ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల దాడి | Hezbolla Rockets Attack On Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల దాడి

Sep 20 2024 7:33 PM | Updated on Sep 20 2024 7:55 PM

Hezbolla Rockets Attack On Israel

జెరూసలెం: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లకు‌ ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పైకి హెజ్‌బొల్లా తాజాగా 140 రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ హద్దుమీరిందని, ప్రతి దాడి ఉంటుందని హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా ఇప్పటికే వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాకెట్‌ దాడులు జరగడం గమనార్హం. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు మిలటరీ క్యాంపులపై ఈ దాడులు జరిపినట్లు హెజ్‌బొల్లా తెలిపింది.

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడికి ప్రతిగా రాకెట్లతో దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. లెబనాన్‌ సరిహద్దుల నుంచి  రాకెట్లు దూసుకొచ్చిన విషయాన్ని ఇజ్రాయెల్‌ మిలటరీ ధ్రువీకరించింది. అయితే ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సిఉంది. 

కాగా, ఇప్పటివరకు పాలస్తీనాలోని హమాస్‌ ఉగ్రవాదులపై  దృష్టి పెట్టిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్‌ గ్రూపు హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలే లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌ దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థలున్నాయని హెజ్బొల్లా ఆరోపిస్తోంది. పేజర్లు,వాకీటాకీల పేలుళ్లతో పాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ రాకెట్‌ దాడులు కూడా చేసింది.  

ఇదీ చదవండి.. లెబనాన్‌ ఉక్కిరిబిక్కిరి.. రాకెట్లతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

Advertisement
 
Advertisement
Advertisement