ఆ ఒప్పందాన్ని అంగీకరించం | Hezbollah rejects Israel-Lebanon ceasefire | Sakshi
Sakshi News home page

ఆ ఒప్పందాన్ని అంగీకరించం

Jun 5 2026 3:48 AM | Updated on Jun 5 2026 4:30 AM

Hezbollah rejects Israel-Lebanon ceasefire

లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు వైదొలగాలి 

హెజ్‌బొల్లా గ్రూప్‌ నేత నయీమ్‌ కాశీం డిమాండ్‌  

బీరూట్‌: ఇజ్రాయెల్, లెబనాన్‌ ప్రభుత్వం మధ్య కుదిరిన తాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము అంగీకరింబోమని హెజ్‌బొల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ నాయకుడు నయీమ్‌ కాశీం తేల్చిచెప్పారు. లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు పూర్తిగా వైదొలగాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాశీం విడుదల చేసిన లిఖితపూర్వక ప్రకటనను హెజ్‌బొల్లా టీవీ అల్‌–మనార్‌లో గురువారం చదివి వినిపించారు. 

కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. హెజ్‌బొల్లా మిలిటెంట్లు దక్షిణ లెబనాన్‌ను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇందుకు మిలిటెంట్లు ఒప్పుకోవడం లేదు. అలాచేసే తాము లొంగిపోయినట్లు, ఓటమిని అంగీకరించినట్లే అవుతుందని అంటున్నారు. శత్రువుకు తలవంచబోమని తేల్చిచెబుతున్నారు. దురాక్రమణకు ముగింపు పలకాలని, లెబనాన్‌ నుంచి వైదొలగాలని ఇజ్రాయెల్‌ను కాశీం డిమాండ్‌ చేశారు. దురాక్రమణ కొనసాగుతున్నంత కాలం ప్రతిఘటనను విరమిస్తామని ఎవరికీ హామీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటే ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గాలన్నారు. హెజ్‌బొల్లా గ్రూప్‌కు ఇరాన్‌ మద్దతిస్తున్న సంగతితెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement