మరో మూడు వారాలు: ట్రంప్
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హెజ్‌బొల్లా మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణను మరో మూడు వారాలపాటు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికాలోని ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారుల మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన రెండో విడత చర్చల్లో ఈమేరకు ఒప్పందం కుదిరిందన్నారు. లెబనాన్‌కు హెజ్‌బొల్లా నుంచి అవసరమైన భద్రతను అమెరికా కల్పిస్తుందని ట్రంప్ భరోసా ఇచ్చారు.


