ఇరాన్‌లో బాంబు పేలుళ్లు.. ఐదుగురు మృతి | Bomb blasts in seven cities in Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో బాంబు పేలుళ్లు.. ఐదుగురు మృతి

Feb 1 2026 3:26 AM | Updated on Feb 1 2026 4:33 AM

Bomb blasts in seven cities in Iran

ఇరాన్‌లో బాంబుల మోత మోగింది. ఆ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో బాంబుల మోత మోగింది. ఈ దాడుల్లో ఐదుగురు  మరణించినట్లు సమాచారం. కాగా ఈ పేలుళ్లును ఇరాన్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

శనివారం ఇరాన్‌లోని ఏడు నగరాల్లో బాంబుపేలుళ్లు సంభవించాయి.  ఆ దేశ రాజధాని టెహ్రాన్‌తో పాటు, పరాండ్, తబ్రిజ్, కోమ్, అహ్వాజ్, నానాజ్‌ తో పాటు బందర్, అబ్బాస్ నగరాల్లో పెద్దఎత్తున పేలుళ్లతో దద్ధరిళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 14 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది.  అయితే ఈ పేలుళ్లకు తమ బాధ్యత లేదని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి.

అయితే ప్రస్తుతం ఇరాన్‌, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్దఎత్తున రోడ్లెక్కారు. ఈ ఆందోళనలో దాదాపు ఐదు వేల మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు  మసౌద్ పెజెష్కియన్ స్పందించారు. 

ప్రస్తుతం ఇరాన్‌లో నడుస్తున్న నిరసనలను అమెరికా, ఇజ్రాయెల్ ఆసరాగా తీసుకోవాలని చూస్తున్నాయని తెలిపారు. తద్వారా ఇరాన్‌లో అశాంతి వ్యాప్తి చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement