లెబనాన్‌లో రష్యాకు చెందిన ఓ స్వీనీ అనే జర్నలిస్టు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడి జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. అంతలోనే ఓ మిసైల్ అతని వైపుగా దూసుకొచ్చింది. ఇది గమనించిన జర్నలిస్టు అక్కడి నుంచి పక్కకు దూకారు. దీంతో ఆ రాకెట్ అక్కడే పేలింది.
ఈ దుర్ఘటనలో జర్నలిస్టుతో పాటు కెమెరామెన్‌కు గాయాలయ్యాయి. దీంతో వారు వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. ఈ మిసైల్ అటాక్ జరిగిన ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన లైవ్‌లో రికార్డయ్యింది. లెబనాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ వీడియో ప్రతిబింబిస్తుంది.
Being a journalist in this modern day war is among hundred ways to die😰
A missile strikes insanely close to him pic.twitter.com/ymUOhS5OEf— Cypher (@patocypher) March 19, 2026


