బెర్లిన్: చారిత్రక శత్రుత్వం నుంచి బలమైన రక్షణ బంధం వైపు జర్మనీ, ఇజ్రాయెల్ దేశాలు అడుగు వేశాయి. హోలోకాస్ట్(రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన మానవ ఊచకోత) ముగిసిన 80 ఏళ్ల తర్వాత, జర్మనీ తన దేశ భద్రత కోసం ఇజ్రాయెల్ తయారు చేసిన ‘ఆరో 3’ (Arrow 3) క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. ఇది రెండు దేశాల మధ్య మారిన సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది.
సుమారు 56 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ రక్షణ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందంగా రికార్డు సృష్టించింది. దీనిలో భాగంగా మొదటి విడత రక్షణ సామగ్రిని ఇజ్రాయెల్ ఇప్పటికే జర్మనీకి అందజేసింది. దీంతో జర్మనీ ఆకాశానికి పటిష్టమైన రక్షణ కవచం లభించింది.
HISTORIC: Israeli missile defense is now guarding Germany’s skies. 🇮🇱🇩🇪
Less than 80 years after the Holocaust, Germany is relying on Jewish innovation to protect its people. From Auschwitz to Arrow 3, this is a moment the world should remember. pic.twitter.com/bDBTh6uXEq— Hananya Naftali (@HananyaNaftali) December 21, 2025
ఈ ‘ఆరో 3’ వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఇది భూ వాతావరణానికి అవతలే (అంతరిక్షంలోనే) గుర్తించి కూల్చేస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని, జర్మనీ ప్రభుత్వం ఈ అత్యాధునిక సాంకేతికతను ఎంచుకుంది. ఇది ఇజ్రాయెల్ సాంకేతిక శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ వివరాలను ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ అందించింది. జర్మనీ పార్లమెంట్ ఇటీవల మరిన్ని నిధులను కూడా ఈ వ్యవస్థ కోసం కేటాయించింది. ఇది భవిష్యత్తులో ఐరోపా దేశాల రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. 
ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్‌మెయిల్


