దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు | Israel Strikes South Lebanon | Sakshi
Sakshi News home page

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

May 3 2026 7:14 AM | Updated on May 3 2026 7:16 AM

Israel Strikes South Lebanon

బీరూట్‌: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన దాడుల్లో ఏడుగురు చనిపోయారు. హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పరస్పర దాడులు ఆగకపోవడం గమనార్హం. మొత్తం 9 గ్రామాల ప్రజలను వెంటనే నివాసాలు వదిలివెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది.

కెఫర్‌ దజాల్‌లో ఓ కారుపై జరిగిన దాడిలో ఇద్దరు, ల్వైజాహ్‌ గ్రామంలోని నివాసంపై జరిగిన దాడిలో ముగ్గురు, షౌకిన్‌పై దాడిలో మరో ఇద్దరు మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. సరిహద్దుల్లోని యరౌన్‌లోని కేథలిక్‌ చర్చిలోని కొంత భాగాన్ని ఇజ్రాయెల్‌ ఆర్మీ ధ్వంసం చేసినట్లు నిర్వాహకులు ఆరోపించారు.

కాగా, హెజ్‌బొల్లా లక్ష్యంగా 24 గంటల వ్యవధిలో సుమారు 50 వైమానిక దాడులను చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ మిలటరీ వెల్లడించింది. శనివారం తీర ప్రాంతంలోని బయెద్‌ అనే గ్రామంలోని ఓ ఇంట్లో చేరిన ఇజ్రాయెల్‌ బలగాలే లక్ష్యంగా డ్రోన్‌ దాడి చేసినట్లు హెజ్‌»ొల్లా సైతం ప్రకటించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement