మేజర్‌ అభిలాషకు ఐరాస అవార్డు  | Major Abhilasha Barak to receive 2025 UN military gender advocate award | Sakshi
Sakshi News home page

మేజర్‌ అభిలాషకు ఐరాస అవార్డు 

May 24 2026 5:02 AM | Updated on May 24 2026 5:01 AM

Major Abhilasha Barak to receive 2025 UN military gender advocate award

ఐక్యరాజ్యసమితి: లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్‌లో భారత శాంతి పరిరక్షక దళం తరఫున సేవలందిస్తున్న మేజర్‌ అభిలాష బారక్‌ ప్రతిష్టాత్మక మిలటరీ జెండర్‌ అడ్వొకేట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. విధుల్లో భాగంగా మహిళలు, బాలికలకు చేరువయ్యేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐరాస శుక్రవారం ఎక్స్‌లో తెలిపింది. 

యూఎన్‌ ఇంటెరిమ్‌ ఫోర్స్‌ ఇన్‌ లెబనాన్‌(యూనిఫిల్‌)లో ఫిమేల్‌ ఎంగేజ్‌మెంట్‌ టీమ్‌ కమాండర్‌గా బారక్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీలో కంబాట్‌ హెలికాప్టర్‌ పైలట్‌గా ఎంపికైన మొట్టమొదటి మహిళ అభిలాష బారక్‌. ఈ నెల 29వ తేదీన ఐరాస శాంతిపరిరక్షక దళాల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అభిలాషకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును గతంలో ఐరాస శాంతిపరిరక్షక దళాల్లో పనిచేసిన భారత్‌కు చెందిన మేజర్‌ సుమన్‌ గవానీ, మేజర్‌ రాధికా సేన్‌ తమ సేవలకు గుర్తింపుగా అందుకోవడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement