యూఏఈ సంచ‌ల‌న నిర్ణయం.. అనాథ‌ల కోసం రూ.225 కోట్లు | AED 100 million boost for Mother of Nation Endowment for Orphans | Sakshi
Sakshi News home page

యూఏఈ సంచ‌ల‌న నిర్ణయం.. అనాథ‌ల కోసం రూ.225 కోట్లు

Feb 22 2026 3:30 AM | Updated on Feb 22 2026 3:30 AM

AED 100 million boost for Mother of Nation Endowment for Orphans

అనాథ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం యూఏఈ ప్ర‌భుత్వం చారిత్ర‌త్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. 'మదర్ ఆఫ్ ది నేషన్ ఎండొవ్‌మెంట్' కార్యక్రమానికి యూఏఈ శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం  'ఎర్త్ జాయెద్ ఫిలాంత్రోపీస్' (Erth Zayed Philanthropies) అనే సంస్థ 100 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ.225 కోట్లకు పైగా)ను విరాళంగా ప్ర‌క‌టించింది.

యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ జ్ఞాపకార్థం ఈ 'ఎర్త్ జాయెద్ ఫిలాంత్రోపీస్' సంస్థను స్థాపించారు. అబుదాబీ కేంద్రంగా పనిచేసే ఈ ప్ర‌భుత్వ‌ సంస్థ..యూఏఈ అంతర్జాతీయ మానవతా సాయం, స్వచ్ఛంద కార్యక్రమాలన్నింటినీ నిర్వ‌హిస్తుంటుంది.

ఈ సంస్థ చైర్మెన్‌గా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు. కాగా  ఈ 100 మిలియన్ దిర్హామ్‌లను అబుదాబి అవ్కాఫ్ పర్యవేక్షణలో ప్రత్యేక పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని యూఏఈలోని అనాథ పిల్లల విద్య, ఆరోగ్యం, వారి భవిష్యత్తు సాధికారత కోసం ఖర్చు చేయునున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement