పశ్చిమాసియా మెుత్తం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇజ్రాయెల్ బలగాలు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నాయి. 1986 యుద్ధంలో మృతిచెందిన ఓ సైనికుడి మృతదేహం కోసం అర‍్థరాత్రి వేళ గాలింపులు జరిపాయి.
ప్రస్తుతం లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకెళ్లింది. ఆ దేశంలోకి చొరబడి హిజ్బుల్లా, హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కడ టెల్ అవీవ్ ఒక ఆసక్తికర ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 1986లో లెబనాన్‌తో యుద్ధం సమయంలో రాన్ అరాద్ అనే ఇజ్రాయెల్ ఫైలట్ మరణించాడు. హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌పై దాడిచేయగా అది తూర్పు లెబనాన్‌లోని బెక్కా లోయ సమీపంలో నబిట్ అనే గ్రామం వద్ద కూలిపోయింది.
అయితే ఆరోజు జరిగిన దాడిలో ఫైలట్ అరాద్ మరణించినట్టు ఇజ్రాయెల్ అప్పుడే నిర్ధారించింది. ఆయన మృతదేహాన్ని వెనక్కితీసుకురావడానికి ప్రయత్నాలు జరుపగా అవి ఫలించలేదు. అయితే ప్రస్తుతం దానికి సరైన సమయం అని భావించిన ఇజ్రాయెల్ ప్రత్యేక కమెండోలను రంగంలోకి దించింది. నాలుగు సైనిక హెలికాప్టర్లతో శుక్రవారం రాత్రి వేళ నబిట్ ప్రాంతానికి చేరుకొని గాలింపులు చేపట్టారు.
తాజాగా ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని పంచుకున్నారు. "ఇజ్రాయెల్ సైనికులు నాలుగు హెలికాప్టర్లలో వచ్చారు. ఆ లోయ ప్రాంతంలో ఆ సైనికుడి మృత దేహం కోసం తవ్వకాలు జరిపారు. అయితే వారికి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. అయితే అతని డెడ్‌బాడీ కోసం మరోసారి వెతుకతామని వారు తెలిపారు" అని గ్రామస్థులు పేర్కొన్నారు.
అయితే అరాద్ అవశేషాలు దొరికే దాకా గాలింపు కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొంది. దీంతో ఇజ్రాయెల్ తమ దేశ సైనికులకు ఎంత గౌరవం ఇస్తుందా అనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అరాద్‌ను ఎక్కడ పూడ్చిందీ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్.. హెజ్బొల్లా దళాలను విచారించి ఆ ఆధారంగానే ఈ ఆపరేషన్ చేపట్టిందని సమాచారం.


