breaking news
peace mission
-
అంతర్జాతీయ పీస్ మిషన్ ప్లాన్‌లో ట్రంప్..?
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అనేక అంతర్జాతీయ సంస్థలను తన ఆర్థిక, అంగ బలంతో గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు తానే అధ్యక్షుడిగా ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.ట్రంప్‌కున్న తలబిరుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సంస్థలన్నీ అమెరికా దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడతాయని అందుకే ఆ దేశం మాటే చెల్లాలని ఆయన తరచుగా వాదిస్తారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితిపై కూడా ట్రంప్ పలుమార్లు విమర్శలు చేశారు. అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు నిధులు తగ్గించడంతో పాటు కొన్ని సంస్థలను బహిష్కరించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ స్థాపించబోతున్నట్లు బ్లుూమ్బర్గ్ నివేదిక తెలిపింది. అందులో చేరే ప్రతి సభ్యదేశానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పీస్ మిషన్ తీసుకునే ప్రతి నిర్ణయాలకు ఆ సంస్థ అధ్యక్షుడి నిర్ణయం తప్పనిసరై ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.అయితే ఏ దేశమయితే 1బిలియన్ డాలర్లు సంస్థకు విరాళంగా ఇస్తుందో ఆ దేశానికి సంస్థ యెుక్క శాశ్వత సభ్యత్యం లభిస్తుందని తెలిపింది. ఈ శాంతి ఆర్గనైజేషన్ యెుక్క ఉద్దేశం అంతర్జాతీయంగా శాంతిని సుస్థిరపరచడమేనని పేర్కొంది. అయితే ఈ శాంతిమిషన్లో చేరడానికి 1బిలియన్ డాలర్లు చెల్లించాలనే అనే వాదన పూర్తిగా అవాస్తవం అని వైట్‌హౌస్ తెలిపింది. -
ప్రపంచ శాంతి స్థాపనకు భారత్ భారీ సాయం
న్యూయార్క్: ప్రపంచంలో శాంతికాముక దేశం ఏదంటే అందరూ భారత్‌ను చూపిస్తారు. అలాంటి భారతదేశం ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం శాంతి స్థాపనకు విశేష కృషి చేస్తోంది. ఈ క్రమంలో శాంతి పెంపొందించేందుకు భారతదేశం భారీ సహాయం ప్రకటించింది. ఏకంగా లక్షా 50 వేల డాలర్లు ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ నిధులను ఐక్య రాజ్య సమితికి అందించనున్నట్లు న్యూయార్క్‌లో జరిగిన వర్చువల్ సమావేశంలో భారత్ తెలిపింది. ప్రపంచంలో శాంతిని పెంపొందించేందుకు ఐక్య రాజ్య సమితి తీవ్రంగా శ్రమిస్తోంది. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడితే శాంతి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఐక్యరాజ్య సమితికి అన్ని దేశాలు నిధులు ఇస్తుంటాయి. ఈ క్రమంలో భారతదేశం లక్షా 50 వేల డాలర్లు ఇస్తున్నట్లు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత బ్రాండ్ అంబాసిడర్ టి.ఎస్.తిరుమూర్తి ప్రకటించారు. ‘‘శాంతి స్థాపనలో మా దేశం ఎప్పుడు ముందుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో శాంతి స్థాపన కార్యక్రమాలకు మా మద్దతును పెంచుకుంటున్నాం. అందులో భాగంగానే శాంతి స్థాపన నిధికి 2021 సంవత్సరానికి గాను లక్షా 50 వేల డాలర్లు ప్రకటిస్తున్నాం’’ అని న్యూయార్క్‌లో జరిగిన వర్చువల్ సమావేశంలో తిరుమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగానే త్రిమూర్తి 2020లో శాంతిస్థాపనకు జరిగిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం ప్రపంచదేశాల మధ్య శాంతియుత వాతావరణం ఉండాలనేది అందరికీ తెలిసిందే. ప్రధానంగా మూడో ప్రపంచ యుద్ధం అనేది రాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఐరాస కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భారత్ కీలకంగా పని చేస్తుంది. అందుకే భారతదేశానికి ఐరాసలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశంగా భారత్ కొనసాగుతోంది.


