బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్న హయథమ్ అలీ తబ్‌తబై సహా ఐదుగురు చనిపోగా 24 మంది గాయపడ్డారు. జూన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి జరపడం ఇదే మొదటిసారి.
బీరుట్ శివారులోని హరెట్ హెచ్‌చీక్ ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌పై కచ్చిత లక్ష్యంతో దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హెజ్‌బొల్లా సీనియర్ మిలిటెంట్ హయథమ్ అలీ తబ్‌తబై హతమయ్యాడని తెలిపింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈయనపై ఇజ్రాయెల్ హత్యాయత్నం చేసినట్లు సమాచారం. తాజాగా జరిగిన క్షిపణి దాడిలో హయథమ్ గాయపడ్డారా లేదా చనిపోయారా అనేది హెజ్‌బొల్లా ధ్రువీకరించలేదు. దాడి కారణంగా అపార్టుమెంట్ భవనం పూర్తిగా దెబ్బతిందని, పలు కార్లతోపాటు చుట్టుపక్కల భవనాలు కూడా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. రెండు క్షిపణులు ఆ భవనంపై పడినట్లు స్థానికులు తెలిపారు. హెజ్‌బొల్లాలోని శక్తివంతమైన రద్వాన్ యూనిట్‌కు హయథమ్ సారధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం 2016లో ఈయన్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈయన తలపై 5 లక్షల డాలర్ల రివార్డు ఉంది.
ఇదిలా ఉండగా.. హయథమ్ అలీ టార్గెట్ కారణంగా దహియేలో భయాందోళన నెలకొంది. అక్కడ దాడులకు కొన్ని క్షణాల ముందు యుద్ధ విమానాల గర్జన విన్నట్లు నివాసితులు తెలిపారు. వాహనాలు మరియు భవనాలు ధ్వంసమై కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో 24 మందికిపైగా ౌపౌరులు మృతి చెందినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, హెజ్‌బొల్లా కమాండర్‌కు నివాసంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే మొదటిది.


