లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దక్షిణ ప్రాంతంలోని హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు (IOF) వైమానికదాడులు జరుపుతున్నాయి. నష్టం వివరాలు తెలియరావాల్సింది. అయితే తాజా పరిణామాలతో ఇజ్రాయెల్-హోజ్‌బొల్లా ఘర్షణలు మళ్ల తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్‌బొల్లా షెల్టర్‌లను టార్గెట్ చేశాయి. సాజ్, అల్-రయ్‌హాన్, మౌంట్ అల్-రఫీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. దీర్ అల్-జహ్రాని, హౌమిన్ అల్-ఫౌఖా ప్రాంతాల గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాల సంచారం కనిపించిందని తెలుస్తోంది.
మరోవైపు.. దీర్ అల్-జహ్రాని–హౌమిన్ అల్-ఫౌఖాలోని లోయపై బాంబుదాడి జరిగింది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్‌లోని క్ఫార్ఫిలా, రూమైన్, మౌంట్ రయ్‌హాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా దాడులతో స్పష్టమవుతోంది. అటు వాది హమిలా ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు సమాచారం.
హెజ్‌బొల్లాకి చెందిన మిసైల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆయుధ గిడ్డంగులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించుకుంది. 2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన సీజ్‌ఫైర్ తర్వాత కూడా ఇజ్రాయెల్ 10,000కిపైగా ఉల్లంఘనలు జరిపిందని UNIFIL (United Nations Interim Force in Lebanon) గణాంకాలు చెబుతున్నాయి. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆవున్ తాజా దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయన్నారు. లెబనాన్‌లోని పలు గ్రామాల ప్రజలను తక్షణ ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ.. ఐక్యరాజ్య సమితి కూడా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.


