ఇరాన్ బలహీనపడింది.. మా వేలు ట్రిగ్గర్‌పై ఉంది: నెతన్యాహు | Benjamin Netanyahu Press Meet After Lebanon Strikes | Sakshi
Sakshi News home page

Benjamin Netanyahu: కాల్పుల విరమణ లెబనాన్‌కి వర్తించదు

Apr 9 2026 12:04 AM | Updated on Apr 9 2026 12:04 AM

Benjamin Netanyahu Press Meet After Lebanon Strikes

ఇరాన్‌కి విధించిన డెడ్‌లైన్ పొడిగించిన ట్రంప్.. మరో రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కొనసాగుతుందని చెప్పారు. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం అందరికీ షాకిచ్చింది. దీంతో ఇరాన్.. మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ తర్వాత, లెబనాన్‌పై దాడులు అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు.

'గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడింది. ఇరాన్‌తో యుద్ధంలో పెద్దఎత్తున లక్ష‍్యాలు సాధించాం. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పది. ‍ట్రంప్‌తో సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. మా వేలు ట్రిగ్గర్‌పై సిద్ధంగా ఉంది. కాల్పుల విరమణ లెబనాన్‌కి వర్తించదు. లెబనాన్.. సంధిలో భాగం కాదు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తాం' అని నెతన్యాహు అన్నారు.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ కేవలం 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు చేసింది. ఇందులో ఇప్పటివరకు 254 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లెబనాన్‌పై ఇలానే దాడులు చేస్తే సీజ్‌ఫైర్ నుంచి ఇరాన్ తప్పుకొనే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement