ఇరాన్ దాడులు.. మృతుల వివరాలు ప్రకటించిన యుఏఈ | Iranian Missile And Drone Attacks On UAE Kill 3 Foreign Nationals, Injure 112 Amid Gulf Tensions | Sakshi
Sakshi News home page

ఇరాన్ దాడులు.. మృతుల వివరాలు ప్రకటించిన యుఏఈ

Mar 8 2026 7:31 AM | Updated on Mar 8 2026 1:29 PM

Defense Ministry announces details of attacks on UAE

ఓ వైపు తమ పరిసర దేశాలపై దాడులు చేయమని ప్రకటించిన ఇరాన్... మరోవైపు అటాక్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దుబాయిపై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకపడినట్లు యూఏఈ తెలిపింది. ఇప్పటి వరకూ ఇరాన్‌ జరిపిన దాడుల్లో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందగా 112 మంది గాయపడ్డట్లు యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ గల్ఫ్ దేశాలపై అటాక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లోని యుఎస్‌ఏ మిలిటరీ స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్  నిన్న (శనివారం) స్పందించారు. గల్ఫ్ దేశాలపై దాడులు జరిపినందుకు క్షమాపణలని ఇకపై దాడులు జరపమన్నారు. అయితే వారి దేశం నుంచి అమెరికా దాడులు చేయకుండా చూసుకోవాలని కోరారు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యుఏఈపై ఇరాన్ దాడులు జరుపుతున్నట్లు  ఆ దేశ  రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది

యుఏఈ డిఫెన్స్‌ ఫోర్స్‌ ట్వీట్‌ చేస్తూ   "7 వతేదీ శనివారం రోజు యుఏఈ పై ఇరాన్  16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో 15 క్షిపణులు, 119 డ్రోన్లు గాలిలోనే కూల్చివేయబడ్డాయి. ఇప్పటివరకూ మెుత్తంగా 221 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడగా 205 క్షిపణులను గాలిలోనే కూల్చివేశాము. 14 సముద్రంలో పడ్డాయి. 2 క్షిపణులు మాత్రం యూఏఈ భూభాగాన్ని తాకాయి. అదేవిధంగా 1,305 డ్రోన్లను ప్రయోగించగా 1,229 కూల్చివేశాము. 76 డ్రోన్లు భూభాగాన్ని తాకాయి." అని తెలిపింది

కాగా ఇప్పటి వరకూ ఈ దాడులలో ముగ్గురు విదేశీ  పౌరులు మృతి చెందారని వారు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జాతీయులను పేర్కొంది. అయితే ఇరాన్‌ జరిపిన  అటాక్స్‌ వల్ల 112 మందికి స్వల్ప గాయాలయ్యాయాయని అందులో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నారని యుఏఈ రక్షణ శాఖ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement