లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది మృతి చెందినట్లు, 57 మంది గాయపడినట్లు ఆ దేశ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. తాజా మారణహోమంతో మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన లెబనాన్ వాసుల సంఖ్య 1021కి చేరింది.
కాగా, మార్చి 2న లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా.. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం మధ్యలోకి కాలు దూర్చింది. ఇరాన్‌కు మద్దతుగా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్, లెబనాన్‌లోని అనేక ప్రాంతాలపై విస్తృత వైమానిక దాడులు ప్రారంభించింది. వాస్తవానికి 2024, నవంబర్ 27న ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది.


