నిన్న మొన్నటి వరకూ ఇరాన్ లక్ష్యంగా దాడులు చేసిన ఇజ్రాయిల్.. ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వెనెజువాలాలో గత వారంగా జరుగుతున్న పరిణామాలు ఉదహరిస్తూ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. ‘ మీరు దారికి రాకపోతే వెనెజువెలాలో ఏం జరిగిందో అదే జరుగుతుంది’ అని ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు యేర్ లాపిడ్ పేర్కొన్నారు..
అమెరికా సైన్యం.. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అరెస్ట్ చేసిన ఘటనను ఉదాహరణగా చూపిస్తూ,ఇరాన్ పాలకులు వెనిజులాలో జరుగుతున్న పరిణామాలను గమనించాలి” అని స్పష్టంగా పేర్కొన్నారు. దీని ఫలితంగా అమెరికా ఒక దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేయగలిగితే, ఇరాన్ పాలకులు కూడా ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చనే సంకేతాలు పంపారు లాపిడ్. ఇది ఇరాన్‌క ఒక హెచ్చరిక లాంటిదిగా పేర్కొన్నారు. ఇరాన్ పాలకులు తమ చర్యలకు గణనీయమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ భేటీ తర్వాత.. వెనెజువాలాపై అగ్రరాజ్యం దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైన మదురోను నిర్బంధించింది. ఆయనపై నార్కో-డ్రగ్స్ ముద్ర వేసి న్యూయార్క్‌లో తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్‌ను ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు హెచ్చరించడం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే.. తమపై దాడికి దిగితే అందుకు మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్‌కు మాటల ప్రతిదాడికి దిగింది.
ఒకవేళ అమెరికాతో తమపై యుద్ధానికి దిగితే కచ్చితంగా తిప్పి కొడతామని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. తాము మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ తాజా పరిణామాలు ఇజ్రాయిల్-ఇరాన్‌ల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు..


