ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్ల దాడి | Hezbolla Rocket Strikes On Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్ల దాడి

Aug 21 2024 7:42 PM | Updated on Aug 21 2024 7:42 PM

Hezbolla Rocket Strikes On Israel

బీరుట్‌: ఇజ్రాయెల్‌పై లెబనాన్‌ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లా ప్రతీకార దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై హెజ్బొల్లా రాకెట్లతో విరుచుకుపడుతోంది. ఇటీవలే ఇజ్రాయెల్‌పై సుమారు 200 రాకెట్లను ప్రయోగించిన హెజ్‌బొల్లా తాజాగా బుధవారం(ఆగస్టు21) యాభైకిపైగా రాకెట్లతో దాడులు జరిపింది.

ఈ రాకెట్ల దాడిలో గొలాన్‌ హైట్స్‌లో ఉన్న ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఓ పక్క ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రయత్నాలు జరుపుతుండగా మరోపక్క హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

మంగళవారం లెబనాన్‌పై ఇజజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా తాము తాజా రాకెట్‌ దాడులు చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది.  ఇజ్రాయెల్‌ దాడుల్లో హెజ్బొల్లా కమాండర్‌ మృతిచెందినప్పటి నుంచి మిలిటెంట్‌ సంస్థ ప్రతీకార దాడులు చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement