వైమానిక దాడులు చేస్తాం..ఇరాన్ హెచ్చరిక | Iran issues warning to Israel | Sakshi
Sakshi News home page

వైమానిక దాడులు చేస్తాం..ఇరాన్ హెచ్చరిక

Apr 8 2026 4:26 PM | Updated on Apr 8 2026 4:39 PM

Iran issues warning to Israel

పశ్చిమాసియా యుద్ధంలో సీజ్‌ఫైర్‌ ఒప్పందంతో ఇరాన్‌ శాంతించినా.. ఇజ్రాయెల్‌ మాత్రం తన తీరు మార్చుకున్నట్లు లేదు. తాజాగా దక్షిణ లెబనాన్‌ ప్రాంతంలో క్షిపణులతో విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌, టెల్‌ అవీవ్‌కు భారీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుంది. ఈ విషయమై ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. "కొన్ని గంటల్లో దక్షిణ లెబనాన్‌పై బాంబుల దాడిని ఆపకుంటే ఇరాన్‌ వైమానికి దళం టెల్‌ అవీవ్‌పై దాడులు కొనసాగిస్తుంది" అని ఇరాన్ ప్రకటించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

అయితే ఈ విషయమై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు  "ఈ కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇరాన్‌తో నేరుగా జరిగే యుద్ధానికి మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై పోరాటం ఆగదని" తేల్చి చెప్పారు. లెబనాన్ నుండి హిజ్బుల్లా దాడులు చేస్తున్నంత కాలం ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మరో వైపేమో ఇరాన్‌ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కాల్పుల ఉల్లంఘన జరిగే అవకాశం ఉందా అని ఆందోళన ‍వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement