Live Updates
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
ఇరాన్-అమెరికా రెండో దశ చర్చలపై క్లారిటీ
- ఇరాన్-అమెరికా రెండో దశ చర్చలపై క్లారిటీ
- అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు
- ఇస్లామాబాద్ వేదికగా రెండురోజుల్లో చర్చలు: ట్రంప్
2026-04-14 21:29:53
ట్రంప్‌నకు మోదీ ఫోన్
- డొనాల్డ్ ట్రంప్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్
- ట్రంప్‌తో సుమారు 40 నిమిషాలు మాట్లాడిన మోదీ
- ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల వేళ కీలక అంశాలపై సంభాషణ
2026-04-14 20:00:43
అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
- మళ్లీ పాకిస్థాన్‌కు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు!
- ఇస్లామాబాద్‌లో రెండోసారి చర్చలు జరిపే అవకాశం
- ఈ వారం చివరలోనే పాక్‌కు ఇరు దేశాలు
- అంతర్జాతీయ మీడియాలో ఈ మేరకు వార్తలు
2026-04-14 16:44:33
యుద్ధ నష్టంపై ఇరాన్ ఏమందంటే..
- పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటిదాకా ఇరాన్‌కు భారీ నష్టం
- సమారు 270 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో 25 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా
- నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రకటన
- యుద్ధానికి బాధ్యులైన దేశాలే ఆ నష్టాన్ని చెల్లించాలని ఇరాన్ డిమాండ్
- జెనీవా లేదా ఇస్తాంబుల్ వేదికగా రెండో విడత చర్చలు జరిగే చాన్స్
- ఆ చర్చల్లో నష్ట పరిహారం కోరే అవకాశం
2026-04-14 13:48:52
బ్లాకేడ్‌తో ఇరాన్‌కు భారీ నష్టం!
- హర్ముజ్ దిగ్బంధనంతో ఇరాన్‌కు భారీ నష్టం
- సోమవారం నుంచి ఇరాన్ పోర్టులకు చేరుకోని నౌకలు
- ఇరాన్ పోర్టుల నుంచి కదలని నౌకలు
- చమురు, ఎరువులు, ఆహారం, ఇతర సరుకుల రవాణాకు అంతరాయం
- ఎగుమతుల రూపంలో అత్యధికంగా ఇరాన్‌కు నష్టం
- ఒక్క రోజులో 4 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా
- ఇది ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం
2026-04-14 11:25:43
హర్ముజ్ బ్లాకేడ్.. భారత్‌పై ప్రభావం!
- హర్ముజ్‌ను బ్లాకేడ్ చేసిన అమెరికా సైన్యం
- సముద్రంలో నౌకలు, యుద్ధ విమానాల గస్తీ
- ఇరాన్‌కు వచ్చి.. పోయే నౌకలపై క్షుణ్ణంగా తనిఖీలు
- తీవ్రంగా ఖండిస్తున్న పలు దేశాలు
- హర్ముజ్ దిగ్బంధంతో భారత్‌పైనా ప్రభావం
- ఆగిపోనున్న చమురు సరఫరా.. ధరలు పెరిగే అవకాశం?
- భారత్ నౌకలకు లైన్ క్లియర్‌గానే ఉందన్న ఇరాన్
- హర్ముజ్ బ్లాకేడ్‌పై ఇప్పటిదాకా స్పందించని భారత్
సంబంధిత వార్త: హర్ముజ్ హైటెన్షన్.. సంక్షోభం తప్పదా?
2026-04-14 09:52:45
లెబనాన్‌కూ కాల్పుల విరమణ.. అమెరికా ముందడుగు
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
- లెబనాన్‌కు వర్తించని కాల్పుల విరమణ
- లెబనాన్‌పై భీకర దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్.. భారీగా ప్రాణ నష్టం!
- తీవ్రంగా ప్రతిఘటిస్తున్న హెజ్‌బొల్లా గ్రూప్
- ఇజ్రాయెల్-లెబనాన్ శాంతి చర్చల కోసం అమెరికా ముందడుగు
- ఈరోజు రాత్రి చర్చలు జరిగే అవకాశం
- చర్చల్లో పాల్గొననున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో, ఇజ్రాయెల్ లెబనాన్ రాయబారులు
- చర్చలను వ్యతిరేకిస్తున్న హెజ్బోల్లా కీలక నేతలు
2026-04-14 08:50:21
సౌదీ అరేబియా రిక్వెస్ట్
- హర్ముజ్ దిగ్బంధనంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన
- అమెరికా అధ్యక్షుడికి సౌదీ అరేబియా విజ్ఞప్తి
- హర్ముజ్ బ్లాకేడ్‌తో నిలిచిపోనున్న చమురు సరఫరా
- ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే చాన్స్
- దిగ్బంధనం తొలగించాలని సౌదీ అరేబియా విజ్ఞప్తి
2026-04-14 08:46:40
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు?
- అమెరికా ఇరాన్ మధ్య మరోసారి చర్చలు
- రెండో విడత చర్చలు త్వరలోనే!
- జెనీవా(స్విట్జర్లాండ్) వేదికగా చర్చలు జరిగే అవకాశం
- ఇస్లామాబాద్(పాక్) వేదికగా జరిగిన తొలి విడత చర్చలు
- ఇరాన్ బెట్టుతో విఫలైమన చర్చలు
- ఒప్పందం కోసం ఇరాన్ ఆత్రుతగా ఎదురు చూస్తోందంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఇరాన్ దిగి వస్తేనే చర్చలు ఫలిస్తాయంటున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
- తమ కీలకమైన డిమాండ్ల విషయంలో తగ్గేదే లే అంటున్న ఇరాన్
- డీల్‌లో కీలకంగా మారనున్న హర్ముజ్ జలసంధి
- చర్చలు ఫలిస్తే.. అణు ఒప్పందం సైతం ఓ కొలిక్కి వచ్చే చాన్స్
2026-04-14 07:42:34
ఇరాన్ యుద్ధం.. జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
- ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు
- ఇరాన్‌తో ఇంకా చర్చలకు ఆస్కారం ఉంది
- యుద్ధం ఆగడం మా చేతుల్లో లేదు
- బంతి ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉంది
- ఇరాన్ దిగి రావాలని.. ఇంకా సరళమైన ధోరణి ప్రదర్శించాలని హితవు
2026-04-14 07:31:22
హర్ముజ్ ఎఫెక్ట్: అది ఆర్థిక ఉగ్రవాదమేనంటున్న జేడీ వాన్స్
- హర్ముజ్‌లో ప్రారంభమైన అమెరికా బ్లాకేడ్
- ఇరాన్ పోర్టుల వైపు నౌకలు వెళ్లకుండా అడ్డగింత
- అమెరికా బెదిరింపులకు వెనక్కి తగ్గమంటున్న ఇరాన్
- అణు ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య కుదరని ఒప్పందం
- డీల్‌లో హర్ముజ్ కీలకమంటున్న అమెరికా
- ఇరాన్ వార్నింగ్‌పై తీవ్రంగా స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
- జల సంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడం ఆర్థిక ఉగ్రవాదమే: వాన్స్
- ఈ విషయంలో ట్రంప్ నాయకత్వంలో తగిన చర్యలు తీసుకుంటోంది: వాన్స్
- ఇరాన్ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడితే వారి నౌకలు బయటకు వెళ్లకుండా చూస్తాం: వాన్స్
- హర్ముజ్ వద్ద ఇరాన్ చర్యలను అడ్డుకుంటాం: వాన్స్
- అమెరికా బ్లాకేడ్‌తో హర్ముజ్ వద్ద ఉద్రిక్తతలు
2026-04-14 07:08:58
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- లెబన్‌నాన్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులు
- బీరుట్ సహా పలు ప్రాంతాల్లో భారీగా నష్టం
- భారీ సంఖ్యలో మృతులు ఉండొచ్చని కథనాలు
- లెబనాన్ దాడుల్లో.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడులు
- ఇజ్రాయెల్ రక్షణదళం వాహనాలను పేల్చేశామని ప్రకటించిన హెజ్బొల్లా
- శాంతి చర్చలు అటకెక్కే అవకాశం!
2026-04-14 06:52:37
హర్ముజ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- హర్ముజ్ జలసంధిలో అత్యంత ఉద్రిక్తంగా పరిస్థితి
- ఇరాన్ పోర్టులపై బ్లాకేడ్ ప్రారంభించిన అమెరికా నావికాదళం
- ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్న ఇరాన్
- తీవ్రంగా ప్రభావితం అవుతున్న చమురు, గ్యాస్ రవాణా
- ప్రపంచవ్యాప్తంగా హర్ముజ్ పరిణామాలపై ఆందోళనలు
2026-04-14 06:52:37
Advertisement


