మ‌రో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్ | Trump hikes tariffs to 15% after court ruling | Sakshi
Sakshi News home page

మ‌రో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్

Feb 21 2026 10:31 PM | Updated on Feb 21 2026 10:48 PM

Trump hikes tariffs to 15% after court ruling

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో బాంబు పేల్చారు. అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై తాత్కాలిక సుంకాన్ని పది నుంచి ప‌దిహేను శాతంకు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కాగా శుక్ర‌వారం ఆయా దేశాల‌పై ట్రంప్ విధించిన గ్లోబుల్ టారిఫ్‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 

దీంతో ధ‌ర్మాసనం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. సెక్షన్ 122 కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవార‌మే ట్రంప్‌ సంతకాలు చేశారు. అయితే ట్రంప్‌ త‌న నిర్ణయాన్ని పునఃసమీక్షించి.. గరిష్టంగా 15 శాతం వరకు పెంచుతున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించారు.

"ప్ర‌పంచ దేశాల‌పై విధిస్తున్న 10% సుంకాన్ని 15%కి పెంచాలని నిర్ణ‌యించాను. ఇది త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి రానుంది. దశాబ్దాలుగా అనేక దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయి. రాబోయో కొద్ది నెలల్లో చ‌ట్ట‌బ‌ద్దంగా అనుమ‌తించ‌ద‌గిన టారిఫ్‌ల‌ను అమ‌ల్లోకి తీసుకు రానున్నాను" అని  ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

కాగా సెక్షన్ 122 ప్ర‌కారం.. అమెరికా ప్రెసెడెంట్ గరిష్టంగా 15 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. ఈ సుంకాలు 150 రోజుల వరకు అమలులో ఉంటాయి. ఆ తర్వాత పొడిగించాలంటే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం తప్పనిసరి
 

Advertisement
 
Advertisement
Advertisement