ఇక కాల్పులుండవు.. ట్రంప్ కీలక ప్రకటన | trump netanyahu phone call israel hezbollah | Sakshi
Sakshi News home page

ఇక కాల్పులుండవు.. ట్రంప్ కీలక ప్రకటన

Jun 2 2026 2:15 AM | Updated on Jun 2 2026 4:56 AM

trump netanyahu phone call israel hezbollah

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.  ఇజ్రాయెల్, హిజ్బుల్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. ఈ విషయమై ఇజ్రాయెల్ అధ్యక్షునితో చర్చలు జరపామని దానికి నెతన్యాహూ అంగీకరించినట్లు పేర్కొన్నారు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్  దాడులను డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఆపారు. బీరూట్ దక్షిణ శివార్లపై దాడులు చేయాలని, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరుపక్షాలతో మాట్లాడి  తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగేలా ఒప్పందం చేశారు. 

డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ  "ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో నేను చాలా ఫలప్రదమైన ఫోన్ సంభాషణ జరిపాను. బీరూట్‌కు ఎటువంటి సైనిక బలగాలు వెళ్లవు. హిజ్బుల్లాతో కాల్ మాట్లాడాను. అన్ని రకాల కాల్పులను నిలిపివేయడానికి వారు అంగీకరించారు — ఇజ్రాయెల్ వారిపై దాడి చేయదు, వారు ఇజ్రాయెల్‌పై దాడి చేయరు"" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్లో రాశారు.

లెబనాన్ రాజధాని వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ బలగాలను తన ఆదేశాలతో వెనుకకి తిరిగినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తుల ద్వారా జరిగిన చర్చల ఆధారంగా.. హిజ్బుల్లా కూడా కాల్పులు జరపకుండా ఉండేందుకు అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే శాంతి చర్చల ఒప్పందంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకూ చర్చలు ప్రస్థావనే లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement