు. 10వేల సైన్యంతో దిగ్బంధం 10వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హారూŠమ్జ్ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు. హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
'10వ యుద్ధాన్ని ఆపుతున్నా': ట్రంప్ పోస్ట్ వైరల్
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య 10 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.ట్రంప్ తన ప్రకటనలో.. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ (Joseph Aoun) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో జరిగిన చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఈ చర్చల ఫలితంగా రెండు దేశాలు శాంతి దిశగా ముందడుగు వేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ తూర్పు ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు లేదా భారత ప్రామాణిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ తన పాత్రను విశేషంగా ప్రస్తావిస్తూ.. ఇప్పటివరకు ప్రపంచంలో 9 యుద్ధాలను ఆపగలిగానని, ఇది తన 10వ విజయంగా నిలుస్తుందని తెలిపారు. ఇది ఆయన రాజకీయ దృక్పథాన్ని, అంతర్జాతీయ వ్యవహారాల్లో తన జోక్యాన్ని ప్రతిబింబిస్తుంది.వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు '34 ఏళ్లలో తొలిసారిగా సమావేశమయ్యాయని' ట్రంప్ అన్నారు. ఆ రెండు దేశాలు "శాశ్వత శాంతి"ని సాధించేలా చూడాలని తాను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్లను ఆదేశించినట్లు కూడా ఆయన తెలిపారు. -
వారి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందోచ్..!
ఇజ్రాయెల్-లెబనాన్ల మధ్య జ్వాలాగ్ని చల్లారనుందా?, ఆ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందా? యుద్ధానికి ఇరు దేశాలు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాయా? అంటే అవుననక తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానంగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఫోన్ చేసి చర్చలు జరిపారు. అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం గమనార్హం. -
స్కూల్లో భారీగా భయానక ఆయుధాలు.. ఇంతటి డేంజర్లో..
టెల్ అవీవ్: పిల్లలు చదువుకునే స్కూల్లో ఏముంటాయి? స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, వాళ్లు కూర్చునేందుకు బెంచీలు వంటివి ఉంటాయి. అయితే, ఓ స్కూల్లో మాత్రం 130కి పైగా భయానక ఆయుధాలు కనపడ్డాయి. లెబనాన్‌లోని బింట్ జ్బైల్ ప్రాంతంలోని ఓ స్కూల్లో హెజ్బొల్లాకు చెందిన ఈ ఆయుధాలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) గుర్తించాయి.కలాష్నికోవ్ తుపాకులు, పిస్టళ్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయని ఐడీఎప్ ఎక్స్‌లో పేర్కొంటూ వాటి ఫొటోలను పోస్ట్ చేసింది. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుధాలతో పాటు హెజ్బొల్లా జెండాలు, ఇతర ఉగ్రవాద సంస్థల గుర్తులు కూడా అక్కడ కనపడ్డాయి.ఇదే సమయంలో ఐడీఎఫ్ మరో ప్రకటనలో.. కేవలం ఒక నిమిషంలో సుమారు 70 హెజ్బొల్లా మౌలిక వసతులను ధ్వంసం చేశామని తెలిపింది. డజన్ల కొద్దీ ఆయుధాలను గుర్తించామని తెలిపింది. అందులో ఆర్పీజీలు, కలాష్నికోవ్ తుపాకులు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్లు, స్పై డివైజ్‌లు, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయి.🔎LOCATED: 130+ weapons belonging to Hezbollah inside a school in the area of Bint Jbeil.The weapons located included Kalashnikov rifles, pistols and additional weapons. Alongside the weapons, the troops also found Hezbollah flags and other terrorist organization insignia. pic.twitter.com/6XCpoouhoX— Israel Defense Forces (@IDF) April 16, 2026మరో ఆపరేషన్‌లో పదులకొద్దీ ఉగ్రవాదులను హతమార్చినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా హెజ్బొల్లా ఇంతకు ముందు ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై రెండు డ్రోన్ దాడులకు బాధ్యత వహించింది. నహారియా సమీపంలో ఇజ్రాయెల్ సైన్య స్థావరాలపై డ్రోన్ దాడులు జరిగాయి.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లాపై లక్ష్యిత దాడులు కొనసాగుతున్నాయని, దీర్ఘకాల శాంతి దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.కాగా, ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఇరు దేశాలు మూడు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు అమెరికాలో దౌత్య చర్చలు నిర్వహించాయి. ఈ రెండు దేశాల మధ్య చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఇటీవల రాకెట్లను ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిపింది. అదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు జరిపాయి. ⭕️DISMANTLED: ~70 Hezbollah terror infrastructure sites in just one minute.IDF soldiers located dozens of weapons, among the weapons located were RPGs, Kalashnikov rifles, ammunition, grenades, an anti-aircraft missile, surveillance equipment and combat equipment.In an… pic.twitter.com/dbUHl1rgoV— Israel Defense Forces (@IDF) April 16, 2026 -
వార్ అప్డేట్స్: హర్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా వీడలేదు. హర్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొసాగుతోంది. ఇరాన్ పోర్టులకు వచ్చిపోయే నౌకలపై నిఘా కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్‌కు సహించడం లేదు. మరోవైపు పాక్ వేదికగానే మరోసారి శాంతి చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
చర్చలు జరుపుతూనే బాంబుల వర్షం.. 13 మంది మృతి
బీరుట్: లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు అమెరికాలో దౌత్య చర్చలు నిర్వహించాయి. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలను చారిత్రక చర్చలని పేర్కొంటున్నారు. అయితే, అటు చర్చలు జరుగుతుండగానే ఇటు లెబనాన్‌పై బుధవారం ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్ పట్టణాలపై మరిన్ని ఘోర దాడులను ప్రారంభించింది. లెబనాన్ ప్రభుత్వ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం జరిగిన దాడుల్లో 13 మంది మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధులు అమెరికాలో సమావేశమైన 24 గంటలు కూడా గడవకముందే ఈ ఘటన జరిగింది.హిజ్బుల్లా రాకెట్ల ప్రయోగంఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిపామని ప్రకటించింది. హిజ్బుల్లా సుమారు 30 రాకెట్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో మెటులా, కఫర్ గిలాడి, కిర్యాత్ ష్మోనా ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు ఎంతగా కొనసాగుతున్నాయో ఇది సూచిస్తోంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు జరిపాయి. సైడాన్ జిల్లా అల్-బబ్లియా ప్రాంతంలో డ్రోన్ దాడి, ఖలీలా పట్టణంపై వైమానిక దాడి జరిగినట్లు సమాచారం.గాజాలో వాడిన విధానాలను దక్షిణ లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ సైన్యం వాడుతున్నట్లు తెలుస్తోంది. హారెట్జ్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఉపయోగించిన విధానాల్లాగే దక్షిణ లెబనాన్ గ్రామాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ సమాచారం ఇజ్రాయెల్ సైనికులను ఉటంకిస్తూ వెలువడింది.ఇళ్లను ప్రణాళికాబద్ధంగా కూల్చివేస్తున్నారు. కొందరు సైనికులు రోజువారీగా కూల్చిన భవనాల సంఖ్య ఆధారంగా లక్ష్యాలు నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతాలను దాటి మరింత లోతుగా దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించాయి. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకు స్పందించలేదు. -
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నౌకలు ఇప్పటికే హర్ముజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగా.. తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. -
రెండేళ్ల పాప: యుద్ధంలోనే పుట్టి.. యుద్ధంలోనే మృతి..
టైర్ (లెబనాన్): ఆ పాప వయసు కేవలం రెండేళ్లు మాత్రమే. యుద్ధంలోనే పుట్టింది.. యుద్ధంలోనే కన్నుమూసింది. తనచుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ పాపను యుద్ధమే బలితీసుకుంది.ఇజ్రాయెల్ దాడుల్లో ఆ పాప తండ్రి మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఇజ్రాయెల్ దాడిలో ఆ రెండేళ్ల పసిపాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన దక్షిణ లెబనాన్‌లో చోటుచేసుకుంది. చనిపోయిన బాలిక పేరు టలీన్ సయీద్. ఇజ్రాయెల్ దాడిలో ఆ పసిపాప అక్క అలైన్ సయీద్ (7) బయటపడింది. గత వారం దక్షిణ లెబనాన్‌లో తన ఇంటిపై ఇజ్రాయెల్ చేసిన దాడి నుంచి కూడా అలైన్ సయీద్ ప్రాణాలతో బయటపడింది. స్రిఫా గ్రామంలో సయీద్ ఇంటిపై బుధవారం దాడి జరిగింది. అదే రోజు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభమైంది. ఇది తమ దేశానికి కూడా వర్తిస్తుందని లెబనాన్‌లో చాలామంది భావించారు. ఇజ్రాయెల్ దాడులు చేయడంతో లెబనాన్‌లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సయీద్ కుటుంబానికి చెందిన మరో నలుగురు బంధువులు కూడా మృతి చెందారు.“కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. దీంతో మేము గ్రామానికి వెళ్లాం. శవపేటిక వద్ద ప్రార్థనలు చదివి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం. ఒక్కసారిగా ఒక తుపాను మాపై పడుతున్నట్టుగా అనిపించింది” అని నాసర్ సయీద్ (64) అనే వ్యక్తి తమపై జరిగిన బాంబు దాడుల గురించి తెలిపాడు. అతను కూడా ఈ దాడి నుంచి బయటపడ్డాడు.ఆదివారం, అతను ఇతర బంధువులతో కలిసి దక్షిణ పోర్ట్ నగరం టైర్‌కు వెళ్లి పచ్చని గుడ్డలతో కప్పిన మృతదేహాలను తీసుకున్నాడు. వాటిలో ఒక మృతదేహం చాలా చిన్నగా ఉంది. అది అతని మనవరాలు టలీన్ సయీద్ మృతదేహం. అలైన్ సయీద్ చెల్లెలే టలీన్ సయీద్.పసిపాప టలీన్ తలపై, కుడి చేతిపై బ్యాండేజ్‌లు, ముఖంపై గీతలు ఉన్నాయి. అది చూసిన వారికి కన్నీరు ఆగలేదు. లెబనాన్‌లో తాజా యుద్ధం మార్చి 2న ప్రారంభమైంది. లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా, ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ స్థావరాలపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు పెంచింది. వీటిలో 2,000 మందికి పైగా మృతి చెందారు. అందులో 165 మంది పిల్లలు, దాదాపు 250 మహిళలు ఉన్నారు.బాంబు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లో కాల్పుల విరమణకు ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్-అమెరికాతో జరిపిన చర్చల్లో దీనిపై సానుకూల ప్రకటన రాలేదు. లెబనాన్ అధికారులతో వేరే మార్గంలో చర్చలు కొనసాగించాలని ఇజ్రాయెల్ చూస్తోంది. -
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు కీలక ప్రకటన
జెరూసలేం: ఇరాన్‌తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలు ఇంకా పూర్తికాలేదని బాంబు పేల్చారు. కాగా, ఇరాన్‌పై ఇప్పటికే విజయం సాధించినట్టు నెతన్యాహు చెప్పుకొచ్చారు. మరోవైపు లెబనాన్‌తో శాశ్వత శాంతి కోసం ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించే నాటికి ఇరాన్ అణ్వస్త్రాలకు అత్యంత సమీపంలో ఉంది. రోజుకు వందల క్షిపణులు తయారు చేసే సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు అస్తిత్వ ముప్పులను ఎదుర్కోవడమే మా లక్ష్యమని అన్నారు. అలాగే, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని భూగర్భంలో అణు, క్షిపణి కార్యక్రమాలను దాచిపెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి స్థితిలో ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోలేకపోయిందని చెప్పారు. ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణం ఇరాన్ విధానాలేనని ఆరోపించారు.ఇరాన్ బలహీనమే.. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల సమృద్ధ యురేనియం విషయంలో కూడా నెతన్యాహు స్పందించారు. దానిని దౌత్యపరంగా లేదా అవసరమైతే బలప్రయోగంతో తొలగిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా మ్యాప్ చూపిస్తూ వాళ్లు మమ్మల్ని అణగదొక్కాలని చూశారని, ఇప్పుడు తామే వారిని బలహీనపరుస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ బలహీనపడిందని, కాల్పుల విరమణ కోరుతున్నదని నెతన్యాహు అన్నారు. దేశంలో అంతర్గత సమస్యలు పెరిగాయని కూడా పేర్కొన్నారు. మమ్మల్ని నాశనం చేస్తామని బెదిరించినవాళ్లు ఇప్పుడు తమకే బతుకుబండిపై పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.శాంతి కోసం సిద్ధం..లెబనాన్‌తో శాశ్వత శాంతి కోసం సిద్ధమని, అయితే ఈ ఒప్పందం తరాల పాటు నిలిచేలా ఉండాలని నెతన్యాహు స్పష్టం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తన భద్రతకు హాని కలిగించే శక్తులపై చర్యలు కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. లెబనాన్ గత నెలలో పలుమార్లు శాంతి చర్చలకు ముందుకొచ్చిందని చెప్పారు. కాగా, లెబనాన్‌తో వచ్చే వారం నుంచే అధికారిక చర్చలు ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ రెండు ప్రధాన షరతులు విధించింది. మొదటిగా, సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. రెండోది, భద్రతకు హామీ ఇచ్చేలా దీర్ఘకాలిక శాంతి ఒప్పందం ఉండాలి. -
ఇంత అసహ్యంగా మాట్లాడతారా?.. పాక్ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్
ఇరాన్-అమెరికా శాంతి చర్చల వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు సజావుగా సాగవంటూ ఓపక్క ఇరాన్ కొత్త పాట పాడుతోంది. మరోపక్క ఈ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌పై ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బాహాటంగానే ఇరు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. లెబనాన్ దాడుల విషయంలో ఇజ్రాయెల్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారాయన. ఇజ్రాయెల్ అనే దేశం క్యాన్సర్‌లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపమన్న రీతిలో వ్యాఖ్యానించారు. ‘‘ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. అటు లెబనాన్‌లో అమాయకుల్ని ఇజ్రాయెల్ చంపుతోంది. గాజా, ఇరాన్ తర్వాత.. లెబనాన్‌లో రక్తపాతం కొనసాగిస్తోంది. అలాంటి దేశాన్ని పుట్టించినవాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నా’’ అంటూ సోషల్ మీడియాలో ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆసిఫ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరే పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందిస్తూ.. ఇజ్రాయెల్ నాశనం కోరుకుంటున్న పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఏ దేశం ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతించబోదని.. పైగా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇలాంటివి ఊహించలేం అంటూ పేర్కొంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ కూడా పాక్ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ జబ్బుతో పోల్చడం అంటే.. ఒక దేశ నాశనాన్ని కోరుకోవడమేనని, ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం మంచివి కావని అన్నారు. ఇజ్రాయెల్-పాకిస్తాన్ మధ్య ఏనాడూ అధికారిక సంబంధాలు లేవు. అయితే.. ఇరాన్-అమెరికా యుద్ధంలో చైనాతో పాటు పాక్ మధ్యవర్తిత్వం వహించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వ్యవహారంలో పాక్ పాత్ర ఏమీ ఉండకపోవచ్చని.. అసలు ఆ దేశాన్ని నమ్మడానికే వీల్లేదని ఇజ్రాయెల్ అంటోంది. గతంలో గాజా విషయంలో గల్ఫ్ దేశాల సాయం తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు పాక్‌ను కూడా వాడుకుంటున్నట్లు కనిపిస్తోందని చెబుతోంది. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగాల్సిన టైంలో.. పాక్-ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరంగా మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి. -
ఇరాన్‌కు అమెరికా మరోసారి వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా?. శాశ్వాత శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరాన్-అమెరికాలు చర్చలకు ముందుకు వచ్చాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ పాటిస్తున్న ఇరు దేశాలు.. ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు సిద్ధమయ్యాయి. అయితే ఈ చర్చలపై సందిగ్ధత నెలకొంది. -
తగ్గినట్లే తగ్గి.. ట్విస్ట్ ఇచ్చిన నెతన్యాహు
పశ్చిమాసియా యుద్ధంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లెబనాన్‌పై దాడుల విషయంలో తగ్గినట్లే కనిపించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఆ వెంటనే ‘తూచ్’ అనేశారు. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే.. మరోవైపు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని సంబంధిత కేబినెట్ అధికారులకు సూచించారాయన. అదే సమయంలో.. లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. హెజ్బోల్లా సంస్థను నామ రూపాలు లేకుండా చేసేంత వరకు ఐడీఎఫ్(ఇజ్రాయెల్ సైన్యం) సైనిక చర్య కొనసాగుతుందని పేర్కొన్నారాయన. ‘‘అందరికీ ఒక్కటే చెప్పదల్చుకున్నా. లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదు. హెజ్బోల్లాపై మా శాయశక్తులు దాడులు కొనసాగిస్తాం. శాంతిని నెలకొల్పుతాం’’ అని ప్రకటించారు. లెబనాన్ నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతోనే శాంతి చర్చలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నెతన్యాహు.. రెండు లక్ష్యాలను తమ ముందు పెట్టుకున్నామని చెప్పారు. ఒకటోది.. హెజ్బోల్లాకు ఆయుధాలు అందకుండా చేసి ఆ గ్రూప్‌ను అంతమొందించడం, రెండోది లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాశ్వతంగా శాంతి పరిస్థితులు నెలకొల్పడం అని ప్రకటించారు. రెండు వారాల యుద్ధ విరమణకు అమెరికా-ఇరాన్ ముందుకు వచ్చినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది మరణించారు. ఈ పరిణామంపై ఇరాన్ భగ్గుమంది. ఇది ఇస్లామాబాద్(పాక్) వేదికగా జరగబోయే శాంతి చర్చలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని చెబుతూ.. హర్ముజ్‌ను మళ్లీ మూసేసింది. లెబనాన్‌పై దాడులు కొనసాగితే.. తాము తిరిగి యుద్ధం ప్రారంభిస్తామని బెదిరించింది కూడా. అయితే కాల్పుల విరమణ అనేది లెబనాన్‌కు వర్తించబోదని అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్‌లు చెబుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వేదికగా.. లెబనాన్-ఇజ్రాయెల్ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘కాల్పుల విరమణ’ గందరగోళం పాపం పాక్‌దే!
మధ్యవర్తి అంటే పెద్దమనిషి తరహాలో పెద్దరికంతో, హుందాగా వ్యవహరించాలి. కానీ దశాబ్దాలుగా ఉగ్రమూకలను చంకనెత్తుకు తిరుగుతూ తమ దేశంలో ఉగ్రవాదమే లేదని బొంకే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపైనా అదే ధోరణిని ప్రదర్శించి మరోసారి నవ్వులపాలైంది. ఇందుకు పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తెరమీదకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనల ఘటనే సాక్ష్యంగా నిలిచింది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా పది ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి ‘లెబనాన్’అనే పేరును తొలగించి అమెరికా, ఇజ్రాయెల్‌లకు పాకిస్తాన్ ప్రతిపాదనలను చేరవేసిందనేది ఇప్పుడు విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ. పాక్ మధ్యవర్తిత్వంలో తమకు అందిన ప్రతిపాదనల్లో ‘లెబనాన్’అనే పదం ఎక్కడా లేదనేది అమెరికా, ఇజ్రాయెల్ వాదన. దీంతో పాకిస్తాన్ చేసిన అసమర్థ, అసంబద్ధ మధ్యవర్తిత్వం కారణంగా తమపై దాడులభారం తప్పట్లేదని ఇప్పుడు లెబనాన్ పాక్‌పై ఆగ్రహంగా ఉంది. పాక్ మాత్రం దీంతో తమకెలాంటి సంబంధంలేదని చేతులు దులిపేసుకునేలా మాట్లాడటం గమనార్హం. ‘‘లెబనాన్‌తో కలుపుకుని ప్రతిచోటా, ఎక్కడా దాడులు జరపబోమని ఇరాన్, అమెరికా, మిత్రదేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన అమల్లోకి వచ్చింది’’అని తొలుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో ఒక ట్వీట్‌చేశారు. ట్వీట్‌చేసిన కొద్దిసేపటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేయడంతో కాల్పులవిరమణ ఒప్పందంలో లెబనాన్ పేరు ఉందా? లేదా? అనే గందరగోళం తలెత్తింది. ఇందుకు పాకిస్తానే కారణమని లెబనాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ పంపిన ప్రతిపాదనలకు పాకిస్తాన్ ఏకపక్షంగా సవరణలుచేసి అమెరికాకు పంపిందని ఆరోపించింది. ఇరాన్ సైతం ఇదే వాదనలు చేసింది. తాము పంపిన వాటిని మార్చేసి అమెరికాకు పంపడంతోపాటు, అమెరికా పంపిన ప్రతిపాదనలనూ కాస్తంత అటూఇటూ మార్చేసి తమకు అందజేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘సీజ్ఫైర్లో లెబనాన్ ఉందని ఇరాన్‌ను మధ్యవర్తిత్వ దేశాలు నమ్మించి ఉండవచ్చు. ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లెబనాన్‌పై దాడి చేయబోమనే ప్రతిపాదనలకు మేం సమ్మతి తెలపలేదు’’అని అన్నారు. ట్వీట్ సైతం అమెరికా నుంచే.. షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’ఖాతాలో ప్రత్యక్షమై ట్వీట్ సైతం సొంతంగా టైప్ చేసింది కాదు అని, అమెరికా అధ్యక్షభవనం నుంచి వచ్చిన సందేశాన్నే ఉన్నది ఉన్నట్లుగా షరీఫ్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. సందేశం మీద తొలుత డ్రాఫ్ట్ అనే పదం కన్పించి తర్వాత అది కన్పించకుండా పోయింది. షరీఫ్ ‘ఎక్స్’లో పోస్ట్చేయబోయే వాక్యాలను తొలుత శ్వేతసౌధం ధ్రువీకరించిందని, వైట్‌హౌస్ అనుమతితోనే షరీఫ్ ఆ సందేశాన్ని పోస్ట్‌చేశారని న్యూయార్క్‌టైమ్స్ పేర్కొంది. దీనిపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడంతో ఇదే వాస్తవమనే వాదనకు బలం చేకూరింది. ఒక పక్షం వాదనలు, డిమాండ్లను అత్యంత పారదర్శకంగా మరో పక్షానికి అందించడంలో పాకిస్తాన్ విఫలమైందని, అందుకే లెబనాన్ విషయంలో సందిగ్ధత చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సందిగ్ధత నడుమ శాంతి
దుబాయ్/ఇస్లామాబాద్/బీరూట్/వాషింగ్టన్: పాకిస్తాన్ అస్తవ్యస్థ మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన ‘రెండు వారాల కాల్పుల విరమణ’పూర్తి సందిగ్ధవాతావరణంలో కొనసాగుతోంది. ఓవైపు లెబనాన్‌పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పడం, మరోవైపు లెబనాన్‌పై దాడులుచేస్తే హార్మూజ్ పీకనొక్కేసి నౌకల రాకపోకలను శాశ్వతంగా మూసేస్తామన్న ఇరాన్ ప్రకటనతో అసలు కాల్పులవిరమణ అనేది ఏ స్థాయిలో అమలవుతోందనే ప్రశ్న యావత్ ప్రపంచప్రజలను వేధిస్తోంది. కాల్పుల విరమణ మొదలయ్యాక సైతం లెబనాన్‌పై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కన్నెర్రజేసిన ఇరాన్ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ హార్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో పర్షియన్ గల్ఫ్ గుండా చమురు, పెట్రో ఉత్పత్తుల నౌకల రాకపై గంపెడాశలు పెట్టుకున్న ప్రపంచదేశాలు వెనువెంటనే నిట్టూర్చాయి. మరోవైపు తమ గగనతలంలోకి గత 24 గంటల్లో ఎలాంటి శత్రు క్షిపణులు, డ్రోన్లు చొరబడలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ గురువారం ప్రకటించాయి. పాకిస్తాన్లో జరగబోయే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో? చర్చలు విఫలమైతే మళ్లీ భీకరదాడులు, ప్రతిదాడులు తప్పవేమోనన్న భయాందోళనల పీడకల ప్రపంచదేశాలను వదిలిపోవట్లేదు. మరోవైపు తమపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన భీకరదాడిలో పెద్దసంఖ్యలో జనం ప్రాణాలుకోల్పోవడంతో ఆ దేశంతో చర్చలకు సిద్ధమని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటించారు. దీంతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘నేరుగా చర్చలు జరపాలని కేబినెట్ మంత్రులను ఆదేశించా. లెబనాన్‌లో హెజ్బొల్లా సాయుధులు తమ ఆయుధాలను త్యజించాల్సిందే. అప్పుడే ఇరుదేశాల మధ్య శాంతియుత సంబంధాలపై దృష్టిసారించగలం’’అని నెతన్యాహూ అన్నారు. లెబనాన్‌పై భీకరదాడులు కొనసాగుతాయన్న కొద్దిసేపటికే ఆయన ఇలా భిన్నమైన ప్రకటనచేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనమేరకే నెతన్యాహూ లెబనాన్‌తో నేరుగా చర్చలకు అంగీకరించారని తెలుస్తోంది. వాషింగ్టన్లో వచ్చేవారం జరగబోయే ఈ చర్చల్లో అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యేషెల్ లీటెర్, లెబనాన్‌లో అమెరికా రాయబారి మైఖేల్ పాల్గొంటారని తెలుస్తోంది. మా వేలు ట్రిగ్గర్మీదే ఉంది.. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లెబనాన్ పేరు చేర్చినా ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై ఇరాన్ మండిపడింది. లెబనాన్‌పై దాడులుచేస్తే మరింతగా రెచ్చిపోతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. శనివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో బఘేర్ భేటీకానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గకపోతే దారుణ ప్రతిదాడులు తప్పవని, గన్ ట్రిగ్గర్‌పై తమ వేలు అలాగే ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. మరోవైపు చమురుధరలు పెరుగుతూ పోతున్నాయి. గురువారం అంతర్జాతీయంగా నాణ్యమైన బ్రెంట్ రకం చమురు ధర బ్యారెల్‌కు 98 డాలర్లకు పెరిగింది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28నాటి ధరతో పోలిస్తే ఇది ఏకంగా 35 శాతం అధికంకావడం గమనార్హం. చర్చల అంశాలపైనా సందిగ్ధత చర్చల్లో ఇరాన్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో? వాటికి అమెరికా, ఇజ్రాయెల్ ఏ రీతిలో స్పందిస్తాయోననే సందిగ్ధత కొనసాగుతోంది. శనివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో చర్చలు జరగనున్నాయి. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సముద్రజలాలుగా ఉన్న హార్మూజ్ జలసంధి జలాలపై ఇకపై తమ గుత్తాధిపత్యం ఉండాలని ఇరాన్ డిమాండ్‌చేసే వీలుంది. ఇరాన్ నవతరం క్షిపణుల తయారీ ప్రాజెక్ట్, అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించడంపై చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుచెప్పే అవకాశముంది. ఆపత్కాలంలో కలిసిరావాల్సిన నాటో సభ్యదేశాలు మొండిచేయి చూపించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణల నడుమ జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ అగ్రరాజ్యానికి మద్దతుపలికారు. ‘‘అమెరికాతో నాటో కలిసి నడుస్తుంది. ఈ మేరకు బుధవారం ట్రంప్‌తో సంభాషించా. అయితే ఏమేరకు అమెరికాకు సాయపడాలనే అంశంపై జూలైలో తుర్కియేలోని అంకారాలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో తేలుస్తాం. అమెరికా, యూరప్‌లను కలుపుతూ నాటో పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం’’అని మెర్జ్ అన్నారు. మరోవైపు చర్చలకు పాకిస్తాన్ సన్నాహకాలు చేస్తోంది. ఏర్పాట్లపై పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్‌తో సమీక్ష జరిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయంకల్లా ఇస్లామాబాద్‌కు చేరుకోనుంది. శిథిలాల దిబ్బ... బుధవారం మధ్యాహ్నం 10 నిమిషాల్లో 100కుపైగా ప్రాంతాలపై ఒకేసారి దాడిచేసి లెబనాన్‌లో ఇజ్రాయెల్ వినాశనం సృష్టించిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 303కు పెరిగింది. 1,150 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దాడుల్లో హెచ్‌బొల్లా నేత నయీం ఖాసిమ్ సన్నిహితుడు అలీ యూసుఫ్ హర్షీ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. శిథిలాల గుట్టలుగా మారిన దాడి ప్రాంతాల్లో ఇంకా బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.సముద్ర మందుపాతరలతో జాగ్రత్త సరకు రవాణా నౌకలకు ఇరాన్ సూచన సీమైన్స్ అమర్చిన ప్రాంతం ‘చార్ట్’విడుదలదాడులు, ప్రతిదాడులు, బెదిరింపులు, కవి్వంపులు, హెచ్చరికల దశ దాటి కాల్పులవిరమణ పర్వంలోకి అడుగుపెట్టిన పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కాస్తంత మెత్తబడి అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. అయితే యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్రమందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదలచేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది. చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్‌ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. సీమైన్స్ బారిపడకుండా ఈ నౌకలు ఇకపై ఇరాన్‌కు దగ్గరగా లరాక్ ద్వీపానికి సమీపంగా వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. మేం ఇరాన్ చుట్టూతే ఉంటాం: ట్రంప్కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినంత మాత్రాన పశ్చిమాసియాను అమెరికా బలగాలు వీడిపోవని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆయన గురువారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘యుద్ధం శాశ్వత ముగింపునకు సంబంధించిన సమగ్ర ఒప్పందం కుదిరే వరకు, అది అమల్లోకి వచ్చే వరకు అమెరికా బలగాల ఎక్కడికీ పోవు. పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూతా మొహరించే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల దాడి, కాల్పుల మోత మరింతగా మోగుతుంది’’ అని ట్రంప్ అన్నారు. -
ఇరాన్ ఆగ్రహం.. 24 గంటల్లో విరమణకు గండి!
-
ఆక్.. పాక్.. కరివేపాక్
ఇరాన్-అమెరికా&కో మధ్య యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమని పాకిస్తాన్ తెగ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇరాన్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట కాస్త క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చైనా పాత్ర కీలకమని చెప్పి పాక్ గాలి తీసేశారు. ఈలోపు.. ఇటు ఇజ్రాయెల్ ఆ మధ్యవర్తిత్వంపై ఏకంగా అనుమానాలే వ్యక్తం చేస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్‌లో పాక్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఆ దేశానికి అంత సీన్ లేదని.. అదసలు నమ్మదగిన విషయమే కాదని అంటోంది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం విషయంలో పాక్ పాత్ర ఏం మాత్రం ఉండకపోవచ్చు. అమెరికా కేవలం తమ వ్యూహాత్మక కారణాల వల్లే పాకిస్తాన్‌ను వాడుకుంటుందేమో అని వ్యాఖ్యానించారు.అమెరికా గతంలో ఖతర్, టర్కీ వంటి దేశాలను ముందుంచి గాజా విషయంలో హమాస్‌తో ఒప్పందాలు సాధించింది. అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్‌ను ఉపయోగించుకుని ఉండొచ్చు. కాబట్టి పాక్‌ను విశ్వసనీయ మధ్యవర్తిగా ఏ కోణంలోనూ చూడలేం అని అన్నారాయన. అదే సమయంలో.. అమెరికాతో సమన్వయం కొనసాగించడం ఇజ్రాయెల్‌కు ఎంతో ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.విమర్శలు కూడా.. పశ్చిమాసియా యుద్ధంలో పాక్ మధ్యవర్తిత్వంపై ఇప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లెబనాన్ విషయంలో స్పష్టత లేకపోవడంతోనే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లెబనాన్‌కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందని పాక్ తొలుత ప్రకటించగా.. ఆ మాట చెప్పడానికి పాక్‌కు ఏ అర్హత ఉందంటూ ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో.. ఇటు అమెరికా కూడా లెబనాన్‌కు ఒప్పందం వర్తించబోదని తేల్చేసింది. దీంతో ఈ గందరగోళానికి పాక్ తీరే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, అమెరికా తమను నమ్ముతున్నాయని పాక్ అంటోంది. అయితే ఇరాన్ మాత్రం పాక్ ప్రయత్నాలను ప్రశంసిస్తూనే.. మధ్యవర్తిత్వాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో శుక్రవారం జరగబోయే చర్చలకు అమెరికా–ఇరాన్ ప్రతినిధులను ఆహ్వానించారు. “ఇరాన్, అమెరికా- మిత్రదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. శాంతి చర్చలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాం” అని ఆయన సోషల్ మీడియా వేదికలో ఓ పోస్ట్ చేశారు. సౌదీ, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులకు సైతం ఈ సమావేశానికి ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అయితే చర్చలు శనివారం(11వ తేదీకి) జరుగుతాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.ఇరాన్‌పై భీకర దాడుల హెచ్చరికలు చేసిన ట్రంప్.. చివరి నిమిషంలో యుద్ధానికి బ్రేక్ వేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటు ఇరాన్ కూడా ఆ ప్రకటనను ధృవీకరించింది. కానీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో ఘర్షణలు మళ్లీ ఉధృతమయ్యాయి. ఈ పరిణామంపై ఇరాన్ భగ్గుమంటోంది. కీలకమైన హర్ముజ్‌ను తెరిచినట్లే తెరిచి.. మళ్లీ మూసేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ లెబనాన్ ఈ కాల్పుల విరమణలో ఏమాత్రం భాగం కాదని, హెజ్బొల్లా ఉనికి కారణంగా ఇది ‘వేరే ఘర్షణ’ అని ప్రకటించారు. అయితే పలు దేశాలు మాత్రం లెబనాన్‌కు సీజ్ఫైర్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో పట్టుమని ఒక్క గంట కూడా శాంతి పరిస్థితులు నెలకొనలేదు. ఇరాన్, అమెరికాలు యుద్ధ విరమణ, శాంతి చర్చలకు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ.. హెజ్బొల్లా పేరు చెప్పి లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. కేవలం 10 నిమిషాల్లో 100 బాంబులు ప్రయోగించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు కలగజేసింది. లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించుకున్నారు. రెండు వారాల కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని.. అది జలసంధిలో భాగం కాదని.. హెజ్బోల్లాపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి చర్చలు అసంబద్ధం అని పేర్కొంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంతవరకు అమెరికాతో శాంతి చర్చలు జరపడం అసాధ్యమని, ఈ చర్చలే అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఈ చర్చలను ముందుకు నడిపించనుంది.ఇజ్రాయెల్ లెబనాన్‌పై ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ వైమానిక దాడులు జరపగా.. 254 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క బీరుట్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. ప్రతికారంగా.. హెజ్బోల్లా కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇజ్రాయెల్–లెబనాన్ ఘర్షణలు మధ్యప్రాచ్యంలో(Middle East) శాంతి ప్రయత్నాలను మరింత క్లిష్టం చేస్తున్నాయని పలువురు ప్రపంచ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ లెబనాన్‌పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. యూరప్, జపాన్, కెనడా నాయకులు సంయుక్త ప్రకటనలో శాంతి కోసం పిలుపునిచ్చారు. -
లెబనాన్‌పై భీకర దాడులు
బీరూట్/దుబాయ్/టెల్ అవీవ్: తాజా కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించబోదన్న ఇజ్రాయెల్ అన్నంత పనీ చేసింది. బుధవారం మధ్యాహ్నం ఆ దేశంపై భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే రాజధాని బీరూట్‌పై కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 100కు పైగా లక్ష్యాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. అత్యంత జనసమ్మర్ధంతో కూడిన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుంది! దాంతో పలు పౌర, వాణిజ్య ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. నివాస స్థలాలు, అపార్ట్మెంట్లు కుప్పకూలాయి. ఈ దాడులకు ఏకంగా 112 మందికి పైగా బలైనట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. 700 మందికి పైగా గాయపడ్డట్టు వెల్లడించింది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం భారీగా పెరగవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అల్ మజారా ప్రాంతంలో దగ్ధమైన వాహనాల్లో కాలి బుగ్గిగా మారిన మృతదేహాలను వెలికితీసినట్టు ఏపీ వార్తా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాటినుంచీ లెబనాన్‌పై ఇదే అతి భారీ దాడి అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది! దక్షిణ లెబనాన్‌తో పాటు తూర్పున బెక్కా లోయపైనా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడులపై మీడియా ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టినట్టుగా బదులిచ్చారు. ‘‘ఇజ్రాయెల్–లెబనాన్ ఘర్షణకు ఇరాన్‌తో సంబంధం లేదు. కనుక కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించబోదు’’అని మరోసారి స్పష్టం చేశారు. దాడులను అనాగరిక చర్యగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ అభివరి్ణంచారు. తాము కేవలం క్షిపణి లాంచర్లు, కమాండ్ కేంద్రాలు, నిఘా వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో కాల్పులకు తెర దించేందుకు ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధమని లెబనాన్ ప్రకటించింది. గత 40 రోజుల దాడుల్లో లెబనాన్‌లో 1,530 మందికి పైగా మరణించారు. 10 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. దద్దరిల్లిన టెహ్రాన్ ఇరాన్‌పై కూడా దాడులు జరిగాయి. పేలుళ్లతో రాజధాని టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. లావాన్ దీవిలోని చమురు క్షేత్రంపైనా ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. భారీ సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్‌తో పాటు యూఏఈ, కువైట్, బహ్రెయిన్ తదితర దేశాలు వెల్లడించాయి. హార్మూజ్‌కు మళ్లీ మూత! లెబనాన్‌పై దాడులతో ఇరాన్ నిర్ణయంటెహ్రాన్: అంతర్జాతీయంగా చమురు సరఫరాలకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధి ఎట్టకేలకు తెరుచుకుందన్న ఆనందనం కొద్ది గంటల ముచ్చటగానే ముగిసింది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ నేపథ్యంలో 40 రోజుల ప్రతిష్టంభన అనంతరం బుధవారం ఉదయమే హార్మూజ్‌ను ఇరాన్ తెరిచిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొన్ని నౌకలు దాని గుండా వెళ్లినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. దాంతో హార్మూజ్‌ను మళ్లీ మూసేస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుంది! లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలోనే జలసంధిని మూసేసినట్టు ఫార్స్ న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది. -
ఎట్టకేలకు శాంతి!
టెహ్రాన్/దుబాయ్/వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియా కల్లోలానికి ఎట్టకేలకు తాత్కాలికంగా తెర పడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయి. కనీవిని ఎరగని దాడులతో ఇరాన్‌ను సర్వనాశనం చేసేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగిసేందుకు కేవలం 90 నిమిషాల ముందు ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. దాంతో తాత్కాలికంగానైనా పెను ముప్పు తప్పిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇరాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టు మంగళవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్ తన ట్రూత్‌సోషల్ మాధ్యంలో పోస్టు చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఇందుకు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ రెండు వారాల్లోగా యుద్ధానికి పూర్తిగా తెర దించేందుకు కృషి చేయాలని అమెరికా, ఇరాన్ నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు శుక్ర, లేదా శనివారాల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సమావేశం కానున్నారు. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్‌కు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సారథ్యం వహిస్తారని సమాచారం. ఇరు బృందాలూ గురువారమే ఇస్లామాబాద్ చేరుకోనున్నట్టు చెబుతున్నారు. ఇరాన్ బృందం రాకను అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ధ్రువీకరించినట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. అయితే ఇరు వర్గాల పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాల్పుల విరమణకు సంబంధించి తీవ్ర అయోమయం నెలకొంది. కాల్పుల విరమణ లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని ప్రకటించగా, నెతన్యాహు మాత్రం దాన్ని ఖండించారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగబోవని కుండబద్దలు కొట్టారు. అనంతరం ట్రంప్ కూడా దీన్ని ధ్రువీకరించారు. హెజ్బొల్లా కారణంగా కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించబోదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగైతే విరమణ ఒప్పందం నుంచి బయటికి రావడమే గాక చర్చల నుంచే తప్పుకుంటామని ఇరాన్ హెచ్చరించింది! మరోవైపు, అసలు విరమణ ఒప్పందమే చాలా ‘బలహీనంగా’ఉందంటూ వాన్స్ పెదవి విరిచారు! ఇంకోవైపు కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ నిరి్నరోధంగా దాడులను కొనసాగించింది. దాంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై భారీగా దాడులకు దిగింది! ఈ నేపథ్యంలో రెండు వారాల కాల్పుల విరమణ ఏ మేరకు అమలవుతుందన్నది సందేహాస్పదంగా మారింది. దీనికి తోడు, ఇరాన్‌తో ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి సంబంధించి ఇప్పటిదాకా తుది ప్రణాళిక అంటూ ఏమీ ఖరారు కాలేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కోరోలినా లెవిట్ మీడియాకు స్పష్టం చేశారు! ఇరాన్ షరతులపై ట్రంప్ అసంతృప్తి హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలన్న షరతుపైనే కాల్పుల విరమణకు తాను అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ 10 షరతులను తమ ముందుంచిందన్నారు. వాటిలో కొన్ని ఆచరణయోగ్యంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డ ఆయన, ఆ తర్వాత మాట మార్చారు. ఇరాన్ షరతులు మోసపూరితంగా ఉన్నాయని ఆక్షేపించారు. అంతేగాక ఇరాన్ ఇకముందెప్పుడూ యురేనియం శుద్ధికి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ‘‘ఆ దేశం ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. గతేడాది మా దాడుల్లో భూ స్థాపితమైన ఆ యురేనియం నిల్వలను ఇరాన్ సహకారంతోనే వెలికి తీసి తరలిస్తాం’’అని చెప్పుకొచ్చారు. యురేనియం నిల్వలను తమకు అప్పగించని పక్షంలో ఇరాన్‌పై మళ్లీ దాడులు తప్పవని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు! కానీ ఇందుకు ఆ దేశం ఏ మేరకు అంగీకరిస్తుందన్నది సందేహాస్పదంగా మారింది. యురేనియం నిల్వల అప్పగింతపై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించలేదు. ఇరాన్‌ను చర్చలకు ఒప్పంచడంలో తెర వెనక చైనా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ట్రంప్ కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు తమకు కూడా సమాచారం ఉందని వెల్లడించారు.విజయం మాదంటే మాదేఅమెరికా, ఇరాన్ ప్రకటనలు ఇరానే దేబిరించింది: హెగ్సెత్ షరతులకు ఒప్పకున్నారు: ఇరాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో, నెలన్నర రోజుల యుద్ధంలో గెలిచింది తామంటే తామేనని అమెరికా, ఇరాన్ పోటాపోటీగా ప్రకటనలు జారీ చేశాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే దేబిరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియా సాక్షిగా ప్రకటించారు! ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్ సైన్యం కనీసం మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు చెప్పారు. అమెరికాయే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పలు పోస్టులు చేశారు.ప్రపంచ శాంతికి కీలకమైన రోజు! ఇరాన్ తమపై దాడులను ఆపాలని కోరింది. కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ నాకు చేరవేశారు. ఈ రాత్రికి ఇరాన్‌పై తలపెట్టిన అతి పెద్ద దాడిని నిలిపేయాలని విన్నవించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిచే షరతుపై ఇరాన్‌పై దాడులను 2 వారాల పాటు నిలిపేసేందుకు నేను అంగీకరించా. ఆ దేశంపై దాడుల ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నింటిని ఇప్పటికే సాధించేశాం. ఇరాన్ మాకు 10 పాయింట్లతో ప్రతిపాదన పంపింది. దానిపై ఈ రెండు వారాల్లో చర్చలు జరిపి ఒప్పందానికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు యథావిధిగా సాగేందుకు అమెరికా సాయపడుతుంది. ఇరాన్ తన దేశ పునరి్నర్మాణ ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చు. అమెరికాలో మాదిరిగానే పశ్చిమాసియాలో కూడా త్వరలో స్వర్ణయుగాన్ని ఆస్వాదించాలి. ఇది ప్రపంచ శాంతికే అతి కీలకమైన రోజు! – ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఇరాన్‌కు ఆయుధాలిస్తే 50 % టారిఫ్ విధిస్తా ఇరాన్ మిత్రదేశాలకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్‌తో కయ్యానికి కాలు దువ్వబోనని శాంతివచనాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మిత్రదేశాలపై టారిఫ్‌ల యుద్ధం ప్రకటించారు. ఇరాన్‌కు ఆయుధాలను సరఫరాచేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ‘‘ఇరాన్‌కు మిలటరీ ఆయుధాలు అందించే ప్రతి దేశంపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తా. అటు ఇరాన్‌కు ఆయుధాలు పంపుతూ ఇటు అమెరికాకు వస్తూత్పత్తులను ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం టారిఫ్‌లను మోపుతా. టారిఫ్‌ల విధింపు విషయంలో ఎలాంటి మినహాయింపులు, సడలింపులు ఉండబోవు. ఇకపై ఆయుధాలు పంపిన తక్షణం అదనపు టారిఫ్‌లు అమల్లోకి వస్తాయి’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఒక పోస్ట్‌పెట్టారు. ట్రంప్ హెచ్చరికతో అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త అవరోధాలు తలెత్తే ముప్పు ఉంది. ఇరాన్ మిత్ర దేశాలైన రష్యా, చైనా, ఉత్తరకొరియా దేశాలపై అమెరికా అదనపు టారిఫ్‌ల భారం మోపే ఆస్కారముంది. రష్యా, చైనా, ఉ.కొరియాలు ఆయుధాలతోపాటు సైనిక సాంకేతికతనూ ఇరాన్‌కు చేరవేసినట్లు గతంలోనే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరగా దేశం వీడండిఇరాన్లోని భారతీయ పౌరులకు కేంద్రం సూచన దుబాయ్: అనూహ్యంగా కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇరాన్ నుంచి బయటపడాలని అక్కడి భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతరాయబార కార్యాలయం బుధవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. ‘‘ఇరాన్‌ను వీడాలనుకునే భారతీయులు తొలుత అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రతించండి. వాళ్ల సూచన మేరకు నడుచుకోండి. ముందస్తు అనుమతి, సమన్వయం లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఏ అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకోకండి. రాయబార కార్యాలయం సూచించిన మార్గాల్లోనే దేశం వీడండి. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో +989128109115, +989128109102, +989128109109, +989932179359 నంబర్లకు ఫోన్‌చేసి సంప్రతించి తగు సూచనలు, సలహాలు తీసుకోండి. cons. tehran@mea.gov.in ఈమెయిల్‌కు మెయిల్‌చేసి సలహాలు పొందొచ్చు. -
ఇరాన్ బలహీనపడింది.. మా వేలు ట్రిగ్గర్‌పై ఉంది: నెతన్యాహు
ఇరాన్‌కి విధించిన డెడ్‌లైన్ పొడిగించిన ట్రంప్.. మరో రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కొనసాగుతుందని చెప్పారు. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం అందరికీ షాకిచ్చింది. దీంతో ఇరాన్.. మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ తర్వాత, లెబనాన్‌పై దాడులు అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు.'గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడింది. ఇరాన్‌తో యుద్ధంలో పెద్దఎత్తున లక్ష్యాలు సాధించాం. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పది. ట్రంప్‌తో సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. మా వేలు ట్రిగ్గర్‌పై సిద్ధంగా ఉంది. కాల్పుల విరమణ లెబనాన్‌కి వర్తించదు. లెబనాన్.. సంధిలో భాగం కాదు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తాం' అని నెతన్యాహు అన్నారు.లెబనాన్‌పై ఇజ్రాయెల్ కేవలం 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు చేసింది. ఇందులో ఇప్పటివరకు 254 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లెబనాన్‌పై ఇలానే దాడులు చేస్తే సీజ్ఫైర్ నుంచి ఇరాన్ తప్పుకొనే అవకాశముంది. -
వైమానిక దాడులు చేస్తాం..ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియా యుద్ధంలో సీజ్ఫైర్ ఒప్పందంతో ఇరాన్ శాంతించినా.. ఇజ్రాయెల్ మాత్రం తన తీరు మార్చుకున్నట్లు లేదు. తాజాగా దక్షిణ లెబనాన్ ప్రాంతంలో క్షిపణులతో విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, టెల్ అవీవ్‌కు భారీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఈ విషయమై ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. "కొన్ని గంటల్లో దక్షిణ లెబనాన్‌పై బాంబుల దాడిని ఆపకుంటే ఇరాన్ వైమానికి దళం టెల్ అవీవ్‌పై దాడులు కొనసాగిస్తుంది" అని ఇరాన్ ప్రకటించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.అయితే ఈ విషయమై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు "ఈ కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇరాన్‌తో నేరుగా జరిగే యుద్ధానికి మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై పోరాటం ఆగదని" తేల్చి చెప్పారు. లెబనాన్ నుండి హిజ్బుల్లా దాడులు చేస్తున్నంత కాలం ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మరో వైపేమో ఇరాన్ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కాల్పుల ఉల్లంఘన జరిగే అవకాశం ఉందా అని ఆందోళన వ్యక్తమవుతోంది. -
కాల్పుల విరమణలో అదిరిపోయే ట్విస్ట్
అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించబోదని.. దాడులు కొనసాగుతాయన్న రీతిలోనే ఆయన మాట్లాడారు. అయితే.. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడడంలో క్రెడిట్ పూర్తిగా తమదేనని భావిస్తున్న పాకిస్తాన్‌కు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయంగా మారింది. ఇరాన్‌పై భీకర దాడులు ఉంటాయన్న ట్రంప్.. డెడ్‌లైన్‌కు సరిగ్గా గంటన్నర ముందు శాంతి పావురం ఎగరేశారు. రెండు వారాలపాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని ప్రకటించారు. ఆ వెంటనే కాల్పుల విరమణ అనేది అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే.. కాసేపటికే షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో ప్రకటన చేశారు. బుధవారం వేకువ జామున నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నప్పటికీ లెబనాన్‌ను ఒప్పందంలో చేర్చలేదని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, అలాగే ప్రాంతీయ మిత్రదేశాలు ఇరాన్ అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కట్టుబడి ఉన్నాయని అన్నారు. అమెరికా–ఇరాన్ యుద్ధ విరమణ ఒప్పందం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిందన్నది ట్రంప్ ప్రకటనతో స్పష్టమైంది. ఇరాన్, యుద్ధం ముగించడానికి 10-పాయింట్ల ప్రణాళికను అమెరికాకు అందజేసింది. అయితే.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో ఇజ్రాయెల్–పాకిస్తాన్ మధ్య విభేదాలు స్పష్టమయ్యాయి. ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 10న శాంతి చర్చలు జరగనున్నాయి. ఆలోపు ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందా? లేదంటే వ్యవహారం మరింత ముదురుతుందా? అనేది చూడాలి.ఇదిలా ఉంటే.. మరోపక్క లెబనాన్ పరిస్థితి తీవ్రంగా ఉంది. మార్చి 2న హెజ్బుల్లా సంస్థ ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లు ప్రయోగించగా.. ప్రతిగా ఇజ్రాయెల్ భారీ స్థాయి దాడులు జరిపింది. ఈ దాడుల్లో 1,500 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.చైనా చెబితేనే.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో సంప్రదింపుల నేపథ్యంలోనే కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే.. కాసేపటికే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో చైనా కీలక పాత్ర పోషించిందని అన్నారు. మరోవైపు.. ఇరాన్ వాదన కూడా అలాగే ఉంది. ఈ విషయంలో పాక్ ప్రమేయమేదీ లేదనట్లే ఇరాన్ ప్రకటించింది. కేవలం చైనా చెబితేనే తాము ఈ ఒప్పందానికి ముందుకు వచ్చామని అంటోంది.ఇదీ చదవండి: అమెరికాకు ఇరాన్ 10 కండిషన్లు! ఇవిగో.. -
అఖండ ఇజ్రాయెల్ భావన ప్రమాదకరం
ప్రస్తుత యుద్ధరంగంలో లెబనాన్, పాలస్తీనా, ఇరాన్ ప్రతిఘటనల్ని అణచివేసి ‘అఖండ ఇజ్రాయెల్’ స్థాపనకు ఇజ్రాయెల్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానంలో అతని సంతానానికి నైలునది–యూప్రటీసుల మధ్యగల భూభాగం చెందు తుందని పురాణం చెబుతున్నట్లంటుంది. దీని ప్రకారం ఇరాన్, జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా దేశాలన్నింటినీ లేదా వాటిల్లో కొంత భూభాగాన్ని ఇజ్రాయెల్ ‘అఖండ ఇజ్రాయెల్’ కింద పరిగణిస్తోంది.ఆటోమన్ సామ్రాజ్యంపై విజయం సాధించిన బ్రిటిష్ సామ్రాజ్యం... అరబ్బులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసి దానిపై పరిపాలనాధికారాన్ని 1948 వరకు తన దగ్గరే ఉంచుకొంది. 1917లో యుద్ధ సమయంలో యూదు నాయకుడు తియోడర్ హెర్షల్కు, బ్రిటిష్ వాళ్లకు మధ్య జరిగిన బల్ఫోర్స్ రహస్య ఒప్పందం ఫలితంగా... పాలస్తీనా భూభాగంలో యూదులకు తలదాచుకోవటానికి వాగ్దానం చేశారు.1948లో వారి అనుకూల ఐక్యరాజ్య సమితిలో 118వ తీర్మానంతో ఇజ్రాయెల్, పాలస్తీనాలుగా భూభాగాన్ని విభజించారు. కానీ 1948 యుద్ధంలో ఇజ్రాయెల్... గాజా, వెస్ట్‌బ్యాంక్‌లు మినహా బ్రిటిష్ మాండేటరీ పాలస్తీనా మొత్తాన్నీ తన ఆధీనంలోకి తీసుకొంది. 1967లో ఆరు రోజుల యుద్ధంలో వెస్ట్‌బ్యాంక్, గాజాలతో పాటుగా ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంతోపాటు సిరియాలోని గోలెన్ హైట్స్‌ను ఆక్రమించి, 1982లో సినాయ్ను ఈజిప్టుకు తిరిగి ఇచ్చింది. ఇప్పటికీ ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్ అదుపుకలిగి ఉండటం గమనార్హం.ఇరాన్ యుద్ధాన్ని అదునుగా చేసుకొని దక్షిణ లెబనాన్‌లో, రాజధాని బీరూట్, మధ్య జిల్లాలతోపాటు బెకాలోయపై ఇజ్రాయెల్ బాంబుల దాడులు చేస్తున్నది. నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. 15 లక్షల మందికి పైగా, దేశంలో దాదాపు 20 శాతం ప్రజలు తమ ఇళ్లను వదిలి వలసలకు వెళ్లిపో వాల్సి వచ్చింది. ఇది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని ఐరాస ప్రకటించింది. హెజ్బొల్లాను నిరాయుధులుగా చేసేవరకు లెబనాన్ భూమిని ఆక్రమిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రజలను భయభ్రాంతుల్ని చేయటం ద్వారా హెజ్బొల్లాకు వ్యతిరేకంగా వారిని మార్చాలనే వ్యూహంలో ఇజ్రాయెల్ ఉంది.ప్రస్తుతం అమెరికా మద్దతుగా ఉన్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అలాషర్తో ఇజ్రాయెల్ మరింత బలపడుతోంది. సిరియా ద్వారా లెబనాన్ సరిహద్దులను, కదలికలను గమనిస్తూ లెబనాన్‌కు సహాయం అందకుండా చేస్తోంది. లెబనాన్ తూర్పు సరిహద్దును మూసివేయించింది. దేశంలో ఇప్పటికే అనేక వంతెనలను కూల్చింది. లెబనాన్ ఆక్రమణ దిశగా సాగుతోంది.చదవండి: అమెరికా.. తన ఆటలో తనే పాయిందా?కానీ డెమోరా అణుకేంద్రంపై ఇరాన్ చేసిన దాడి ఇజ్రాయెల్‌కు వణుకుపుట్టించింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన అమెరికా అధ్య క్షుడు ట్రంప్ ఏకంగా కొన్ని రోజులపాటు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడిచేయబోమని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ‘అఖండ ఇజ్రాయెల్’ సాకారమవ్వడం అసాధ్యం. ఒక వేళ ఈ యుద్ధంలో ఇజ్రా యెల్– అమెరికా నెగ్గితే మొత్తం పశ్చిమాసియాను ఆక్రమించి దీనికి ‘నూతన పురాణ అఖండ ఇజ్రాయెల్’గా మరొక పురాణగాథ చెప్ప టానికి అవి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇరాన్ దగ్గర వాటి ఆటలు సాగడం లేదు. ‘రెండు దేశాల’ సిద్ధాంతానికి ఇజ్రాయెల్ కట్టుబడిన నాడే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుంది. అంతవరకూ పశ్చిమాసియా కాష్ఠం రగులుతూనే ఉంటుంది.– బుడ్డిగ జమిందార్ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
ఇజ్రాయిల్ దాడుల్లో జర్నలిస్టులు మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లో శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందినట్లు ఆదేశ సైన్యం ప్రకటించింది.ఇజ్రాయెల్ లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంపైకి కంబాట్ ఆపరేషన్ చేపడుతూ పెద్దఎత్తున హిజ్బుల్లా ఫైటర్స్‌ను హతమారుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ దాదాపు 400కు పైగా హిజ్బుల్లా ఫైటర్స్ అంతం చేసినట్లు ప్రకటించింది. తాజాగా శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన ఛానెల్ షుయబ్-అల్- మనార్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టుతో పాటు మరో మహిళా జర్నలిస్టు, కెమెరామెన్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన జర్నలిస్టు దశాబ్దకాలంగా యుద్ధవార్తలు కథనాలు ప్రచురిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ దాడులను లెబనాన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. కాగా 2023 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక మంది పాత్రికేయులు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. -
400 మంది హిజ్బుల్లా ఫైటర్స్ మృతి
ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులలో ఇప్పటివరకు 400 మందికి పైగా హిజ్బుల్లా ఫైటర్లు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. దానితో పాటు లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది.ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఇటు లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంలోని నేరుగా సాయుధబలగాల్ని రంగంలోకి దింపింది. ఈ నేఫథ్యంలోనే ఆ ప్రాంతంలో భారీగా దాడులు చేస్తోంది. ఈ అటాక్స్ వల్ల ఇప్పటికే లక్షలో సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా 400కు పైగా హిజ్బుల్లా తీవ్రవాదులు మృతిచెందినట్లు నివేదికలు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ వివరాల్ని హిజ్బుల్లా సమూహానికి చెందిన వ్యక్తులు అందజేసినట్లు తెలిపింది.అయితే హిజ్బూల్లా మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక వివరాలను ప్రచురించలేదు. కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు మరణించిన సందర్భంలో వారి వివరాలను వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడులలో కనీసం 700 మంది హిజ్బుల్లా ఫైటర్లను మరణించినట్లు పేర్కొంది. ఇందులో వందలాది మంది ఆ సమూహానికి చెందిన ఎలైట్ 'రాద్వాన్ ఫోర్స్' సభ్యులు ఉన్నారని తెలిపింది.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడులు మరియు భూతల కార్యకలాపాల వల్ల లెబనాన్‌లో ఇప్పటివరకూ 1,142 మంది మరణించారని, వీరిలో 122 మంది పిల్లలు, 83 మంది మహిళలు మరియు 42 మంది వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొంది. కాగా 2023-2024లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో దాదాపు 5 వేల వరకూ హిజ్బుల్లా ఫైటర్స్ మృతిచెందినట్లు లెబనాన్ ప్రకటించింది. -
లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 20 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది మృతి చెందినట్లు, 57 మంది గాయపడినట్లు ఆ దేశ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. తాజా మారణహోమంతో మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన లెబనాన్ వాసుల సంఖ్య 1021కి చేరింది.కాగా, మార్చి 2న లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా.. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం మధ్యలోకి కాలు దూర్చింది. ఇరాన్‌కు మద్దతుగా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్, లెబనాన్‌లోని అనేక ప్రాంతాలపై విస్తృత వైమానిక దాడులు ప్రారంభించింది. వాస్తవానికి 2024, నవంబర్ 27న ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది. -
జర్నలిస్టు పైకి మిసైల్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
లెబనాన్‌లో రష్యాకు చెందిన ఓ స్వీనీ అనే జర్నలిస్టు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడి జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. అంతలోనే ఓ మిసైల్ అతని వైపుగా దూసుకొచ్చింది. ఇది గమనించిన జర్నలిస్టు అక్కడి నుంచి పక్కకు దూకారు. దీంతో ఆ రాకెట్ అక్కడే పేలింది.ఈ దుర్ఘటనలో జర్నలిస్టుతో పాటు కెమెరామెన్‌కు గాయాలయ్యాయి. దీంతో వారు వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. ఈ మిసైల్ అటాక్ జరిగిన ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన లైవ్‌లో రికార్డయ్యింది. లెబనాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ వీడియో ప్రతిబింబిస్తుంది.Being a journalist in this modern day war is among hundred ways to die😰A missile strikes insanely close to him pic.twitter.com/ymUOhS5OEf— Cypher (@patocypher) March 19, 2026 -
యుద్ధం ఎఫెక్ట్.. వేలసంఖ్యలో మృతులు.. లక్షలాది నిరాశ్రయులు
పశ్చిమాసియా యుద్ధం తీవ్ర మానవతా సంక్షోభానినికి దారి తీస్తుంది. ఈ యుద్దంలో ఇప్పటికే దాదాపు 2 వేల మందికి పైగా పౌరులు చనిపోగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతే కాకుండా పెద్ద మెుత్తంగా ఆస్తినష్టం సంభవించింది.ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు మెుదలు పెట్టి 15 రోజులు పూర్తయింది. అయినప్పటికీ యుద్ద ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రగిలిపోతుంది.కాగా ఇప్పటివరకూ యుద్దం కారణంగా నష్టపోయిన వారి తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది.యుద్దం ప్రారంభంనుంచే ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్‌తో పాటు లెబనాన్‌పై దాడి చేస్తోంది. అక్కడి హిజ్బుల్లా తీవ్రవాదులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నట్లు చెప్పినప్పటికీ చాలా మట్టుకు జనావాసాలపైనే ఇజ్రాయెల్ మిసైల్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ నివేదిక తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. యుద్దం కారణంగా లెబనాన్‌లో ఇప్పటి వరకూ దాదాపు ఎనిమిది లక్షల ప్రజలు నిరాశ్రయులైనట్లు నివేదికలు తెలిపాయి. అంతే కాకుండా వారిలో దాదాపు రెండు లక్షల మంది చిన్నారులున్నట్లు పేర్కొన్నాయి.దీనితో పాటు యుద్దం ప్రభావం గల్ఫ్ దేశాలపైనా అధికంగా పడింది. అక్కడి అమెరికా రక్షణ స్థావరాలే టార్గెట్‌గా ఇరాన్ దాడులు జరపడంతో ఆ దేశాలలోని పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే దుబాయి బీచ్‌లు, హోటళ్లు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. మార్కెట్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. దీంతో యుద్దం ఎప్పుడు ముగుస్తుందా అని ఆందోళన చెందుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి.. ప్రముఖ ఇన్‌ప్లూయెన్సర్ ఫ్యామిలీ మృతి
పశ్చిమాసియా యుద్దంలో మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ప్రముఖ లెబనీస్ ఇన్‌ప్లూయెన్సర్ నటాలీ కమల్ తన కుటుంబాన్ని కోల్పోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సైతం ప్రస్తుతం విషమంగా ఉంది.ఇజ్రాయెల్ ఓవైపు ఇరాన్‌పై దాడులు చేస్తూనే మరోవైపు లెబనాన్‌పై విరుచుకపడుతుంది. హిజ్బుల్లా స్థావరాలే లక్షంగా పెద్దఎత్తున మిసైల్స్ అటాక్ చేస్తోంది. టెల్ అవీవ్ ఆ దేశంలోకి చొచ్చుకొని కంబాట్ ఆర్మీ ఆపరేషన్ చేపడుతుంది. ఈ దాడుల నేపథ్యంలో ఆ దేశంలోని సాధారణ ప్రజలు సైతం దాడులలో పెద్దఎత్తున మృత్యువాత పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మౌంట్ లెబనాన్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ నటాలీ భర్త మెుహమ్మద్ షెబాద్, ఆమె చిన్న కుమార్తె తాలిన్ మరణించారు. అంతేకాకుండా ఈ అటాక్‌లో నటాలీ సైతం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన ప్రాంతం బీరూట్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం నేపథ్యంలో ఆశ్రయం కోల్పోయిన అనేక కుటుంబాలు అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ అటాక్ చేసిందని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మెుత్తంగా ముగ్గురు మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. -
‘గ్రేటర్ ఇజ్రాయెల్’ దిశగా నెతన్యాహు కుట్ర?
యుద్ధంతో పశ్చిమాసియా రావణకాష్టంలా మారింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కాస్తా ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధంగా రూపాంతరం చెందింది. అయితే ఇది ఉగ్రవాద వ్యతిరేక పోరాటమా లేక శతాబ్దాల నాటి సరిహద్దుల విస్తరణా? అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. లెబనాన్‌ను కబళిస్తున్న తీరు చూస్తుంటే ప్రధాని నెతన్యాహు లక్ష్యం ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ వైపు మళ్లుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.15 రోజుల్లో 20 శాతం భూభాగం కబ్జా?గడచిన రెండు వారాల్లో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎప్) లెబనాన్ సరిహద్దుల్లో ఊహించని వేగంతో ముందుకు సాగింది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని సుమారు 20 శాతం భూభాగాన్ని ఖాళీ చేయించడం వెనుక భారీ వ్యూహం దాగివుంది. హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేయడం పేరుతో ఇజ్రాయెల్ అక్కడ శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 800 మందికి పైగా పౌరులు, పోరాట యోధులు మరణించడంతో ఈ ప్రాంతం శ్మశానవాటికను తలపిస్తోంది.ఏమిటీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ కల?బైబిల్ కాలం నాటి ‘ప్రామిస్డ్ ల్యాండ్’ (వాగ్దాన భూమి) సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలనేది కొందరు అతివాద ఇజ్రాయెలీ నాయకుల తీవ్ర ఆకాంక్ష. దీనినే ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లేదా 'అఖండ ఇజ్రాయెల్' అని పిలుస్తారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ లోని కొన్ని భాగాలను కలుపుకోవాలి. నెతన్యాహు తాజా దాడులు ఈ పాత మ్యాప్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.హిజ్బుల్లా అణచివేత.. ఇరాన్ లక్ష్యంగా పావులుఇజ్రాయెల్కు అసలైన శత్రువు ఇరాన్ అని నెతన్యాహు నమ్ముతారు. ఇరాన్ అండతో నడుస్తున్న హిజ్బుల్లాను బలహీనపరచకుండా లెబనాన్‌పై పట్టు సాధించడం అసాధ్యం. అందుకే ఒకవైపు క్షిపణి దాడులతో హిజ్బుల్లా వెన్ను విరుస్తూనే, మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోందని వశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ జోక్యం చేసుకోకుండా అడ్డుకోగలిగితే, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా మారుతుంది.ట్రంప్ హయాంలో.. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన గత 13 నెలల్లో ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఇరాన్ నేతలపై దాడులు, కఠినమైన టారిఫ్‌లు, ఇజ్రాయెల్‌కు బేషరతు మద్దతు ఇవ్వడం ద్వారా ట్రంప్ నెతన్యాహుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లయింది. అమెరికా అండ ఉండటంతో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తోంది.పశ్చిమాసియా మ్యాప్ మారుతోందా?ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణుల పోరాటం కాదు.. ఇది భౌగోళిక సరిహద్దుల మార్పిడి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ‘బఫర్ జోన్’ ఏర్పాటు ఇప్పుడు లెబనాన్ లోపలి వరకు చొచ్చుకుపోయింది. నెతన్యాహు వ్యూహం గనుక ఫలిస్తే, రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పటంలో లెబనాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.శాంతి చర్చలు సాధ్యమేనా?ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అటు ఇరాన్ తన పట్టు కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఇటు ఇజ్రాయెల్ తన లక్ష్యం నెరవేరకుండా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ మహా సంగ్రామం పశ్చిమాసియాను మరో పెను మార్పు వైపు నడిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా? -
లెబనాన్‌పై బాంబుల వర్షం
పశ్చిమాసియా యుద్ధ తీవ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు మద్ధతుగా నిలిచే గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుంది. హిజ్బూల్లా స్థావరాలే లక్షంగా అటాక్స్ చేస్తుంది. అయితే ఈ దాడుల్లో అధిక సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు తీవ్రతరం చేసింది. కొద్దిరోజుల క్రితమే గ్రౌండ్ లెవల్ ఆపరేషన్ చేపట్టింది. ఆ దేశ ఆర్మీ దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి దాడులు చేస్తున్నాయి. తాజాగా బీరూట్ నగరంపై బాంబులతో విరుచుకపడింది. హిజ్బుల్లా టార్గెట్‌గా జరిగిన దాడుల్లో ఆ దేశంలోని సాధారణ పౌరులు పెద్దమెుత్తంలో మరణిస్తున్నారు. తాజాగా బీరూట్‌పై జరిపిన బాంబుదాడుల్లో 12 మంది వైద్యసిబ్బంది మృతిచెందినట్లు లెబనాన్ ప్రకటించింది.హిజ్బుల్లా హెచ్చరికఅయితే ఈ నేపథ్యంలో హిజ్బుల్లా నేత నయీమ్ ఖాసిమ్ తీవ్రంగా స్పందిచారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు." మమ్మల్ని మేము దీర్ఘకాలిక పోరాటానికి సిద్దం చేసుకున్నాం. భగవంతుడు కోరుకుంటే ఇజ్రాయెల్ యుద్ధ రంగంలో మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇది సాధారణ యుద్ధం కాదు. అస్థిత్వ యుద్దం." అన్నారు. లెబనాన్‌లో మౌళిక సదుపాయాలపై జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మూల్యం చెల్లించాలని తెలిపారు.కాగా నిన్న శుక్రవారం జ్రారియే మరియు టేర్ ఫాల్సే పట్టణాలను కలిపే లిటాని నదిపై ఉన్న వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇది హిజ్బుల్లాకు ప్రధానమైన రహదారి. ఇది ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్ చేరుకోవడానికి కీలకంగా ఉంటుంది. తాజాగా ఇజ్రాయెల్ దాన్ని ధ్వంసం చేసింది.ఇజ్రాయెల్ హెచ్చరిక కాగా మరోవైపు ఇజ్రాయెల్ ఈ దాడిపై ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే మరియు హిజ్బుల్లా ఉగ్రవాదులు ఉపయోగించే హిజ్బుల్లాకు తన మద్ధతు ఉపసంహరించి దానిని నిరాయుధీకరణ చేసే వరకూ లెబనాన్ భూభాగం కోల్పోతూనే ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ హెచ్చరించారు.ఐక్యరాజ్యసమితి స్పందనఅయితే శుక్రవారం బీరుట్ ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ పర్యటించారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు తక్షణమే యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలకు మద్ధతు ఇవ్వడానికి 325 మిలియన్ డాలర్ల మానవతావాద సహాయం అందించాలని ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. -
హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎప్)తన దాడులను మరింత ఉధృతం చేసింది. బుధవారం ఉదయం బీరుట్‌లోని దహీహ్ ప్రాంతంలో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండ్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులను విజయవంతంగా పూర్తి చేసింది. హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.దీనికిముందు బీరుట్‌తో పాటు లెబనాన్‌లోని టైర్ ప్రాంతంలో కూడా ఐడిఎఫ్ మెరుపు దాడులు చేపట్టింది. అక్కడి హిజ్బుల్లా ప్రధాన కమాండ్ సెంటర్‌ను వైమానిక దాడుల ద్వారా ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ భూభాగంపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద ముఠాల ఆటకట్టించడమే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.ఈ దాడుల సమయంలో పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఐడిఎఫ్ గరిష్ట జాగ్రత్తలు తీసుకుంది. దాడులకు ముందే పౌరులను హెచ్చరించడం, లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక మందుగుండు సామగ్రిని ఉపయోగించడం, నిరంతర వైమానిక నిఘా తదితర చర్యల ద్వారా పౌర హానిని తగ్గించడానికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బుల్లా వ్యూహాలను తిప్పికొట్టేలా ఈ దాడులు సాగాయని ఇజ్రాయెల్ పేర్కొంది.ఇజ్రాయెల్ పౌరుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దేశవాసులకు హాని కలిగించే ఏ ప్రయత్నాన్ని సహించబోమని ఐడిఎఫ్ పునరుద్ఘాటించింది. ఇరాన్ పాలన ప్రోద్బలంతో హిజ్బుల్లా తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, ఉగ్రవాద నిర్మూలనపై తాము గట్టి సంకల్పంతో ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు మరోమారు స్పష్టం చేశాయి. ఇది కూడా చదవండి: ‘ఎన్సీఈఆర్టీ’ వివాదంలో మరో మలుపు -
హిజ్బొల్లాపై తిరుగుబాటు.. ఎన్నికలకు దూరంగా లెబనాన్
బీరూట్: లెబనాన్‌లో రాజకీయ, భద్రతా సంక్షోభం నెలకొంది. మే నెలలో జరగాల్సిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేస్తూ లెబనాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్,హిజ్బుల్లా మధ్య యుద్ధం వల్ల అస్థిరత నెలకొంది. హిజ్బుల్లా పట్ల దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంలోని రాజకీయ మిత్రుల మద్దతు కోల్పోయింది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడంతో లెబనాన్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. హిజ్బుల్లా ఈ యుద్ధంలో కలగజేసుకోవడం లెబనాన్ ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసింది. పార్లమెంటరీ స్పీకర్ నబీహ్ బెర్రీ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్‌లో 128 మంది సభ్యుల్లో 76 మంది ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేయాలని మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల వాయిదాకు హిజ్బుల్లా ఎంపీలు కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం.చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్హిజ్బొల్లా దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్ లెబానాన్‌పై విరుచుకుపడింది. గతవారం జరిపిన దాడుల్లో 83మంది పిల్లలు మృతి చెందగా 200మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల రక్షణ, ఆరోగ్యం, విద్య, పోషణ కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూనిసెఫ్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్‌ను ఆపన్న హస్తం అందించేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. 6.9బిలియన్ డాలర్లు అత్యవసర ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పడింది. -
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం సీక్రెట్ ఆపరేషన్
పశ్చిమాసియా మెుత్తం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇజ్రాయెల్ బలగాలు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నాయి. 1986 యుద్ధంలో మృతిచెందిన ఓ సైనికుడి మృతదేహం కోసం అర్థరాత్రి వేళ గాలింపులు జరిపాయి.ప్రస్తుతం లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకెళ్లింది. ఆ దేశంలోకి చొరబడి హిజ్బుల్లా, హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కడ టెల్ అవీవ్ ఒక ఆసక్తికర ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 1986లో లెబనాన్‌తో యుద్ధం సమయంలో రాన్ అరాద్ అనే ఇజ్రాయెల్ ఫైలట్ మరణించాడు. హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌పై దాడిచేయగా అది తూర్పు లెబనాన్‌లోని బెక్కా లోయ సమీపంలో నబిట్ అనే గ్రామం వద్ద కూలిపోయింది.అయితే ఆరోజు జరిగిన దాడిలో ఫైలట్ అరాద్ మరణించినట్టు ఇజ్రాయెల్ అప్పుడే నిర్ధారించింది. ఆయన మృతదేహాన్ని వెనక్కితీసుకురావడానికి ప్రయత్నాలు జరుపగా అవి ఫలించలేదు. అయితే ప్రస్తుతం దానికి సరైన సమయం అని భావించిన ఇజ్రాయెల్ ప్రత్యేక కమెండోలను రంగంలోకి దించింది. నాలుగు సైనిక హెలికాప్టర్లతో శుక్రవారం రాత్రి వేళ నబిట్ ప్రాంతానికి చేరుకొని గాలింపులు చేపట్టారు.తాజాగా ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని పంచుకున్నారు. "ఇజ్రాయెల్ సైనికులు నాలుగు హెలికాప్టర్లలో వచ్చారు. ఆ లోయ ప్రాంతంలో ఆ సైనికుడి మృత దేహం కోసం తవ్వకాలు జరిపారు. అయితే వారికి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. అయితే అతని డెడ్‌బాడీ కోసం మరోసారి వెతుకతామని వారు తెలిపారు" అని గ్రామస్థులు పేర్కొన్నారు.అయితే అరాద్ అవశేషాలు దొరికే దాకా గాలింపు కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొంది. దీంతో ఇజ్రాయెల్ తమ దేశ సైనికులకు ఎంత గౌరవం ఇస్తుందా అనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అరాద్ను ఎక్కడ పూడ్చిందీ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్.. హెజ్బొల్లా దళాలను విచారించి ఆ ఆధారంగానే ఈ ఆపరేషన్ చేపట్టిందని సమాచారం. -
భీకర యుద్ధం.. ఇరాన్ గుండెల్లో బాంబుల వర్షం
-
ఇరాన్‌పై నిప్పుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్‌తో పాటు లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ బుధవారం ఐదో రోజు అక్షరాలా నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని కీలక ప్రభుత్వ వ్యవస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా టెహ్రాన్‌తో పాటు కోమ్, ఉరి్మయా, కెర్మన్షా తదితర నగరాలపై కూడా రోజంతా పలు దఫాలుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్‌లోని క్షిపణి నిల్వల కేంద్రంపై క్షిపణుల వర్షం కురిపించింది.టెహ్రాన్ సమీపంలోని నూతన అణు ప్రాజెక్టు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన వైఏకే–130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో కూల్చేసినట్టు సైన్యం వెల్లడించింది. దాడుల ధాటికి తాళలేక దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా ఇరాన్ వాయిదా వేసుకుంది! ఇప్పటిదాకా ఇరాన్‌కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు. ఇరాన్లో ఇప్పటిదాకా 1,045 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం బాగా క్షీణించిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ ఎఫీ డెఫ్రిన్ పేర్కొన్నారు. దాంతో దాడుల తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకొచ్చారు. బుధవారం ఇరాన్ కూడా దీటుగా ప్రతి దాడులకు దిగింది. జెరూసలేం తదితర నగరాలపైకి భారీగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతర్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలపై కూడా దాడులను నిరి్నరోధంగా కొనసాగించింది. దుబాయ్‌లోని యూఎస్ రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో కార్యాలయం భారీ మంటల్లో చిక్కింది. అయితే సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అక్కడి రస్ అనూరా చమురు శుద్ధి కేంద్రంపై కూడా మళ్లీ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ వ్యవస్థపైనా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అంతేగాక తన దాడులను టరీ్కకి కూడా విస్తరించింది! ఇరాన్ నుంచి తమ గగనతలంలోకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్టు టర్కీ ప్రకటించింది. తమపై అకారణ దాడికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాలు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. పశ్చిమాసియాలోని సైనిక, ఆర్థిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేందుకు సన్నద్ధం అవుతున్నామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది! లెబనాన్‌లో... లెబనాన్‌పై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ బుధవారం మరింత పెంచింది. ఎడతెరిపి లేకుండా వచి్చపడుతున్న క్షిపణులు, బాంబులతో బీరూట్ దద్దరిల్లిపోతోంది. అరమౌన్, సాదియత్ తదితర నగరాలపైనా దాడులు కొనసాగుతున్నాయి. బలైనట్టు తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామవాసులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడుల ధాటికి దక్షిణ లెబనాన్‌లో ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులుగా మారారు. బాల్బెక్లో ఓ నివాస సముదాయంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు, సాదియత్లో ఆరుగురు మరణించినట్టు లెబనాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. -
తీవ్రస్థాయికి యుద్ధం.. దూసుకెళుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకూ తమ ప్రాంతాలను నుండే శత్రు దేశంలోకి దాడి చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ లెవల్లో తమ దేశ ఆర్మీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌పై పదాతిదళాల ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ధృవీకరించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా టార్గెట్‌గా దక్షిణ లెబనాన్‌లోకి దూసుకెళుతున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అమెరికా కేవలం కంబాట్ దాడులే చేసిందని అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్‌కు పంపిస్తాం. ప్రత్యక్ష యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌పై మండిపడ్డారు. ఇరాన్ ప్రతి సారి అబద్ధం చెబుతోంది. ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేసే మిసైల్ వ్యవస్థ ఉంది. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్లో ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుంది. అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు.ఇరాన్ సుప్రీం ఖమేని మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇరాన్‌కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామన్నారు. ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తెలిపారు. ఇదివరకే అమెరికా ఇరాన్ నావికాదళాన్ని తుడిచిపెట్టిందని ఇక ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తామని తెలిపారు. అయితే ఇరాన్ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచిందని వాటిని చేధించడం అమెరికా,ఇజ్రాయెల్ సైన్యాలకు పెనుసవాల్‌గా మారిందన్నారు. అయితే ఇరాన్ సైతం తీవ్రమైన ప్రతి దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా విరుచుకపడుతుంది. -
‘మమ్మల్ని కెలకొద్దు’.. లెబనాన్ ప్రధాని సీరియస్ వార్నింగ్!
బేరూత్: ఇజ్రాయెల్‌పై హెజ్బుల్లా జరిపిన రాకెట్ దాడులపై లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ.. హెజ్బుల్లా చర్యలు బాధ్యతారహితమైనవని,అనుమానాస్పదమైనవని అన్నారు. ఇటువంటి విచక్షణారహిత దాడులు తమ దేశాన్ని ప్రాంతీయ యుద్ధంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ అగ్రనేత ఖమేనీ మృతికి ప్రతీకారంగా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ పెద్ద ఎత్తున రాకెట్లు, డ్రోన్లతో లెబనాన్‌పై విరుచుకుపడిన దరిమిలా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. أياً كانت الجهة التي تقف وراءها، فإنّ عملية إطلاق الصواريخ من جنوب لبنان عمل غير مسؤول ومشبوه، ويعرّض امن لبنان وسلامته للخطر ويمنح اسرائيل الذرائع لمواصلة اعتداءاتها عليه.لن نسمح بجر البلاد إلى مغامرات جديدة، وسنتخذ كل الإجراءات اللازمة لتوقيف الفاعلين وحماية اللبنانيين.— Nawaf Salam نواف سلام (@nawafsalam) March 2, 2026ఇరాన్ మద్దతు కలిగిన హెజ్బుల్లా.. లెబనాన్ భద్రతను, సుస్థిరతను ప్రమాదంలో పడేస్తోందని ప్రధాని నవాఫ్ సలామ్ ఆవేదన వ్యక్తం చేశారు. హెజ్బుల్లా చేస్తున్న ఇటువంటి దాడులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ తన దురాక్రమణను కొనసాగించడానికి అవకాశం కల్పిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లోకి తమ దేశాన్ని లాగడాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.దేశ ప్రజల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఇటువంటి ‘కొత్త సాహసాల’కు దేశం బలికాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. మరోవైపు హెజ్బుల్లా దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) లెబనాన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడ్డాయి. లెబనాన్ భూభాగంలోని హెజ్బుల్లా మౌలిక సదుపాయాలు, రాకెట్ ప్రయోగ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ప్రధాని సలామ్ శాంతిని కాపాడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు లెబనాన్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: విప్లవ వీరుడి నుంచి.. క్షిపణి జ్వాలల వరకు.. -
దక్షిణ లెబనాన్‌పై.. ఇజ్రాయెల్ దాడులు
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా హిజ్బుల్లా తీవ్రవాదులు తరుచుగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దక్షిణ లెబనాన్ లోని టెర్రరిస్టుల మౌలిక సదుపాయాల ధ్యంసమే టార్గెట్‌గా ఈ అటాక్స్ జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.అయితే ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అనుకూల వర్గాలైన హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యెమెన్‌లోని ప్రభుత్వ మద్ధతు గల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్ధమవుతున్నారు.దీనిలో భాగంగా హోదైదా, మారిబ్ ప్రాంతాల్లో తమ బలగాలను మోహరించారు. వారి నియంత్రణలో ఉన్న సనా వంటి నగరాల్లో అత్యవసర కేంద్రాలు, ఆశ్రయాలుగా ఉపయోగించే ప్రభుత్వ భవనాలు సిద్ధం చేస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన పక్షంలో హౌతీలు ఇతర ఇరాన్ మిత్ర బలగాలతో (హిజ్బుల్లా వంటి) కలిసి ‘యూనిటీ ఆఫ్ ఫ్రంట్స్’ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, కొత్త దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన డ్రోన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.మెుత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు గంభీరంగా మారాయి. ఇటు వైపేమో ఇరాన్ అనుకూల వర్గాలు అమెరికా, ఇజ్రాయెల్ పై దాడులకు సిద్ధమవుతుండగా మరో వైపేమే అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్‌కు దగ్గరగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి
లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్ తూర్పు ప్రాంతమైన బెకా వ్యాలీపై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో హిజ్బుల్లాకు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి కూడా ఉన్నట్లు భద్రతా వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అతి పెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే హిజ్బుల్లా నుండి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.అదేవిధంగా దక్షిణ లెబనాన్‌లోని సిడాన్ సమీపంలో ఉన్న 'ఐన్ అల్-హిల్వే' అనే పాలస్తీనా శరణార్థి శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. అక్కడ హమాస్ కమాండ్ సెంటర్ ఉందనే కారణంతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. కానీ హమాస్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. అది కేవలం భద్రతను పర్యవేక్షించే జాయింట్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రమని హమాస్ స్పష్టం చేసింది. -
హిజ్బుల్లా స్థావరాలపై ఐడీఎఫ్ దాడులు
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలపై దాడులు జరిపింది.ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను మళ్లీ పుంజుకునేలా చేస్తోందన్న సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు నిర్వహించింది. హిజ్బుల్లా కార్యకర్తలు ఇజ్రాయెల్ భూభాగం వైపు ట్యాంక్ వ్యతిరేక క్షిపణులను ప్రయోగించడానికి ఉపయోగించిన అల్-ఖియామ్ సమీపంలోని ఒక నిర్మాణాన్ని కూడా సైనికులు కూల్చివేసినట్లు సైన్యం తెలిపింది.దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హిజ్బుల్లా (Hezbollah) చెందిన ఆయుధ నిల్వ గిడ్డంగులను లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేసింది. ఈ దాడులకు ముందు, పౌరులకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు, వాటిలో ఆ ప్రాంతంలోని జనాభాకు ముందస్తు ఇజ్రాయెల్ సైన్యం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.ఈ ఆయుధ కేంద్రాలలో ఒకటి జనసంచారం ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల మధ్యలో ఉంది. లెబనాన్ పౌరులను హిజ్బుల్లా 'మానవ కవచాలు' (Human Shields) వాడు కుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. పౌర మౌలిక సదుపాయాల నుండి కార్యకలాపాలను కొనసాగిస్తోంది అనడానికి ఇదొక ఉదారణ అని పేర్కొంది. ఈ ఆయుధ కేంద్రాలు ఇజ్రాయెల్ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని, అందుకే వాటిని తొలగించడం తప్పనిసరి అని IDF స్పష్టం చేసింది.కాగా ఈ దాడులు కేవలం ఆకస్మికమైనవి కావు, దీని వెనుక కీలకమైన కారణాలు లేకపోలేదు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో హిజ్బుల్లా ఎటువంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించ కూడదు. కానీ హిజ్బుల్లా మళ్లీ అక్కడ స్థావరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన ప్రకారం, తమ దేశానికి ముప్పు పొంచి ఉన్నంత కాలం లెబనాన్‌లోని ఏ ప్రాంతంలోనైనా కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. హెజ్బుల్లా తన సైనిక మౌలిక సదుపాయాలను పౌర గృహాల కింద, స్కూళ్ల సమీపంలో నిర్మించడం అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించడమేనని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. -
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దక్షిణ ప్రాంతంలోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు (IOF) వైమానికదాడులు జరుపుతున్నాయి. నష్టం వివరాలు తెలియరావాల్సింది. అయితే తాజా పరిణామాలతో ఇజ్రాయెల్-హోజ్బొల్లా ఘర్షణలు మళ్ల తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్బొల్లా షెల్టర్లను టార్గెట్ చేశాయి. సాజ్, అల్-రయ్‌హాన్, మౌంట్ అల్-రఫీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. దీర్ అల్-జహ్రాని, హౌమిన్ అల్-ఫౌఖా ప్రాంతాల గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాల సంచారం కనిపించిందని తెలుస్తోంది. మరోవైపు.. దీర్ అల్-జహ్రాని–హౌమిన్ అల్-ఫౌఖాలోని లోయపై బాంబుదాడి జరిగింది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్‌లోని క్ఫార్ఫిలా, రూమైన్, మౌంట్ రయ్‌హాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా దాడులతో స్పష్టమవుతోంది. అటు వాది హమిలా ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు సమాచారం. హెజ్బొల్లాకి చెందిన మిసైల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆయుధ గిడ్డంగులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించుకుంది. 2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన సీజ్ఫైర్ తర్వాత కూడా ఇజ్రాయెల్ 10,000కిపైగా ఉల్లంఘనలు జరిపిందని UNIFIL (United Nations Interim Force in Lebanon) గణాంకాలు చెబుతున్నాయి. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆవున్ తాజా దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయన్నారు. లెబనాన్‌లోని పలు గ్రామాల ప్రజలను తక్షణ ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ.. ఐక్యరాజ్య సమితి కూడా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. -
లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు..!
నిన్న-మొన్నటి వరకూ ఇరాక్‌తో యుద్ధం చేసిన ఇజ్రాయిల్.. ఇప్పుడు లెబనాన్‌పై యద్ధం చేయడానికి సిద్ధమవుతుందా?, ఇజ్రాయిల్ సైనిక దళాలు తమ సరిహద్దు గోడను దాటి లెబనాన్‌లోకి వెళ్లడానికి కారణం ఏమిటి?, ఇజ్రాయిల్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక దేశం సైనిక దళాలు.. వేరొక దేశంలోకి ప్రవేశించాయంటే కారణం లేకుండా వెళ్లవు. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా తమ సరిహద్దు గోడను దాటి కేవలం 150 మీటర్ల దూరంలోకి వెళ్లాయి. దక్షిణ లెబనాన్‌లోని జెజైన్ జిల్లాలోకి ప్రవేశించాయి. అదే సమయంలో ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ దాడులకు కూడా పాల్పడిందని స్థానిక న్యూస్ ఏజెన్సీలు స్పష్టం చేయింది. దీనిపై లెబనాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయిల్ దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని ఆరోపిస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయిల్ వైమానిక దళాలు స్పందించాయి. దక్షిణ లెబనాన్‌లో హెజ్బుల్లా ఆనవాళ్ల ఉన్నాయని అందుకే అక్కడ దాడులు చేశామని పేర్కొన్నాయి. నెతన్యాహూ తిరిగొచ్చిన తర్వాతే ఈ దాడులుఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మిలటరీకి ప్రత్యేక ఆదేశాల జారీ చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ ఎటువంటి సైనిక చర్యలు ఉండొద్దని పేర్కొన్నారు. అయితే ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. ఆ దేశ సైనిక దళాలు.. లెబనాన్న టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
బీరుట్ గగనతలంలో భారీ ఎయిర్ ఫోర్స్ రద్దీ.. ఏం జరగబోతుంది..?
లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో ఇటీవల భారీ ఎయిర్ ఫోర్స్ రద్దీ కనిపిస్తోంది. స్థానికులు వరుసగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాల కదలికలను గమనిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఏం జరుగబోతుందోనని లెబనాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నట్లు సమాచారం.ఎందుకీ ఆందోళన..?లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుంది. సరిహద్దు నియంత్రణ, ప్రాంతీయ రాజకీయాల నేపథ్యంలో 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసింది. ఈ దాడికి వ్యతిరేకంగా లెబనాన్‌లో ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా హిజ్బుల్లా అనే సంస్థ ఏర్పడింది. హిజ్బుల్లా లెబనాన్‌లోని షియా ముస్లింలకు ఆధారంగా ఏర్పడి, ఇరాన్ మద్దతుతో బలపడింది. ప్రస్తుతం హిజ్బుల్లా లెబనాన్‌లో శక్తివంతమైన రాజకీయ, సైనిక శక్తిగా మారింది.ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో సైనిక ఉనికిని కొనసాగించడం, హిజ్బుల్లా దానిని ప్రతిఘటించడం ద్వారా వివాదం తీవ్రరూపం దాల్చింది. 2024 నవంబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, అప్పుడప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి.ఇటీవలే (డిసెంబర్ 9న) ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు జరిపాయి. మౌంట్ సఫీ, జ్బా, జెఫ్టా వ్యాలీ ప్రాంతాల్లో జనావాసాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి తమ గగనతలంలో సంచరిస్తుండటంతో లెబనాన్ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. -
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా కీలక నేత హతం
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్న హయథమ్ అలీ తబ్‌తబై సహా ఐదుగురు చనిపోగా 24 మంది గాయపడ్డారు. జూన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి జరపడం ఇదే మొదటిసారి.బీరుట్ శివారులోని హరెట్ హెచ్చీక్ ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌పై కచ్చిత లక్ష్యంతో దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హెజ్బొల్లా సీనియర్ మిలిటెంట్ హయథమ్ అలీ తబ్‌తబై హతమయ్యాడని తెలిపింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈయనపై ఇజ్రాయెల్ హత్యాయత్నం చేసినట్లు సమాచారం. తాజాగా జరిగిన క్షిపణి దాడిలో హయథమ్ గాయపడ్డారా లేదా చనిపోయారా అనేది హెజ్బొల్లా ధ్రువీకరించలేదు. దాడి కారణంగా అపార్టుమెంట్ భవనం పూర్తిగా దెబ్బతిందని, పలు కార్లతోపాటు చుట్టుపక్కల భవనాలు కూడా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. రెండు క్షిపణులు ఆ భవనంపై పడినట్లు స్థానికులు తెలిపారు. హెజ్బొల్లాలోని శక్తివంతమైన రద్వాన్ యూనిట్‌కు హయథమ్ సారధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం 2016లో ఈయన్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈయన తలపై 5 లక్షల డాలర్ల రివార్డు ఉంది. ఇదిలా ఉండగా.. హయథమ్ అలీ టార్గెట్ కారణంగా దహియేలో భయాందోళన నెలకొంది. అక్కడ దాడులకు కొన్ని క్షణాల ముందు యుద్ధ విమానాల గర్జన విన్నట్లు నివాసితులు తెలిపారు. వాహనాలు మరియు భవనాలు ధ్వంసమై కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో 24 మందికిపైగా పౌరులు మృతి చెందినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, హెజ్బొల్లా కమాండర్‌కు నివాసంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే మొదటిది. -
Lebanon: పాలస్తీనా శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి
సిడాన్: దక్షిణ లెబనాన్‌లోని సిడాన్ తీరప్రాంతం శివార్లలోని పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మరణాలను ధృవీకరించింది. ‘ఎన్డీటీవీ’ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడి ఒక డ్రోన్ సాయంతో చేశారు. తొలుత మసీదు పార్కింగ్ స్థలంలో ఉన్న ఒక కారును ఢీకొట్టించారు. ఏడాది క్రితం ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య కాల్పుల విరమణ తర్వాత లెబనాన్‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఈ దాడిని ధృవీకరించింది. ఇది హమాస్ శిక్షణా ప్రాంగణం లక్ష్యంగా జరిగిందని పేర్కొంది. హమాస్ గ్రూపు ఎక్కడ పనిచేసినా వారిపై చర్యలు కొనసాగిస్తామని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఇజ్రాయెల్.. లెబనాన్‌పై వైమానిక దాడులను నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో హమాస్, హిజ్బుల్లా వంటి తీవ్రవాద వర్గాలకు చెందిన పలువురు నేతలు మరణించారు. 2024, జనవరి 2న బీరుట్లో జరిగిన డ్రోన్ దాడిలో హమాస్ కీలక నేత సలేహ్ అరౌరి మృతి చెందారు.2023, అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపిన తర్వాతి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. నాటి దాడికి స్పందనగా ఇజ్రాయెల్.. గాజాపై దాడి చేసి, పదివేల మంది పాలస్తీనియన్లను హత్య చేసింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజు నుంచే హిజ్బుల్లా.. ఇజ్రాయెల్ సరిహద్దు పోస్టులపై రాకెట్లను ప్రయోగించడం మొదలుపెట్టింది. ఈ ఘర్షణలు 2024 సెప్టెంబర్ చివరిలో పూర్తి స్థాయి యుద్ధంగా మారాయి.2024 నవంబర్ చివరిలో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది. అయినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్‌లో అనేక వైమానిక దాడులు నిర్వహిస్తూనే ఉంది. గత నాలుగు దశాబ్దాలలో హిజ్బుల్లాతో జరిగిన ఘర్షణల్లో లెబనాన్‌లో 4,000 మంది, ఇజ్రాయెల్‌లో 127 మంది మరణించారు. కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ సైనిక చర్యల కారణంగా లెబనాన్‌లో 270 మందికి పైగా మరణించారని, దాదాపు 850 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.ఇది కూడా చదవండి: ట్రంప్ కొత్త డ్రామా.. డీల్స్ కోసం ‘ఎంబీఎస్’కు క్లీన్చిట్ -
హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి
లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో నబాతియే (Nabatieh) ప్రాంతంలోని కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి.ఈ దాడులపై ఐడీఎఫ్ ప్రతినిధి స్పందిస్తూ.. ఉత్తర కమాండ్ నేతత్వంలో ఐడీఎఫ్.. లెబనాన్‌లోని నబతియే ప్రాంతంలో హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిందని తెలిపారు. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లెబనాన్ అంతటా ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తోందని.. హిజ్బుల్లా కార్యకలాపాలు.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఐడీఎఫ్ పేర్కొంది. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు
జెరూసలేం: లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులతో విరుచుకుపడింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు రాకెట్లు దూసుకొచ్చాయి. దీంతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర ప్రతిదాడులు చేస్తోంది. శనివారం దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రదేశాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గతేడాది నవంబరులో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం తొలిసారి పెద్దఎత్తున పరస్పర దాడులు జరుగుతున్నాయి.బుధవారం.. గాజాపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు. సరిహద్దులకు సమీపంలోని ఖాన్‌యూనిస్ నగర వెలుపల అబసన్ అల్– కబీర్ గ్రామంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 16 మంది చనిపోయినట్లు అక్కడున్న యూరోపియన్ ఆస్పత్రి తెలిపింది.కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మొదటిసారిగా ఇజ్రాయెల్ మంగళవారం ఉదయం గాజాపై జరిపిన దాడుల్లో కనీసం 400 మంది చనిపోవడం తెలిసిందే. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో 200 మంది చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మరో 909 మంది క్షతగాత్రులుగా మారారని పేర్కొంది. కాగా, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించుకుంది. -
హసన్ నస్రల్లాకు కన్నీటి వీడ్కోలు
బీరూట్: లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హెజ్బొల్లా’దివంగత అధినేత హసన్ నస్రల్లాకు వేలాది మంది అభిమానులు తుది వీడ్కోలు పలికారు. గత ఏడాది సెపె్టంబర్లో బీరూట్ శివారు ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో మరణించిన నస్రల్లా అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అభిమాన నేతకు నివాళులర్పించడానికి వేలాది మంది తరలివచ్చారు. నస్రల్లా పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం లెబనాన్ రాజధాని బీరూట్‌లోని కెమిల్లీచామౌన్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఉంచారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. స్టేడియంలో నస్రల్లా మృతదేహంతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు హషీం సఫీద్దీన్ మృతదేహాన్ని కూడా జనం దర్శించుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో సఫీద్దీన్ మరణించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరువురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హెజ్బొల్లా అగ్రనేత నయీమ్ ఖాషీం టీవీలో ప్రసంగించారు. నస్రల్లా చూపిన మార్గంలో నడుస్తామని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు. అంత్యక్రియల సందర్భంగా బీరూట్ నగరంలో అడుగడుగునా నస్రల్లా చిత్రపటాలు ఏర్పాటు చేశారు. నగరంలో విషాద వాతావరణం కనిపించింది. విదేశాల నుంచి సైతం అభిమానులు హాజరయ్యారు. -
సిరియాలో విధ్వంసం.. స్వదేశానికి బయలుదేరిన భారతీయులు
డెమాస్కస్/బీరూట్: సిరియాలో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తరలి వస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవతో దాదాపు 75 మంది భారతీయులు సిరియా నుంచి స్వదేశానికి బయలుదేరారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరియాలో దారుణ పరిస్థితులు, దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సిరియాను వీడాలని సూచించింది. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీంతో, అక్కడున్న వారంతా స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.సిరియా నుండి కనీసం 75 మంది భారతీయులు పప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. వారంతా మొదట సిరియా నుంచి లెబనాన్ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు.. డెమాస్కస్, బీరూట్ భారత రాయబార కార్యాలయాల ద్వారా పౌరుల తరలింపునకు సంబంధించి సమన్వయం చేసినట్టు వెల్లడించింది.ఇక, ఇప్పటికీ సిరియాలో ఉన్న భారతీయులు.. డమాస్కస్‌లోని దౌత్యకార్యాలయం ద్వారా తగిని సాయం పొందాలని కోరింది. ఈ క్రమంలో హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973, వాట్సాప్, ఈ-మెయిల్ hoc.damascus@mea.gov.in ద్వారా టచ్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.Pics of 75 Indians evacuated from war torn #Syria, they are reaching home soon. https://t.co/uw6TWEtIUP pic.twitter.com/wNqagbh758— Abhishek Jha (@abhishekjha157) December 10, 2024 -
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల వెంట కాల్పుల మోత ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు అండగా ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ వెనక్కి తగ్గే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో హెజ్బొల్లాకు కుదరబోతున్న కాల్పుల విరమణ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణకు నెతన్యాహూ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంకొన్ని కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక అంగీకారం కుదురుతుందని తెలుస్తోందని సీఎన్ఎన్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సూత్రప్రాయ అంగీకారం త్వరలో కుదరబోతోందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సర్ సోమవారం చెప్పారు. -
హెజ్బొల్లాకు మళ్లీ ఎదురుదెబ్బ.. మరో కీలక నేత హతం
బీరుట్:మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆదివారం(నవంబర్17) జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.మహమ్మద్ ఆసిఫ్ అనేక సంవత్సరాలుగా హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ తన దాడులను ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా అంతమొందించింది. ఇదిలా ఉండగా హెజ్బొల్లా మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్న వేళ ఈ దాడులు చోటుచేసుకున్నాయి. -
ఇజ్రాయెల్‌పైకి వందలాది రాకెట్లు
బీరూట్: కొద్దిపాటి విరామం తర్వాత లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై సోమవారం వందలాది రాకెట్లతో దాడికి దిగింది. సెప్టెంబర్‌లో లెబనాన్‌వ్యాప్తంగా వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను గాయపరచడమే గాక వందల మంది మరణానికి కారణమైన పేజర్ దాడులు తమ పనేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. తమ దేశ ఉత్తర ప్రాంతంపై నిమిషాల వ్యవధిలోనే 165కు పైగా రాకెట్లు వచ్చిపడ్డట్టు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వార్తా పత్రిక పేర్కొంది. వాటిలో 50కి పైగా కార్మియెల్ ప్రాంతం, పరిసర పట్టణాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించింది. మరోవైపు రేవు పట్టణం హైఫాపైకి రెండు విడతల్లో 90కి పైగా రాకెట్లు దూసుకెళ్లాయి. గలిలీ, కార్మియెల్ ప్రాంతాల్లోని సైనిక లక్ష్యాలపై తాము చేసిన వ్యూహాత్మక దాడులు విజయవంతమైనట్టు హెజ్బొల్లా ప్రకటించింది. అనంతరం రాకెట్ దాడుల దృశ్యాలతో కూడిన వీడియోలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మతిలేని దూకుడు బారినుంచి ఉత్తర ప్రాంతంలోని తమ పౌరులను పూర్తిస్థాయిలో కాపాడుకుంటామని పేర్కొంది. హెజ్బొల్లా రాకెట్లను చాలావరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుని సురక్షితంగా కూల్చేసింది. అయినా పలు రాకెట్లు పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను కూడా తాకినట్టు సమాచారం. దాడుల్లో బినా పట్టణంలో ఏడాది వయసున్న ఓ చిన్నారితో పాటు ఏడుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 8న కూడా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భారీగా రాకెట్ దాడులకు దిగడం తెలిసిందే. లెబనాన్‌తో కాల్పుల విరమణ దిశగా చర్చల్లో పురోగతి కని్పస్తోందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గైడెన్ సార్ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
పేజర్ దాడులు.. యస్ మా పనే
జెరూసలేం: ఇటీవల లెబనాన్, సిరియాలపై జరిగిన పేజర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ దాడిలో పలువురు హిజ్బుల్లా నేతలు హతమయ్యారు. తాజాగా ఈ దాడులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేజర్ల దాడుల ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.గత సెప్టెంబరులో హిజ్బుల్లాపై జరిపిన పేజర్ దాడులకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఈ దాడుల్లో 40 మంది మృతిచెందగా, మూడు వేల మంది గాయాలపాలయ్యారు. నాడు ఈ పేజర్ల దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లెబనాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. దీనిని మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి ఒమర్ దోస్త్రి మీడియాతో మాట్లాడుతూ లెబనాన్‌లో పేజర్ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెతన్యాహు స్వయంగా ధృవీకరించారన్నారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు అందిన కొద్ది రోజులకే ఈ దాడుల వెనుక ఉన్నది తానే అనే విషయాన్ని నెతన్యాహు తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు.కాగా ఈ పేలిన పేజర్లను హంగేరీకి చెందిన బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తయారు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో తెలిపింది. గత సెప్టెంబరులో లెబనాన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా నిరసనలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌లోకి తమ దళాలను దింపి, దాడులకు తెగబడింది. ఇది కూడా చదవండి: ‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రం చేసింది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది.బీరుట్‌పైనే కాకుండా తీర నగరం టైర్‌పైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. గతంలో ఇక్కడ దాడులు చేస్తామని ముందే హెచ్చరించిన శనివారం జరిపిన దాడుల గురించి మాత్రం ఎలాంటి సమాచారమివ్వలేదని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో మొత్తం 3136 మంది మరణించారని, 13వేల మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ అధికారులు తెలిపారు. కాగా, పాలస్తీనాలోని హమాస్‌తో పాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్లపై ఇజ్రాయెల్ ఏకకాలంలో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హెజ్బొల్లా ఇరాన్‌కు మద్దతుగా పనిచేస్తోందన్న కారణంగా ఇటీవల ఇజ్రాయెల్ హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై విరుచుకుపడుతోంది.ఇదీ చదవండి: డీఏపీకి ‘గాజా’ దెబ్బ -
శిథిలాల్లో 30 మృతదేహాలు
బీరుట్: లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ భవనం నేలమట్టమైంది. బుధవారం సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న కనీసం 30 మృత దేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కిందే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా చేపట్టిన ఈ దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. తీరప్రాంత సిడాన్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పట్టణంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి చేసిన దాఖలాలు లేవు. ఇలా ఉండగా, లెబనాన్‌లోని హెజ్బొల్లా సాయుధ గ్రూపు బుధవారం ఇజ్రాయెల్‌పైకి కనీసం 10 రాకెట్లను ప్రయోగించింది. దీంతో, టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి. ఒక రాకెట్ శకలం సెంట్రల్ ఇజ్రాయెల్ నగరం రాననలోని పార్కు చేసిన కారుపై పడింది. టెల్ అవీవ్‌లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలోని బహిరంగ ప్రాంతంలో రాకెట్లు పడ్డాయని మీడియా తెలిపింది. విమానాల రాకపోకలు మాత్రం కొనసాగాయని పేర్కొంది. రాకెట్ల దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సహాయక బృందాలు తెలిపాయి. -
దాడులను తట్టుకోలేరు.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్
జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడి చేయాలని చూస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇరాన్ దాడులపై తాజాగా ఇజ్రాయెల్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెర్జి హలేవీ స్పందించారు. ఈ సందర్బంగా హలేవీ మాట్లాడుతూ..‘ఇరాన్ ప్రతిదాడి చేస్తే మా దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుంది. ఇరాన్‌ను ఎలా చేరుకోవాలో మాకు తెలుసు. మరోసారి దాడి చేస్తే ఇరాన్‌ను ఎలా గట్టిగా దెబ్బ కొట్టాలో మా దగ్గర ప్లాన్ ఉంది. ప్రస్తుతం కావాలనే కొన్ని లక్ష్యాలను పక్కన పెట్టాము. వాటిపై మరో సందర్భంలో గురిపెడతాము. ఆ సమయంలో ఇజ్రాయెల్ దాడులను తట్టుకోలేరు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇదే సమయంలో హమాస్ చీఫ్ హసన్ నస్రల్లా స్థానంలో డిప్యూటీ హెడ్ నయీమ్ ఖాసీమ్‌ను ఎంపిక చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హిజ్జుల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. ఈ సందర్బంగా గల్లంట్ మాట్లాడుతూ.. నయీమ్ ఖాస్సెమ్ నియామకం తాత్కాలికం మాత్రమే. అతను ఎక్కువ కాలం ఉండలేడు. అతడికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది అని చెప్పారు. గత నెలలో దక్షిణ బీరుట్లో ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా చనిపోయిన విషయం తెలిసిందే.మరోవైపు.. గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది మంది మృతి చెందారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజా వ్యాప్తంగా 143 మంది, లెబనాన్‌లో 77 మందికి పైగా మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక, లెబనాన్‌లో భూతల దాడులకు వెళ్లి 33 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.🎥 Video is in Hebrew 🇮🇱Chief of the General Staff, LTG Herzi Halevi, visited the "Ramon" Airbase today and met with pilots and the ground crews who were involved in the recent strikes against.Halevi warned, "If Iran makes the mistake of launching another missile barrage at… pic.twitter.com/bH61AwMQX5— 🇮🇱 Am Yisrael Chai 🇮🇱 (@AmYisraelChai_X) October 30, 2024 -
ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు జర్నలిస్టులు మృతి
బీరుట్/ఖాన్ యూనిస్: గాజాతోపాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని బీరుట్ కేంద్రంగా పనిచేసేత అరబ్ టీవీ అల్ మయాదీన్ కెమెరామ్యాన్ ఘస్సన్ నాజర్, టెక్నీషియన్ మహ్మద్ రిడా, హెజ్బొల్లా గ్రూపునకు చెందిన అల్ మనార్ టీవీ కెమెరామ్యాన్ విస్సమ్ కస్సిమ్‌గా గుర్తించారు. ఘటన సమయంలో ఆ భవనంలో ఏడు వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన 18 మంది జర్నలిస్టులు ఉన్నారని లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకరీ చెప్పారు. ఇజ్రాయెల్ చర్యను ప్రణాళిక ప్రకారం చేపట్టిన హత్యాకాండగా అభివర్ణించారు. కుప్ప కూలిన భవనం ప్రాంగణంలో ప్రెస్ అనే స్టిక్కర్‌తో ధ్వంసమైన వాహనాలున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. ఆ సమయంలో తామంతా విశ్రాంతి తీసుకుంటున్నామని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన అల్ జజీరా ఇంగ్లిష్ చానెల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. గాజాపై యుద్ధం మొదలయ్యాక 128 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఒకే కుటుంబంలోని 36 మంది మృతిగాజాలోని ఖాన్‌యూనిస్ నగరంపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 38 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. -
నస్రల్లా బంకర్లో భారీ సంపద
జెరూసలేం: బీరుట్‌లోని ఓ ఆస్పత్రి కింద హెజ్బొల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా గడిపిన రహస్య బంకర్లో 50 కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే బంగారం, నగదు లభ్యమైనట్టు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్‌తో పాటు హెజ్బొల్లా కూడా ఇలా ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర సున్నితమైన ప్రదేశాలను ఆయుధాల నిల్వకు, మిలిటెంట్లకు ఆశ్రయానికి వాడుతోందని ఆరోపించింది. బంకర్ నిర్మాణానికి సంబంధించిన గ్రాఫిక్ ఫొటో, అనుకరణ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ఆదివారం విడుదల చేశారు.ఆస్పత్రికి కింద ఉన్నందుననీ బంకర్‌ను కూల్చే ఆలోచన లేదని వెల్లడించారు. హెజ్బొల్లాపై చర్యలు తీసుకోవాలని లెబనాన్ అధికారులకు హగరి విజ్ఞప్తి చేశారు. హెజ్బొల్లా డబ్బును ఉగ్రవాదానికి, ఇజ్రాయెల్‌పై దాడికి వాడేందుకు అనుమతించొద్దని లెబనాన్ ప్రభుత్వాన్ని, అధికారులను, అంతర్జాతీయ సంస్థలను కోరారు. ఇందులో హెజ్బొల్లా ఆర్థిక విభాగమైన అల్–ఖర్ద్ అల్– హసన్ పాత్ర ఉందన్నారు. హెజ్బొల్లా కార్యకలాపాలకు నిధులు సమకూ రుస్తున్న తీరును కూడా హగరి వివరించారు.లెబనాన్ ప్రజలు, ఇరాన్ ప్రభుత్వం హెజ్బొల్లాకు ప్రధాన ఆదాయ వనరులన్నారు. లెబనాన్, సిరియా, యెమెన్, టర్కీల్లో హెజ్బొల్లా నడిపే ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆదాయాన్ని ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇజ్రాయెల్ పోరాటం లెబనాన్ పౌరులపై కాదు. కానీ వారిని హెజ్బొల్లా ఇలా కవచాలుగా వాడుకుంటోంది’’ అని ఆరోపించారు. లెబనాన్‌లో మరో బంకర్లో కూడా కోట్లాది డాలర్ల విలువైన బంగారం, నగదును సోమవారం గుర్తించినట్టు హగరి తెలిపారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి..13 మంది మృతిబీరుట్/టెల్అవీవ్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై సోమవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 13 మంది చనిపోగా 57 మంది గాయపడ్డారు. బీరుట్ దక్షిణ శివారుల్లో జరిపిన దాడిలో రఫిక్ హరారీ యూనివర్సిటీ ఆస్పత్రికి సమీపంలోని భవనం పూర్తిగా ధ్వంసమైందని అధికా రులు తెలిపారు. అయితే, తాము హెజ్బొల్లా లక్ష్యంగా దాడి చేశామని, ఆస్పత్రిపై కాదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అంతకు మించి వివరాలను వెల్లడించలేదు. ఆస్పత్రి ప్రవేశ ద్వారానికి సమీపంలో జరిగిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రచార మవుతున్నాయి. ఇలా ఉండగా, సెంట్రల్ ఇజ్రాయె ల్పైకి మంగళవారం హెజ్బొల్లా పలు రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు తమ గగన తల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఒక రాకెట్ బహిరంగ ప్రదేశంలో పడిందని పేర్కొంది. -
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి
-
టార్గెట్ నెతన్యాహూ!
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా డ్రోన్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మధ్యధర సముద్ర తీర ప్రాంతంలోని కెసారియా పట్టణంలో ఉన్న నెతన్యాహూ ఇంటిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి డ్రోన్లు దూసుకొచ్చినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. వాటిని తమ సైన్యం కూల్చేసినట్లు ప్రకటించింది. ఆ సమయంలో నెతన్యాహూ, ఆయన భార్య ఇంట్లో లేరని పేర్కొంది. లెబనాన్ సరిహద్దు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెతన్యాహూ నివాసంపైకి డ్రోన్లు దూసుకొస్తుండగా ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయి. దాంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చేసినట్టు సైన్యం తెలియజేసింది. డ్రోన్ల శకలాలు తగిలి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడని, 13 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మెడికల్ సరీ్వసు అధికారులు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ రాడార్ వ్యవస్థకు అందకుండా అతి తక్కువ ఎత్తులో వచ్చిన ఒక డ్రోన్ నెతన్యాహూ నివాసాన్ని ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో అది ఇజ్రాయెల్ హెలికాప్టర్‌కు అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల హెజ్బొల్లా, హమాస్ అధినేతలు మరణించడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా మిలిటెంట్లు నెతన్యాహూను లక్ష్యం చేసుకొని డ్రోన్ దాడులకు ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. మాది ఉనికి పోరు: నెతన్యాహు హమాస్‌తో యుద్ధాన్ని గెలిచి తీరతామని నెతన్యాహూ ప్రకటించారు. తన నివాసంపై దాడి అనంతరం ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇజ్రాయెలీలను ఉద్దేశించి ఇంగ్లిష్, హీబ్రూ భాషల్లో మాట్లాడారు. ‘‘ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హమాస్‌ను తుడిచిపెట్టకుండా నన్ను ఆపలేరు’’ అని తన నివాసంపై దాడులనుద్దేశించి స్పష్టం చేశారు. లక్ష్యసాధనలో ఇజ్రాయెల్ సైనిక దళాలు అద్భుత ప్రగతి కనబరుస్తున్నాయంటూ ప్రస్తుతించారు. వారిని చూసి గరి్వస్తున్నట్టు చెప్పారు. ‘‘మా వాళ్లను కిరాతకంగా పొట్టన పెట్టుకోవడం, మా మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, మా చిన్నారులను సజీవంగా బుగ్గి చేయడం వంటి దారుణ అకృత్యాల్లో యాహ్యా సిన్వర్ (హమాస్ చీఫ్)ది కీలకపాత్ర. రెండ్రోజుల క్రితమే అతన్ని మట్టుబెట్టాం. మాది ఉనికి పోరాటం. దీన్ని తుదకంటా కొనసాగిస్తాం. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న ఇతర ఉగ్ర సంస్థలపైనా రాజీలేని పోరు సాగిస్తాం’’ అని ప్రకటించారు. హెజ్బొల్లా అగ్రనేత హతం హెజ్బొల్లా మరో అగ్రనేతను కోల్పోయింది. సంస్థ డిప్యూటీ కమాండర్ నాసర్ రషీద్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్ బెయిల్ పట్టణంలో శనివారం జరిపిన బాంబు దాడుల్లో అతను మరణించినట్టు వెల్లడించింది.సిన్వర్ లేకపోయినా హమాస్ సజీవం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పష్టికరణ టెహ్రాన్: హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ ప్రాణత్యాగం ప్రశంసనీయమని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. సిన్వర్ భౌతికంగా లేకపోయినా హమాస్ ఎప్పటికీ ఉంటుందని తేలి్చచెప్పారు. పాలస్తీనా ప్రజల కోసం ఆ సంస్థ పోరాటం సాగిస్తూనే ఉంటుందని తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో బుధవారం సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఖమేనీ తాజాగా స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. సిన్వర్‌ను కోల్పోవడం హమాస్‌కు కొంత నష్టమే అయినప్పటికీ ఆ సంస్థ మనుగడకు ముప్పేమీ లేదని వెల్లడించారు. హమాస్ సజీవంగా ఉందని, ఇకపైనా ఉంటుందన్నారు. పోరాటంలో సిన్వర్ ఒక ధ్రువతార అని ఖమేనీ కొనియాడారు. క్రూరమైన శత్రువుపై అలుపెరుగని పోరాటం సాగించారని, అంకితభావంతో పని చేశారని చెప్పారు. పలు సందర్భాల్లో శత్రువుకు గుణపాఠం చెప్పారని వివరించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై చేసిన దాడి ద్వారా సిన్వర్ చరిత్ర సృష్టించారని, ఘనమైన వారసత్వాన్ని వదిలివెళ్లారని ఉద్ఘాటించారు. -
ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రమాదం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దళాలు తమ వరుస దాడులతో హమాస్,హెజ్బొల్లా అగ్ర నేతలను ఒక్కొక్కరిగా హతమార్చుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హమాస్ చీఫ్, అక్టోబర్ 7 దాడుల సూత్రదారి యాహ్యా సిన్వర్ మృతిచెందిన విషయం తెలిసిందే. గాజాలోని ఓ ఇంటిపై చేసిన దాడిలో సిన్వర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన రెండు రోజులకే ఓ ఆందోళనకర ఘటన చోటుచేసకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.లెబనాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ శనివారం దక్షిణ హైఫాలోని సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. ఈ డ్రోన్ దాడిలో భవనం కొంత భాగం దెబ్బతింది. అయితే ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.కాగా లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ వాయు దళాలు టెల్ అవీవ్ ప్రాంతంలో కూల్చివేశాయి. అయితే మూడోది మాత్రం సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఎగిరిందని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..మేయర్ సహా 15 మంది మృతి
బీరుట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఖనా నగర మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ వెల్లడించారు.ఈ దాడుల్లో ఖనా మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.పౌరుల ఇళ్ల మధ్య ఉన్న హెజ్బొల్లా తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడులు చేసింది.ఈ దాడుల్లో మేయర్ సహా పలువురు మృతి చెందారు.దాడిలో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై 50 రాకెట్లతో హెజ్బొల్లా దాడి -
హెజ్బొల్లా టన్నెల్ వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య దాడులు, ప్రతిదాడుల ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో.. హెజ్బొల్లా టన్నెల్‌కు సంబంధించి ఇనుప తలుపులు, ఫంక్షన్ రూమ్‌లు, ఏకే 47 రైఫిళ్లు, బెడ్రూం, బాత్రూం, స్టోర్ రూం, జనరేటర్, వాటర్ ట్యాంక్, ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లో వంద మీటర్ల మేర ఉన్న ఈ సొరంగంలో హెజ్బొల్లా సామగ్రి దృష్యాలను ఇజ్రాయెల్ ఆర్మీ చూపించింది. అయితే.. ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.INSIDE LOOK into a Hezbollah terrorist tunnel in southern Lebanon: pic.twitter.com/h3ZastZHxC— Israel Defense Forces (@IDF) October 15, 2024 ‘‘దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హెజ్బొల్లా గ్రూప్ ఏం చేస్తోందో చూడడానికి మేము సరిహద్దును దాటి అక్కడి వెళ్తున్నాం. ఉత్తర ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 హమాస్ తరహా దాడికి హెజ్బొల్లా టన్నెల్‌ను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది’’ అని వీడియో ఓ ఇజ్రాయెల్ సైనికుడు మాట్లాడటం వినవచ్చు.ఇక.. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తనంతరం గాజాపై ఇజ్రయెల్ సైన్యం భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్బొల్లా తమ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇక.. లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్.. సరిహద్దుల్లో వాటి స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై ఆదివారం హెజ్బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్‌లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం బీరుట్‌పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్లతో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు. స్కూలుపై దాడి..20 మంది మృతి గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి. లెబనాన్‌లో 21 మంది మృత్యువాత లెబనాన్‌లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. ‘ఐరాస దళాల మాటున హెజ్బొల్లా’లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు. ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. -
బీరుట్‌పై దాడులు.. 22కు చేరిన మృతులు
బీరుట్/న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరుట్‌పై గురువారం రాత్రి ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో మరణాల సంఖ్య 22కు చేరుకుంది. తాజా ఘటనలో 117 మంది క్షతగాత్రులుగా మారారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. బాధితుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. సెంట్రల్ బీరుట్‌లోని రస్ అల్–నబా, బుర్జ్ అబి హైదర్లపై ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో ఒక చోట ఎనిమిదంతస్తుల భవనం నేలమట్టం కాగా, మరో చోట ఓ భవన సముదాయంలోని దిగువ అంతస్తులు ధ్వంసమయ్యాయి. తమ ముఖ్య అధికారి వఫిక్ సఫాను చంపేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం విఫలమైందని హెజ్బొల్లాకు చెందిన అల్ మనార్ టీవీ అనంతరం పేర్కొంది. దాడులు జరిగిన సమయంలో వఫిక్ ఆ రెండు భవనాల్లోనూ లేరని స్పష్టం చేసింది. తాజా దాడి, 2006 తర్వాత బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత తీవ్రమైందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన భీకర దాడుల్లో హెజ్బొల్లా నేత హస్సన్ నస్రల్లా సహా పలువురు కమాండర్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. హెజ్బొల్లా గురు వారం ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మరో వైపు, భూతల, వైమానిక, క్షిపణి దాడులతో హెజ్బొల్లా లక్ష్యాలపై ఇప్పటికే విరుచు కుపడు తున్న ఇజ్రాయెల్ సముద్రంపై నుంచి కూడా దాడులకు పాల్పడుతుందని సమాచారం. ఇద్దరు లెబనాన్ సైనికులు మృతిలెబనాన్లోని బింట్ జబెయిల్ ప్రావిన్స్ కఫ్రాలోని ఆర్మీ చెక్ పాయింట్‌లోని భవనంపై శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు సైనికులు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. ఐరాస బలగాలపై మళ్లీ కాల్పులులెబనాన్లో ఐరాస శాంతి పరిరక్షక దళాల (యూఎన్ఐఎఫ్ఐఎల్)పై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం మరోసారి దాడులకు పాల్పడ్డాయి. నఖౌరా పట్టణంలోని యూఎన్ఐఎఫ్ఐఎల్ ప్రధాన కార్యాలయం అబ్జర్వేషన్ పోస్ట్‌పై జరిగిన కాల్పుల్లో ఇద్దరు సభ్యులు గాయపడ్డారు. ఒకరు టైర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐరాస తెలిపింది. అదేవిధంగా, దక్షిణ లెబనాన్‌లో ఐరాస గుర్తించిన 120 కిలోమీటర్ల బ్లూలైన్‌ను దాటి ఇజ్రాయెల్ ఆర్మీ బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు చొచ్చుకువచ్చాయని ఐరాస శుక్రవారం తెలిపింది. -
మీకూ గాజా గతే!
బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. ‘‘ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతంచేశాం. అతని స్థానంలో హెజ్బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం.గతంలో ఎన్నడూలేనంతగా హెజ్బొల్లా ఇప్పుడు బలహీనపడింది’ అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వా«దీనం చేసుకుంది.ఈ క్రమంలో హెజ్బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది. -
హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా
వాషింగ్టన్: కాల్పుల విరమణ అంశాన్ని ప్రస్తావించడం హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు వెనుకంజను తెలియజేస్తోందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. మంగళవారం(అక్టోబర్8) వాషింగ్టన్లో ఆయన మీడియాతో మట్లాడారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చితికిపోయిందన్నారు.‘సంవత్సరం నుంచి హెజ్బొల్లాను ప్రపంచం మొత్తం కాల్పుల విరమణ చేయాలని అడుగుతోంది. దీనిని హెజ్బొల్లా తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పుడేమో హెజ్బొల్లానే కాల్పుల విరమణ అడుగుతోంది. ఈ యుద్ధానికి దౌత్య పరమైన పరిష్కారమే అంతిమంగా మేం కోరుకుంటున్నాం’అని చెప్పారు. కాగా, హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ కాసిమ్ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కాల్పుల విరమణ కోసం లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ బెర్రీ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ తమపై భీకర దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశానికి ధీటైన జవాబిస్తున్నామని కాసిమ్ తెలిపారు.ఇదీ చదవండి: వేల మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ముఖ్యనేత హతం
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మిలిటెంట్ గ్రూపు హమాస్‌కు చెందిన కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. ఉత్తర లెబనాన్ ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల క్యాంపుపై ఇజ్రాయెల్ తాజాగా వైమానిక దాడులు జరిపింది.ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన అల్ ఖసమ్ బ్రిగేడ్ లో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందాడు. దాడుల్లో అతల్లాతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మీడియా ఈ విషయాలను వెల్లడించింది.ఇక,లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.ఇందులో 250 మంది హెజ్బొల్లాకు చెందినవారున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. అంతకముందు ఇజ్రాయెల్ జరిపిన స్పెషల్ ఆపరేషన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతి చెందాడు. ఇదీ చదవండి: ఇరాన్ అణుస్థావరాలు పేల్చేయండి: ట్రంప్ -
బీరుట్‌పై భీకర దాడి
బీరుట్/జెరూసలేం: హెజ్బొల్లా చీఫ్‌ను అంతం చేసి దాడులను ఉధృతంచేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా లెబనాన్ దేశ రాజధాని నడిబొడ్డున దాడికి తెగబడింది. బీరుట్ నగరంలో దేశ పార్లమెంట్, ప్రధాన మంత్రి కార్యాలయం, ఐక్యరాజ్యసమితి లెబనాన్ ప్రధాన కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతంపై దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున సెంట్రల్ బీరుట్‌లోని బషౌరా జిల్లాలోని ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో 9 మంది మృతిచెందారు.దీంతో భవంతిలోని హెజ్బొల్లా హెల్త్‌సెంటర్ దెబ్బతింది. చనిపోయిన వారిలో హెజ్బొల్లా ఆరోగ్యకేంద్రంలో పనిచేసే ఏడుగురు సభ్యులున్నట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. మవాద్ ప్రాంతంలోని హెజ్బొల్లా మీడియా సంబంధాల భవనం మీదా దాడులు జరిగాయి. బింట్ జిబేయిల్ పట్టణంలోని ఆర్మీ పోస్ట్‌పై జరిగిన శతఘ్ని దాడిలో ఒక లెబనాన్ సైనికుడు చనిపోయారు. రెడ్‌క్రాస్ సిబ్బంది దుర్మరణం దక్షిణ లెబనాన్‌లో గాయపడిన పౌరులను తరలిస్తున్న రెడ్‌క్రాస్ సిబ్బంది వాహనంపై దాడి జరిగింది. తయ్యబే గ్రామ సమీపంలో జరిగిన ఈ దాడిలో నలుగురు పారామెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ‘‘ ఐరాస శాంతిపరిరక్షక దళాల సమన్వయంతో ముందస్తు సమాచారంతోనే వైద్యసిబ్బంది వెళ్తున్నారు. అయినాసరే వారిపై దాడి జరిగింది. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలను ఉల్లంఘించడమే. వాళ్ల వద్ద ఆయుధాలు ఉన్నాయని ఎలా ఓ నిర్ణయానికొస్తారు? సొంత నిర్ణయాలు తీసుకుని దాడులు చేసే అధికారం ఇజ్రాయెల్‌కు ఎవరిచ్చారు?’’ అని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు దక్షిణ లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించడం మొదలెట్టింది. ఆక్రమణను ప్రతిఘటిస్తూ లెబనాన్ సైన్యం జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎనిమిది మంది సైనికులు చనిపోయారు. తరలిపోతున్న విదేశీయులు సంక్షోభం నేపథ్యంలో తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు స్పెయిన్ రంగంలోకి దిగింది. బీరుట్ ఎయిర్‌పోర్ట్‌కు రెండు విమానాలను హుటాహుటిన పంపించింది. ఐరాస శాంతి కార్యక్రమాల్లో భాగంగా బీరుట్లో ఉన్న 676 మంది తమ సైనికులు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా అక్కడే ఉంటారని స్పెయిన్ పేర్కొంది. ట్రిపోలీ నౌకాశ్రయం నుంచి 300కుపైగా తుర్కియే దేశస్తులు స్వదేశం పయనమయ్యారు. బ్రిటన్, ఆ్రస్టేలియా, జపాన్, ఇటలీ దేశస్తులు సైతం లెబనాన్ వీడుతున్నారు. గత 24 గంటల్లో 28 మంది హెల్త్‌వర్కర్లు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఇరాన్, లెబనాన్‌లపై ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అసహనం వ్యక్తంచేశారు. హమాస్ నేతను చంపేశాం ఇజ్రాయెల్ ప్రకటనమూడు నెలల క్రితమే గాజా స్ట్రిప్‌లో హమాస్ సీనియర్ నేత రావీ ముష్తాహాను చంపేశామని ఇజ్రాయెల్ గురువారం ప్రకటించింది. కమాండర్లు సమీ సిరాజ్, సమీ ఔదేహ్లనూ చంపేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే వీరి మరణవార్తపై హమాస్ స్పందించలేదు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పైకి హమాస్ చేసిన దాడి వెనుక సూత్రధారి, హమాస్ టాప్ కమాండర్ యాహ్యా సిన్వర్‌కు ముష్తాహా అత్యంత సన్నిహిత నేత. సిన్వర్ ఇంకా గాజాలోనే రహస్య ప్రదేశంలో దాక్కున్నాడని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. సిరియాలో ఆయుధాగారంపై దాడులు తమకు ముప్పుగా పరిణమించొచ్చు అని అనుమానించిన ప్రతి లక్ష్యంపై ఇజ్రాయెల్ గురిపెడుతోంది. ఇందులోభాగంగా గురువారం సిరియా పశి్చమతీరంలోని లటాకియా ప్రావిన్స్‌లోని రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఖమేమిన్ ఆయుధాగారంపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. హెజ్బొల్లాకు అధునాతన ఆయుధాలు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయని, వీటిని ధ్వంసంచేసి హెజ్బొల్లాకు ఆయుధాల కొరత సృష్టించడమే ఈ దాడుల అసలు లక్ష్యమని తెలుస్తోంది. గత షెడ్యూల్ ప్రకారం ఖాసిమ్ ఫార్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సరకు రవాణా విమానం ద్వారా ఇక్కడి ఆయుధాలను ఇరాన్‌కు చేరవేయాల్సిఉంది. ఈలోపే ఇజ్రాయెల్ దాడి చేసింది. 100 మంది నవజాత శిశువులకు నస్రల్లా పేరు హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా పట్ల ఇరాక్ ప్రజలు తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. నస్రల్లా మరణం ఇరాక్‌లో మరీ ముఖ్యంగా మెజారిటీ షియా జనాభాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆయనకు నివాళిగా దేశంలోని సుమారు 100 మంది నవజాత శిశువులకు ‘నస్రల్లా’ పేరు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 100 మంది శిశువులు ఆ పేరుతో నమోదు అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది షియా సమాజం ఆయనను ఎంతగా ఆరాధిస్తోందో ఇట్టే అర్థమవుతోంది. షియాలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, ప్రతిఘటనకు చిహ్నంగా నస్రల్లాను చూస్తారు. షియా వర్గాల్లో నస్రల్లాకు గణనీయమైన ఫాలోయింగ్ ఉంది. నస్రల్లాను ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడానీ అమరుడిగా అభివర్ణించారు. ఇరాక్‌తో నస్రల్లాకు మతపరంగానేకాకుండా రాజకీయ భావజాలపరంగా లోతైన అనుబంధం ఉంది. 2003 ఇరాక్‌ను అమెరికా ఆక్రమించడాన్ని నస్రల్లా బహిరంగంగానే విమర్శించి అక్కడి షియాలకు ఆరాధ్యుడయ్యాడు. -
పశ్చిమాసియా చిచ్చుకు బాధ్యులెవరు?
లెబనాన్‌పై దాడి, హెజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై వందలాది మిసైళ్లతో ఇరాన్ విరుచుకు పడింది. వాటిలో అనేకాన్ని ఇజ్రాయెల్ కూల్చివేయగలిగిందిగానీ వాళ్ల నగరాలు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఇదే కొనసాగితే దారుణ విధ్వంసం తప్పదు. ఇప్పటికైనా దౌత్య యత్నాలు సాగుతాయా అన్నది ప్రశ్న. యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాదమనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది. అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది.ఇరాన్ ఈ నెల ఒకటవ తేదీ రాత్రి ఇజ్రాయెల్‌పై వందలాది మిసైళ్లతో దాడి చేసింది. అవి అగ్ని బాణాల వలె ఇజ్రాయెల్ పైకి దూసుకుపోయి కురుస్తుండటం ఆ రోజు రాత్రి ఆకాశంలో కనిపించి ప్రపంచమంతా ఊపిరి బిగ బట్టింది. ఇక రానున్న రోజులలో ఏమి కావచ్చునన్నది అందరి ఆందో ళన, భయం. ఇందుకు దోహదం చేసిన పరిణామాలు గత కొద్ది రోజు లలో చోటు చేసుకున్నాయి. హెజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హత్య చేసింది. లెబనాన్‌పై దాడులు ప్రారంభించింది. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ యుద్ధ నౌకలు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మంగళవారం నాడు ఒక వీడియో విడుదల చేస్తూ నేరుగా ఇరాన్‌ను ఉద్దేశించి రెండు కీలకమైన మాటలు అన్నారు. మొత్తం పశ్చిమాసియాలో ఏ ప్రాంతం కూడా తమ బలానికి అతీతమై నది కాదన్నది మొదటిది. ఇరానియన్ నాయకుల వల్లనే అక్కడి ప్రజలు పేదరికానికి, ఇతర సమస్యలకు గురవుతున్నారనీ, వారు లేకుంటే ఇరాన్ బాగా అభివృద్ధి చెందుతుందనీ, వారికి తమ నాయ కుల సమస్య త్వరలో తీరిపోతుందన్నదీ రెండవది. హెజ్బొల్లా అధినేత హత్య నేపథ్యంలో ఇటువంటి హెచ్చరికలతో ఇరాన్ అగ్ర నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని వెంటనే తాము సురక్షితమనుకునే రహస్య స్థావరానికి తరలించారు.త్వరత్వరగా చోటు చేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి జరిపింది. ఇరాన్ వందలాది మిసైళ్లలో అనేకాన్ని ఇజ్రాయెల్‌తో అమెరికా నౌకా దళాలు కూల్చివేశాయి గానీ, మరెన్నో ఇజ్రాయెలీ నగరాలను, సైనిక స్థావరా లను ధ్వంసం చేశాయి కూడా. ఇది ఇంతటితో ఆగుతుందా, లేక యుద్ధం పెచ్చరిల్లుతుందా అనే ప్రశ్నకు సమాధానం ప్రధానంగా ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ మాత్రం మంగళవారం రాత్రే ఒక ప్రకటన చేస్తూ, తమవైపు చర్యలు ప్రస్తుతానికి ఇంతటితో ఆపుతున్నామనీ, ఇజ్రాయెల్ వైఖరిని బట్టి తదుపరి చర్యలుంటాయనీ అన్నారు. మరొకవైపు ఇజ్రా యెల్ ప్రధాని, సైన్యాధిపతి తాము ప్రతీకారం తీర్చుకొనగల మన్నారు. లోగడ హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హానియేను తమ దేశంలోనే హత్య చేసినందుకు, అదే విధంగా తమ అగ్రశ్రేణి సైనిక బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ నిల్ఫరోషాన్ను హత్య చేసినందుకు ప్రతీకారంగా కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్లతో దాడి జరిపి, అది తమ హెచ్చరిక అని ప్రకటించింది. అపుడు కూడా ఇజ్రాయెల్ ప్రతీ కార ప్రకటనలు చేసింది. కానీ బయటి రాజ్యాలు ఇజ్రాయెల్ వైపు కొన్ని, ఇరాన్ వైపు కొన్ని దౌత్య యత్నాలు చేయటంతో అది అంత టితో నిలిచిపోయింది. ఇపుడు తిరిగి అటువంటి స్థితే తలెత్తుతున్నది. అయితే ఈసారి కూడా దౌత్య యత్నాలు సాగుతాయా లేక పరిస్థితి విషమిస్తుందా అన్నది ప్రశ్న. గతానికి, ఇప్పటికి కొన్ని తేడాలు ఉన్నా యన్నది గమనించవలసిన విషయం. పోయినసారివలె గాక ఇపుడు లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. ఇరాన్ అధినేతలను హత్య చేయగలమనే నర్మగర్భమైన హెచ్చరికలు చేసింది. పశ్చిమ దేశాల నౌకా బలాలు మధ్యధరాలో ప్రవేశించటమేగాక, ఇరాన్ మిసైళ్లను ఎదుర్కొనే రూపంలో ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొ న్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతును మరొకమారు ప్రకటించారు. ఇవీ తేడాలు. కనుక, రానున్న రోజులలో ఏమైనా జరగవచ్చు. లేదా జరగక పోవచ్చు. అన్ని వివాదాలకు, ఘర్షణలకు, యుద్ధాలకు కారణమైన పాలస్తీనా సమస్య పరిష్కారం కానిదే ఏదీ ఆగబోదన్నది మౌలిక విషయం. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయా లున్నాయి. మొదటిది–గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం. హమాస్ దళాలు గత అక్టోబర్‌లో తమ భూభాగంపై దాడి జరిపి సుమారు 1,200 మంది పౌరులను హత్య చేశారన్న దాన్ని సాకుగా చేసుకుని ఇప్పటికే ఇజ్రాయెల్ 42,000 మంది పాలస్తీనియన్లను గాజాలో చంపివేసింది. గాజాకు సంబంధించి మరొక స్థాయిలో ఇజ్రాయెల్ చెప్తున్నది, అక్కడ తమ సైనిక నియంత్రణ ఇక శాశ్వతంగా ఉంటుంది. పాలస్తీనియన్లే పాలించినా పర్యవేక్షణ తమదవుతుంది. ఐక్యరాజ్య సమితి సైతం వ్యతిరేకిస్తున్నా, అసలు వెస్ట్ బ్యాంక్ మొత్తంగా ఇజ్రాయెల్‌లో భాగమే, తమదే అనటం రెండవది! పాలస్తీనియన్లకు మద్దతుగా హెజ్బొల్లాతో పాటు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ తదితర దేశాల మిలిటెంట్లు ఎన్ని నష్టాలనైనా ఎదుర్కొంటూ నిలవడమన్నది మూడవ ముఖ్యమైన విషయం. లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నాల్గవ ముఖ్య విషయం. ఇక చివరిది ఇరాన్. వారి సైనిక బలం సంఖ్య రీత్యా ఇజ్రాయెల్‌ను మించినదే అయినా, వైమానిక బలం, సాంకేతిక శక్తి అందుకు సాటిరావు. పైగా, ఉక్రెయిన్‌లో వలెనే ఇక్కడ కూడా మొత్తం అమెరికా కూటమి తమ ఆయుధ శక్తి, ధన బలంతో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. రెండు దేశాల మధ్య భూతల యుద్ధం జరిగితే ఇరాన్‌ది పైచేయి కావచ్చునేమోగానీ, మధ్యలో సిరియా, జోర్డాన్, ఇరాక్ భూభాగాలు ఉన్నందున అది వీలయ్యేది కాదు. అందువల్ల క్షిపణులు, యుద్ధ విమానాలపై ఆధారపడాలి.అంతమాత్రాన ఇజ్రాయెల్ గెలిచి తీరుతుందని కాదు. ఫలితం ఎట్లున్నా... ఇరాన్‌తో పాటు పాలస్తీనియన్లు, హెజ్బొల్లా, హౌతీలు, లెబనాన్‌తో పాటు ఇరాకీ మిలిటెంట్లు ఒకేసారి విరుచుకుపడితే ఇజ్రా యెల్‌కు తీవ్ర నష్టాలు తప్పవు. పైగా, ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధాలు జరిగినప్పుడల్లా ప్రపంచమంతటి నుంచి ముస్లిం యువకులు వేలాదిగా వెళ్లి పాల్గొనటాన్ని చూశాము. దీనంతటి పర్యవసానం యుద్ధం పూర్తి స్థాయికి పరిణమించటం.అట్లా జరగకుండా ఉండాలంటే ఏకైక మార్గం దౌత్య యత్నాలు! అయితే, అమెరికా కూటమి బాహాటంగా ఇజ్రాయెల్‌తో నిలవటం, గాజా యుద్ధాన్ని ఆపించక పోవటమేగాక ఐక్యరాజ్యసమితిని, ప్రపంచాభిప్రాయాన్ని తోసిరాజంటోంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌తో ముడిపడి వారి సామ్రాజ్యవాద ప్రయోజనాలు అటువంటివి. సుమారు 120 సంవత్సరాల క్రితం మొదలై, 80 ఏళ్ల నుంచి క్రమంగా జటిలంగా మారుతూ, మరొక 20 ఏళ్లకు కొరకరానికొయ్య అయిపోయిన ఈ సమస్యకు మొట్టమొదటి నుంచి కూడా ఏకైక కారణం వారి ప్రయోజనాలే. 1948కి ముందు అసలు లేనే లేని ఇజ్రాయెల్ సృష్టిని, యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో ఆమోదించి పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాద మనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది.అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. పశ్చిమం చిచ్చును సృష్టించింది. దీన్ని ఇన్ని దశాబ్దాలుగా సాగిస్తున్నది వారు మాత్రమేనని మరొకసారి చెప్పనక్కర లేదు. ముఖ్యంగా గాజా మారణహోమం నుంచి మొదలుకొని జరుగుతున్నదేమిటో ఇజ్రా యెల్, అమెరికాలు గుర్తించక తప్పదు. వారు తమ ఆయుధ బలంతో పైచేయి సాధిస్తుండవచ్చుగాక. కానీ, ప్రపంచం దృష్టిలోనే గాక అంత ర్జాతీయ సంస్థల ఎదుట గతంలో ఎన్నడూ లేనంతగా ఏకాకు లయ్యారు. వియత్నాం యుద్ధం తర్వాత అంతటి వ్యతిరేకతను, ఏహ్యతను తిరిగి 50 ఏళ్ల తర్వాత చూస్తున్నాము. అపుడు జరిగిన అమెరికా క్యాంపస్ ప్రదర్శనలు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీనంతటి నుంచి ఇజ్రాయెల్, అమెరికాలు పాఠాలు నేర్చుకుంటే వారికే మంచిది. చరిత్రలో అనేక సామ్రాజ్యాలు బలంతో విర్రవీగి నేల కూలాయి. అమెరికా సైతం నెమ్మదిగా అదే దిశలో పయనిస్తున్నదని పలువురు పాశ్చాత్య మేధావులే హెచ్చరిస్తున్నారు కూడా!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
‘విరమణకు నస్రల్లా అంగీకారం’
బీరూట్: బీరూట్‌పై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. అయితే ఆయన హత్యకు ముందు కాల్పుల విరమణకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ అన్నారు. హత్యకు ముందే ఇజ్రాయెల్‌తో నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని తెలిపారు. అదేవిధంగా కాల్పుల విరమణకు సంబంధించిన నిర్ణయం గురించి నస్రల్లా అమెరికా, ఫ్రెంచ్ ప్రతినిధులకు కూడా తెలియజేసినట్లు వెల్లడించారు. సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ బీరూట్‌పై వైమానిక దాడుల చేసినట్లు సమయంలో నస్రల్లా దక్షిణ శివారు ప్రాంతం దహియేలోని ఒక బంకర్లో ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు లెబనాన్ నుంచి పారిపోవాలని నస్రల్లాను హెచ్చరించినట్లు బుధవారం రాయిటర్స్ ఓ కథనంలో పేర్కొంది.ఇజ్రాయెల్ శుక్రవారం జరిపిన భారీ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ఇజ్రాయెల్ వార్నింగ్ వేళ.. ఇరాన్ సుప్రీం నేత సంచలన ట్వీట్ -
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్.. ఏ దేశం ఎటువైపు!
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లటంతో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌కు మద్దతుగా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్బొల్లా గ్రూప్, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఈ యుద్ధం కాస్త.. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాలకు విస్తరించింది. ఇక.. మంగళవారం ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన భీకర మిసైల్స్ దాడితో ఒక్కసారిగా పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాల మధ్య ఇటీవల కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలాగే కొనసాగితే.. ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యుద్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో మెరుపు దాడిని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరాన్‌కు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్రదేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్), అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి.అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ జరుగుతోంది.ఇజ్రాయెల్మిత్ర దేశం అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ అక్టోబరు 2023 నుంచి గాజా స్ట్రిప్‌లోని హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఇరాన్, ఇరాన్ మద్దతు మిలిటెంట్ గ్రూప్‌లను దాడులకు ప్రతిదాడులతో హెచ్చరిస్తూ.. గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేవరకు తమ దాడులను ఆపబోమని తేల్చిచెబుతోంది.ఇజ్రాయెల్ మిత్రదేశాలు: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, సౌదీ అరేబియాప్రత్యర్థులు: హౌతీలు, హమాస్, ఇరాన్, హెజ్బొల్లాఇరాన్గతంలో ప్రాక్సీ మిటిటెంట్ల గ్రూప్‌ల ద్వారా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై ఎక్కువగా దాడి చేసింది. అనూహ్యంగా ఇటీవల ఏప్రిల్‌లో, మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్పకై ప్రత్యక్ష దాడులను ప్రారంభించింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య , టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1(మంగళవారం) ఇజ్రాయెల్‌పై 200లకుపైగా మిసైల్స్‌తో భీకర దాడులు చేసింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలు భాగంగా ఇజ్రాయెల్‌పై 17 డ్రోన్లు, 120 బాలిస్టిక్ క్షిపణులను మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా క్రమంగా ఇజ్రాయెల్‌ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంతో తన మిత్రదేశాలను సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది.ఇరాన్ మిత్రపక్షాలు: యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హమాస్ప్రత్యర్థులు: ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాసౌదీ అరేబియాఇజ్రాయెల్తో దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది. కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక వైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు పంపిన దేశాలలో సౌదీ అరెబీయా ఒకటి.ఖతార్ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ, ఖతార్ హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్కు ఆశ్రయం ఇచ్చింది. అదేవిధంగా ఇరాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు చాలా ఇష్టం లేకపోవటం గమనార్హం.జోర్డాన్ఈ ఏడాది జనవరిలో దేశంలోని అమెరికా ఆర్మీ స్థావరంపై ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు దాడి చేసి ముగ్గురు సైనికులను అంతం చేశారు. అనంతరం జోర్డాన్ కూడా తీవ్ర సంఘర్షణలో చిక్కుకుంది. జోర్డాన్ గాజాకు సహాయాన్ని పంపినప్పటికీ.. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కూడా కొనసాగించింది. -
ఇజ్రాయెల్‌కు షాక్ ఇవ్వనున్న హెజ్బొల్లా!
హెజ్బొల్లాను నిర్వీర్యం చేసే లక్ష్యంతో లెబనాన్‌లో ఆ గ్రూప్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. భూతల దాడులు చేపట్టేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. అయితే మరోవైపు.. మంగళవారం ఇజ్రాయెల్ టెల్ అవీవ్ సమీపంలోని గ్లిలాట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ స్థావరం, మొసాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దాడి చేసినట్లు లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200కు చెందిన గ్లిలాట్ బేస్, టెల్ అవీవ్ శివార్లలో ఉన్న మొసాద్ ప్రధాన కార్యాలయం వద్ద ఫాడి 4 రాకెట్లను ప్రయోగించినట్లు పేర్కొంది.శుక్రవారం బీరుట్ శివార్లలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో తమ చీఫ్ హసన్ నస్రల్లాను ఇజజ్రాయెల్ అంతం చేసిన తర్వాత ‘‘ మీ సేవలో నస్రల్లా’’ అనే పేరుతో ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాన మిలిటరీ ఇంటెలిజెన్స్ గ్లిలోట్ బేస్ లక్ష్యంగా తమ బృందం ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేసిందని ఆగస్టు చివరిలో నస్రల్లా పేర్కొన్నారు. అయితే.. ఆ సమయంలో తమ స్థావరాలపై దాడి చేయడంలో హెజ్బొల్లా విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇక.. హెజ్బొల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించకపోవటం గమనార్హం. -
ప్రమాదకర యుద్ధక్రీడ
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడితో ఏడాది క్రితం అక్టోబర్ 7న పశ్చిమాసియాలో చెలరేగిన హింసాత్మక సంఘర్షణ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ముస్లిమ్‌లలోని షియా వర్గానికి చెందిన తీవ్రవాద హెజ్బొల్లా బృందానికి 32 ఏళ్ళుగా సారథ్యం వహిస్తున్న అధినేత హసన్ నస్రల్లాను భీకర గగనతల దాడుల ద్వారా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తీరు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. లెబనాన్‌లోని ఇటీవలి పేజర్లు, వాకీటాకీల పేలుళ్ళ ఉదంతం మరువక ముందే ఇజ్రాయెల్ మరోసారి తన గూఢచర్య, సైనిక సత్తా చాటిన వైనం ముక్కున వేలేసుకొనేలా చేసింది. లెబనాన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్‌లు గురువారం పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దాన్ని సమర్థిస్తున్నారనే అందరూ భావించారు. ఒక్క రోజు గడిచిందో లేదో... ఒకపక్క న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే, మరోపక్క నెతన్యాహూ మాత్రం బీరుట్‌పై వైమానిక దాడికీ, హెజ్బొల్లా అధినేతను మట్టుబెట్టడానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయెల్ మంకుపట్టుతో ముందుకు పోతున్నట్టు తేటతెల్లమైంది. చిత్రమేమిటంటే, లెబనాన్‌లో కాల్పుల విరమణను బయట తోసిపుచ్చిన నెతన్యాహూ ప్రైవేటుగా మాత్రం అందుకు అంగీకరించారు. అమెరికా, ఫ్రాన్స్ అధికారులు సైతం చెప్పినమాట అదే. తీరా దాడులు మాత్రం నెతన్యాహూ కొనసాగించారు. కొన్ని నెలలుగా ఆయన తీరు అంతే. అమెరికాకు నచ్చే మాటలు పైకి చెబుతారు. కానీ, చివరకు మాత్రం తాను ఏదనుకుంటే అదే చేస్తున్నారు. అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతున్నా, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయెల్ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్‌లోనూ వెయ్యిమంది మరణించారు. అక్కడి జనాభాలో దాదాపు అయిదోవంతు మంది నిర్వాసితులయ్యారు. భవనాలపై బాంబు దాడులకు జడిసి, ప్రజలు వీధుల్లో నిద్రిస్తున్న పరిస్థితి. గగనతలం నుంచి బాంబులు ఆగలేదు. భూమార్గంలోనూ ముప్పు తప్పదన్న భయం తప్పడం లేదు. మరోపక్క ఇజ్రాయెల్ చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో ఈ తలనొప్పి తగ్గేలా లేదు.అలాగని హెజ్బొల్లా అధినేత మరణానికి యావత్ లెబనాన్ బాధపడుతోందని అనలేం. తీవ్ర హింసకు పాల్పడి, ఎందరి మరణానికో కారణమైన నస్రల్లా పట్ల లెబనాన్, ఇజ్రాయెల్, సిరియా సహా పలు ప్రాంతాల్లో ప్రజానీకానికి పెద్దగా ప్రేమ ఏమీ లేదు. అరబ్ ప్రపంచంతో పాటు సాక్షాత్తూ లెబనాన్‌లో సైతం ఆయన మరణానికి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఆనందం వ్యక్తం కావడం గమనార్హం. సిరియన్ నియంత బషర్ అల్–అసద్‌తో చేతులు కలిపి తమ వద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని హెజ్బొల్లా అణిచివేయడంతో వారిలో ఆగ్రహం నెలకొంది. అందుకే ఈ రకమైన భావన వ్యక్తమైంది. లెబనీస్ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, తద్వారా లెబనీస్ సైన్యం హెజ్బొల్లా చేతుల్లోని దక్షిణ లెబనాన్‌పై నియంత్రణ సాధించి, సరిహద్దు వెంట శాంతి నెలకొల్పాల నేది వారి అభ్యర్థన. నిజానికి, ఇజ్రాయెల్‌తో యుద్ధం తాము కోరుకోకపోయినా, ఇరాన్ ఆదేశాలతో లెబనీస్‌ను నస్రల్లా దీనిలోకి లాగారని వారి వాదన. ఇలాగే సాగితే గాజా భూఖండం లాగా బీరుట్ సైతం ధ్వంసమవుతుందనీ, అంతర్యుద్ధం మళ్ళీ వస్తుందనీ లెబనీయుల భయం. ముందు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణస్థితికి రావడం ముఖ్యం. అందుకు సౌదీలూ సిద్ధమే! కాకపోతే, రెండు దేశాల ఏర్పాటనే పరిష్కార సూత్రంతో పశ్చిమ తీరం లోని పాలెస్తీనా అథారిటీతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావాలన్నది వారి షరతు. వ్యవహారం అక్కడే పీటముడి పడింది. ఇరాన్‌కు నెతన్యాహూ హెచ్చరిక, హెజ్బొల్లా నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిజ్ఞ, ఇరాన్ అండతో పెచ్చరిల్లుతున్న ఇతర వర్గాల వ్యవహారం... అంతా చూస్తుంటే ఇక ఇది అంతులేని కథే! నిజానికి, లెబనాన్, గాజాల్లోని తీవ్రవాద వర్గాలను హతమార్చాలనే ఇజ్రాయెల్ సైనిక విధానం వల్ల తాత్కా లిక లాభాలే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. ఆ మధ్య సాక్షాత్తూ ఇరాన్ రాజధాని టెహరాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే, ఇప్పుడు బీరుట్లో హెజ్బొల్లా అధినేత, వెంటనే అదే గ్రూపులోని మరో కీలక నేత నబిల్ కౌక్... ఇలా పలువురిని ఇజ్రాయెల్ చంపేసింది. కానీ ఇలాంటి సంస్థల్లో ఒకరు పోతే మరొకరొస్తారు. పైగా ఇజ్రాయెల్ దూకుడు వల్ల ఇరాన్‌లోని కొత్త సంస్కరణవాద సర్కారూ చేసేదేమీ లేక, తీవ్రంగా ప్రతిస్పందించక తప్పదు. అప్పుడు ముడి మరింత బిగుస్తుంది. అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలెస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో... ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్‌లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి. ప్రపంచాన్ని చీకటితో కమ్మేస్తాయి. -
లెబనాన్‌పై దాడులు ఆపాలి: రష్యా
మాస్కో: లెబనాన్‌లో ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో తమ ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ త్వరలో పర్యటిస్తారని తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడితో మిఖాయిల్ సమావేశం కానున్నారని వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఇప్పటికే ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా రష్యా పేర్కొంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని కోరింది. ఇదీ చదవండి: లెబనాన్‌లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు -
ఇజ్రాయెల్ దాడిలో 105 మంది మృతి
బీరూట్ : లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బొల్లాను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వడివడిగా అడుగులు వేస్తోంది భూతల,వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా, లెబనాన్ రాజధాని బీరూట్‌లో తొలిసారి జనావాసాల్లో హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆదివారం జరిపిన దాడుల్లో సుమారు 105 మంది మరణించారు. 359 మందికిపైగా గాయపడ్డారు.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో ఘోరమైన వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. తూర్పు, దక్షిణ, బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ మంది మరణించారని చెప్పారు. సోమవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.రెండు వారాల క్రితం ఇజ్రాయెల్..హెజ్బొల్లా సభ్యులపై దాడుల ముమ్మరం చేసిన నాటి నుండి 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మంది గాయపడ్డారని లెబనాన్ పేర్కొంది.రాయిటర్స్ ప్రకారం, బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్.. 20 మంది హెజ్బొల్లా అగ్రనేతల్ని హత మార్చింది. వారిలో నస్రల్లా,నబిల్ కౌక్‌తో పాటు ఇతర నేతలు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌పై దాడిని కొనసాగించాలని ఆదేశించారు. హెజ్బొల్లాపై చేస్తున్న దాడుల కారణంగా సామాన్యులు నష్టపోకూడదని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. -
లెబనాన్‌లో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్:లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచింది. ఇప్పటివరకు హెజ్బొల్లా తీవ్రవాదులు లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజాగా సోమవారం(సెప్టెంబర్30) తెల్లవారుజామున బీరుట్ పట్టణం లోపల జనావాసాలపైనా విరుచుకుపడింది.బీరుట్‌లోని కోలా జిల్లాలో ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో నలుగురు పౌరులు మృతిచెందారు.బీరుట్ తర్వాత బెక్కా ప్రాంతంలో దాడులు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించిన విషయాన్ని లెబనాన్ పత్రికలు ప్రచురించాయి. కాగా,ఆదివారం లెబనాన్ నుంచి తమ దేశం వైపు దూసుకొచ్చిన ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ విజయవంతంగా కూల్చివేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: లెబనాన్ నిరాశ్రయులు..10 లక్షలు -
లెబనాన్ నిరాశ్రయులు.. పది లక్షలు!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్‌లో ఇదే అతి పెద్ద వలస ఇదే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్‌పైకి మార్చింది. హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. సిరియాకే ఎందుకు? నిరాశ్రయులైన లెబనాన్ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. యూకేకు సంపన్నులులెబనాన్లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఓకే ఒక కమర్షియల్ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్‌ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు. -
Israel Hezbollah War: హెజ్బొల్లా అగ్రనేత హతం
జెరూసలేం: లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం దాడిలో సంస్థ సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం వెల్లడించింది. కౌక్ మృతిని హెజ్బొల్లా ధ్రువీకరించింది. దీంతో గత వారం రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్బొల్లా ముఖ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది! హెచ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా శుక్రవారం ఇజ్రాయెల్ భీకర బాంబు దాడిలో మృతిచెందడం తెలిసిందే. ఆయనతో పాటు ఇద్దరు అగ్రశ్రేణి కమాండర్లు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌక్ 1980ల నుంచి హెజ్బొల్లాలో చురుగ్గా పని చేస్తూ అగ్ర నేతగా ఎదిగారు. 2006లో దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో హెజ్బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశారు. మీడియాలో తరచుగా కనిపిస్తూ రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై అభిప్రాయాలు వెల్లడించేవారు. హెజ్బొల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హషీం సైఫుద్దీన్ దాదాపుగా ఖరారైనట్టు సమాచారం.జోర్డాన్‌పై మిస్సైల్ దాడి! మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జోర్డాన్‌పైనా క్షిపణి దాడి జరిగింది. భారీ క్షిపణి ఒకటి బహిరంగ ప్రదేశంలో పడిపోయినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది. ఇది లెబనాన్ నుంచి దూసుకొచి్చనట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇరాన్ గూఢచారి ఇచ్చిన పక్కా సమాచారంతోనే...! లెబనాన్ రాజధాని బీరుట్లో ఓ భవనం కింద భారీ నేలమాళిగలో దాక్కున్న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడం తెలిసిందే. ఇరాన్ గూఢచారి ఇచి్చన కచి్చతమైన సమాచారంతోనే నస్రల్లా జాడను గుర్తించినట్లు ఫ్రెంచ్ పత్రిక లీ పారిసీన్ వెల్లడించింది. అండర్‌గ్రౌండ్‌లో హెజ్బొల్లా సీనియర్ సభ్యులతో నస్రల్లా సమావేశం కాబోతున్నట్లు సదరు గూఢచారి ఇజ్రాయెల్‌కు ఉప్పందించాడని తెలిపింది. నస్రల్లా మృతిపై ఇరాన్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జనం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అమెరికాకు, ఇజ్రాయెల్‌కు చావు తప్పదంటూ నినాదాలు చేశారు. పార్లమెంట్ సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. 1980వ దశకం నుంచి హెజ్బొల్లాకు ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సిరియాపై అమెరికా దాడులు... 37 మంది మిలిటెంట్లు హతం బీరుట్: సిరియాపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. ఆదివారం 2 దఫాలుగా దాడులకు దిగింది. వీటిలో తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూపు, అల్ ఖైదా అనుబంధ సంస్థకు చెందిన 37 మంది మిలిటెంట్లు హతమైనట్టు ప్రకటించింది. మృతుల్లో ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు ఉన్నారని వెల్లడించింది. అల్ ఖైదా అనుబంధ హుర్రాస్ అల్ దీన్ గ్రూప్‌కు చెందిన సీనియర్ మిలిటెంట్‌తో పాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వాయవ్య సిరియాపై దాడి చేసినట్లు అమెరికా æ తెలిపింది. సెంట్రల్ సిరియాలోని మారుమూల అజ్ఞాత ప్రదేశంలో ఉన్న ఐఎస్ శిక్షణా శిబిరంపై ఈ నెల 16న పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు సిరియా నేతలతో సహా 28 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అమెరికా ప్రయోజనాలతో పాటు తమ మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసిస్ సామర్థ్యాన్ని ఈ వైమానిక దాడి దెబ్బతీస్తుందని సైన్యం పేర్కొంది. 2014లో ఇరాక్, సిరియాలను చుట్టుముట్టి, పెద్ద భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అతివాద ఐఎస్ గ్రూపు తిరిగి రాకుండా నిరోధించడానికి సిరియాలో సుమారు 900 మంది అమెరికా దళాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపులున్న వ్యూహాత్మక ప్రాంతాలకు కొద్ది దూరంలోనే ఉన్నాయి. దాడుల్లో 69 మంది మృతి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పుల్‌స్టాప్ పడటం లేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఆదివారం చేసిన దాడులతో 69 మంది చనిపోగా 76 మంది గాయపడినట్లు లెబనాన్ తెలిపింది. ఒక్క బెకా లోయపై దాడుల్లో 21 మంది మరణించగా 50 మంది వరకు గాయపడ్డారని, అయిన్ అల్ డెల్బ్ గ్రామంపై జరిగిన దాడిలో 24 మంది చనిపోయారు. -
హెజ్బొల్లా చీఫ్ ఎలా చనిపోయాడు..?
బీరుట్:ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతదేహం లభ్యమైంది.దక్షిణ బీరుట్ నుంచి తమ నేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్బొల్లా ఆదివారం(సెప్టెంబర్29) వెల్లడించింది.అయితే నస్రల్లా మృతదేహంపై ఎలాంటి ప్రత్యక్ష గాయాలు లేవని సమాచారం.బాంబు దాడి కారణంగా షాక్‌కు గురై నస్రల్లా మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి.కాగా,తాము లెబనాన్‌పై ఆదివారం తాజా దాడుల్లో హెజ్బొల్లా మరో కీలక నేత నబిల్కౌక్కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.ఇదీచదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు
బీరుట్: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ హత్య మార్చింది. ఈ నేపథ్యంలో నస్రల్లా మృతిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. నస్రల్లాను అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన విషయం అని చెప్పుకొచ్చారు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యటన తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్‌కు వెళ్లారు. హసన్ నస్రల్లా హత్యానంతరం ఈ ఘటనపై నెతన్యాహు మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు మాట్లాడుతూ.. నస్రల్లాను హతమార్చడం మాతో అతి ముఖ్యమైన విషయం. హిజ్బుల్లాకు చెందిన ఇతర టాప్ కమాండర్లను తాము చంపినా, నస్రల్లాయే మాకు అసలు టార్గెట్. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న ప్రణాళికకు సూత్రధారిగా అతడు వ్యవహరించాడు. అందుకే అతడినే మేము టార్గెట్‌గా పెట్టుకున్నాము. యుద్ధంలో నస్రల్లా హత్య చారిత్రక మలుపు. తన శత్రవులపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాలకు కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే, ఇరాన్ ఆమోదం ఉన్న వ్యక్తికే పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిజ్బులా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్ సఫీ అల్ దిన్ ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. నస్రల్లాకు హషీమ్ సఫీ అల్ దిన్ బంధువు. అలాగే, హిజ్బుల్లా జిహాద్ కౌన్సిల్లోనూ సభ్యుడుగా ఉన్నాడు.మరోవైపు.. ఇజ్రాయెల్ వైమానిక దాడులు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను తాకాయి. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా బలమైన కోట అయిన దహియేహ్‌లో దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పౌరులు మృతిచెందారు. అలాగే, 90 మందికి పైగా గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇది కూడా చదవండి: Hassan Nasrallah: అరబ్బుల హీరో -
Hassan Nasrallah: అరబ్బుల హీరో
హెజ్బొల్లా గ్రూప్‌నకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన షేక్ హసన్ నస్రల్లా ప్రస్థానం ముగిసిపోయింది. నిరుపేద కుటుంబంలో జని్మంచి, ఉన్నత స్థాయికి చేరుకొని, లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న నస్రల్లా మరణం హెజ్బొల్లాకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఆయన 1960 ఆగస్టు 31న ఉత్తర లెబనాన్‌లో షియా ముస్లిం కుటుంబంలో జని్మంచారు. కూరగాయలు విక్రయించే నస్రల్లా తండ్రికి మొత్తం 9 మంది సంతానం. అందరిలో పెద్దవాడు నస్రల్లా. ఆయన బాల్యం తూర్పు బీరూట్‌లో గడిచింది. మత విద్య అభ్యసించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలు విపరీతంగా చదివేవారు. తనకు కావాల్సిన పుస్తకాల కోసం సెకండ్–హ్యాండ్ బుక్ షాపుల్లో గాలించేవారు. షియా పండితుడు మూసా అల్–సదర్‌ను ఆరాధించేవారు. రాజకీయాలపై, షియా వర్గం సంక్షేమంపై నస్రల్లాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తమవాళ్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 ఏళ్లకే నాయకత్వ బాధ్యతలు 1975లో అంతర్యుద్ధ సమయంలో నస్రల్లా కుటుంబం దక్షిణ లెబనాన్‌కు తరలివచి్చంది. ఆయన 1989లో ఇరాన్‌లోని నజఫ్ సిటీలో కొంతకాలం మత సిద్ధాంతాలు అభ్యసించారు. లెబనాన్‌కు తిరిగివచ్చి 16 ఏళ్ల వయసులో షియా రాజకీయ, పారామిలటరీ గ్రూప్ అయిన అమల్ మూవ్మెంట్లో చేరారు. ఆ సంస్థలో చురుగ్గా పనిచేశారు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)ను అంతం చేయడానికి 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో పీఎల్ఓకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతీకారమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ కార్యాలయంపై షియా ఇస్లామిక్‌వాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో చాలామంది ఇజ్రాయెల్ అధికారులు మరణించారు. అనంతరం షియా ఇస్లామిక్వాదులతో హెజ్బొల్లా గ్రూప్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక సయ్యద్ అబ్బాస్ ముసావీతోపాటు నస్రల్లా కీలక పాత్ర పోషించారు. 1992లో ఇజ్రాయెల్ దాడిలో ముసావీ మరణించారు. దీంతో 32 ఏళ్ల వయసులో హెజ్బొల్లా నాయకత్వ బాధ్యతలను నస్రల్లా స్వీకరించారు. హెజ్బొల్లా శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. లెబనాన్ సైన్యం కంటే హెజ్బొల్లా పవర్ఫుల్ అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాల్లో నస్రల్లా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. హెజ్బొల్లాకు ఇరాన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. ఆయుధాలు, డబ్బు అందజేసింది. హమాస్‌తోపాటు మధ్యప్రాచర్యంలోని పలు ఉగ్రవాద సంస్థలకు హెజ్బొల్లా శిక్షణ ఇచి్చంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్‌పై నస్రల్లా అలుపెరగని పోరాటం సాగించారు. పూర్తి అంకితభావంతో పనిచేశారు. 2000 సంవత్సరం నాటికల్లా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలను తరిమికొట్టారు. అరబ్ ప్రపంచానికి ఒక ఐకాన్‌గా మారారు. 1997లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో నస్రల్లా కుమారుడు హదీ మరణించాడు. 1997లో హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. 2006లో ఇజ్రాయెల్‌పై హెచ్‌బొల్లా సాగించిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లెబనాన్‌లో 34 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయింది. నస్రల్లాను పలు దేశాలు హీరో అంటూ కీర్తించాయి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నస్రల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లలో ఆయన చాలా అరుదుగానే బహిరంగంగా కనిపించారు. టీవీ, రేడియో ద్వారా తన అనుచరులకు సందేశం చేరవేసేవారు. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో నస్రల్లా ఎక్కువగా అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఉండేవారు. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాను నస్రల్లా తమ బద్ధ శత్రువుగా ప్రకటించారు. క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్‌ను సమూలంగా నాశనం చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నస్రల్లా వేషధారణ షియా మత బోధకుడిలాగే ఉండేది. వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను ముందుకు నడిపించే నాయకుడంటే నమ్మడం కష్టం. ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఆయన పెట్టిందిపేరు. హెజ్బొల్లాను రాజకీయ శక్తిగా కూడా మార్చారు. 2005లో లెబనాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్బొల్లా పోటీ చేసింది. రెండు సీట్లు గెలుచుకుంది. అంతేకాదు మంత్రివర్గంలో సైతం హెజ్బొల్లా చేరిందంటే నస్రల్లా చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్ హై అలర్ట్.. సురక్షిత ప్రాంతానికి సుప్రీమ్ లీడర్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో హెజ్బొల్లాకు భారీ నష్టం సంభవిస్తోంది. దక్షిణ బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం జరిపిన దాడుల్లో మిలటరీ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. అయితే నస్రల్లా మరణ వార్తలపై హెజ్బొల్లా కానీ, లెబనాన్ కానీ ఇంకా స్పందించలేదు.ఇదిలా ఉండగా దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం దూకుడు ప్రదర్శిస్తున్న వేళ.. ఇరాన్ అప్రమత్తమైంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని దేశంలోని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనకు భద్రతా ఏర్పాట్లను కూడా పెంచినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నస్రల్లాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత.. తదుపరి చర్యపై లెబనాన్, హెజ్బొల్లా, ఇతర ప్రాంతీయ గ్రూపులతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మా యుద్ధం లెబనాన్ ప్రజలతో కాదు: ఇజ్రాయెల్
జెరూసలెం: లెబనాన్ రాజధాని బీరుట్‌తో పాటు దాని చుట్టుపక్కలప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలివెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) హెచ్చరించింది.ఈమేరకు ఐడీఎఫ్ ఎక్స్(ట్విటర్)లో ఓ వీడియోని పోస్టు చేసింది.తమ యుద్ధం హెజ్బొల్లాతోనే కానీ లెబనాన్ ప్రజలతో కాదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పౌరులు లక్ష్యంగా హెజ్బొల్లా దాదాపు లక్షా 50వేల రాకెట్లు లెబనాన్‌లో ఉంచిందని తెలిపింది.వాటిల్లో కొన్నింటిని వ్యూహాత్మకంగా పౌరులు నివసించే ప్రాంతాల్లో ఉంచిందని, వాటిని తాము నిర్వీర్యం చేయనున్నామని వెల్లడించింది. ఇందులో భాగంగా దాడులు జరిగే అవకాశమున్నందున ప్రజలు ఆ ప్రాంతాలను విడిచి వెళ్లాలని ఐడీఎఫ్ కోరింది.ఉత్తర ఇజ్రాయెల్‌లోని పౌరులను హెజ్బొల్లా లక్ష్యంగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ చీఫ్ తెలిపారు.లెబనాన్ నుంచి వచ్చిన రాకెట్‌తో ఆ ప్రాంతం మొత్తం దెబ్బతిన్నట్లు వెల్లడించారు.తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్న హెజ్బొల్లా నుంచి తమ దేశ ప్రజలతో పాటు వనరులను రక్షించుకుంటామని చెప్పారు. ఇదీచదవండి: హూ ఈజ్ నస్రల్లా..ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతడే -
Who is Nasrallah: ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతనే!
పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాలస్తీనా అనుకూల.. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(IDF) భీకర దాడులు కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను లక్ష్య్ంగా చేసుకుని బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంలో బాంబులు కుమ్మరించింది. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని హెజ్బొల్లా ప్రకటించుకున్నప్పటికీ.. ఆయన కుమార్తె జైనబ్ మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ నజ్రల్లా ఎవరు?. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది పరిశీలిస్తే..పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో) నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టి విజయం సాధించింది. అయితే, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నంచిన పీఎల్ఓలోని కొందరు 1982 జూన్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షైన్ బెట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 91 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి హెజ్బొల్లాగా ఏర్పాటయ్యారు. ఈ సంస్థ ఏర్పాటులో ముసావితో కలిసి నస్రల్లా కీలక పాత్ర పోషించాడు.1992లో అప్పటి హెజ్బొల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావి హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను తన మార్గదర్శి స్థానం నుంచి నస్రల్లా అందుకున్నాడు. అప్పటికి అతడి వయసు 32 ఏళ్లే. అతడి నాయకత్వంలో హెజ్బొల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఊహించకపోవచ్చు.పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు. హెజ్బొల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు. 2011లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఈ సంస్థ సాయం చేసింది.దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌తో హెజ్బొల్లా చేసిన భీకర పోరాటం తర్వాత నస్రల్లా పేరను అరబ్ దేశాల్లో మార్మోగింది. 2006లో లెబనాన్‌లో 34 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో అతడు కీలక ప్రాత పోషించాడు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారాడు.నస్రల్లా కేవలం హెజ్బొల్లా చీఫ్‌గా మాత్రమే గుర్తింపు లేదు. బీరుట్ శివారులోని బుర్జ్ హమ్ముద్ ప్రాంతంలో 1960లో నస్రల్లా జన్మించాడు. అతని తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి. షియా కుటుంబంలో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకడైన నస్రల్లా.. చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్, పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. అప్పటి హెజ్బొల్లా సారథి అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడడంతో ఆయన జీవితమే మలుపు తిరిగింది. నస్రల్లా భార్య ఫాతిమా యాసిన్. నలుగురు పిల్లలు. 1997లో ఇజ్రాయెల్ యుద్ధంలో తన పెద్ద కొడుకు హదీని కోల్పోయాడాయన. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో నస్రల్లా కూతురు కుమార్తె జైనబ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నా.. ఆమె మృతిని హెజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. హెజ్బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జైనబ్ మృతి నిజమైతే గనుక.. ప్రతీకారంగా హెజ్బొల్లా దాడులను తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది కూడా. ఇంతకీ నస్రల్లా ఎక్కడ?నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. తాజా దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేదా సురక్షితంగానే ఉన్నాడా? అన్నదానిపై స్పష్టత లేదు. తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు, హెజ్బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. కానీ, కమ్యూనికేషన్ కట్ అయ్యినట్లు సమాచారం. మరోవైపు, హెజ్బొల్లా స్థావరాలపైకి యాంటీషిప్ క్షిపణులతో ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది. -
టార్గెట్ నస్రల్లా.. బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి
బీరుట్: హెజ్బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రతిజ్ఞచేసిన కొద్దిసేపటికే.. లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై భారీ బాంబు దాడులు జరిగాయి. బంకర్లను సైతం భూస్థాపితం చేసే భారీ బాంబులతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. బీరుట్ నగరంలోని దహియే పరిధిలోని హరేట్ రీక్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆరు ప్రధాన భవనాలు నేలమట్టమయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 76 మంది గాయపడ్డారు.మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఘటనాస్థలి వద్ద పెద్దసంఖ్యలో జనం గుమికూడారు. హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ టీవీఛానెళ్లు పేర్కొన్నాయి. ఏకధాటిగా బాంబులు వేయడం, పెద్ద సైజు బాంబులు వాడటం చూస్తుంటే హమాస్ అగ్రనేతను అంతంచేయడానికే ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా పరిస్థితిపై ఎలాంటి స్పష్టత రాలేదు. బీరుట్లో గత ఏడాదికాలంలో ఇంతటి భారీస్థాయిలో బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి. దాడుల ధాటికి ఆరు ప్రధాన భవంతులు నేలమట్టమయ్యాయి. అవి కూలాక బాంబులను వేయడం చూస్తుంటే అక్కడి భూగర్భంలో నిర్మించిన బంకర్లను కూల్చేయడమే అసలు లక్ష్యమని తెలుస్తోంది.‘‘ఈ బంకర్లలో∙నస్రల్లా ఉన్నట్లు భావిస్తున్నాం. ఖచ్చితత్వంతో కూడిన లక్షిత దాడి చేశాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. బాంబు పేలుళ్ల ప్రభావంతో ఏకంగా 30 కి.మీ.ల దూరంలోని ఇళ్ల గాజు కిటికీలు, అద్దాలు సైతం పగిలిపోయాయి. గురువారం చనిపోయిన హెజ్బొల్లా కమాండర్ అంత్యక్రియలు జరిగిన గంటకే బీరుట్‌పై దాడులు జరగడం గమనార్హం. పర్యటనను అర్థంతరంగా ముగించిన నెతన్యాహూ అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూ ఈ దాడుల వార్త తెల్సి వెంటనే తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశం బయల్దేరారు. నస్రల్లా మరణిస్తే తదుపరి కార్యాచరణపై రక్షణ, సైనిక, పాలనా వర్గాలతో చర్చించేందుకు ఆయన తిరిగొస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా దాడి ప్రాంతంలో లేడని హెజ్బొల్లా ప్రకటించింది. నస్రల్లా సురక్షితంగా వేరే ప్రాంతంలో ఉన్నారని ఇరాన్ అధికార ‘తస్నీమ్’ వార్తాసంస్థ ప్రకటించింది. దాడులపై అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ చెబుతుండగా, అలాంటి సమాచారం తమకు అందలేదని అమెరికా స్పష్టంచేసింది. ఇరాన్ ఆరా.. నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి జరగడంతో ఇరాన్ సుప్రీం ఖమేనీ తన నివాసంలో జాతీయ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరిచారు. బీరుట్‌పై ఐడీఎఫ్(ఇజ్రాయెల్ రక్షణ బలగాలు) దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు తెలిసింది. అయితే.. ఓ మీడియా సంస్థతో అతడు బతికే ఉన్నాడని హెజ్బొల్లా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అలాగే.. ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి సైతం మీడియాతో మాట్లాడుతూ.. టెహ్రాన్ వర్గాలు అతడి సమాచారం గురించి ఆరా తీస్తోంది. -
42 ఏళ్ల రక్తచరిత్ర
హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఏకంగా ఆరు వందల మంది దాకా మరణించారు. ఆ దేశంపై ఇజ్రాయెల్ ఇంతటి తీవ్ర దాడులకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అయితే హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కొత్తేమీ కాదు. ఇది నాలుగు దశాబ్దాల రక్తచరిత్ర... 1982: ఇజ్రాయిల్ ఆక్రమణ–హెజ్జ్బొల్లా్ల పుట్టుక హెజ్జ్బొల్లా, ఇజ్రాయెల్ సంఘర్షణకు 1982లో బీజం పడింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) దాడులకు ప్రతిస్పందనగా లెబనాన్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. బీరుట్ నడిజ్బొడ్డులో పీఎల్‌ఓను ముట్టడించింది. ఈ మారణకాండలో 2,000 మంది పాలస్తీనా శరణార్థులు, 3,500 మంది లెబనాన్ పౌరులు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా పుట్టుకొచి్చందే హెజ్బొల్లా. ఇరాన్ మద్దతుతో షియా ముస్లిం నేతలు దీన్ని ఏర్పాటు చేశారు. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలు, బెకా లోయలో అసంతృప్త యువతను భారీగా చేర్చుకుంటూ చూస్తుండగానే శక్తివంతమైన మిలీషియాగా ఎదిగింది.1983–1985: రక్తపాతం–ప్రతిఘటన హెజ్జ్బొల్లా, దాని గ్రూపులు లెబనాన్‌లోని విదేశీ దళాలపై 1982–1986 మధ్య పలు దాడులు చేశాయి. 1983లో బీరుట్‌లోని ఫ్రెంచ్, అమెరికా సైనిక శిబిరాలపై బాంబు దాడిలో 300 మందికి పైగా శాంతి పరిరక్షకులు మరణించారు. ఇది తమ పనేనని ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రకటించినా, దాడి వెనుక హెజ్జ్బొల్లా హస్తముందని ప్రచారం జరిగింది. 1985 నాటికి దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనుదిరిగేంతగా హెజ్బొల్లా బలపడింది. 1992–1996: రాజకీయ ఎదుగుదల 1992లో లెబనాన్ అంతర్యుద్ధం అనంతరం హెజ్జ్బొల్లా రాజకీయ శక్తిగా ఎదిగింది. 128 మంది సభ్యులున్న పార్లమెంటులో 8 సీట్లు గెలుచుకుంది. షియా ప్రాబల్య ప్రాంతాల్లో సామాజిక సేవలతో రాజకీయంగా, సైనికంగా ప్రభావం పెంచుకుంది. ఇజ్రాయెల్ దళాలపై ప్రతిఘటననూ కొనసాగించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ అకౌంటబిలిటీ’లో 118 మంది లెబనాన్ పౌరులు మరణించారు. 1996లో హెజ్జ్బొల్లాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ గ్రేప్స్ ఆఫ్ రాత్’తో హింస పరాకాష్టకు చేరింది. 2000–2006: ఇజ్రాయెల్ వెనుకంజ–జూలై యుద్ధం రెండు దశాబ్దాల ఆక్రమణ తరువాత 2000 మేలో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఏకపక్షంగా వైదొలిగింది. హెజ్జ్బొల్లా ప్రతిఘటనే దీనికి కారణమంటారు. ఈ విజయం ఆ సంస్థను లెబనాన్‌లో ప్రబల రాజకీయ శక్తిగా, ఇజ్రాయెల్‌పై అరబ్ ప్రతిఘటనకు కేంద్రంగా మార్చింది. 2006లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హెజ్జ్బొల్లా బందించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు, చివరికి యుద్ధానికి దారితీసింది. 34 రోజుల పాటు సాగిన ఈ ‘జూలై’ఘర్షణలో 1,200 మంది లెబనాన్ పౌరులు, 158 మంది ఇజ్రాయెలీలు మరణించారు. 2009–2024: ప్రాంతీయ సంఘర్షణ 2009 నాటికి హెజ్బొల్లా లెబనాన్‌లో పూర్తిస్థాయి సైనిక, రాజకీయ శక్తిగా మారింది. సిరియా అంతర్యుద్ధం సందర్భంగా ఇది కొట్టొచి్చనట్టు కని్పంచింది. 2012లో అసద్ ప్రభుత్వం తరఫున హెజ్జ్బొల్లా జోక్యం చేసుకోవడంతో అరబ్బుల మద్దతును కోల్పోవాల్సి వచి్చంది. కానీ అనంతరం ఇరాన్ మద్దతు హెజ్జ్బొల్లాకు కొత్త శక్తినిచి్చంది. 2023లో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆ దేశంతో మరోసారి హెజ్జ్బొల్లా ప్రత్యక్ష ఘర్షణకు కారణమయ్యాయి. దాంతో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ దాడుల్లో 51 మంది మృతి
టెల్ అవీవ్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల దాడి మూడోరోజు బుధవారం కూడా కొనసాగింది. ఈ దాడుల్లో 51 మంది చనిపోగా, 223 గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబైద్ వెల్లడించారు. హెజ్బొల్లా అగ్రనాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో సోమ, మంగళవారాల్లో 564 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌పై భూతల దాడులకు సిద్ధమవుతున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి బుధవారం తెలిపారు.మొస్సాద్ ప్రధాన కార్యాలయం పైకి.. హెజ్బొల్లా బుధవారం ఇజ్రాయెల్‌పైకి డజన్ల కొద్ది క్షిపణులను ప్రయోగించింది. ఏకంగా టెల్ అవీవ్‌లోని నిఘా సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైకి ఖాదర్–1 బాలిస్టిక్ మిసై్పల్ను ప్రయోగించినట్టు ప్రకటించింది. టెల్ అవీవ్‌లో, సెంట్రల్ ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మారుమోగాయి. దాంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భూతలం నుంచి భూతల లక్ష్యంపైకి ప్రయోగించిన క్షిపణిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి సెంట్రల్ ఇజ్రాయెల్‌ను చేరుకోవడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. -
పేజర్ దాడులు నిజంగా ఇజ్రాయెల్ పనేనా?
లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో సాధారణ పౌరులు కూడా మరణిస్తున్నారని లెబనాన్ ఆరోపిస్తోంది. అయితే.. ప్రస్తుతకాలంలో ప్రపంచంలోని మరేయితర దేశం ఎదుర్కొనంత యుద్ధ సంక్షోభం తాము ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది. ఒకవైపు హమాస్.. మరోవైపు హెజ్బొల్లా దాడులతో క్లిష్టమైన పరిస్థితుల్లో తాము ఉన్నట్లు చెబుతోంది. అదే సమయంలో.. ప్రత్యర్థులపై చేస్తున్న జరుగుతున్న ‘మిస్టరీ దాడుల్ని’ తోసిపుచ్చకపోవడం గమనార్హం!!. అయితే.. భారత్‌లో ఆ దేశ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియా ఛానెల్ డిబేట్లో పాల్గొన్నారు. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఇది ఇజ్రాయెల్, దాని నిఘా సంస్థల పనేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా అని యాంకర్ అడిగింది. దానికి ఆయన స్పందిస్తూ..‘‘గతంలో సైన్యాల మీదనో, ఉగ్రవాదం మీదనో దాడులు జరిగేవి. ప్రస్తుతం యుద్ధం అనేది సంప్రదాయ పద్ధతుల నుంచి హైబ్రీడ్ పద్ధతికి మారిపోయింది. ఈ కాలంలో ఇజ్రాయెల్ ఎదుర్కొన్నంత దాడులు మరేయితర దేశం ఎదుర్కొలేదు. రాకెట్లు, మిస్సైల్స్ మాత్రమే కాదు.. మా దేశంపై సైబర్ దాడులు కూడా జరిగాయి. నింగి, నేల, జల మార్గం ఆఖరికి టన్నెల్స్ ద్వారా కూడా మాపై దాడులు జరిగాయి... ఇలాంటి పరిస్థితుల్లో.. ఇజ్రాయెల్ కేవలం తనను తాను రక్షించుకోవడం మీద మాత్రమే ఫోకస్ చేయడం లేదు. అదే టైంలో తన దాడులతో శత్రు దేశాలకు ‘సర్ప్రైజ్’ చేయాలనుకుంటోంది కూడా. ఇజ్రాయెల్ ఇప్పుడు ఏ తరహా దాడులు చేస్తుందో.. అనే అంశం లోతుల్లోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. కానీ, ప్రత్యర్థులు దొడ్డిదారిన దాడులకు తెగబడినప్పుడు వాళ్లకు అదే రీతిలో బదులివ్వడం తప్పేం కాదు కదా’’ అని రూవెన్ వ్యాఖ్యానించారు.ఇదే ఇంటర్వ్యూలో ఆయన.. తాజా యుద్ధ పరిణామాలతో పాటు అమెరికా, భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు దక్కిన మద్ధతు, తాజా అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, పాలస్తీనా అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్‌తో భేటీ కావడం లాంటి అంశాలపైనా స్పందించారు. లెబనాన్‌లో సెప్టెంబర్ 17-18 తేదీల మధ్య పేజర్లు, ఆ మరుసటి రోజే వాకీటాకీలు.. ఇతర శాటిలైట్ డివైజ్‌లు పేలిపోయి 37 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. ఇవి హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్.. దాని నిఘా సంస్థ మోస్సాద్ జరిపిన దాడులేనని లెబనాన్ ఆరోపిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మెరుపు దాడి.. హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు (ఫొటోలు)
-
మా యుద్ధం హెజ్బొల్లాతోనే.. మీతో కాదు!
Israel–Hezbollah Conflict Latest News: ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ రక్తమోడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాకా జరిగిన దాడిలో.. వంద మందికి పైగా చిన్నారులు, మహిళలు సహా మొత్తం 500 మంది మరణించారు. రెండు వేల మంది దాకా గాయాలపాలయ్యారు. అక్టోబర్ 7న గాజా సంక్షోభం మొదలయ్యాక.. ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ(IDF) ప్రకటించుకుంది. పైగా ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించడం గమనార్హం.‘‘ముప్పు మాదాకా(ఇజ్రాయెల్) చేరడాని కంటే ముందు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఈ మేరకు ఆయన ఓ సందేశం విడుదల చేశారు. ‘‘లెబనాన్ ప్రజల్లారా.. మా యుద్ధం మీతో కాదు. మా యుద్ధం హెజ్బొల్లాతో. ఆ సంస్థ చాలాకాలంగా మిమ్మల్ని రక్షణ కవచంలా ఉపయోగించుకుంటోంది. మీరు ఉండే ఆవాసాల్లోనే ఆయుధాలను దాస్తోంది. హెజ్బొల్లా మా నగరాలను, ప్రజలనే లక్షంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగానే మేం వాళ్లపై దాడులు చేస్తూ.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నాం’’ అని ఓ సందేశం విడుదల చేశారు. Message for the people of Lebanon: pic.twitter.com/gNVNLUlvjm— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) September 23, 2024హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా నెతన్యాహు కోరారు. ‘‘వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి మీరు మీ ప్రాణాలను రక్షించుకోండి. మా ఆపరేషన్ ముగిశాక.. మళ్లీ మీ నివాసాలకు తిరిగి వెళ్లొచ్చు’’ అని లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారుఇక.. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని యుద్ధంలోకి లాగొద్దని ఆయన నెతన్యాహూను ఉద్దేశించి హితవు పలికారు.ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణ లెబనాన్ మరో గాజా అయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల జోక్యంతోనైనా పరిస్థితులు చల్లబడాలని ఆయన కోరుకుంటున్నారు. గతేడాదే మొదలైంది..కిందటి ఏడాది జులైలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఫౌద్ షుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దానికి ప్రతీకారంగా ఆగష్టు నుంచి వీలు చిక్కినప్పుడల్లా రాకెట్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ సరిహద్దులో హెజ్బొల్లా విరుచుకుపడుతోంది. తాజాగా.. లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిపోయి 37 మంది చనిపోగా.. వేల మంది గాయపడ్డారు. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోయారు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్.. ఆ దేశ భద్రతా ఏజెన్సీ మోస్సాద్ ఈ దాడులకు దిగాయని లెబనాన్ ఆరోపించింది. ఈ పరిణామం ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించింది. కిందటి ఏడాది నుంచి ఇప్పటిదాకా.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు.హెజ్బొల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ ‘ఆపరేషన్ నార్తన్ ఆరోస్’ కొనసాగిస్తోంది. తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలిటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: వీళ్ల వైరం ఏనాటిదంటే..! -
ఇజ్రాయెల్ భీకర దాడులు
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్‌లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.వెళ్లిపోవాలంటూ మెసేజ్లుతామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్‌ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. -
హిజ్బుల్లాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే 300 లకుపైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 700 మందికి గాయాలైనట్లు పేర్కొంది.ఈ రోజు ఉదయం నుండి దక్షిణ పట్టణాలు, గ్రామాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో 182 మంది మరణించారు. వారిలో పిల్లలు, మహిళలు,మెడికల్ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ ప్రతినిధులు ప్రకటించారు. ఈ దాడులపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి స్పందించారు. లెబనాన్‌లోని సామాన్య ప్రజలు హిజ్బుల్లాకు అనుసంధానంగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అంతేకాదు తమ సైన్యం లెబనాన్ అంతటా విస్తరించిన హిజ్బుల్లా ఖచ్చితమైన స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని హగారి స్పష్టం చేశారు. లెబనాన్ పౌరులు భద్రత దృష్ట్యా వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. చదవండి : పడవలో కుళ్లిన 10 మృతదేహాలు -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల విధ్వంసం
జెరూసలేం: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోమారు భీకర దాడి చేసింది. డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వందకు మించిన హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ విమానాల నుంచి వస్తున్న శబ్ధాలు, దూసుకువస్తున్న బాంబులు, క్షిపణులకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు హిజ్బుల్లా రాకెట్ లాంచర్లతో సహా దక్షిణ లెబనాన్‌లోని దాదాపు 110 లక్ష్యాలపై భారీ దాడి చేశాయని ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడిలో లెక్కలేనందమంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీనికిముందు శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 37 మంది మృతి చెందారు. ఈ తాజా దాడి తర్వాత లెబనాన్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. శనివారం లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై వరుస దాడుల ఘటన మరువక ముందే తాజా దాడులు జరిగాయి. తాజా దాడుల్లో వేలాది రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసమయ్యాయని ఐడీఎఫ్ పేర్కొంది. 🚨Update: IDF continues massive air strikes across Lebanon! One of the largest bombs ever dropped by Israel on southern Lebanon, very likely a US Moab! pic.twitter.com/D71TB3tPI3— US Civil Defense News (@CaptCoronado) September 21, 2024ఇది కూడా చదవండి: గాజాలో 22 మంది మృతి -
లెబనాన్ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?
హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో.. కేరళకు చెందిన ఓ టెక్కీని బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్వేలో స్థిరపడిన అతనికి.. బల్గేరియాలో ఓ కంపెనీ ఉంది. అక్కడి నుంచే పేజర్ల సప్లై జరిగిందని, పేలుడు పదార్థాలను ఇక్కడే అమర్చి ఉంటారన్న అనుమానాల నడుమ మూడు రోజులపాటు అతన్ని విచారించారు. వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్(37).. నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే.. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు ఇతని కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అధికారులు అనుమానించారు. ఈ అనుమానాలకు అతని కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. దీంతో.. బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్ఎస్, ఆ దేశ విదేశాంగ సహకారంతో జోస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. చివరకు.. పేలుళ్లకు సంబంధించిన పేజర్లకు, ఇతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు.‘‘లెబనాన్ పేజర్ల పేలుళ్లకు నోర్టా గ్లోబల్ లిమిటెడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీ యాజమానితో పేజర్లకు సంబంధించి లావాదేవీలు(ట్రాన్జాక్షన్స్) జరిగాయన్న వాదనలోనూ నిజం లేదు’’ అని డీఏఎన్ఎస్ ప్రకటించింది. మరోవైపు ఓస్లో(నార్వే) పోలీసులు సైతం ప్రాథమిక విచారణలో జోస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి.ఇదీ చదవండి: పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదేసెప్టెంబర్ 17వ తేదీన లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా.. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని, పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో..తైవాన్‌కు చెందిన పేజర్ల కంపెనీ గోల్డ్ అపోలో పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. పేలుడుకు గురైన ఏఆర్-924 పేజర్లకు తమకు సంబంధం లేదని తైవాన్ కంపెనీ స్పష్టం చేసింది. హంగేరీ బుడాపెస్ట్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గర వాటి తయారీ ట్రేడ్ మార్క్ ఉందని తేలింది. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన రిన్సన్ జోస్.. కొంతకాలం లండన్‌లోనూ పని చేశాడు. ఆపై సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఓస్లోలోనే ఉంది. తాజా పరిణామాలతో కేరళలోని జోస్ కుటుంబం ఆందోళనకు గురైంది. అతన్ని ఇరికించే కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. మూడు రోజులపాటు అధికారులు అతన్ని కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని భార్య మీడియా వద్ద వాపోయింది. అయితే లెబనాన్ పేలుళ్ల కేసు నుంచి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ అతన్ని ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం. -
సహించరాని ఉన్మాదం
ముందు ఇరుగుపొరుగుతో... ఆ తర్వాత పశ్చిమాసియా దేశాలన్నిటితో ఉన్మాద యుద్ధానికి ఇజ్రా యెల్ సిద్ధపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలూ, దేశాలూ ఈ మాదిరిగా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతే ఇది కాస్తా ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం లేకపోలేదని మంగళ, బుధవారాల్లో లెబనాన్, సిరియాల్లో చోటుచేసుకున్న పరిణామాలు తెలియజెబుతున్నాయి. వరసగా రెండురోజులపాటు పేజర్లనూ, వాకీటాకీలనూ, ఇళ్లల్లో వినియోగించే సౌరశక్తి ఉపకరణా లనూ పేల్చటం ద్వారా సాగించిన ఆ దాడుల్లో 37 మంది మరణించగా నాలుగు వేలమందికి పైగా గాయపడ్డారు.లెబనాన్‌లో హిజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయటానికే ఈ దాడులు చేసినట్టు కనబడుతున్నదని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు అర్ధసత్యం మాత్రమే. ప్రాణాలు కోల్పోయినవారిలో మిలిటెంట్లతోపాటు పసిపిల్లలూ, అమాయక పౌరులూ, ఆరోగ్యసేవా కార్య కర్తలూ ఉన్నారు. హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మాత్రమే కాదు... అదొక రాజకీయ పక్షం, ధార్మికసంస్థ. కనుక ఆ పేజర్లు సామాన్య పౌరులకూ చేరివుండొచ్చు.గాజాలో దాదాపు ఏడాదిగా మారణ హోమం సాగుతోంది. దాన్ని ఆపటానికీ, శాంతియుత పరిష్కారం సాధించటానికీ ఎవరూ చిత్తశుద్ధితో కృషి చేయటం లేదు. మొన్న ఫిబ్రవరిలో అమెరికా వైమానిక దళ సీనియర్ ఎయిర్మాన్ ఆరోన్ బుష్నెల్ ఆత్మాహుతి చేసుకునేముందు ఫేస్బుక్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సందేశం ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. కళ్లెదుట మారణ హోమం సాగుతుంటే ప్రపంచం నిర్లిప్తంగా మిగిలిపోవటాన్ని... తన చేతులకూ నెత్తురంటడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆ సందేశంలో ఆయన రాశాడు. అమెరికాకు చీమ కుట్టినట్టయినా లేదు. లెబనాన్, సిరియాల్లో జరిగిన దాడులపై ఒక మీడియా సమావేశంలో పదే పదే ప్రశ్నించినా వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ జవాబిచ్చేందుకు నిరాకరించటం దీన్నే ధ్రువపరుస్తోంది. ఉగ్రవాదానికి విచక్షణ ఉండదు. తన విధ్వంసకర చర్యలు ఎవరికి చేటు చేస్తాయన్న ఆలోచన ఉండదు. వ్యక్తులు ఇలాంటి ఉన్మాదానికి లోనయితే జరిగే నష్టంకన్నా రాజ్యాలు ఉగ్రవాదాన్నిఆశ్ర యిస్తే కలిగే నష్టం అనేక వందల రెట్లు ఎక్కువ. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అలాంటిధూర్త రాజ్యాలు వేరే దేశాలపై సైతం ఆ మాదిరిగానే దుందుడుకు చర్యలకు దిగి ప్రపంచాన్నిపాదాక్రాంతం చేసుకోవటానికి కూడా సిద్ధపడతాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను అందరూ వ్యతిరేకించింది అందుకే. ఒక దేశాన్ని దురాక్రమించి, అక్కడి పౌరులకు కనీసం నిలువ నీడ కూడా లేకుండా చేస్తూ అందుకు ప్రతిఘటన ఉండకూడదనుకోవటం తెలివి తక్కువతనం. పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడి, చివరకు ఒప్పందం కుదరబోతున్న దశలో సైతం అడ్డం తిరిగి మొండికేసిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. అంతేకాదు... ఇరుగుపొరుగు దేశాలతో తరచు గిల్లికజ్జాలకు దిగటంతోపాటు ఇథియోపియా, ఉగాండా, నైజర్, కెన్యావంటి సబ్ సహారా దేశాల, లాటిన్ అమె రికా దేశాల నియంతలకు ఆయుధాలిచ్చి అండదండలందించిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. చూస్తూ ఉంటే మేస్తూ పోయినట్టు ప్రపంచం స్థాణువై మిగిలిపోతే ఈ అరాచకాలకు అంతంఉండదు. సమస్య ఉన్నదని గుర్తించటం దాని పరిష్కారానికి తొలి మెట్టు. కానీ ఇంతవరకూ అమెరికాగానీ, దానికి వంతపాడుతున్న యూరప్ దేశాలుగానీ అసలు పాలస్తీనా అనేది సమస్యే కానట్టు నటిస్తున్నాయి. తాజాగా జరిగిన పేలుళ్ల వెనకున్న కుట్రలో ఇప్పుడు అందరి అనుమానమూ పాశ్చాత్య ప్రపంచంపై పడింది. ముఖ్యంగా హంగెరీ, బల్గేరియా దేశాల సంస్థల పాత్ర గురించి అందరూ ఆరా తీస్తున్నారు. పేజర్లను తాము తయారుచేయటం లేదనీ, హంగెరీలోని బీఏసీ అనే సంస్థ తమ లోగోను వాడుకుని ఉత్పత్తి చేస్తోందనీ తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ అంటున్నది. ఇందుకు తమకు పశ్చిమాసియా దేశంనుంచి నగదు ముడుతున్నదని సంస్థ వివరించింది. హంగెరీ మీడియా సంస్థ కథనం ఇంకా విచిత్రంగా ఉంది. అది చెప్తున్న ప్రకారం బీఏసీ కాదు, బల్గేరియాలోని నోర్టా గ్లోబల్ అనే సంస్థ ఈ పేజర్లను సరఫరా చేసిందట. బీఏసీకి ఉత్పాదక సామర్థ్యంలేదనీ, అది కేవలం ఒక ఏజెంటు మాత్రమే ఉండే కన్సెల్టింగ్ ఏజెన్సీ అనీ హంగెరీ ప్రభుత్వం చెబుతోంది. ఇక బల్గేరియా అయితే అసలు పేజర్ల ఉత్పాదక సంస్థ తమ గడ్డపైనే లేదంటున్నది. ప్రజల ప్రాణాలు తీసే దుష్ట చర్యకు పాల్పడి నేరం తాలూకు ఆనవాళ్లు మిగల్చకపోవటం, అది ఘనకార్యమన్నట్టుసంబరపడటం ఉగ్రవాద సంస్థల స్వభావం. దాన్నే ఇజ్రాయెల్ కూడా అనుకరిస్తూ పైచేయి సాధించానని భ్రమపడుతున్నట్టుంది. కానీ ఈ మాదిరి చర్యలు మరింత ప్రతీకార వాంఛను పెంచుతాయి తప్ప దాని స్థానాన్ని పదిలం చేయలేవు.ఇంతవరకూ పేలుళ్ల బాధ్యత తనదేనని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. తమ శత్రువు ఎక్కడున్నా వెదికి వెదికి పట్టుకుని మట్టుబెట్టడం, అందుబాటులో ఉన్న సాంకేతికతలను అందుకు వాడుకోవటం ఇజ్రాయెల్‌కు కొత్తగాదు. ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి చొరబడి మాల్వేర్ను ప్రవేశ పెట్టడం, పౌరుల గోప్యతకు భంగం కలిగించటం, కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్లు పేలిపోయేలా చేయటం ఇజ్రాయెల్ సంస్థల నిర్వాకమే. మిత్రపక్షం కదా అని ధూర్త రాజ్యాన్ని ఉపేక్షిస్తే అదిప్రపంచ మనుగడకే ముప్పు కలిగిస్తుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఇజ్రాయెల్ చర్యలు సారాంశంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టాల ఉల్లంఘన. అందుకు పర్యవసానం లేకపోతే శతాబ్దాలుగా మానవాళి సాధించుకున్న నాగరిక విలువలకు అర్థం లేదు. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల దాడి
జెరూసలెం: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా తాజాగా 140 రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్ హద్దుమీరిందని, ప్రతి దాడి ఉంటుందని హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాకెట్ దాడులు జరగడం గమనార్హం. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు మిలటరీ క్యాంపులపై ఈ దాడులు జరిపినట్లు హెజ్బొల్లా తెలిపింది.దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతిగా రాకెట్లతో దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. లెబనాన్ సరిహద్దుల నుంచి రాకెట్లు దూసుకొచ్చిన విషయాన్ని ఇజ్రాయెల్ మిలటరీ ధ్రువీకరించింది. అయితే ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సిఉంది. కాగా, ఇప్పటివరకు పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై దృష్టి పెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలే లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థలున్నాయని హెజ్బొల్లా ఆరోపిస్తోంది. పేజర్లు,వాకీటాకీల పేలుళ్లతో పాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ రాకెట్ దాడులు కూడా చేసింది. ఇదీ చదవండి.. లెబనాన్ ఉక్కిరిబిక్కిరి.. రాకెట్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ -
లెబనాన్ ఉక్కిరిబిక్కిరి.. ఇజ్రాయెల్ మెరుపు దాడులు
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడులకు దిగింది. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడింది. మరోవైపు.. హిజ్బుల్లా నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌లో భయాకన వాతావరణం నెలకొంది. ఏ సమయంలో ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా గురువారం టెలివిజన్‌లో ప్రసంగించారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయెల్ హద్దు మీరిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడటం గమనార్హం. వందల సంఖ్యలో వార్‌హెడ్స్, రాకెట్లు హిజ్బుల్లా స్థావరాలపైకి దూసుకెళ్లాయి. తాజా దాడిలో గాయపడిన, చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, అంతకుముందు హిజ్బుల్లా డ్రోన్ దాడులు చేసింది. ఇందులో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. Israel is bombarding Hezbollah targets in Lebanon right now, in the most extensive wave of attacks since the war started. That's what you do when thousands of Hezbollah terrorists are incapacitated due to injuries 📟pic.twitter.com/wry0WodZxf— Dr. Eli David (@DrEliDavid) September 19, 2024 పేజర్లు, వాకీటాకీలపై నిషేధంపేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో అప్రమత్తమైన లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది. ఇక, లెబనాన్‌లో మంగళ, బుధవారాల్లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది. దాదాపు మూడు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 287 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.Hezbollah had prepared 100s of rockets launchers, 1000 plus barrels in #Lebanon for attack on Israeli military & civilian targets.Just minutes before the launch, #Israel discovered the plot, struck, & successfully destroyed all the Hizb launch sites in massive IAF Air strikes pic.twitter.com/7ZNmp2BDDq— Megh Updates 🚨™ (@MeghUpdates) September 20, 2024ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ రూటే వేరు.. ఆధారాలుండవ్.. అంతా సినీ ఫక్కీలో..! -
యుద్ధం అంచున..
బీరుట్: చేతిలో ఇమిడే చిన్నపాటి పేజర్లు, వాకీటాకీలను పేల్చేసి హెజ్బొల్లాపై అనూహ్య దాడులకు దిగిన ఇజ్రాయెల్ శుక్రవారం ఏకంగా లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో జెట్విమానాలతో రంగ ప్రవేశం చేసి ఒక్కసారిగా యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. అనూహ్య పేలుళ్లతో వేలాది మంది హెజ్బొల్లా సాయుధుల, పౌరుల రక్తం కళ్లజూసిన ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసి పశ్చిమాసియాలో సమరాగ్నిని మరింత రాజేసింది.ఇజ్రాయెల్ బలగాలకు హెజ్బొల్లా దీటుగా బదులిస్తున్నాయి. ఈ సందర్భంగా అల్–మర్జ్ ప్రాంతంలో హెజ్బొల్లా జరిపిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యంలోని 43 ఏళ్ల రిజర్వ్ మేజర్ నేయిల్ ఫార్సీ, 20 ఏళ్ల సర్జెంట్ టోమర్ కెరెన్ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు డ్రోన్ దాడిలో, మరొకరు ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడిలో చనిపోయారని ఇజ్రాయెల్ ఎన్12 న్యూస్ వార్తాసంస్థ ప్రకటించింది. బీరుట్ నగరం మీదుగా ఒక్కసారిగా ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు తక్కువ ఎత్తులో చెవులు చిల్లులుపడేలా ధ్వని వేగంతో దూసుకుపోవడంలో అసలేం జరుగుతుందో తెలీక జనం భయపడి పోయారు. తాము చాలా డ్రోన్లను ఆకాశంలో చక్కర్లు కొట్టడం చూశామని స్థానికులు చెప్పారు.హెజ్బొల్లా స్థావరాలపై దాడులుహెజ్బొల్లా చీఫ్ నస్రల్లా ప్రసంగిస్తుండగానే∙ హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాదాపు 150 రాకెట్ లాంఛర్లను ధ్వంసంచేసింది. హెజ్బొల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. చాలా సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల పౌరుల ఇళ్లను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని హెజ్బొల్లాపై ఆరోపణలు గుప్పించింది. పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటూ దక్షిణ లెబనాన్‌ను యుద్ధ భూమిగా మార్చిందని ఆరోపించింది. ‘‘ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులతో తరలిపోయిన ఇజ్రాయెలీలు మళ్లీ సరిహద్దు ప్రాంతాల సొంతిళ్లకు తిరిగి చేరుకోవడం మాకు ముఖ్యం. వారి రక్షణ, భద్రత లక్ష్యంగా ఎలాంటి సైనిక చర్యలకైనా మేం సిద్ధం.సమస్యను మరింత జఠిలం చేస్తూ, ఆలస్యం చేసేకొద్దీ హెజ్బొల్లా మరింతగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యవ్ గాలంట్ హెచ్చరించారు. ‘‘ ఈ దాడులు ఆగవు. అయితే హెజ్బొల్లాతో పోరు చాలా సంక్లిష్టతో కూడుకున్న వ్యవహారం’’ అని సైన్యాధికారులతో భేటీలో గాలంట్ వ్యాఖ్యానించారు. పరస్పర దాడులతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించకుండా సంయమనం పాటించాలని, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని ఇరుపక్షాలకు అమెరికా, ఫ్రాన్స్ సూచించాయి.ఈ విపరిణామంతో లెబనాన్‌లో ప్రజారోగ్యం కుదేలవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గెబ్రియేసిస్ ఆందోళన వ్యక్తంచేశారు. లెబనాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యే వీలుంది. యుద్ధభయాలతో అక్కడి తమ పౌరులు లెబనాన్‌ను వీడాలని బ్రిటిషర్లకు బ్రిటన్ విదేశాంగ శాఖ శుక్రవారం అత్యవసర అడ్వైజరీ జారీచేసింది. మరోవైపు లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది. బీరుట్ ఎయిర్‌పోర్ట్‌లో పేజర్, వాకీటాకీలపై నిషేధంవేలాది పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో కొంతమంది మరణాలు, వేలాదిగా హెజ్బొల్లా సభ్యులు క్షతగాత్రులైన ఘటనతో లెబనాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికుల, పౌర విమానయాన సంస్థల విమానాల భద్రతపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా బీరుట్ నగరంలోని రఫీక్ హరీరీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే ఏ విమానంలోనూ పేజర్, వాకీటాకీలను అనుమతించబోమని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు గురువారం మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ ఈ నిషేధం అంశం తెలియజేయాలని విమానయాన సంస్థలకు సూచించింది.రెడ్‌లైన్ దాటి భారీ తప్పిదం చేసింది: నస్రల్లాపరస్పర దాడులు మొదలుకావడానికి ముందే గుర్తుతెలియని ప్రదేశం నుంచి హమాస్ చీఫ్ నస్రల్లా టెలివిజన్‌లో ప్రసంగించారు. ‘‘పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో వేలాది మంది ప్రాణాలు హరించేందుకు బరితెగించి ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. వేల మందిని రక్తమోడేలా చేసి యుద్ధనేరానికి పాల్పడింది. పరికరాల విధ్వంసంతో మా కమ్యూనికేషన్‌కు భారీ నష్టం వాటిల్లిన మాట వాస్తవమే. అయినాసరే దాడులతో మాలో నైతిక స్థైర్యం మరింత పెరిగింది. ఇజ్రాయెల్‌పై పోరుకు మరింత సంసిద్ధమయ్యాం. అనూహ్య పేలుళ్లతో శత్రువు తన పరిధి దాటి ప్రవర్తించాడు.అన్ని నియమాలను, రెడ్‌లైన్‌ను దాటేశాడు. వాళ్లు ఊహించినట్లే దాడులు చేస్తాం. ఊహించనంతగా దాడి చేస్తాం. గాజాలో దాడులు ఆపేదాకా మేం ఉత్తరలెబనాన్ సరిహద్దులో దాడులు ఆపబోం. మా దాడుల దెబ్బకి పారిపోయిన సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలు ఎన్నటికీ తమ సొంతిళ్లకు రాలేరు. దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెడితే అది మాకు సువర్ణావకాశం. వాళ్లు దారుణ ఫలితాలను చవిచూస్తారు’’ అని అన్నారు. -
Lebanon: లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు.. 32 మంది మృతి
బీరుట్: లెబనాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వాకీటాకీలు, పేజర్ల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. ఇక, తాజాగా వాకీటాకీల పేలుళ్ల కారణంగా దాదాపు 32 మంది మృతిచెందగా.. 450 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, బుధవారం పలుచోట్ల పేజర్లు పేలిన ఘటనలో దాదాపు 13 మంది మృత్యువాతపడగా 2800 మంది తీవ్రంగా గాయపడ్డారు.కాగా, బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వీటితోపాటు సౌర పరికరాలనూ పేలుళ్లకు వినియోగించుకున్నారు. పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో ఇలా మరో పేలుడు సంభవించడం తీవ్ర కలకలం సృష్టించింది. వైర్లెస్ పరికరాలైన పేజర్లు, వాకీటాకీలు పేలడంతో ఈ పరికరాల హ్యాకింగ్ ఎలా జరిగింది అనేది కీలకంగా మారింది. మరోవైపు తీర ప్రాంతంలోని సిడోన్‌లో కారుతోపాటు ఒక దుకాణంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బీరుట్‌లోని పలు ఇళ్లలో సౌర పరికరాలూ పేలిపోయాయి. హిజ్బుల్లా గ్రూపునకు చెందిన వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలూ పేలాయి. ఇక.. ఇజ్రాయెలే ఈ దాడులకు దిగిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ పేలుళ్ల ఘటనలో మరణాల సంఖ్యల మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.#Pager After pager now Walkie-talkies explode at funeral held for pager victims.Pakistan condemned the attack.#Lebanon pic.twitter.com/pVMV3zQE0K— kiran parmar (@kiranaparmar72) September 19, 2024 అయితే, లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో తయారయ్యాయి. వాటిపై ఐకామ్ అని ఉంది. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ. కాగా, లెబనాన్‌లో పేలిన వాకీ టాకీల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశామని ఐకామ్ వెల్లడించింది. ఇక, ఇవి చేతితో పట్టుకునే విధంగా రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హిజ్బోల్లా ఐదు నెలల కిందట కొనుగోలు చేసింది. ఇక, తాజాగా ఈ పరికరాలు పేలిన కారణంగా భారీ నష్టం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌పై భీకరంగా దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్త తరహా దాడులో లెబనాన్‌పై విరుచుకుపడుతోందని పలువురు చెబుతున్నారు. అందులో భాగంగా ఇలా అనూహ్య పేలుళ్ల ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ తన సైనికులతో యుద్ధం మరో అంకంలోకి ప్రవేశించిందని, మరింత ధైర్యం, అంకిత భావం అవసరమని సూచించారు. సైన్యం సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లోకి భారీగా సైన్యాన్ని ఇజ్రాయెల్ తరలిస్తోంది. All types of electric devices owned by Hezbollah are now blowing up in #Lebanon and the region.Apart from pagers & walkie-talkies, other devices such as fingerprint devices, solar power, radios, phones, batteries are now exploding too. #LebanonBlastpic.twitter.com/FIm5RH9UpA— Arun Pudur (@arunpudur) September 18, 2024ఇది కూడా చదవండి: ట్రంప్‌కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్ ఇచ్చిన యూనియన్ -
Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం!
లెబనాన్, సిరియాల్లో పేజర్ల అనూహ్య పేలుళ్లతో గతంలో ఎన్నడూలేనంతగా తొలిసారిగా పేజర్లపై చర్చ మొదలైంది. మంగళవారం నాటి ఘటనలో లెబనాన్, సిరియాల్లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 12కు పెరిగింది. ఇందులో ఇద్దరు చిన్నారులుసైతం ఉన్నారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు. అసలు ఏమిటీ పేజర్లు? అవి ఎలా పనిచేస్తాయి? వాటిల్లోకి పేలుడు పదార్థం ఎలా వచ్చి చేరింది? తదతర అంశాలను ఓసారి చూద్దాం.ఫోన్లో నిఘా భయం.. అందుకే పేజర్గాజా స్ట్రిప్‌లో హమాస్‌కు బాసటగా నిలుస్తూ లెబనాన్‌లోని హెజ్బొల్లా.. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. తమ వ్యూహాలు ఇజ్రాయెల్‌కు చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఫోన్ల ద్వారా సున్నిత, రహస్య సమాచార మార్పిడి జరిగితే ఇజ్రాయెల్ పసిగట్టే ప్రమాదం ఉందని గ్రహించి ఫోన్లకు స్వస్తి పలికింది. వెంటనే ఫోన్లను పగలగొట్టి పాతిపెట్టాలని హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి హసస్ నస్రల్లామ్ తమ సభ్యులకు ఫిబ్రవరి 13న పిలుపునిచ్చారు. ఫోన్లకు బదులు పేజర్ వాడాలని సూచించారు. పేజర్లో సమాచారం అత్యంత సురక్షితంగా, భద్రంగా ఉంటుందని వారి నమ్మకం. దీంతో యుద్ధక్షేత్రంలో ఉండే సైనికులు మొదలు సహాయక సేవల్లో ఉండే వైద్యుల వరకు వివిధ విభాగాల సభ్యులు పేజర్ వాడటం మొదలెట్టారు. వీరి కోసం ఈ ఏడాది ప్రారంభంలో కొత్త పేజర్లను విదేశాల నుంచి తెప్పించారు. పోలీసు, అగ్నిమాపక శాఖలు సహా పలు అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది తక్షణ హెచ్చరికల కోసం పేజర్లపై ఆధారపడుతున్నారు.బ్రాండ్ మాదే.. ఉత్పత్తి మాది కాదు లెబనాన్‌లో పేలుళ్లకు ఉపయోగించిన పేజర్ ఏఆర్–924 రకానికి చెందినది. ఈ ఏడాది ప్రారంభంలో 5,000 పేజర్లను హెజ్బొల్లా ఆర్డర్ చేసింది. తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో సంస్థ నుంచి ఏఆర్–924 పేజర్లను తెప్పించినట్లు లెబనాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి స్థాయిలోనే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ రంగంలోకి దిగి ప్రతి పేజర్లో 3 గ్రాముల బరువైన పేలుడు పదార్థాన్ని మదర్‌బోర్డులో అమర్చిందని హెజ్బొల్లా, లెబనాన్ భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. పేల్చేందుకు శత్రువు పంపిన కోడ్‌ను మదర్ బోర్డ్ అందుకున్నాక పేజర్లోని పేలుడు పదార్థం క్రియాశీలమై పేలిందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేజర్లను నెలల తరబడి వాడుతున్నా వాటిలోని పేలుడు పదార్థాన్ని హెజ్బొల్లా వర్గాలు గుర్తించకపోవడం తీవ్ర భద్రతావైఫల్యంగా చెబుతున్నారు. ఆ పేజర్లను మొదట్లో స్కాన్ చేసినపుడు ఎలాంటి పేలుడు పదార్థం జాడ కనిపించలేదని వారు చెబుతున్నారు. అయితే ఈ పేజర్లను హంగేరీకి చెందిన ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ’ అనే సంస్థ రూపొందించిందని ఆ బ్రాండ్ యజమాని గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు హుసు చింగ్–కువాంగ్ తెలిపారు. ‘ఏఆర్–924 అనే బ్రాండ్ మాత్రమే మాది. ఆ బ్రాండ్ పేరుతో ఉన్న ఉత్పత్తి మాది కాదు. ఆ బ్రాండ్ పేరును వాడుకునేందుకు బీఏసీకి అనుమతి ఇచ్చాం. ఈ మేరకు మూడేళ్లక్రితం ఒప్పందం కుదిరింది’’ అని చింగ్కువాంగ్ బుధవారం చెప్పారు. అయితే బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ అనేది ఒక డొల్లకంపెనీ అని వార్తలొచ్చాయి. హంగేరీలోని బుడాపెస్ట్ నగరంలో సంస్థ ప్రధాన కార్యాలయం ఒక జనావాస అపార్ట్మెంట్లో ఉంది. అక్కడ ఒక కిటికీకి బీఏసీ కన్సల్టింగ్ అనే స్టిక్కర్ తప్పితే అక్కడ ఏమీ లేదని అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు తేల్చారు.గతంలోనూ సాంకేతికతను వాడిన ఇజ్రాయెల్పేజర్కాకుండా గతంలో ఇలాగే వస్తువుల్లో పేలుడు పదార్థాలను అమర్చి శత్రువులను అంతంచేసిన చరిత్ర మొస్సాద్‌కు ఉంది. టెక్నాలజీ సాయంతో పేలుళ్లు జరిపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. 1996లో హమాస్ కీలక బాంబ్మేకర్ యాహ్యా అయాస్ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ పేలుడు పదార్థాన్ని మొబైల్ ఫోన్లో అమర్చింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ షిన్‌బెట్ గతంలో యాహ్యా ఫోన్లో 15 గ్రాముల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని నింపింది. తండ్రికి అయాష్ ఫోన్ కాల్ చేసినప్పుడు ఫోన్ మాట్లాడేది అయాష్ అని నిర్ధారించుకున్నాక దానిని పేల్చి అయాస్ను అంతంచేశారు. రిమోట్ ద్వారా నియంత్రించే కృత్రిమమేధతో పనిచేసే మిషిన్గన్తో ఇరాన్ అణు శాస్త్రవేత్త, ఉప రక్షణ మంత్రి మోసెన్ ఫక్రిజాదేను 2020లో హతమార్చింది. ఇజ్రాయెల్ 2021లో ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్లను హ్యాక్ చేసి దేశవ్యాప్తంగా చమురు సరఫరాను స్తంభింపజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌లోని రెండు ప్రధాన గ్యాస్ పైప్లైన్లను పేల్చి పలు నగరాల సేవలకు అంతరాయం కలిగించింది. జూలైలో టెహ్రాన్‌లోని ఒక అతిథిగృహంలోని గదిలో నెలల క్రితమే శక్తివంతమైన బాంబును అమర్చి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాను హతమార్చింది.– నేషనల్ డెస్క్, సాక్షి -
Israel Hezbollah War: నిన్న పేజర్లు నేడు వాకీ టాకీలు
బీరుట్: వాకీటాకీలు, సౌర విద్యుత్ వ్యవస్థల పేలుళ్లతో లెబనాన్ దద్దరిల్లింది. గాజా స్ట్రిప్‌పై భీకర భూతల, గగనతల దాడులతో తెగబడిన ఇజ్రాయెల్ తాజా తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిందని బుధవారం నాటి అనూహ్య పేలుళ్ల స్పష్టమైంది. హెజ్బొల్లా సాయుధులు విరివిగా వాడే పేజర్లు పేలి 24 గంటలు గడవకముందే లెబనాన్‌లో బుధవారం వాకీటాకీలు, సౌరవిద్యుత్ వ్యవస్థలు పేలిపోయాయి. ఈ అనూహ్య పేలుళ్ల ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 450 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పేజర్ల పేలుళ్లతో 13 మంది చనిపోయి 2,800 మంది రక్తమోడిన తరుణంలో మరో ‘సాంకేతిక’ పేలుళ్ల పర్వానికి దిగి ఇజ్రాయెల్ కొత్త యుద్ధతంత్రానికి తెరలేపిందని అంతర్జాతీయంగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. గాజా స్ట్రిప్‌లో దాదాపు మొత్తం భూభాగాన్ని జల్లెడపట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు తన లక్ష్యాన్ని లెబనాన్‌కు మార్చుకుందని తాజా ఉదంతం చాటుతోంది. అంతిమయాత్ర వేళ పేలుళ్లు పేజర్ల పేలుళ్లలో మరణించిన ముగ్గురు హెజ్బొల్లా సభ్యులు, ఒక చిన్నారి అంతిమయాత్రలు బీరుట్ శివారులోని దహియేలో కొనసాగుతున్నపుడే వాకీటాకీలు పేలడం గమనార్హం. ‘‘బీరుట్లో చాలా చోట్ల వాకీటాకీలు పేలాయి. ఎల్రక్టానిక్ పరికరాలు పేలిన ఘటనల్లో 9 మంది చనిపోయారు’’ అని లెబనాన్ ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. బీరుట్ నగరంతోపాటు లెబనాన్‌లో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయని హెచ్»ొల్లా ప్రతినిధులు చెప్పారు. వాయవ్య తీర పట్టణమైన సిడాన్లో ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ దుకాణం వాకీటాకీల పేలుడుకు ధ్వంసమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రక్తమోడుతూ వందలాది మంది ఆస్పత్రులకు పోటెత్తుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో కనిపించాయి. ‘‘ఇలాంటిది నేనెప్పడూ చూడలేదు. గాయపడిన వారిలో చాలా మందికి చేతివేళ్లు తెగిపోయాయి. కళ్లు దెబ్బతిన్నాయి’’ అని బీరుట్‌లోని దీయూ ఆస్పత్రిలో వైద్యురాలు నౌర్ ఎల్ ఓస్తా చెప్పారు. ‘‘ వరుస అనూహ్య పేలుళ్లతో ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి ఆజ్యంపోస్తున్నాయి’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.దాడికి ఇదే సరైన సమయమా? వేలాది మంది హెజ్బొల్లా సైనికులు గాయాలపాలై ఆస్పత్రులకు పరిమితమయ్యారు. పేజర్ల పేలుడుతో హెజ్బొల్లాలో కమ్యూనికేషన్ నెట్వర్క్ కోలుకోనంతగా దెబ్బతింది. వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లతో పౌరుల్లో ఆందోళనల నడుమ దేశంలో శాంతిభద్రతలపై లెబనాన్ దృష్టిపెట్టాల్సిఉంది. ఈ తరుణంలో దాడి చేస్తే శత్రువును భారీగా దెబ్బ కొట్టవచ్చని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ గడ్డపై వరుస పేలుళ్లతో ఆగ్రహించిన లెబనాన్, హెజ్బొల్లా సాయుధాలు దాడులకు తెగబడొచ్చన్న ఇజ్రాయెల్ భావించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా లెబనాన్ సరిహద్దు ప్రాంతాలకు ఇజ్రాయెల్ అదనపు బలగాలను తరలించింది. అక్టోబర్ 8న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దమనకాండ మొదలైననాటి నుంచి ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు చేస్తోంది. ఉద్రిక్తతలను ఆపండి: ఐరాస లెబనాన్ వాకీటాకీల పేలుళ్ల ఘటనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తచేసింది. ‘‘ పరిస్థితి చేయిదాట కుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలి’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ‘‘ బందీలను విడిచిపెట్టి శాంతి స్థాపనకు కట్టుబడాలి. ఎల్రక్టానిక్ పరికరాల పేలుళ్లకు పాల్పడటం చూస్తుంటే ఇది భారీ సైనిక చర్యకు కసరత్తులా తోస్తోంది’’ అని గుటెరస్ వ్యాఖ్యానించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ చెప్పారు. యుద్ధంలో కొత్త దశ మొదలైంది: ఇజ్రాయెల్వాకీటాకీల ఉదంతం తర్వాత రమాట్ డేవిడ్ వైమానిక స్థావరంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్ మాట్లాడారు. ‘‘ యుద్ధంలో కొత్త దశకు తెరలేపుతున్నాం. యుద్ధక్షేత్ర కేంద్ర స్థానం ఉత్తరం నుంచి దిశ మార్చుకుంటోంది. మాకు ఇప్పుడు స్థిరత్వం అవసరం. బలగాలు, వనరులను వేరే లక్ష్యం వైపు వినియోగించే అవకాశముంది. బుధవారం అద్భుత ఫలితాలు సాధించాం’’ అని సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అత్యున్నత స్థాయి భద్రతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హెజ్బొల్లాపై అదనపు దాడులకు సిద్ధమవుతున్నామని చెప్పారు. దీంతో లెబనాన్‌తో పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోందని అర్థమవుతోంది. కాగా, వరుస పేలుళ్లపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలని ఐరాస మానవహక్కుల సంస్థ చీఫ్ వోకర్ టర్క్ డిమాండ్‌చేశారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
పేజర్లే బాంబులై...
బీరూట్: ఇజ్రాయెల్‌కు తమ ఆనుపానులు చిక్కొద్దనే ఉద్దేశంతో వాడుతున్న పేజర్లు చివరికి హెజ్బొల్లా మిలిటెంట్ల ప్రాణాలకే ముప్పు తెచి్చపెట్టాయి. మంగళవారం దేశంలో పలు ప్రాంతాల్లో వేలాది పేజర్లు ఉన్నపళాన పేలిపోయాయి. ఈ వింత పేలుళ్లలో కనీసం 2,800 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘కనీసం 200 మందికి పైగా ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటిదాకా 9 మంది మృత్యువాత పడ్డారు’’ అని ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియద్ తెలిపారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాలన్నీ హెజ్బొల్లా కంచుకోటలే. రాజధాని బీరూట్‌లో పలుచోట్ల జనం తమ చేతులు, ప్యాంటు జేబులు, బెల్టుల్లోని పేజర్లు పేలి గాయాలపాలవుతున్న వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆస్పత్రుల్లో ఎ మర్జెన్సీ వార్డులన్నీ క్షతగాత్రులతో నిండిపోతున్నట్టు స్థానిక ఏపీ ఫొటోగ్రాఫర్లు తెలిపారు. ప్రధానంగా నడుము, కాళ్లకు గాయాలైనట్టు చెప్పారు. లెబనాన్‌లోని తమ రాయబారి కూడా పేజర్ పేలి గాయపడ్డ ట్టు ఇరాన్ ధ్రువీకరించింది. సిరియాలోనూ పేజర్ పేలుళ్లు జరిగాయి. ప్రతీకారం తప్పదు: హెజ్బొల్లా ఇది కచి్చతంగా ఇజ్రాయెల్ పనేనని హెజ్బొల్లా మండిపడింది. ప్రతీ కారం తప్పదంటూ ప్రకటన విడుదల చేసింది. మిలిటెంట్లు వాడుతున్న పేజర్లనే ఇజ్రాయెల్ వారిపైకి ఆయుధాలుగా మార్చి ప్రయోగించిందని ఏపీ అభిప్రాయపడింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో అవి ఏకకాలంలో పేలేలా చేసిందని చెప్పుకొచి్చంది. దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. సెల్ ఫోన్లు వాడితే తమ కదలికలను ఇజ్రాయెల్ కనిపెడుతుందనే భయంతో వాటి వాడకాన్ని హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా గతంలోనే ఆదేశించారు. దాంతో కమ్యూనికేషన్ కోసం మిలిటెంట్లు పేజర్లు వాడుతున్నారు. ఆ క్రమంలో ఇటీవల కొనుగోలు చేసిన కొత్త బ్రాండ్ పేజర్లే పేలాయని హెజ్బొల్లా ప్రతినిధి చెప్పుకొచ్చారు. ‘‘అవి ముందుగా వేడెక్కాయి. కాసేపటికే పేలిపోయాయి. వాటిలోని లిథియం బ్యాటరీలే కొంపముంచినట్టున్నాయి’’ అంటూ వాపోయారు. శత్రువు పని పట్టడంలో ఆరితేరిన ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఇలా వినూత్నంగా ప్లాన్ చేసిందన్న వ్యాఖ్యలు విని్పస్తున్నాయి. -
రూటు మార్చిన ఇజ్రాయెల్.. టపాసుల్లా పేలిన హిజ్బుల్లా ఉగ్రవాదుల పేజర్లు
బీరుట్: లెబనాన్ దేశంలో హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా దాడి జరిగింది. ఒకే సమయంలో జరిగిన దాడిలో పేజర్లు వినియోగించే వెయ్యిమంది హిజ్బుల్లా ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి సైతం గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. నిత్యం క్షిపణులు, వందలాది డ్రోన్లతో బీభత్సం సృష్టించే ఇజ్రాయెల్ ఈసారి రూటు మార్చింది. టెక్నాలజీని ఉపయోగించి దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఇరాన్ మద్దతుగల లెబనాన్ దేశంలోని హిజ్బుల్లా ఉగ్రవాదుల వద్ద ఉన్న వేలాది కమ్యూనికేషన్ పరికరాలు (పేజర్లు) వరుసగా పేలాయి. ఈ పేలుళ్లలో ప్రజలు, వైద్యులు, వెయ్యి మందికి పైగా హిజ్బుల్లా సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లు అతిపెద్ద భద్రతా ఉల్లంఘన గా హిజ్బుల్లా ప్రతినిధులు తెలిపారు. లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో ప్రాథమికంగా పేలుళ్లు జరిగాయి. అలా పేలుళ్లు జరిగిన 30 నిమిషాల తర్వాత కూడా పేలుళ్లు తీవ్రత మరింత పెరిగిందని, గాయపడ్డ గాయపడ్డ క్షత గాత్రులకు తరలించేందుకు అంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కోసం పేజర్లు వినియోగిస్తుంటారు. ఆ పేజర్లతో బహిరంగ ప్రదేశాలకు వెళుతుంటారు. అలా వెళ్లిన హిజ్బుల్లా ఉగ్రవాదుల వద్ద ఉన్న వెయ్యికి పైగా పేజర్లు టపాసుల్లా పేలాయి. ఈ పేలుడు వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తమ హస్తం ఉందని ఇజ్రాయెల్ ప్రకటించలేదు. -
ఇజ్రాయెల్‌తో యుద్ధం... లెబనాన్ తరమా?
నాలుగైదు రోజుల నాటి ముచ్చట. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు ఇటీవల ఇజ్రాయెల్‌పై భారీ దాడికి సిద్ధపడ్డారు. కానీ దీన్ని ఇజ్రాయెల్ ముందే పసిగట్టింది. వాళ్లు కాలూచేయీ కూడదీసుకోకముందే వందలాది యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై మెరుపుదాడి చేసింది. అనంతర అందుకు ప్రతిగా హెజ్బొల్లా కూడా వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డా ఆ దాడులను సమర్థంగా కాచుకుంది. ఈ ఉదంతం పశి్చమాసియాలో ఇప్పటికే చెలరేగుతున్న యుద్ధ జ్వాలలను మరింతగా ఎగదోసింది. ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి లెబనాన్ సిద్ధపడుతోందంటూ జోరుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ వంటి అజేయ సైనిక శక్తిని ఓడించే సత్తా లెబనాన్‌కు ఉందా? దేశ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరిస్తుందా...?! లెబనాన్ చాన్నాళ్లుగా పెను రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అప్పుల కుప్ప కొండంత పెరిగిపోయింది. దేశంలో సరైన విద్యుత్ సరఫరా వ్యవస్థకే దిక్కు లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ సరేసరి. పేదరికం విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగి నెగ్గుకు రావడం లెబనాన్ సాధ్యపడే పని కాదంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఇరు దేశాలు నెల పాటు భీకరంగా తలపడ్డాయి. చివరికది అర్ధంతరంగా ముగిసినా లెబనాన్‌కు తీరని నష్టాలే మిగిల్చింది.దశాబ్దాల అవినీతి, రాజకీయ అస్థిరత లెబనాన్‌లో చాన్నాళ్లుగా రాజకీయ అస్థిరత నెలకొంది. అవినీతి పెచ్చరిల్లింది. అభివృద్ధి పూర్తిగా కుంటువడింది. ఆధునీకరణకు నోచుకోక బ్యాంకింగ్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ డీజిల్ జనరేటర్ ఆపరేటర్లు, చమురు సంస్థల చేతుల్లో చిక్కుకుపోయింది. ప్రభుత్వ సంస్థలు కూడా అంతర్జాతీయ రుణదాతల దయాదాక్షిణ్యాలపై నెట్టుకొస్తున్న పరిస్థితి! ఆర్థిక సాయానికీ, ఆహారానికీ విదేశాల మీదే ఆధారపడుతోంది. కోవిడ్ సంక్షోభం దెబ్బకు 2020 నుంచి లెబనాన్ పరిస్థితి పెనంనుంచి పొయ్యిలోకి చందంగా మారింది. బీరూట్ నౌకాశ్రయంలో రసాయన నిల్వల భారీ పేలుడు దెబ్బకు వాణిజ్య రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అంతో ఇంతో ఆదుకుంటున్న పర్యాటక రంగమూ ఇజ్రాయెల్ దాడులతో నేల చూపులు చూస్తోంది.నిల్వలు 3 నెలలకు మించవ్! 2022లో ఇజ్రాయెల్ దాడుల్లో ధాన్యాగారాలు చాలావరకు ధ్వంసం కావడంతో లెబనాన్ ఆహార నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయింది. దాంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతూ నెట్టుకొస్తోంది. ‘‘ఆహార, చమురు నిల్వలు దాదాపు నిండుకున్నాయి. రెండు మూడు నెలలకు మించి లేవు. అవీ అయిపోతే పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉంది’’ అని అంతర్జాతీయ సహాయ సంస్థ మెర్సీ కార్ప్స్ ఆందోళన వ్యక్తం చేసింది. రన్‌వేల పాక్షిక పునరుద్ధరణ తర్వాత ఎయిర్పోర్ట్ కాస్త అందుబాటులో వచి్చంది. శరణార్థుల బెడద లెబనాన్‌కు ఉన్న ఏకైక విమానాశ్రయాన్ని 2006లో ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేసింది. దాంతో సరుకు వాయు రవాణాను పూర్తిగా బ్రేకులు పడ్డాయి. నాటి దాడుల్లో మౌలిక వసతులన్నీ ధ్వంసమై లెబనాన్‌కు ఏకంగా రూ.26 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది! ఇజ్రాయెల్ గనక ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయి దాడికి దిగితే లెబనాన్ఇంకెంతటి నష్టం చవిచూడాల్సి ఉంటుం దో అనూహ్యమే. పైగా 2006 యుద్ధమప్పుడు శరణార్థుల బాధ లేదు. సిరియాలో అంతర్యుద్ధం దెబ్బకు ఇటీవల కోటి మందికి పైగా లెబనాన్‌కు పోటెత్తారు. ఈ శరణార్థులకు అందుతున్న అంతర్జాతీయ సాయం కూడా ఆగి ఆర్థిక భారం మరీ పెరిగింది.ఐరాస పెదవి విరుపు డ్రోన్ల వాడకంతో ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులు సమూలంగా మారిన నేపథ్యంలో ఈసారి ఇజ్రాయెల్‌తో యుద్ధమంటూ వస్తే మరింత భీకరంగా ఉండొచ్చు. అందుకు కావాల్సిన సన్నద్ధత లెబనాన్‌కు ఏమాత్రమూ లేదని ఐరాస, లెబనాన్ సంయుక్త ముసాయిదా పత్రమే పరోక్షంగా తేల్చేయడం విశేషం. అదేం చెప్పిందంటే... → గాయపడే సైనికులు, పౌరుల కోసం ఆస్పత్రుల్లో ఔషదాలు, అత్యవసర చికిత్స, సదుపాయాలను భారీగా సమకూర్చుకోవాలి. → 2006లో మాదిరి చిన్నపాటి యుద్దమైనా కనీసం 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. → వారికి కనీస సదుపాయాల కల్పనకు నెలకు కనీసం రూ.420 కోట్లు కావాలి. → అదే పూర్తిస్థాయి భీకర యుద్ధమైతే కోటి మందికి పైగా శాశ్వతంగా నిర్వాసితులైపోతారు. → అప్పుడు వారి బాగోగులకు ఎంత లేదన్నా నెలకు రూ.838 కోట్లు కావాలి. → కొన్ని నెలలుగా ఇజ్రాయెల్–హెజ్బొల్లా పరస్పర దాడుల దెబ్బకు సరిహద్దు ప్రాంతాల్లోని లక్ష మంది ఇప్పటికే వేరే చోట్లకు తరలారు. వారి బాగోగులకు నెలకు రూ.209 కోట్ల కోసమే లెబనాన్ నానా ఆపసోపాలు పడుతోంది.తలకు మించిన నానారకాల సమస్యలతో లెబనాన్ ఇప్పటికే తీవ్రంగా సతమతమవుతోంది. ఇంట గెలవలేని ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగి నెలా నెగ్గుకురాగలదు? చైనా, రష్యా, ఇరాన్ నుంచి సమీకరించిన ఆయుధ సంపత్తి భారీగానే ఉన్నా ఇజ్రాయెల్ దాడులను హెజ్బొల్లా మిలిటెంట్లు తట్టుకుని నిలవడం దుస్సాధ్యమే’’ – అంతర్జాతీయ పరిశీలకులు– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య మిసైల్స్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మిసైల్స్‌తో మెరుపుదాడి చేసింది. హిజ్బుల్లా ఉగ్రసంస్థ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎందుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం లెబనాన్‌లో ముందస్తు దాడులను చేపట్టింది. సుమారు 40 మిసైల్స్‌ను లెబనాన్‌పై ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా వెంటనే స్పందించిన హిజ్బుల్లా ఉగ్రసంస్థ.. ఇజ్రాయెల్‌పై సుమారు 320 కట్యూషా రాకెట్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.🇮🇱 🇱🇧 Following large scale attacks on Hezbollah, Israel has stated that in conjunction with the U.S., intelligence was uncovered pointing to an imminent large scale attack. Throughout Tel Aviv and Jerusalem shelters have been opened, airports have suspended normal procedures,… pic.twitter.com/9skRJyAWUe— Americas News (@AmericasNewsCO) August 25, 2024 ‘‘తమ సైనిక కమాండర్ ఫువాద్ షుక్ర్ హత్యకు ప్రతిస్పందనగా ఈ దాడులకు దిగాం. ప్రత్యేక సైనిక స్థావరాలే లక్ష్యంంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర సైనిక స్థావరాలపై దాడి చేశాం’’ అని ఉగ్రసంస్థ హిజ్బుల్లా ఓ ప్రకటనలో పేర్కొంది.దీంతో ఇజ్రాయెల్‌లో 48 గంటల పాటు అత్యవసర పరిస్థితిని రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ప్రకటించారు. అయితే హిజ్బుల్లా లక్ష్వంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ముందు రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి ఫోన్ లాయిడ్ ఆస్టిన్‌తో మాట్లడినట్లు తెలుస్తోంది. ‘‘ఇజ్రాయెల్ పౌరులపై దాడుల ముప్పును అడ్డుకోవడానికి లెబనాన్‌లోని హిజ్బుల్లా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించాం. బీరూట్‌లోని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇజ్రాయెల్ పౌరుల రక్షణ కోసం మేము అన్ని మార్గాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాం’’ అని గాలంట్ పేర్కొన్నట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా వెల్లడించింది.JUST IN ⤵️⤵️pic.twitter.com/0QG60D787QHundreds #Hezbollah rocket and drone attacks targeting northern #Israel https://t.co/OktRoPt9g4— -🇦🇺|🇺🇲- (@KINGDEMANACATOS) August 25, 2024 ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులతో భారీగా ప్రాణ, ఆస్తినష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో.. మరో యుద్ధం మొదలైతే మరింత ప్రమాదం తప్పదన్న తీవ్ర భయాందోళనలు గతకొంత కాలంగా వ్యక్తమవుతున్నాయి. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై అప్పుడప్పుడూ దాడులకు దిగిన హిజ్బుల్లా ప్రస్తుత దాడుల తీవ్రతను గమనిస్తే.. నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.☄️#BREAKING We have FOOTAGE of ENDLESS Rocket 🚀 attacks HAPPENING NOW in Israel!They are under ATTACK!#Israel#Lebanon pic.twitter.com/0ztlimgxH1— Galaxy News United(GNU) (@GalaxyNewsUnit) August 25, 2024 -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల దాడి
బీరుట్: ఇజ్రాయెల్‌పై లెబనాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ప్రతీకార దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై హెజ్బొల్లా రాకెట్లతో విరుచుకుపడుతోంది. ఇటీవలే ఇజ్రాయెల్‌పై సుమారు 200 రాకెట్లను ప్రయోగించిన హెజ్బొల్లా తాజాగా బుధవారం(ఆగస్టు21) యాభైకిపైగా రాకెట్లతో దాడులు జరిపింది.ఈ రాకెట్ల దాడిలో గొలాన్ హైట్స్‌లో ఉన్న ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఓ పక్క ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రయత్నాలు జరుపుతుండగా మరోపక్క హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.మంగళవారం లెబనాన్‌పై ఇజజ్రాయెల్ దాడులకు ప్రతిగా తాము తాజా రాకెట్ దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్ మృతిచెందినప్పటి నుంచి మిలిటెంట్ సంస్థ ప్రతీకార దాడులు చేస్తోంది. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి... 10 మంది మృతి
బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 10 మంది సిరియన్ దేశస్తులు ప్రాణాలు కోల్పోయారు. నబాటియే ప్రావిన్స్‌లోని వదీ అల్–కె¸ûర్‌పై ఈ దాడి జరిగింది. మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ఆయుధ డిపో లక్ష్యంగా దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ ప్రాంతంలో సామగ్రి తయారీ యూనిట్ ఉందని స్థానికులు తెలిపారు. బాధితులంతా సిరియా నుంచి వచ్చి ఆశ్రయం పొందుతున్నవారేనన్నారు. -
లెబనాన్‌పై దాడుల నియంత్రణకు అమెరికా దౌత్యం
ఇంతవరకూ పాలస్తానాలోని గాజాకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుధ్దం ఇప్పుడు లెబనాన్‌కూ పాకింది. ఇది తీవ్రరూపం దాల్చకుండా ఉండేందుకు అమెరికా తన ప్రయత్నాలను ప్రారంభించింది.ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌పై జరిగిన రాకెట్ దాడిలో 12 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దీనిని నిరోధించేందుకు యునైటెడ్ స్టేట్స్ రంగంలోకి దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది. ఈ నేపధ్యంలో దీనికి ప్రతీకారంగా లెబనాన్‌లోని బీరుట్ లేదా ఇతర లెబనీస్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు తెగబడకుండా ఉండేందుకు అమెరికా తన దౌత్యపరమైన ప్రయత్నాలను ప్రారంభించిందని రాయిటర్స్ పేర్కొంది.అమెరికాకు చెందిన ఇద్దరు దౌత్య అధికారులు రాయిటర్స్‌తో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతోందని, ఇది బహుశా చాలా రోజుల పాటు కొనసాగవచ్చని అన్నారు. అయితే తాము ఇజ్రాయెల్‌ను పరిమిత ప్రతీకార చర్యలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. లెబనాన్‌లోని బీరుట్‌తో పాటు హిజ్బుల్లా ఆధిపత్యం కలిగిన దక్షిణ శివారు ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలు, జనసాంద్రత కలిగిన ప్రాంతాలపై దాడులకు దిగవద్దని ఇజ్రాయెల్‌ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్, డిప్యూటీ పార్లమెంట్ స్పీకర్ ఎలియాస్ బౌ సాబ్తో సహా లెబనీస్ అధికారులు యుద్ధం విషయంలో సంయమనం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. పౌర నివాసిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్ తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా హెచ్చరించింది.లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను అదుపు చేసేందుకు అమెరికా, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరమైన చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ.. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ప్రమాదాన్ని తగ్గించేందుకు నడుంబిగించారు. -
లెబనాన్‌లో యుద్ధమేఘాలు.. పౌరులకు భారత్ అడ్వైజరీ
న్యూఢిల్లీ: గాజాకు పరిమితమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తాజాగా లెబనాన్‌కూ పాకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్‌పై లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా దాడి చేయడమే ఇందుకు కారణం. హెజ్బొల్లా దాడికి ప్రతిగా లెబనాన్‌పై ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడి చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్‌లోని బీరుట్ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో లెబనాన్‌లోని భారత రాయబారకార్యాలయం అప్రమత్తమైంది. లెబనాన్‌లో ఉంటున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని బీరుట్‌లోని తమ కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తాజా అడ్వైజరీ జారీ చేసింది. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వాతావరణం ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లోని మజదల్ షమ్స్‌పై హెజ్బొల్లా దాడి చేసింది. ఈ దాడిలో ఓ 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణమైంది. ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై సోమవారం(జులై 29) డ్రోన్లతో దాడి మొదలుపెట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్: లెబనాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆదివారం(మార్చ్ 24) తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపింది. మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ప్రాంతమైన బల్బీక్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు బల్బీక్ మేయర్ తెలిపారు. ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్‌పై డ్రోన్లతో దాడులు జరిపినట్లు హెజ్బొల్లా ప్రకటించిన గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి 50 రాకెట్లు తమవైపు వచ్చినందునే దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ రాకెట్లలో కొన్నింటిని కూల్చివేశామని, మరికొన్ని మనుషులు లేని చోట పడిపోయాయని వెల్లడించింది. కాగా, మార్చ్ 12న బల్బీక్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా 20 మంది దాకా గాయపడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగిపోయాయి. ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
లెబనాన్: ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురి మృతి
జెరూసలెం: దక్షిణ లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో అయిదుగురు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని లెబనాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వీరిలో తల్లిదండ్రులు సహా ఇద్దరు పిల్లలున్నారు. మరణించిన వారిలో మహిళ ప్రస్తుతం గర్భవతి. ఇజ్రాయెల్ దాడిలో ఇళ్లంతా ధ్వంసమైంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివసించేవారు తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. గత వారంలోనూ దక్షిణ లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఓ జంటతో పాటు వారి కుమారుడు మృతి చెందాడు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులు చేసి వందల మందిని చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అటు గాజాలో హమాస్ ఇటు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 30,960 మంది మరణించగా లెబనాన్‌లో 312 మంది హెజ్బొల్లా ఫైటర్లు, 56 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. వీలు దొరికినపుడల్లా హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు పలువురు ఇజజ్రాయెల్ సైనికులు సహా సాధారణ పౌరులు మృతి చెందారు. ఇదీ చదవండి.. పాక్ అధ్యకక్షుడిగా జర్దారీ -
గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రయెల్‌పై సోమవారం ఓ క్షిపణి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో జరిగిన ఈ దాడి.. లెబనాన్‌కు చెందిన హెజ్జుల్లా మిలిటెంట్ గ్రూప్ పనిగా తేలింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని మార్గాలియోట్ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఓ భారతీయుడు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ముగ్గురే కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. మరణించిన వ్యక్తిని కేరళలోని కొల్లంకు చెందిన పాట్ నిబిన్ మాక్స్మెల్గా గుర్తించగా.. గాయపడిన ఇద్దరిని జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌లుగా గుర్తించారు, ఇద్దరు ఇడుక్కికి చెందగా..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా 31 ఏళ్ల పాట్ నిబిన్ రెండు నెలల కిత్రమే ఇజ్రాయెల్ వెళ్లారు. అతడి భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. వీరికి అయిదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే తన భర్త, తండ్రికి అవే చివరి చూపులు అవుతాయని ఇద్దరూ ఊహించి ఉండరేమో.. ఈ దాడిపై నిబిన్ తండ్రి పాథ్రోస్ మాట్లాడుతూ.. తన పెద్ద కొడుకు ఇజ్రాయెల్ వెళ్లడంతో చిన్న కుమారుడైన నిబిన్ కూడా వారం రోజుల వ్యవధిలోనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ముందు మస్కట్, దుబాయ్ వెళ్లి ఇంటికి వచ్చిన అతడు అనంతరం రెండు నెలల కిత్రం ఇజ్రాయెల్ వెళ్లినట్లు తెలిపారు. తన కోడలు ద్వారా కొడుకు మృతి చెందినట్లు తెలిసినట్లు చెప్పారు. ‘సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె నాకు ఫోన్ చేసి, నిబిన్ దాడిలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. తరువాత అర్ధరాత్రి 12.45 గంటలకు, అతను మరణించినట్లు మాకు సమాచారం వచ్చింది. నిబిన్ నాలుగున్నరేళ్ల కుమార్తెను, అతని భార్య(ఏడు నెలల గర్భవతి)ని వదిలి ఇజ్రాయెల్ వెళ్లాడు. అన్ని లాంఛనాలు పూర్తయ్యాక నిబిన్ మృతదేహాన్ని నాలుగు రోజుల్లో కేరళకు తీసుకురానున్నారు’ అని పేర్కొన్నారు. భారత్ అడ్వైజరీ జారీ ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో తొలిసారి భారతీయ వ్యక్తి మరణించడంతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు.. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరిపి.. భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఖండించిన ఇజ్రాయెల్ ఈ దాడిని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఖండించింది. పండ్లతోటను సాగు చేస్తున్న వ్యవసాయ కార్మికులపై షియా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా జరిపిన ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలోన్ మాక్స్వెల్ సోదరుడితో మాట్లాడి, అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. -
Israeli-Hezbollah War: కాల్చేసే కాంతిపుంజం!
లెబనాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? పక్కలో బల్లెంలా మారిన హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకుందా? హెజ్బొల్లా ఉగ్రవాదుల డ్రోన్లు, రాకెట్లను కూల్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘ఐరన్ బీమ్’ తొలిసారిగా రంగప్రవేశం చేయనుందా? ఇజ్రాయెలీలకు ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. హెజ్బొల్లాతో యుద్ధం మొదలైతే ఇజ్రాయెల్ ప్రజలకు కొన్ని రోజులపాటు విద్యుత్ సంక్షోభం తప్పదన్న హెచ్చరికల పత్రం దేశ న్యాయ శాఖలో రౌండ్లు కొడుతున్నట్టు ‘ద జెరూసలెం పోస్ట్’ ఓ కథనం ప్రచురించింది. చాలా ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు రోజుల దాకా కరెంటు సరఫరా ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ అథారిటీ కూడా పేర్కొంది. ప్రజలు ఆహారం, నీరు, బ్యాటరీ వంటివి దగ్గరుంచుకోవాలని సూచించింది...! ప్రపంచంలోనే తొలిసారి! ఐరన్ బీమ్. ఉగ్రవాదుల రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి క్షణాల్లో కాల్చి బూడిదగా మార్చే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. తీవ్రమైన కాంతిపుంజపు ఉష్ణశక్తితో కూడిన ఈ వినూత్న సాంకేతిక ఆయుధాల గురించి వినడమే తప్ప ఇప్పటిదాకా ఏ దేశమూ ప్రయోగించలేదు. చెప్పాలంటే ప్రయోగాత్మక దశలో ఉన్న టెక్నాలజీ ఇది. ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్సుడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇది స్టార్ ట్రెక్, స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని ఆయుధాల్లా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ‘డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’గా వ్యవహరించే ఈ కొంగొత్త వ్యవస్థను 2014 ఫిబ్రవరి 11న సింగపూర్ ఎయిర్ షోలో ప్రదర్శించారు. పాలస్తీనీ హమాస్, లెబనీస్ హెజ్బొల్లా ఉగ్ర సంస్థలతో తాజా ఘర్షణలు, యుద్ధం నేపథ్యంలో దీన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించనుందని తెలుస్తోంది. ఇలా పని చేస్తుంది... యారో–2, యారో–3, డేవిడ్స్ స్లింగ్, ఐరన్ డోమ్ తర్వాత ఇజ్రాయెల్ అమ్ములపొదిలో సరికొత్త ఆగ్నేయాస్త్రం ఐరన్ బీమ్. ఇది ఫైబర్ లేజర్ ఆధారంగా పనిచేస్తుంది. ఐరన్ డోమ్‌తో పోలిస్తే ఐరన్ బీమ్ చిన్నది, తేలికైనది. రహస్యంగా ప్రయోగించడానికి, ఒక చోట నుంచి మరో చోటికి తరలించడానికి మరింత అనువైనది. ఐరన్ డోమ్ కూడా ఇజ్రాయెల్ స్వల్పశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థే. కానీ ఇటీవలి హమాస్ రాకెట్ దాడులను నిలువరించడంలో విఫలమైంది. ఇప్పుడు డోమ్‌కు బీమ్‌ను జతచేసి సత్ఫలితాలు రాబట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఐరన్ బీమ్కూ పరిమితులు లేకపోలేదు. తడి వాతావరణ పరిస్థితుల్లో ఈ లేజర్ వ్యవస్థ పనిచేయదు. ఎంతటి సానుకూల పరిస్థితులున్నా వాతావరణంలోని తేమ వల్ల 30% నుంచి 40% వరకు శక్తిని లేజర్ కోల్పోతుంది. అలాగే ధ్వంసం చేయాల్సిన లక్ష్యం ఐరన్ బీమ్ దృష్టి రేఖకు సూటిగా ఉండాలి. నేరుగా కంటికి కనిపించకుండా, బీమ్‌కు సూటిగా కాకుండా లక్ష్యం ఎక్కడో నక్కి ఉంటే లేజర్ కిరణాలతో నాశనం చేయడం అసాధ్యం. పైగా ఐరన్ బీమ్ ఫైరింగ్ రేటు కూడా తక్కువ. లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి సరిపోయేంత లేజర్ శక్తిని ప్రయోగించాలంటే కనీసం 5 సెకన్లు, అంతకు మించి సమయం కావాలి. అయినప్పటికీ శత్రు క్షిపణులను గగనతలంలోనే అడ్డుకుని కూల్చేసే సంప్రదాయ ఇంటెర్సెప్టర్ క్షిపణులతో పోలి్చతే ఐరన్ బీమ్ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. ‘ఖర్చు తక్కువ, పనితీరు ఎక్కువ’ అన్నది దీని సూత్రం. పైగా దీన్ని ఎన్నిసార్లైనా పేల్చవచ్చు. ఒక్కో షాట్‌కు అయ్యే వ్యయమూ తక్కువ. ఐరన్ డోమ్‌లో ఒక్కో ఇంటెర్సెప్టర్ రాకెట్‌కు 60 వేల డాలర్ల దాకా అవుతుండగా ఐరన్ బీమ్‌లో మాత్రం ఆ ఖర్చు కేవలం కొన్ని డాలర్లే. అంతేకాదు, ఈ వ్యవస్థలో శత్రు క్షిపణిని ఢీకొట్టాక ఇంటెర్సెప్టర్ శకలాలు పడే ముప్పు కూడా ఉండదు. 7 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు, మోటార్ షెల్స్ వంటివాటిని ఐరన్ బీమ్ క్షణాల్లో నిరీ్వర్యం చేయగలదు. దీన్ని 2025 నాటికి మోహరించాలని ఇజ్రాయెల్ భావించినా యుద్ధం అవసరాలతో ఇప్పుడే రంగంలో దించేలా ఉంది. ఐరన్ బీమ్ X లైట్ బీమ్! ఈ రెండు హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలనూ రఫేల్ సంస్థే అభివృద్ధి చేస్తోంది. లైట్ బీమ్ 7.5 కిలోవాట్ల ఇంటెర్సెప్టర్. రెండు కిలోమీటర్ల దూరంలోని చిన్నపాటి మానవరహిత వైమానిక వాహనాలు, నేలమీద అత్యాధునిక మందుపాతరలు, పేలని మందుగుండు తదితరాలను ఇది నిర్వీర్యం చేయగలదు. ఐరన్ బీమ్ 100 కిలోవాట్ల తరగతికి చెందిన హై ఎనర్జీ లేజర్ సిస్టమ్. ఇది రాకెట్లు, శతఘ్నులు, యూఎవీలను కూల్చగలదు. – జమ్ముల శ్రీకాంత్ -
ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్లు
బీరుట్: లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్‌పైకి పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. బీరుట్లో ఉన్న హమాస్ అగ్ర నేత సలెహ్ అరోరీని చంపినందుకు ప్రతీకారం తప్పదంటూ శుక్రవారం హెజ్బొల్లా నేత సయ్యద్ హస్సన్ నస్రల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శనివారం 62 రాకెట్లను ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరోన్లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇవి ఆ కేంద్రాన్ని నేరుగా తాకాయని పేర్కొంది. మెరోన్ వైపు 40 రాకెట్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, నష్టం గురించి ప్రస్తావించలేదు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై జరిపిన దాడుల్లో 122 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 22,722కు చేరుకుందని పేర్కొంది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నారులు, మహిళలేనని వెల్లడించింది. మరో 58,166 మంది క్షతగాత్రులుగా మిగిలారని పేర్కొంది. -
Hezbollah: ఇజ్రాయెల్ సైన్యానికి హెచ్చరిక
హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకరమైన దాడులను కొనసాగిస్తోంది. అయితే మరోవైపు లెబనాన్‌లోని పాలస్తీనా గ్రూప్‌లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. గత అక్టోబర్ 7 నుంచి హమాస్-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హిజ్బుల్లా సంస్థ, ఇజ్రాయెల్‌కు మధ్య కూడా కాల్పులు జరుగుతున్నాయి. సోమవారం ఇజ్రాయెల్ సైన్యాన్ని హిజ్బుల్ సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. సామాన్య ప్రజలపై దాడికి చేస్తే.. అంతకంతకు భారీ మూల్యం చెల్లించుకుంటారని తెలిపింది. అంత్యక్రియల సమయంలో సామన్య ప్రజలపై దాడులు చేస్తే పర్యావసానాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని మండిపడింది. సోమవారం ఓ ఫైటర్ అంత్యక్రియలను హిజ్బుల్లా సంస్థ నిర్వహించింది. అయితే ఈ అంత్యక్రియల్లో పాల్గొనే సామాన్య జనాలే లక్ష్యంగా సమీపంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఇటువంటి సమయంలో సామాన్య ప్రజలపై దాడులకు దిగితే.. తాము కూడా అదే స్థాయిలో ప్రతికారం తీర్చుకుంటామని హిజ్బుల్లా సంస్థ.. ఇజ్రాయెల్ సైన్యాన్ని హెచ్చరించింది. చదవండి: Israel-Hamas war: 24 గంటల్లో 110 మంది దుర్మరణం -
బందీలకు ఇక విముక్తి!
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న దాదాపు 240 మంది బందీలకు త్వరలోనే విముక్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. బందీల్లో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులూ ఉన్నారు. వారందరినీ క్షేమంగా విడిపించడానికి ఇజ్రాయెల్, అమెరికా, ఖతార్ దేశాలు ప్రయత్నాలు వేగవంతం చేశాయి. ఆయా దేశాల ప్రతినిధులు హమాస్‌తో కొన్ని రోజులుగా జరుపుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. బందీలను విడుదల చేయాలంటే ఇజ్రాయెల్ సైన్యం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలని, గాజాలోకి పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అనుమతించాలని, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఫైటర్లను విడుదల చేయాలని హమాస్ షరతు విధించింది. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించినట్లు సమాచారం. బందీలకు స్వేచ్ఛ ప్రసాదించే విషయంలో అతి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని హమాస్ సీనియర్ నాయకుడు ఇజ్జత్ రిష్క్ మంగళవారం వెల్లడించారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తే బందీలను వదిలిపెట్టడానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చామని ప్రవాసంలో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియేహ్ చెప్పారు. ఒప్పందం చివరి దశలో ఉందని ఖతార్ తెలియజేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే గాజా నుంచి బందీలు వారి స్వదేశాలకు చేరడం ఖాయమే. అయితే, హమాస్‌పై ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నోరువిప్పడం లేదు. హమాస్ చెరలో ఉన్న తమ ఆప్తులను విడిపించాలని బందీల కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నిత్యం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశం రాజకీయంగా తనకు చాలా నష్టం కలిగించే ప్రమాదం ఉండడంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నాలుగు మెట్లు కిందికి దిగొచ్చినట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది. హమాస్ షరతులేమిటి? గాజాపై ఐదు రోజులపాటు భూతల, వైమానిక దాడులను ఇజ్రాయెల్ నిలిపివేస్తే బందీల్లో 50 మంది మహిళలు, చిన్నారులను వదిలేస్తామని హమాస్ షరతు విధించినట్లు తెలిసింది. ఆ తర్వాత ముగ్గురు పాలస్తీనియన్ ఖైదీలకు చొప్పున బదులుగా ఒక్కో బందీని విడిచిపెడతామని చెబుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ జైళ్లలో 8 వేల మందికిపైగా పాలస్తీనా ఫైటర్లు శిక్ష అనుభవిస్తున్నారు. వారిని విడిపించుకోవడానికి బందీలను ఎరగా వాడుకోవాలని హమాస్ నిర్ణయించుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు మృతి లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లో మంగళవారం హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించింది. క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఫరా ఒమర్, రబీన్ మామరీ అనే ఇద్దరు జర్నలిస్టులు, మరో ఇద్దరు పౌరులు బలయ్యారు. మృతిచెందిన ఇద్దరు జర్నలిస్టులు లెబనాన్‌కు చెందిన అల్–మయాదీన్ టీవీ చానల్లో పనిచేస్తున్నారు. -
‘సరైన సమయంలో హమాస్‌తో కలుస్తాం’
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న పోరులో హమాస్‌తో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని.. అందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సంస్థ ప్రకటించింది. ‘‘జరుగుతున్న పోరులో భాగం అయ్యేందుకు హిజ్బుల్లా సిద్ధంగా ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు మేం రంగంలోకి దిగుతాం. ఇజ్రాయెల్ వ్యతిరేక పోరులో హమాస్‌తో చేతులు కలుపుతాం. మా ప్రణాళిక ప్రకారమే మేం ముందుకు వెళ్తాం’’ అని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీమ్, బీరూట్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రకటించారు. ‘‘చాలా దేశాలు, అరబ్ దేశాలు, ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్తలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా హిజ్బుల్లాను యుద్ధానికి దూరంగా ఉండమని కోరుతున్నాయి. కానీ, ఆ పిలుపును మేం పట్టించుకోం. ఏం చేయాలో హిజ్బుల్లాకు బాగా తెలుసు. సరైన సమయంలో రంగంలోకి దిగుతాం’’ అని ఖాసీమ్ తెలిపారు. లెబనాన్‌లోని పాలస్తీనా గ్రూప్‌లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ గత కొంతకాలంగా టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. పైగా హిజ్బుల్లా ఉద్యమానికి ఇరాన్ మద్దతు కూడా ఉంది. సోమవారం.. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు ముగ్గురు మరణించారని హిజ్బుల్లా ప్రకటించుకుంది. మంగళవారం.. హిజ్బుల్లా పోస్టుల మీద దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. అదే సమయంలో హమాస్ విభాగం తమపై రాకెట్ దాడి జరిగిందని ప్రకటించింది. బుధవారం.. లెబనాన్ గ్రామం ధైరా వద్ద మోహరించిన ఇజ్రాయెల్ బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు హిజ్బుల్లా ప్రకటించుకుంది. అయితే.. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో హిజ్బుల్లాకు చెందిన ముగ్గురు గాయపడ్డారట. ఈ దాడుల పర్వంలో.. శుక్రవారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో రాయిటర్‌కు చెందిన జర్నలిస్ట్ దుర్మరణం పాలవ్వగా.. మరికొందరు జర్నలిస్టులు గాయపడ్డారు. అయితే ఈ పరిణామంపై ఇజ్రాయెల్ బలగాలు స్పందించాయి. ఇజ్రాయెల్ వైపు జరిగిన దాడులకు ప్రతిగానే.. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఇది చోటు చేసుకుందని తెలిపింది. మరోవైపు శుక్రవారం దక్షిణ బీరూట్‌లో వెయ్యి మంది హిజ్బూల్లా మద్దతుదారులు.. పాలస్తీనా జెండాలతో, బ్యానర్లతో ఊరేగింపు నిర్వహించారు. భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడంటూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. -
ఇజ్రాయిల్ దాడుల్లో రాయిటర్స్ జర్నలిస్టు మృతి, మరో ఆరుగురికి గాయాలు
జెరుసలేం: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో రాయిటర్స్ వార్తా సంస్థకు చెందిన జర్నలిస్టు మృతిచెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఆరుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. జ్రాయిల్ సరిహద్దు దగ్గరున్న అల్మా అల్-షాబ్ సమీపంలో ఆ దేశ మిలిటరీతో పాటు లెబనీస్ మిలిటరీ హిజ్బుల్లా కాల్పులకు పాల్పడుతోంది. అదే ప్రాంతంలో అల్ జెజిరా, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్(ఏఎఫ్‌పీ)కు చెందిన జర్నలిస్టులు లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దిశ నుంచి వచ్చిన మిస్సైల్ దాడిలో రాయిటర్స్ వీడియో జర్నలిస్ట్ ఇస్సామ్ అబ్దల్లా హత్య ప్రాణాలు కోల్పోయాడు. జర్నలిస్టు మృతికి ఇజ్రాయిల్ కారణమని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి ఆరోపించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు తమ జర్నలిస్టు మృతిపట్ల రాయిటర్స్ వార్తా సంస్థ స్పందించింది. సౌత్ లెబనాన్ నుంచి లైవ్ అందిస్తున్న ఇస్సామ్ అబ్దుల్లా మృతిపట్ల సంతాపం ప్రకటించింది. ఇజ్రాయెల్ వైపు నుంచి వస్తున్న క్షిపణి కాల్పులను వీడియో తీస్తుండగా, మరో మిస్సైల్ దూసుకురావడంతోఅతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీనిపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. రాయిటర్స్‌కు చెందిన మరో ఇద్దరు జర్నలిస్టులు అల్ సుడానీ, మహేర్ నజే సైతం గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపింది. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం Video showing the scene before Reuters journalist Issam Abdallah was killed. Journalists clearly marked as journalists, in an open landscape, doing their jobs. Not endorsing the commentary, just sharing the video. pic.twitter.com/weaKiYqFet — Aislinn Laing (@Simmoa) October 14, 2023 ఇదిలా ఉండగా హమాస్ మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య వారం రోజులుగా భీకర పోరు కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ను అంతం చేసి గాజాను చేజిక్కిచుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు బాంబ్‌లు, వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ దాడుల్లో తాజాగా హమాస్‌కు గ్రూపుకు చెందిన వైమానిక దళ నేత మురాద్ అబూ మురాద్‌ను ఇజ్రాయెల్ అంతమొందించింది. శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో మురాద్ చనిపోయినట్లు ఇవాళ ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. వైమానిక కార్యకలాపాలను సాగిస్తున్న హమాస్ ప్రధాన కార్యాలయంపై చేసిన దాడుల్లో మురాద్ హతమైనట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా హమాస్ మిలిటెంట్లకు మురాద్ దిశానిర్దేశం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హ్యాంగ్ గ్లైడర్ల ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌లో అడుగుపెట్టడానికి మురాద్ కారణమని చెబుతున్నారు. -
ఇజ్రాయెల్‌పై సంచలన ఆరోపణలు
హమాస్ ఉగ్రవాదుల్ని ఏరివేసే లక్ష్యంతోనే.. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. గాజాలోని 3,600 హమాస్ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఉద్రిక్తతలు మొదలైన ఈ ఆరు రోజుల్లో.. నాలుగు వేల టన్నుల బరువున్న ఆరు వేల బాంబులను గాజాపై జారవిడిచినట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో అమాయక ప్రజలతో పాటు తమ దగ్గర బందీలుగా ఉన్నవాళ్లు సైతం మృతి చెందినట్లు హమాస్ చెబుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై సంచలన ఆరోపణలు చేసింది న్యూయార్క్‌కు చెందిన హ్యుమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైట్ పాస్ఫరస్ బాంబులు ఉపయోగిస్తోందని ఆరోపించింది. ‘‘అక్టోబరు 10న లెబనాన్‌పై, అక్టోబరు 11న గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన వీడియోలను పరిశీలించాం. వాటిలో వైట్ పాస్ఫరస్ ఆనవాళ్లు ఉన్నాయి. ఇవి పౌరులపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని హ్యుమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం.. గాజాలో వైట్ పాస్ఫరస్ బాంబులు ప్రయోగించలేదని చెబుతోంది. BREAKING: Israel has used white phosphorus in military operations in Gaza and Lebanon, putting civilians at risk of serious and long-term injuries. White phosphorus causes excruciating burns and can set homes afire. Its use in populated areas is unlawful.https://t.co/TbCVA5Qynp pic.twitter.com/4UKANHTwI2 — Human Rights Watch (@hrw) October 12, 2023 2008-09లో గాజాపై వైట్ పాస్ఫరస్ బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. అయితే 2013లో అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా.. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశామని ప్రకటించుకుంది. ఈ క్రమంలో.. తాజాగా మరోసారి ఇజ్రాయెల్ వీటిని గాజాపై ప్రయోగించిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వైట్ పాస్పరస్ బాంబుల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు. దీంతో కొన్ని దేశాలు దాడుల్లో భాగంగా వీటిని ప్రయోగిస్తున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో తమ సైన్యంపై రష్యా వైట్ పాస్ఫరస్ బాంబులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. వైట్ పాస్పరస్ బాంబులు.. భారీగా పొగతో పాటు కాంతిని వెదజల్లుతాయి. యుద్ధంలో ఎక్కువగా బంకర్లు, భవనాలను నాశనం చేసేందుకు పాస్ఫరస్ బాంబులను ఉపయోగిస్తారు. కానీ, వీటి కారణంగా మనిషి ఆరోగ్యం దెబ్బ తింటుందని.. దీర్ఘ కాలిక రోగాలకు కారణమవుతాయని వైద్యరంగ నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. -
ఇక విధ్వంసమే.. 'వైట్ పాస్పరస్ ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడి'
లెబనాన్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర పోరు నడుస్తోంది. ఈ క్రమంలో తెల్ల భాస్వరంతో కూడిన ఆయుధాలను ఇజ్రాయెల్ ఉపయోగిస్తోందని లెబనాన్ మానవ హక్కుల సంఘం ఆరోపించింది. అటువంటి ఆయుధాలను ఉపయోగించడం వల్ల పౌరులు తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ దళాలు.. తాము తెల్ల భాస్వరంను ఉపయోగించలేదని స్పష్టం చేశాయి. అక్టోబర్ 10, 11 తేదీల్లో పేలిన పలు బాంబులకు సంబంధించిన వీడియోలను లెబనాన్ మానవ హక్కుల సంఘం పరిశీలించింది. గాజా ఎయిర్‌పోర్టుతో పాటు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండు చోట్ల తెల్ల భాస్వరం ప్రయోగించినట్లు ఆరోపించింది. వెలువడిన తెల్లని పొగలు వైట్ పాస్పరస్‌కు సంబంధించినవేనని అనుమానం వ్యక్తం చేసింది. 155 మీమీ తెల్లభాస్వరానికి సంబంధించిన ఫిరంగి ఆనవాళ్లను గుర్తించినట్లు ఆరోపించింది. ఈ వీడియోలకు సంబంధించిన దృశ్యాలను పాలస్తీనా టీవీ ఛానళ్లు కూడా బహిర్గతపరిచాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మంది బలయ్యారు. తెల్లభాస్వరంతో తీవ్రమైన గాయాలు ఏర్పాడుతాయి. దీనితో గృహాలకు నిప్పు కూడా పెట్టవచ్చు. ధీర్ఘకాలికంగా రోగాలు ప్రబలుతున్న నేపథ్యంలో తెల్ల భాస్వరాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. దీని ఉపయోగం చట్టంవిరుద్ధం. అయితే.. తెల్ల భాస్వరం ఉపయోగంపై తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుతం ఇజ్రాయెల్ చెబుతోంది. ఇదీ చదవండి: గాజాపై భూతల యుద్ధం! -
ఇజ్రాయెల్‌కు కొత్త ముప్పు.. హమాస్‌తోపాటు మరో రెండు దేశాలతో పోరాటం
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులతో ఇజ్రాయెల్ అతలాకులతమవుతోంది. గాజాస్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’ పేరుతో మెరుపు దాడి చేపట్టింది. కేవలం 20 నిమిషాల్లోనే దాదాపు 5 వేల రాకెట్లతో విరుచుపడింది. హమాస్ విధ్వంసానికి దిగడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. హమాస్ ఉగ్రవాదులపై యుద్ధాన్ని ప్రకటిస్తూ ఐడీఎఫ్ దళాలను రంగంలోకి దింపింది. ఉగ్రదాడులను ధీటుగా ఎదుర్కొంటూ గాజాపై బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతోంది. హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. గత అయిదు రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3000 మంది మరణించారు. చదవండి: పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం తాజాగా ఇజ్రాయెల్‌కు మరో ముప్పు పొంచుకొచ్చింది. హమాస్‌తోపాటు లెబనాన్, సిరియా రెండు దేశాల నుంచి కూడా దాడులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే గాజాను స్వాధీనం చేసుకున్న హమాస్ ఉగ్రవాద దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్, సిరియా, లెబనాన్‌లోని షియా ఇస్లామిస్ట్ గ్రూప్ హిజ్బుల్లాతో కూడిన ప్రాంతీయ కూటమి.. మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్‌తో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో హమాస్ దాడికి కొన్ని రోజులకే లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా ఇజ్రాయెల్ ట్యాంక్‌పై గైడెడ్ క్షిపణిని ప్రయోగించింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ దాడికి పాల్పడించింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా తమ ఆయుధ నిల్వలు ఏ స్థాయిలో ఉంటాయో అంచనా వేయలేరని హిజ్బుల్లా హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ధ్య 2006లో తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. దీని తర్వాత లెబనాస్- ఇజ్రాయెల్ సరిహద్దులో హింస అత్యంత తీవ్రంగా మారిది. కాగా ఇస్లామిక్ విప్లవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, ఇజ్రాయెల్ దళాలతో పోరాడటానికి హిజ్బుల్లాను 1982లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థాపించారు. మరోవైపు సిరియా నుంచి కూడా ఇజ్రాయెల్‌పై దాడులు మొదలయ్యాయి. సిరియా వైపు నుంచి జరుగుతున్న దాడులకు ఇజ్రాయెల్ సైన్యం కూడా దీటుగానే సమాధానం చెబుతోంది. సిరియా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి అనేక దాడులు జరుగుతున్నట్లు సైన్యం చెబుతోంది. ముఖ్యంగా సిరియా నుంచి మోర్టార్ షెల్స్, శతఘ్ని గుండ్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే 1967లో ఆరు రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ సిరియా నుంచి గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ రెండు దేశాలు మధ్య వైరుద్ధం ఏర్పడింది. -
Israeli-Palestinian Conflict: రంగంలోకి లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్లు
టెల్ అవివ్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోకి లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ తీవ్రవాదుల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లో హెజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీనివల్ల ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువులైన హెజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తోంది. హెజ్బుల్లా వద్ద వేలాది రాకెట్లు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో హెజ్బుల్లా మిలిటెంట్లు మకాం వేశారు. ఆదివారం ఒక్కడి నుంచి మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు.ప్రతిగా ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో లెబనాన్ వైపు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఉత్తర సరిహద్దులో ప్రస్తుతం సాధారణ పరిస్థితులుండగా దక్షిణ ప్రాంతంలో పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ పేర్కొంది. -
అందరూ అక్కడి నుండి వెళ్లిపోండి.. సౌదీ అరేబియా
బీరుట్: లెబనాన్‌లోని శరణార్ధుల శిబిరంలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న కువైటీలు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది సౌదీ ఎంబసీ. సౌదీ అరేబియా తన పౌరులను త్వరగా లెబనాన్ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు లెబనాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ట్విటర్లో పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా సౌదీకి లెబనాన్ కు మధ్య రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌదీ ఎంబసీ తమ దేశస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది కానీ ఎక్కడ సురక్షితమో చెప్పలేదు. ఇదిలా ఉండగా ఇదే నెల మొదల్లో ఇంగ్లాండ్ మాత్రం లెబనాన్ రాకపోకలపై ఆంక్షలు విధించింది. జూలై 29న లెబనాన్ రక్షణ బలగాలకు కరడుగట్టిన ఇస్లామిస్టులకు మధ్య జరిగిన ఘర్షణలో 13 మంది మృతి చెందగా వారంతా మిలిటెంట్లేనని ధృవీకరించాయి శిబిరంలోని భద్రతా వర్గాలు. ఈ శిబిరం అన్నిటిలోకి పెద్దదని ఇక్కడ సుమారు 80,000 నుండి 250,000 మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇది కూడా చదవండి: పబ్జీ లవ్‌స్టోరీ: పాకిస్థాన్‌లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా? -
పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి
బీరుట్: సిడాన్ దక్షిణ పోర్టు నగరంలో పాలస్తీనా శరణార్ధులున్న శిబిరంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మరణించగా ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగాయి. ఇస్లాం ఉగ్రవాది మహమ్మద్ ఖలీల్‌ను హతమార్చే క్రమంలో అతని అనుచరుడిని చంపడంతో అల్లర్లు చెలరేగాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ నుండి వలస వచ్చిన 55,000 మంది పాలస్తీనీయులు ఉంటున్న ఈ శరణార్థుల శిబిరంలో ఒక్కసారిగా తుపాకులతోను, గ్రెనేడ్లతోనూ కాల్పులు జరిగాయి. మిలిటెంట్లకు మిలటరీ సైన్యానికి మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా ఏడుగురు గాయపడ్డారని అధికారులు అన్నారు. చనిపోయినవారిలో ఐక్యరాజ్యసమితి తరపున శరణార్ధుల యోగక్షేమాలు చూడటానికి వచ్చిన యూఎన్ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులు, ఫతాహ్ గ్రూపుకు చెందిన పాలస్తీనా మిలటరీ జనెరల్ తోపాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: ట్విట్టర్ పేరు మార్పు నా చావుకొచ్చింది.. ఆ రోజు నుండి నిద్ర లేదు.. -
Football: ఫైనల్లో భారత్.. పెనాల్టీ షూటౌట్లో లెబనాన్‌పై గెలుపు
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో భారత జట్టు తొమ్మిదో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 4–2తో లెబనాన్ జట్టును ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో కువైట్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో కువైట్ 1–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున వరుసగా సునీల్ ఛెత్రి, అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్ గోల్స్ చేశారు. లెబనాన్ తరఫున మాతూక్ తొలి షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. ఆ తర్వాత వాలిద్, సాదిక్ గోల్స్ చేయగా... బదర్ కొట్టిన నాలుగో షాట్ బయటకు వెళ్లడంతో భారత విజయం ఖరారైంది. గతంలో భారత్ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లలో విజేతగా నిలిచింది. -
దక్షిణ లెబనాన్, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
జెరూసలేం: దక్షిణ లెబనాన్‌తోపాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని హమాస్ ఉగ్రవాద శిబిరాలపై శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో యూదులు పాస్ఓవర్ అనే వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం దక్షిణ లెబనాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 30కిపైగా రాకెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌లో ఇద్దరు గాయపడ్డారు. స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాకెట్ల ప్రయోగానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లో పాతుకుపోయిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు లెబనాన్‌లో టైర్ సమీపంలోని రషీదియా పాలస్తీనా కాందిశీకుల క్యాంప్ వద్ద నేలను తాకాయని అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెల్లడించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలీషియాకు ఇరాన్ అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై హిజ్బుల్లా మిలీషియా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే, తాము కేవలం పాలస్తీనా మిలిటెంట్ల శిబిరాలపైనే వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనా వాసి ఒకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!
సాధారణంగా స్నానం చేసే సబ్బు ఖరీదు ఎంత ఉంటుంది. మహా అయితే రూ. 30, 40 ఉంటుంది. మరీ ఖరీదైంది ఐతే వంద రూపాయలు ఉంటుంది. ఐతే ఈ సబ్బు ఖరీదు వందలు కాదు వేలు అస్సలే కాదు ఏకంగా లక్షల్లో ఉంటుందట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బట కూడా! స్నానం చేసే సబ్బే కదా.. ఏమైనా బంగారంతో తయారు చేశారా? ఎందుకంత ఖరీదని అనుకుంటున్నారా! అవును.. ఇది మామూలు సబ్బు కాదు.. నిజంగానే బంగారంతో తయారు చేస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.. ఎక్కడా తయారు చేస్తారంటే.. లెబానోన్లోని ట్రిపోలీకి చెందిన ఒక కుటుంబం నడిపే సబ్బుల ఫ్యాక్టరీలో ఈ విధమైన సబ్బులు తయారవుతున్నాయి. 15వ శతాబ్ధం నుంచి ఈ విధమైన సబ్బులు వడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఐతే 2013 లో ఈ ఖరీదైన సబ్బులను మొదట తయారు చేశారు. దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ లగ్జరీ సబ్బు పేరు ‘ఖాన్ అల్ సబౌన్’ సోస్. బాడర్ హసీన్ అండ్ సన్స్ కంపెనీ కేవలం చేతులతోనే ఈ సబ్బులను తయారు చేస్తుందట. ప్రత్యేకమైన నూనెలు, సహజ సువాసనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే అమ్ముతారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! బంగారం, వజ్రాల పొడితో తయారీ.. ఈ ఖరీదైన సబ్బుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఒక ఖాన్ అల్ సబౌన్ సబ్బు తయారీకి 17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌లో సహజమైన నూనెలు, సహజసిద్ధమైన తేనె, ఖర్జూరం కలిపి తయారు చేస్తారట. చూడ్డానికి అచ్చం జున్ను ముక్కలా ఉంటుందీ లగ్జరీ సబ్బు. దీని ధర కూడా చుక్కల్లో ఉంటుంది. ఒక సబ్బు ఖరీదు అక్షరాల 2 లక్షల 7 వేల రూపాయలు. ఈ సబ్బు ప్రత్యేకత అదే.. ఈ సబ్బు వాడిన వారికి ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఐతే దీనిని రుజువుచేసే ఆధారాలేవీ లేవు. అంత ఖరీదైన సబ్బు వాడేవారు కూడా ఉంటారా? అని అనుకుంటే పొరపాటే. ముఖ్యమైన విఐపీలు, సెలబ్రెటీలు మాత్రమే వీటిని వాడుతారట. ముఖ్యంగా దుబాయ్‌లో నివసించే సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఈ సబ్బులను వాడుతారు. ఆ మధ్య ఖరీదైన వాటర్ బాటిల్ ధర రూ. 45 లక్షల రూపాయలని విన్నాం. ఇప్పుడు రెండున్నర లక్షల స్నానం సబ్బు.. రోజూ వాడే మామూలు వస్తువులకు కూడా ఇంత ధర పలుకుతుందంటే నమ్మలేకపోతున్నాం కదా! చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..! -
శరీరాన్ని తూట్లు పొడిచారు.. బతికింది.. శభాష్ అనిపించుకుంటోంది
బీరూట్: ప్రాణం లేని వస్తువనుకున్నారో ఏమో.. ఆ క్రూరులు అభంశుభం తెలియని ఆ శునకాన్ని దారుణంగా హింసించారు. దాన్ని గన్ ఫైరింగ్‌కు లక్ష్యంగా మార్చి ప్రాణాలతో చెలగాటం ఆడారు. కళ్లు, ఓ చెవి పోగోట్టుకుంది, ఎముకలు విరగొట్టుకుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అది అదృష్టం బాగుండి బతికింది. మంచి మనుషుల తోడుతో నేడు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగింది. తనకు హాని చేసిన మనషులకు సేవ చేస్తోంది. వివరాలు.. లెబనాన్‌కు చెందిన మ్యాగీ అనే కుక్కపై దాని మాజీ యజమానులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. గన్‌ఫైరింగ్ ప్రాక్టీస్ చేయటానికి దాన్నో లక్ష్యంగా వాడుకున్నారు. కాళ్లు కట్టేసి పెల్లెట్స్(డూప్లికేట్ గన్‌కు సంబంధించిన బుల్లెట్ లాంటి గుళ్లు)తో కాల్పులు జరిపారు. దాని ఒంటినిండా పెల్లెట్స్‌తో తూట్లు పెట్టారు. పాపం అరిచి, మొత్తుకున్నా విడవలేదు. దాని ముక్కు, రొమ్ము, భుజాలు ఇతర శరీర భాగాల్లో దాదాపు 200 గుళ్లు దింపారు. ముఖ్యంగా దాని ముఖంపై కాల్చటంతో కంటి చూపుకోల్పోయింది. అంతేకాదు, దాని దవడ విరిగింది.. ఓ చెవిని కూడా కోల్పోయింది. ప్రాణాల కోసం పోరాడుతున్న దాన్ని తీసుకుపోయి దూరంగా పడేశారు. చావు బతుకులతో పోరాడుతున్న దాన్ని గుర్తించిన ‘‘ వైల్డ్ యాట్ హార్ట్ ఫౌండేషన్’’ అనే జంతు సంరక్షణా సంస్థ రక్షించింది. అనంతరం మ్యాగీ కథ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రిగ్టన్కు చెందిన క్యాసీ చార్లీన్ అనే మహిళ దాన్ని దత్తత తీసుకుంది. దానికి శిక్షణ ఇచ్చి థెరపీ డాగ్‌గా తీర్చిదిద్దింది. (చదవండి: ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’) 2019లో మ్యాగీ పూర్తి స్థాయి థెరపీ డాగ్‌గా మారింది. డిమెన్షియా(మతి మరుపు వ్యాధి)తో బాధపడుతున్న వారికి సహాయం చేస్తోంది. అంతేకాదు స్కూళు పిల్లలు, పోలీస్, ఫైర్ ఫైటర్స్‌కు తోడుగా ఉంటోంది. 2020లో కరోనా సమయంలోనూ సేవలను అందించింది. దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టడంతో పలు ఆంక్షలు ఎత్తేశారు. దీంతో చాలా నెలల తర్వాత తను ఉంటున్న కేర్ హోమ్‌కు మ్యాగీ చేరుకుంది. అక్కడ ఉంటున్న తన కిష్టమైన వ్యక్తి యానీని కలుసుకుంది. (చదవండి: షాపింగ్ చేస్తోన్న కుక్క.. నెటిజనులు ఫిదా) యానీని కలుసుకోక సంవత్సరం కావస్తున్నా.. ఆమెను మ్యాగీ ఏ మాత్రం మర్చిపోలేదు. కేర్ హోమ్‌లోకి అడుగుపెట్టగానే నేరుగా యానీ రూమ్ దగ్గరకు వెళ్లిపోయింది. ఆ తర్వాతే మిగితా వ్యక్తుల్ని కలుసుకుంది. ప్రస్తుతం మ్యాగీ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మ్యాగీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంతో దాన్ని దత్తత తీసుకోవటానికి ఎవ్వరూ రాలేదు. కానీ, ఇప్పుడు లక్షల మంది దాన్ని పెంచుకుంటామంటున్నారు. చదవండి: ఒక్క రూపాయి అయినా పంపండి ప్లీజ్: యాంకర్ రష్మీ -
ఇంధన సంక్షోభం, 90 శాతం మేర పడిపోయిన కరెన్సీ.. తీవ్ర కష్టాలు
బీరూట్: మధ్యప్రాచ్య దేశం లెబనాన్‌లో ఇంధన సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేస్తూ సరఫరాదారులు అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో సైన్యం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జౌక్ మెస్బేలోని వేర్‌హౌజ్‌లలో అక్రమంగా నిల్వ ఉంచిన 65 వేల లీటర్ల డీజిల్, 48 వేల లీటర్ల పెట్రోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని స్థానిక ఆస్పత్రులు, బేకరీ నిర్వాహకులకు పంపిణీ చేశారు. కాగా పెట్రోల్, డీజిల్ దిగుమతిదారులకు ఇచ్చే సబ్సిడీని త్వరలో ఎత్తివేస్తామని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రియాద్ సలామే వారాంతంలో ప్రకటించిన నేపథ్యంలో దేశంలో ఇంధన సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అక్రమ నిల్వలు పెరిగాయి. ఫొటో కర్టెసీ: బీరూట్ టుడే దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో గంటల తరబడి వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో నిరసనలకు దిగుతున్నారు. ఇక అక్కర్లో రహస్యంగా దాచి ఉంచిన ఇంధన ట్యాంకర్‌ను కనుగొన్న ఆందోళనకారులు... 60 వేల లీటర్ల గ్యాసోలిన్, 40 వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆర్మీ రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. మరోవైపు.. ఇంధనాన్ని పంపిణీ చేసేందుకు ఆర్మీ తీసుకువచ్చిన గ్యాసోలిన్ ట్యాంకర్ చుట్టూ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడగా.. ఉద్రిక్త పరిస్థితి నెలకొని, ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో సుమారు 28 మంది మృత్యువాత పడ్డారు. ఓవైపు కరోనా.. మరోవైపు ఇంధన సంక్షోభం కరెంటు కోతలు పెరగడంతో ఆస్పత్రుల్లో పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బీరూట్ మెడికల్ సెంటర్లో ఇంధన కొరత, కరెంటు కోతల కారణంగా రెస్సిరేటర్లు, ఇతర పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో సుమారు 55 మంది రోగులు మరణించినట్లు సమాచారం. ఇందులో 15 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గత రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లెబనాన్.. ప్రస్తుతం కోవిడ్, ఇంధన సంక్షోభంతో పూర్తిగా డీలా పడిపోయింది. ఫొటో కర్టెసీ: బీరూట్ టుడే ఇప్పటికే దేశంలోని సగం మంది జనాభా పేదరికంలో మగ్గిపోతున్నారు. లెబనాన్ కరెన్సీ విలువ 90 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశ అధ్యక్షుడు మిచెల్ ఔన్ ఆదివారం మాట్లాడుతూ... రానున్న రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని సంకేతాలు జారీ చేశారు. కాగా గతేడాది ఆగష్టులో బీరూట్‌లో అతిపెద్ద పేలుడు సంభవించి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగినందున ప్రధాని హసన్ దియాబ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నజీబ్ మికాటి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ.. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో నూతన పాలకులకు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. చదవండి: Afghanistan: మహిళా యాంకర్‌కు తాలిబన్ ప్రతినిధి ఇంటర్వ్యూ! Afghanisthan: ఏమీ వద్దు.. ప్రాణాలు మిగిలితే చాలు.. -
జైలు నుంచి విడిపించరూ..!
పెగడపల్లి (ధర్మపురి): జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని మ్యాక వెంకయ్యపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్(27) ఉపాధి కోసం లెబనాన్ వెళ్లి తిరిగి వస్తుండగా షార్జా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ 2013లో కంపెనీ వీసాపై దుబాయి వెళ్లి 2016 వరకు పనిచేశాడు. అక్కడి కంపెనీలో పని సక్రమంగా లేకపోవడం, జీతం తక్కువగా ఉండటంతో తిరిగి రావాలని భావించాడు. అయితే అప్పటికే వీసా గడువు సమయం ముగియడంతో శ్రీనివాస్‌పై అక్కడి ప్రభుత్వం కేసుపెట్టి అరెస్టు చేసింది. 15 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలై భారత్‌కు వచ్చాడు. 2018లో తిరిగి కంపెనీ వీసాతో లెబనాన్ వెళ్లాడు. తాజాగా లెబనాన్ నుంచి తిరిగొచ్చేందుకు ఈ నెల 25న బయల్దేరి షార్జాకు చేరుకున్నాడు. విమానాశ్రయంలో శ్రీనివాస్ పాసుపోర్టు స్కాన్ చేస్తుండగా దుబాయిలో కేసు ఉన్నట్లు తేలి, పాసుపోర్టు ఎర్రర్ చూపింది. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టుచేసి జైలుకు పంపారు. కాగా, రెండు రోజుల కింద లెబనాన్ నుంచి బయల్దేరుతూ తమకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడని తల్లిదండ్రులు బాలయ్య, కొమురమ్మ, భార్య మమత రోదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి, తమ కొడుకు ఇక్కడికి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. హృదయవిదారకం.. రోడ్డుపక్క గర్భిణి ప్రసవం -
తమ్ముడి తెలివి మూమూలుగా లేదు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అన్నదమ్ముల పంచాయితీ అంటే ఆషామాషీ కాదు.. ఆస్తి పంపకాల నుంచి మొదలై ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వస్తుంది. అయితే లెబనాన్ లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ..గోడకు దారితీసింది. లెబనాన్‌లోని బీరుట్కు దగ్గరగా ఉన్న మనారా అనే పట్టణంలో ఈ గోడ లాంటి ఇల్లు ఉంది. ఇద్దరు అన్నదమ్ముల్లో తమ్ముడికి రావాల్సిన వాటా కన్నా తక్కువ వచ్చిందని అన్నపై కోపం పెంచుకున్నాడు. అన్న ఇంటి నుంచి చూస్తే సముద్రతీరం నేరుగా కనిపిస్తుంది. ఇలా అయితే ఇల్లు ఎక్కువ ధర పలుకుతుంది కదా.. అందుకే తమ్ముడికి ఓ దురాలోచన తట్టింది. అన్న ఇంటి నుంచి బీచ్ కనిపించకుండా ఇల్లు కట్టాలని భావించాడు. ఇలా నిర్మిస్తే ఆ ఇంటి విలువ తగ్గుతుందని మనోడి ఆలోచన. అయితే స్థలం చాలా కొద్దిగా ఉంది. అయినా సన్నగా ఓ ఇల్లు నిర్మించాడు.ఆ ఇంట్లో నివసించేందుకు ఉండాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేశాడు. దీన్ని 1954లో నిర్మించినట్లు చెబుతున్నారు. పైగా ఆ ఇల్లు లెబనాన్‌లో అతి సన్నని ఇంటిగా రికార్డుల్లోకెక్కింది. చాలా సన్నగా ఉన్నవైపు రెండు అడుగుల వెడల్పు, మరోవైపు 14 అడుగుల వెడల్పు ఉందీ ఇల్లు.. ఈ బిల్డింగును అక్కడ ‘విద్వేష’ భవనం అని పిలుస్తారు. -
విడాకుల వివాదం.. మోడల్ దారుణ హత్య
బీరూట్: లెబనాన్‌కు చెందిన జైనా కంజో చాలా అందంగా ఉంటుంది. బ్యూటీ క్వీన్. ఇంతటి అందాల రాశిని చూసిన మోడలింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రీ ప్రముఖలు ఊరుకోరు కదా.. పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు లభిస్తోంది. మోడల్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. వివాహం అయ్యి ఇంకా ఏడాది కూడా గడవలేదు. అన్యోన్యంగా సాగాల్సిన వారి జీవితంలో ఘర్షణలు మొదలయ్యాయి. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి.. మోడల్‌గా రాణించాలనేది జైనా ఆశ. కానీ ఆమె భర్త మాత్రం అందరి భార్యల్లాగే జైనా కూడా ఇంటి పట్టునే ఉండాలని.. కుటుంబాన్ని చూసుకోవాలని భావించాడు. దాంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలే. ఇక లాభం లేదునుకుని జైనా భర్త నుంచి విడిపోవాలని భావించింది. కానీ విడాకులు తీసుకోవడం భర్తకు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఈ నెల 7వ తారీఖున ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఆగ్రహంతో ఊగిపోయిన జైనా భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వత భయంతో అక్కడి నుంచి టర్కీ పారిపోయాడు. జైనాను హత్య చేసిన తర్వాత ఆమె భర్త తాను చేసిన దారుణం గురించి సోదరితో చెప్పాడు. వారి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్ మీడియాకు చిక్కింది. దీని ఆధారంగా పోలీసులు జైనా భర్త మీద కేసు నమోదు చేశారు. ఇక ఈ ఆడియో క్లిప్పింగ్‌లో జైనా భర్త తన సోదరిని ఉద్దేశించి.. ‘‘నన్ను ఏమైనా అడుగు. నేను కావాలని తనను చంపలేదు. ఆమె చనిపోవాలని నేను కోరుకోలేదు. ఆమె ఏడుస్తుండటంతో నా చేతిని ఆమె నోటికి అడ్డం పెట్టాను. ఏడవద్దని చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు.. నాతో గొడవపడాలని చూసింది. తెల్లవారుతున్నా ఆమె ఏడుపు ఆపలేదు. నేను ఆమెను చంపానా’’ అని ఆడిగినట్లు తెలిసింది. ఇక మరో దారుణమైన విషయం ఏంటంటే.. కొద్ది రోజుల క్రితమే జైనా తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హింసిస్తున్నాడని.. భర్త నుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరింది. ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యింది. ఇక జైనా హత్యకు సంబంధించి ఆమె అభిమానులు పోలీసులు తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అందానికి కొలతలెందుకు? 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు
అసలు సబ్బు అంటే ఎలాగుండాలి.. మంచి కలర్ఫుల్గా ఉండాలి.. ఇది చూడండి.. ఇది కూడా సబ్బేనా.. చూశారుగా ఎలాగుందో.. అయితే.. ఇది చాలా ‘లక్ష’ణమైన సోప్ అట.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు. ధర కేవలం రూ.2.07 లక్షలు!! ఎందుకంత అని అడిగితే.. ఇందులో 17 గ్రాముల మేలిమి బంగారం, కొన్ని గ్రాముల వజ్రాల పొడి కూడా ఉందని దీన్ని తయారుచేసిన బడేర్ హసన్ అండ్ సన్స్ వాళ్లు చెప్పారు.. వీటితోపాటు అలీవ్ నూన్, ఆర్గానిక్ తేనె, ఖర్జూరం ఇలా చాలావాటిని వేసి.. దీన్ని తయారుచేశారట.. లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన ఈ కుటుంబం హ్యాండ్ మేడ్ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో పేరెన్నికగన్నవారు.. 15వ శతాబ్దం నుంచీ వీళ్లు ఇదే బిజినెస్‌లో ఉన్నారు. దీన్ని ఈ మధ్య కొందరు ప్రముఖులకు బహుమతిగా ఇచ్చారు.. ఇచ్చినప్పుడు వారి పేరును బంగారంతో ఈ సబ్బుపై చెక్కించి మరీ ఇచ్చారట.. ఇది కొంత మందికే ప్రత్యేకమా.. లేక అందరూ దీన్ని కొనొచ్చా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. క్లారిటీ వస్తే.. కొనే ఉద్దేశం ఉందా ఏమిటి మీకు? చదవండి: (ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు) -
వెంటాడుతున్న విషాదం: ‘ఒక్కరూ ప్రాణాలతో లేరు’
బీరూట్: లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్లు సంభవించి నెల రోజులు దాటిపోయింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర భవనాలన్నీ ధ్వంసమైన ఆ భీతావహ ఘటన ప్రజలను ఇంకా వెంటాడుతోంది. సుమారుగా 191 మంది ప్రాణాలను బలి తీసుకున్న తీవ్ర విషాదం నుంచి వారు నేటికీ కోలుకోలేపోతున్నారు. ప్రమాదం సమయంలో మిస్సయిన ఏడుగురి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ‘లెబనాన్’గుండెను నిలువునా చీల్చిన ఆ చేదు ఘటన నిజం కాకపోయి ఉంటే బాగుండునని, శిథిలాల కింద పడి ఉన్న వాళ్లు కొన ఊపిరితోనైనా బతికి ఉంటారనే ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అయితే చిలీ రక్షణ బృందాలు చెప్పిన విషయాలు వారి ఆశలను అడియాసలు చేశాయి. సెన్సార్ రీడింగ్‌లో వెల్లడైనట్లుగా.. పేలుళ్లలో ధ్వంసమైన భవన శిథిలాల కింద ఓ ఒక్కరు ప్రాణాలతో మిగిలిలేరనే చేదు నిజాన్ని చెప్పాయి. (చదవండి: ‘అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది’) కాగా గత నెల 4న బీరూట్ పోర్టులో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ వలన భారీ స్థాయిలో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 6 వేల భవనాలు నేలమట్టమయ్యాయి. గత ఏడాది కాలంగా లెబనాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి కారణంగా... పేదరికం తారస్థాయికి చేరింది. నిత్యావసరాల కోసం ప్రజలు చెత్తకుప్పలను ఆశ్రయించే దుస్థితి వచ్చింది. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. ఇలాంటి తరుణంలో రాజధానిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం లెబనియన్ల జీవితాలను మరింత గందరగోళంలోకి నెట్టాయి. కనీసం శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసే టెక్నాలజీ కూడా అందుబాటులో లేకపోవడంతో.. స్థానిక ప్రభుత్వం చిలీ, అమెరికా, ఫ్రాన్స్ నుంచి రక్షణ బృందాలను రప్పించగా నేటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హార్ట్‌బీట్ వినిపించింది.. ఈ క్రమంలో శిథిలమైన ఓ భవనం వద్ద మానవ హృదయ స్పందనను(హార్ట్‌బీట్) పోలిన శబ్దాలను హైటెక్ సెన్సార్లు గుర్తించడంతో రక్షణ బృందాలు అక్కడ గాలింపు ముమ్మరం చేయగా వారికి నిరాశే మిగిలింది. అక్కడ మనిషి ఆనవాలు కనిపించలేదని చిలీ రెస్క్యూ స్పెషలిస్టు ఫ్రాన్సిస్కో లెర్మాండా శనివారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఆ భవనం కింద మనిషి బతికి ఉన్నాడనడానికి ఎలాంటి ఆనవాలు లభించలేదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. అక్కడ ఎవరూ సజీవంగా లేరు’’అని విచారం వ్యక్తం చేశారు. ఇక పోర్టు సమీపంలో ఓ జాగిలం సెంట్ వాసన పసిగట్టి పరుగులు తీయడంతో.. ఇద్దరు మహిళా వర్కర్లు అక్కడ గల టన్నెల్ చివరి వరకు వెళ్లి మృతుల జాడ కోసం వెదకగా.. ఎవరూ కనిపించలేదు. అయినప్పటికీ.. ‘‘పాక్షికంగా ధ్వంసమైన భవనాలు కూలిపోతాయనే భయం వెంటాడినా సరే అణువణువూ గాలిస్తాం. బాధితులను వెలికితీసేందుకు మా వంతు ప్రయత్నం కొనసాగిస్తాం’’అని సివిల్ డిఫెన్స్ అధికారి ఖాసీం ఖటార్ వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు అన్నిచోట్లా శిథిలాలను తొలగించే ప్రక్రియ పూర్తై పోవచ్చిందని తెలిపారు. అద్భుతం జరిగితే తప్ప.. అయితే లెబనీస్ అధికారులు మాత్రం.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఘోర ప్రమాదం నుంచి తేరుకుని బతికే ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక ఫిల్మ్ మేకర్ సలీం మురాద్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతం జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ ప్లీజ్ దేవుడా.. బీరూట్ మిరాకిల్‌కు వేదిక కాగల ఆశీర్వాదాలు అందించూ’’అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక మృతులను వెలికితీసేందుకు ప్రాణాలు పణంగా పెట్టి శ్రమిస్తున్న చిలీ రక్షణ బృందాలపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిని నిజమైన హీరోలుగా వర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెబుతున్నారు. బీరూట్ పేలుళ్ల ఘటనకు నెల రోజులు పూర్తైన సందర్భంగా మృతులకు నివాళిగా శుక్రవారం దేశ ప్రజలంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. కాగా ఈ ఘోర విషాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని హసన్ దియాబ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
బీరుట్ ప్రమాదం: విస్మయకర విషయాలు వెల్లడి
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుడు ఘటనకు సంబంధించి విస్మయకర విషయాలు బయటికొస్తున్నాయి. ప్రభుత్వాన్ని నెల క్రితమే హెచ్చరించినా చర్యలు చేపట్టకపోవడంతోనే ఇంతటి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోర్టులో ఉన్న 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వల వల్ల రాజధాని బీరుట్కు ప్రమాదం పొంచి ఉందని సెక్యురిటీ వర్గాలు నెల క్రితమే హెచ్చరించినట్టు ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సెక్యురిటీ వర్గాల హెచ్చరికలకు సంబంధించిన పత్రాలను సదరు వార్తా సంస్థ, కొందరు సీనియర్ భద్రతా అధికారులు పరిశీలించారని పేర్కొంది. బీరుట్ పేలుడు ఘటన అనంతరం నేషనల్ సెక్యురిటీ జనరల్ ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2013 నుంచి గోడౌన్లలో ఉన్న అమ్మోనియం నైట్రేట్‌తో బీరుట్కు పెను ప్రమాదం పొంచి ఉందని అధ్యక్షుడు మిచల్ అవున్, ప్రధాని హసన్ డియాబ్‌కు జులై 20న లేఖ రాసిన విషయాన్ని నేషనల్ సెక్యురిటీ జనరల్ తాజా రిపోర్టులో ప్రస్తావించారు. (చదవండి: ‘హైదరాబాద్ చేరుకున్న అమ్మోనియం నైట్రేట్’) భారీ స్థాయిలో ఉన్న అమ్మోనియం నిల్వలను సంరక్షించాలని జనవరిలో జ్యుడియల్ కమిటీ కూడా చెప్పిందని ఆయన రిపోర్టులో గుర్తు చేశారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు తీవ్రవాదులు దొంగిలించి మారణహోమం సృష్టించే అవకాశం ఉందని, లేదంటే పేలుడు గనుక జరిగితే బీరుట్ సర్వనాశనం అవుతుందని ఆ లేఖలో నేషనల్ సెక్యురిటీ జనరల్ హెచ్చరించారు. దురదృష్టవశాత్తూ ఆయన హెచ్చరించిన రెండు వారాల అనంతరం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 163 మంది ప్రాణాలు కోల్పోగా 6 వేల మందికి పైగా గాయపడ్డారు. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలాఉండగా.. పేలుడు ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. (చదవండి: నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా) -
నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా
బీరుట్: లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. దాంతో రాజీనామా చేయాలని ప్రధాని హసన్ నిర్ణయించుకున్నారు. ‘ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతానన్నారు. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది. లెబనాన్‌ను దేవుడే రక్షించు గాక’ అని టీవీలో తన సంక్షిప్త ప్రసంగాన్ని ముగించారు. (చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్) -
మానవ తప్పిదమే; బీరూట్ పోర్టు డైరెక్టర్ అరెస్ట్
బీరూట్: లబనాన్ రాజధాని బీరూట్‌లో పేలుడు ఘటనకు బాధ్యుడిగా బీరూట్ పోర్టు డైరెక్టర్‌ను లెబనాన్ మిలటరీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో 135 మంది ప్రాణాలు విడువగా దాదాపు 5 వేల మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్ ఫాదీ అకీకీ నేతృత్వంలో పోలీసులు పోర్టు డైరెక్టర్ హస్సాన్ కోరేటమ్‌ని అదుపులోకి తీసుకున్నారని ఆ దేశ మీడియా ఎన్ఎన్ఏ తెలిపింది. హస్సాన్ కోరేటమ్‌తో పాటు మరో 16 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. వీరంతా పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచిన గోడౌన్ 12 వద్ద విధుల్లో ఉన్నారని పేర్కొంది. పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ నిల్వల్లో గోడౌన్ 12 సిబ్బంది నిర్లక్షాన్యికి సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయని ఎన్ఎన్ఏ మీడియా తెలిపింది. పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పింది. (చదవండి: చెన్నైలో 700 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలు) కాగా, మానవ తప్పిదం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు లెబనాన్ దేశాధ్యక్షుడు మిచెల్ అవున్ స్పష్టం చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు వెల్లడించారు. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఇగోర్ గ్రెచుష్కిన్‌విగా తేలిందని, దర్యాప్తు బృందం అతన్ని ప్రశ్నించే అవకాశం ఎన్ఎన్ఏ మీడియా సంస్థ వెల్లడించింది. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, తాజా పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయని లెబనాన్ వాసులు వాపోతున్నారు. దర్యాప్తులతో ఒరిగేదేమీ ఉండదని, పేలుడు పదార్థాలు పోర్టులోకి రాకుండే అడ్డుకుంటే చాలని అంటున్నారు. (కొడుకును రక్షించుకునేందుకు తండ్రి ఆరాటం) -
బీరూట్ పేలుళ్లు : 30 గంటలు సముద్రంలోనే..
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడు జరిగిన 30 గంటల తర్వాత సముద్రంలో ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు అయ్యాడు పోర్టులో పని చేసే కార్మికుడు. భారీ పేలుళ్ల అనంతరం మిస్సయిన వారి జాడ తెలుసుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేట్ చేసిన అకౌంట్లో రక్తపు మడుగులో ఉన్న అమిన్ అల్ జహెద్ ఫోటో కనిపించింది. భారీ పేలుళ్ల అనంతరం తీవ్రగాయాలైన అమిన్ అల్ జహెద్ మధ్యధరా సముద్రంలో పడిపోయినట్టు తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది అమిన్ని కాపాడిన అనంతరం పడవపై పడుకోబెట్టిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తీవ్రగాయాలతో ఉన్న అతన్ని రఫిక్ హరీరీ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, సముద్రంలో 30 గంటలపాటూ ఎలా బతుకుపోరాటం చేశాడనే సమాచారం తెలియాల్సి ఉంది. బీరూట్‌లో సంభవించిన భారీ పేలుళ్లలో 137 మంది మృతిచెందగా, 5,000 మందికి పైగా గాయపడ్డారు. (2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..) 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరూట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. -
విద్వంసం
-
2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ వల్లే..
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో మంగళవారం సంభవించిన శక్తివంతమైన పేలుడులో మృతుల సంఖ్య 135కు చేరిందని, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని లెబనీస్ రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి జార్జి కెటానెహ్ చెప్పారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పేలుడని భావిస్తున్నారు. బుధవారం నగరంలో బీతావహ దృశ్యాలు కనిపించాయి. పోర్ట్ నుంచి ఇప్పటికీ పొగ వెలువడుతోంది. పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చిన్న మంటగా మొదలైన ఈ విస్ఫోటనం క్షణాల్లోనే భీకర రూపం దాల్చింది. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 1975–1990 మధ్య జరిగిన సివిల్ వార్‌లో, పొరుగు దేశం ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణల్లో, ఉగ్రవాద దాడుల్లో ఇలాంటి పేలుళ్లు కనిపించాయని స్థానికులు అంటున్నారు. ప్రాణాలు తీసిన అమ్మోనియం నైట్రేట్ 2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్ ఫహ్మీ చెప్పారు. బీరుట్ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే ముదురు నారింజ రంగు మేఘం పుట్టుగొడుగు ఆకారంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్న దృశ్యం కనిపించింది. విషపూరితమైన నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. ఆహార సంక్షోభం తప్పదా? చాలా చిన్న దేశమైన లెబనాన్‌లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రజల్లో అసంతృప్తిజ్వాలలు రగులుతున్నాయి. వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి లెబనాన్‌పై పంజా విసురుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేలుడు సంభవించి, 135 మంది అమాయక జనం చనిపోవడం పాలకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. లెబనాన్ 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్ పోర్ట్ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది. భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి లెబనాన్‌లో పేలుడు సంభవించి, 135 మంది మరణించడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మిన్నంటిన ఆక్రందనలు కూలిన భవనాలు, రేగుతున్న పొగలు, గల్లంతైన కుటుంబ సభ్యులు.. ఇదీ ప్రస్తుతం బీరుట్ లో పరిస్థితి. ఓ వైపు అంబులెన్స్ సైరన్లు మోగుతుంటే మరోవైపు బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. దారుణమైన ఈ పేలుడు నగరాన్ని ఛిద్రం చేసేసింది. రంగు రంగుల అద్దాలతో, అందమైన రాళ్ల నిర్మాణాలతో ఉన్న ప్రాంతమంతా మరుభూమిగా మారింది. తరాల పాటు నిర్మించిన భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. 1975 నుంచి 1990ల మధ్య జరిగిన సివిల్ వార్‌ను సైతం తట్టుకున్న భవనాలు, పేలుడు ధాటిని మాత్రం తట్టుకోలేక చరిత్రలో కనుమరుగయ్యేలా నేలకూలాయి. ఇంటి బాల్కనీలు రోడ్డు నడిమధ్యకు వచ్చి పడ్డాయి. రెస్టారెంట్లు, షాపుల్లోని కుర్చీలు ఎవరినీ రానివ్వద్దన్నట్టు తలకిందులుగా పడిపోయాయి. నేనెక్కడికెళ్లాలి ? నేనేం చేయాలి అంటూ కుప్పకూలిన ఓ ఇంటి ఎదుట యజమానురాలు బాధను వ్యక్తం చేస్తూ కనిపించింది. పసి పిల్లలు పేలుడు ధాటికి ఆస్పత్రుల పాలయ్యారు. ఇంతకు మించి వినాశనమంటూ ఉంటుందా అనే స్థాయిలో నగరం దిబ్బగా మారింది. ప్రస్తుతానికైతే కుయ్ మంటూ తిరిగే అంబులెన్సులు, రాళ్లెత్తి మరీ మనుషుల కోసం వెతుకుతున్న వాలంటీర్ల శ్రమ, అయినవారిని కోల్పోయి రోదిస్తున్న బాధితుల ఆక్రందనలు మాత్రమే కనిపిస్తున్నాయి. లెబనాన్‌కు వెల్లువెత్తుతున్న సాయం లెబనాన్‌కి అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. లెబనాన్‌లో సంభవించిన పేలుడు అనంతరం క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ విమానాల ద్వారా అవసరమైన మందులను పరికరాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. మందులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్‌లోని మానవతా సహాయ కేంద్రం నుంచి క్షతగాత్రులకు చేరవేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి తారిక్ జెసా రెవిక్ చెప్పారు. ఓడరేవు కేంద్రంగా జరిగిన భారీ పేలుడు ప్రభావంతో అనేక భవనాలు శిథిలమయ్యాయి. బీరుట్లో బీభత్సం సృష్టించిన ఈ పేలుడు ప్రభావంతో ప్రజా జీవనం ఛిన్నాభిన్నమైంది. యూరోపియన్ సమాజం, రష్యా, నార్వే, టర్కీ, నెదర్లాండ్స్, సైప్రస్, గ్రీక్, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు ఇప్పటికే మందులు, వాహనాలు, హెలికాప్టర్లు, అంబులెన్సులు, వైద్య బృందాలు, రెస్క్యూ టీమ్‌లను తరలించడం ప్రారంభించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లెబనాన్‌ను సందర్శించారు. దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో అనేక విదేశీ రాయబార కార్యాలయాలు సైతం దెబ్బతిన్నాయి. కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి ప్రపంచ దేశాలకు లెబనాన్ ప్రధాని వేడుకోలు ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రసంగం విడుదల చేశారు. పేలుడుకు పాల్పడి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారు ఎప్పటికైనా మూల్యం చెల్లించకోక తప్పదని పేర్కొన్నారు. పేలుడులో గాయపడిన మహిళకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్త పేలుడులో గాయపడిన చిన్నారి పేలుడు వల్ల ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -
బీరూట్ పేలుళ్లు : 100కు పెరిగిన మృతుల సంఖ్య
బీరూట్ : లెబనాన్ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు. భయంతో ప్రజలు వీధుల వెంట పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎరువులు, బాంబుల తయారీలో ఉపయోగించే 2750 టన్నుల అల్యూమినియం నైట్రేట్‌ను ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ఆరేళ్లుగా పోర్టు ప్రాంతంలో నిల్వచేశారని అధ్యక్షుడు మేఖేల్ ఔన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర నిర్లక్ష్యమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. బాధ్యులపై చర్యలు పేలుళ్లకు బాధ్యులను విడిచిపెట్టబోమని, వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రధానమంత్రి హసన్ దియాబ్ హెచ్చరించారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైందని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచిన వేర్‌హస్‌లో వెల్డింగ్ పనులు చేపట్టడంతోనే పేలుళ్లు ప్రారంభమయ్యాయని భద్రతాధికారులతో పాటు మీడియా పేర్కొంది. మరోవైపు దశాబ్ధాల తరబడి సాగిన అవినీతి, పాలనా వైఫల్యాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని లెబనాన్ ప్రజలు రాజకీయపార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీరూట్ పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన మేయర్ జమాల్ ఇతాని ఈ ప్రాంతం వార్ జోన్‌ను తలపిస్తోందని..తనకు మాటలు రావడం లేదని అన్నారు.పేలుళ్ల బీభత్సంతో కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లిందని బీరూట్, లెబనాన్‌లకు ఇది కోలుకోలేని దెబ్బని వ్యాఖ్యానించారు. ఇక ఈ ఘటనలో వంద మంది మరణించారని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లెబనాన్ రెడ్‌క్రాస్ హెడ్ జార్జ్ కెట్టాని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ పేలుళ్లలో మృతుల్లో అత్యధికులు పోర్ట్, కస్టమ్స్ ఉద్యోగులే ఉన్నారు.సెంట్రల్ బీరూట్‌లో భవనాలు దెబ్బతినగా, ఫర్నీచర్ వీధుల్లో పడిపోయింది. వీధులన్నీ గ్లాసు ముక్కలు శిధిలాలతో నిండాయి. పోర్టుకు సమీపంలోని కార్లు పల్టీలు కొట్టాయని స్ధానికులు పేలుళ్ల బీభత్సాన్ని గుర్తుచేసుకున్నారు. తాము ఇప్పుడు విపత్తు ప్రాంతంలో ఉన్నామని, పేలుళ్ల ధాటికి తన భవనం కదిలిందని డౌన్‌టౌన్ ప్రాంతానికి చెందిన బిలాల్ (60) చెప్పుకొచ్చారు. పేలుళ్ల ప్రభావం చూసి తాను భూకంపం అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. చదవండి : బీరూట్ పేలుళ్లు: వైరల్ వీడియోలు


