వారి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందోచ్‌..! | Trump announces 10 day Lebanon ceasefire | Sakshi
Sakshi News home page

వారి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందోచ్‌..!

Apr 16 2026 9:31 PM | Updated on Apr 16 2026 9:36 PM

Trump announces 10 day Lebanon ceasefire

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ల మధ్య జ్వాలాగ్ని చల్లారనుందా?, ఆ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందా? యుద్ధానికి ఇరు దేశాలు తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చాయా? అంటే అవుననక తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రధానంగా లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్‌ రుబియో ఫోన్‌ చేసి చర్చలు జరిపారు. 

అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్‌ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు.  దాంతో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్‌. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్‌ ఇచ్చారు.  మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
Advertisement