మైనర్ బాలురపై లైంగిక దాడి.. టీచ‌ర్‌కు 51 ఏళ్ల జైలు శిక్ష | 34-year-old woman pleaded guilty to seven felonies | Sakshi
Sakshi News home page

మైనర్ బాలురపై లైంగిక దాడి.. టీచ‌ర్‌కు 51 ఏళ్ల జైలు శిక్ష

Feb 22 2026 2:10 AM | Updated on Feb 22 2026 2:10 AM

34-year-old woman pleaded guilty to seven felonies

అమెరికాలోని విస్కాన్సిన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలురపై లైంగిక వేధింపులకు పాల్ప‌డిన మాజీ ఉపాధ్యాయురాలికి 51 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కెనోషా కౌంటీలోని ఎలిమెంటరీ స్కూల్‌లో ప‌నిచేసిన అన్న మేరీ క్రోకర్ (34) చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసింది. 

ఆమె విద్యార్థులను ప్రలోభపెట్టడం, వారికి అశ్లీల సందేశాలు పంపడం వంటివి చేసేది. అంతేకాకుండా 12, 14 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల ఇద్ద‌రు బాలురుపై ఆమె లైంగిక దాడులకు పాల్పడినట్లు రుజువైంది. పాఠశాల పరిసరాలు, విద్యార్థుల ఇళ్ల వద్ద కూడా ఆమె ఈ దారుణాలకు ఒడిగట్టింది.

గతేడాది డిసెంబర్‌లోనే మేరీ క్రోకర్ తనపై ఉన్న నేరారోపణలను అంగీకరించింది. దీంతో కోర్టు తాజాగా ఆమెకు శిక్ష విధించింది.  34 ఏళ్ల వయస్సు ఉన్న క్రోకర్ త‌న 80వ ఏట వచ్చే వరకు జైలులోనే గ‌డ‌ప‌నుంది. ఆమెకు  నలుగురు పిల్లలు ఉండ‌డం గ‌మ‌నార్హం. కాగా అమెరికాలో చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాలు చాలా క‌ఠినంగా ఉంటాయి. అది మేరీ క్రోకర్ కేసు విష‌యంలో మ‌రోసారి రుజువైంది.

Advertisement
 
Advertisement
Advertisement