ఉద్రిక్త దేశాల సుందరీమణుల స్నేహబంధం | India Pakistan Bangladesh in Miss Universe 2026 Contestants Friendship | Sakshi
Sakshi News home page

ఉద్రిక్త దేశాల సుందరీమణుల స్నేహబంధం

Nov 19 2026 1:52 PM | Updated on Nov 19 2026 1:52 PM

India Pakistan Bangladesh in Miss Universe 2026 Contestants Friendship

న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్-2026 పోటీల్లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సుందరీమణుల స్నేహబంధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయ విభేదాలు, సరిహద్దు ఉద్రిక్తతలను పక్కనపెట్టి మూడు దేశాలకు చెందిన అందాల భామలు ఆత్మీయంగా కలుసుకున్నారు. ప్యూర్టో రికోలో జరిగిన మిస్ యూనివర్స్ కార్యక్రమం సందర్భంగా వీరు కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారత్‌కు చెందిన కాజియా లిజ్ మెజో, పాకిస్థాన్‌కు చెందిన మిస్బా అర్షద్, బంగ్లాదేశ్‌కు చెందిన సమీరా ఖాన్ మహి కలిసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సమీరా ఖాన్ మహి స్పందిస్తూ.. దేశాలు, జెండాలు వేరైనా ప్రేమ, స్నేహం ఒక్కటేనని పేర్కొన్నారు. బంధాల మధ్య సరిహద్దులు అడ్డురాలేవని తెలిపారు. మిస్బా అర్షద్ సైతం తన అందమైన సోదరీమణులు కాజియా లిజ్ మెజో, సమీరా ఖాన్ మహితో కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ముగ్గురూ ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించారు. భారత ప్రతినిధి కాజియా బర్గండీ రంగు కో-ఆర్డ్ సెట్ ధరించగా, బంగ్లాదేశ్ ప్రతినిధి సమీరా పౌడర్ బ్లూ కలర్ బ్లేజర్, ప్యాంట్‌తో కూడిన పవర్ సూట్‌లో మెరిశారు. పాకిస్థాన్‌కు చెందిన మిస్బా షర్ట్, స్కర్ట్, ఎంబ్రాయిడరీ కార్సెట్‌తో కూడిన ఆధునిక దుస్తుల్లో కనిపించారు. ముగ్గురూ తమ దేశాల పేర్లతో కూడిన సాష్‌లు ధరించారు. ఈ ముగ్గురి ఆత్మీయతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిస్ యూనివర్స్-2026 ఫైనల్ నవంబర్ 24న ప్యూర్టో రికో రాజధాని శాన్ జువాన్‌లో జరగనుంది. 

ఇదీ చదవండి: ఎంపీ మహువా మొయిత్రా కారుపై రాళ్లు, గుడ్లతో దాడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement