ఇజ్రాయిల్ దాడుల్లో జర్నలిస్టులు మృతి | Journalists killed in Israeli attack | Sakshi
Sakshi News home page

ఇజ్రాయిల్ దాడుల్లో జర్నలిస్టులు మృతి

Mar 29 2026 1:00 AM | Updated on Mar 29 2026 4:01 AM

Journalists killed in Israeli attack

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లో శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందినట్లు ఆదేశ సైన్యం ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంపైకి కంబాట్‌ ఆపరేషన్ చేపడుతూ పెద్దఎ‍త్తున హిజ్బుల్లా ఫైటర్స్‌ను హతమారుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ దాదాపు 400కు పైగా హిజ్బుల్లా ఫైటర్స్‌ అంతం చేసినట్లు ప్రకటించింది. తాజాగా శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది.  

హిజ్బుల్లాకు చెందిన ఛానెల్‌ షుయబ్-అల్- మనార్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టుతో పాటు మరో మహిళా జర్నలిస్టు, కెమెరామెన్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన జర్నలిస్టు దశాబ్దకాలంగా యుద్ధవార్తలు కథనాలు ప్రచురిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ దాడులను లెబనాన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. కాగా 2023 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక మంది పాత్రికేయులు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement