Live Updates
ఇరాన్‌కు అమెరికా మరోసారి వార్నింగ్
ఇరాన్‌కు అమెరికా వార్నింగ్
- చర్చల వేళ ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక
- తమతో ఆటలాడితో పరిస్థితులు వేరుగా ఉంటాయన్న అమెరికా
- చర్చల కోసం పాక్‌కు బయల్దేరే క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు
2026-04-10 19:18:57
ఇజ్రాయెల్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- లెబనాన్‌పై దాడులు ఆపేది లేదు
- సీజ్‌ఫైర్ ఒప్పందంలో లెబనాన్ భాగస్వామ్యం కాదు.
- కీలక ప్రకటన విడుదుల చేసిన నెతన్యాహు
2026-04-10 16:34:13
లెబనాన్‌పై దాడులు ఆపండి: యూకే ప్రధాని స్టార్మర్
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపండి
- ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఈ దాడులు ఏంటి?
- ఆ దాడులు విసుగు తెప్పిస్తున్నాయి
- ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ ఒక్కటే
- పుతిన్ తరహాలోనే ట్రంప్ కూడా ఉన్నారు
- పెరుగుతున్న ఇంధన దరలకు ఎవరు కారణం: స్టార్మర్
2026-04-10 15:46:47
ఇరాన్ తర్జన భర్జన
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తర్జన భర్జన
- అమెరికా ఒప్పందాన్ని వదులుకోవాలా.. లేక సంయమనం పాటించాలా అనే దానిపై డైలమా
- ఇజ్రాయెల్ వైఖరిపై ఎటు తేల్చుకోలేకపోతున్న ఇరాన్
2026-04-10 15:41:00
అప్పటిదాకా చర్చలకు వెళ్లం: ఇరాన్
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ప్రతిష్టంభన
- లెబనాన్‌పై తేల్చే వరకు చర్చల్లేవన్న ఇరాన్
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చలు: ఇరాన్
- అధికారికంగా ధృవీకరించిన ఇరాన్ మీడియా
- లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదంటున్న ఇజ్రాయెల్
- దాడులు కొనసాగుతాయని స్పష్టీకరణ
- ఇస్లామాబాద్‌లో ఇవాళ, రేపు జరగాల్సిన చర్చలు
2026-04-10 10:15:56
పాక్‌పై నెతన్యాహు ఫైర్
- పాకిస్తాన్‌పై మండిపడ్డ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
- పాక్ ఇజ్రాయెల్ నాశనం కోరుకుంటోందని వ్యాఖ్య
- లెబనాన్ దాడుల విషయంలో ఇజ్రాయెల్‌కు శాపనార్థాలు పెట్టిన పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్
- తీవ్ర పదజాలంతో ఎక్స్ ఖాతాలో ట్వీట్
- తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ పీఎం కార్యాలయం
- శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించే ఏ దేశం కూడా మరో దేశ నాశనం కోరుకోదంటూ ట్వీట్
- ఇప్పటికే.. మధ్యవర్తిత్వంలో పాక్ పాత్రపై ఇజ్రాయెల్ అనుమానాలు
- పాక్ అసలు నమ్మదగిన దేశం కాదంటూ వ్యాఖ్య
- పాక్‌కు అసలు అంత సీన్ లేదని.. ట్రంప్ కరివేపాకులా వాడి పారేస్తారని ఇజ్రాయెల్ ఎద్దేవా
2026-04-10 08:38:08
శాంతి.. భ్రాంతేనా?
- యుద్ధం.. చర్చలు
- పశ్చిమాసియాలో శాంతి భ్రాంతేనా?
- ఇస్లామాబాద్‌లో చర్చల వేళ.. మరింత ముదురుతున్న పంచాయతీ
- లెబనాన్ విషయంలో తగ్గేదే లే అంటున్న ఇరాన్
- హెజ్‌బొల్లా అంతమయ్యే దాకా లెబనాన్‌లో దాడులు ఆగవంటున్న ఇజ్రాయెల్
- ఇటు ఇజ్రాయెల్-పాక్ మధ్య పేలుతున్ను మాటల తూటాలు
- సైలెంట్‌గా ఉండిపోయిన అమెరికా
- పాక్ మధ్యవర్తిత్వంలోనే లోపముందా?
- లెబనాన్ కన్ఫ్యూజన్‌కు అసలు కారణమేంటి?
- దీర్ఘకాలిక యుద్ధం తప్పదా?
2026-04-10 08:34:21
శాంతి చర్చల్లో బిగ్ ట్విస్ట్
- ఇరాన్-అమెరికా శాంతి చర్చలపై సందిగ్ధత
- లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గని ఇరాన్
- లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు ఉండబోవంటూ ఇరాన్ ప్రకటన
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటున్న ఇరాన్
- ఆపకుంటే తాము దాడులకు దిగుతామని హెచ్చరికలు
- కుదరదంటున్న ఇజ్రాయెల్
- హెజ్‌బొల్లా అంతమే లక్ష్యమని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
- అయితే.. లెబనాన్‌తో శాంతి చర్చలు మాత్రం ఉంటాయన్న నెతన్యాహు
- నెతన్యాహుకి ట్రంప్ సపోర్ట్?
- పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు
- ఇప్పటికే పాక్ బయల్దేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
- ఇస్లామాబాద్ వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో ఇరాన్
- లెబనాన్ అంశం తేలేవరకు శాంతి చర్చలు వాయిదా పడే ఛాన్స్??
2026-04-10 07:28:33
మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
- ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
- హర్ముజ్ నిర్వహణను కొత్త దశలోకి తీసుస్తాం:మొజ్తబా ఖమేనీ
- యుద్ధంలో ఇప్పటివరకు మేమే విజయం సాధించాం: మొజ్తబా ఖమేనీ
- ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు: మొజ్తబా ఖమేనీ
- హర్ముజ్‌ను ఎలాగైనా తెరుస్తామని ట్రంప్ ప్రకటన
- ట్రంప్ ప్రకటన వెలువడిన కాసేపటికే ఖమేనీ నోట హర్ముజ్ మాట
2026-04-10 07:15:07
లెబనాన్‌తో చర్చలుంటాయ్, కానీ..
- లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్ సిద్ధం
- స్వయంగా ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
- శాంతి చర్చల కోసం లెబనాన్ పదే పదే సంప్రదిస్తోంది
- అందుకే చర్చలకు అంగీకరిస్తున్నాం
- వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని ఢిపెన్స్ కేబినెట్‌ను ఆదేశించా
- హెజ్‌బొల్లాను నిరాయుధీకరణ చేయడమే మా లక్ష్యం
- లెబనాన్‌తో శాశ్వత శాంతిని నెలకొల్పాలన్నదే మా రెండో లక్ష్యం
- ఇరాన్-అమెరికా&కో మధ్య రెండు వారాల యుద్ధ విరమణ
- లెబనాన్‌పై మాత్రం దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్
- హెజ్‌బొల్లా గ్రూపు లక్ష్యంగా కొనసాగుతున్న దాడులు
- ప్రతిదాడులు జరుపుతున్న హెజ్‌బొల్లా
- ఇజ్రాయెల్ దాడుల్లో 300 మందికి పైగా మృతి
2026-04-10 07:05:33
హర్ముజ్‌పై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు
- హర్ముజ్‌ను తెరిచినట్లే తెరిచి మూసేసిన ఇరాన్
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలోనే నిర్ణయం
- ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు పరిమిత నౌకలకు అనుమతిస్తామని వెల్లడి
- సీ మైన్‌ల నేపథ్యంతోనేనంటూ ప్రకటించినా.. లెబనాన్ దాడులే కారణమంటున్న విశ్లేషకులు
- హర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- హర్ముజ్ ద్వారా త్వరలోనే పూర్తిస్థాయి చమురు సరఫరా జరుగుతుంది: ట్రంప్
- ఇది ఇరాన్ సహాయం లేకుండా జరగవచ్చు: ట్రంప్
- హర్ముజ్‌లో ఎలాంటి టోల్ విధించకూడదు: ట్రంప్
- ఇప్పటికే విధిస్తుంటే వెంటనే ఆపేయాలి: ట్రంప్
- ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధాలు అందవు: ట్రంప్
2026-04-10 06:58:32
ఇస్లామాబాద్‌లో ఇవాళే శాంతి చర్చలు
- ఇరాన్-అమెరికా మధ్య పాకిస్తాన్‌లో శాంతి చర్చలు
- పాక్ మధ్యవర్తిత్వంతో ఆగిన యుద్ధం
- రెండు వారాల్లో ఒప్పందం కుదరకుంటే.. మళ్లీ యుద్ధం జరిగే చాన్స్
- ఇస్లామాబాద్ చేరుకుంటున్న అమెరికా, ఇరాన్ బృందం
- కీలక అంశాలపై సయోధ్య కోసం చర్చలు
- లెబనాన్‌పై దాడులు ఆపేయాలంటున్న ఇరాన్
- దాడులు చేస్తూ.. శాంతి చర్చలు అనడం కరెక్ట్ కాదని వాదన
- దాడులు ఆగకుంటే యుద్ధం మళ్లీ మొదలవుతుందని ఇరాన్ హెచ్చరిక
- లెబనాన్‌కు సీజ్‌ఫైర్ వర్తించదని.. దాడులు ఆగవని ఇప్పటికే స్పష్టం చేసిన అమెరికా, ఇజ్రాయెల్
- హర్ముజ్ జలసంధిలో నౌకలను అనుమతించకపోతే పరిణామాలు మరోలా ఉండొచ్చని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
2026-04-10 06:35:45
Advertisement


