breaking news
Venezuela
-
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్‌గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్‌లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
ట్రంప్‌కు నోబెల్ నిరాశ
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిని బలవంతంగానైనా సాధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చివరకు భంగపాటే ఎదురయ్యింది. తానే ప్రపంచంలో అతిపెద్ద శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపి ప్రపంచంలో శాంతిని నెలకొల్పానని, అందువల్ల తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న ఆయన వాదనను నోబెల్ కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనెజువెలా ప్రతిపక్ష నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు ప్రకటించటంతో ట్రంప్ కార్యవర్గంపై నోబెల్ కమిటీపై అక్కసు వెళ్లగక్కింది. నోబెల్ కమిటీ అసలైన శాంతి పరిరక్షకులకంటే రాజకీ యాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించింది. మరోవైపు ‘మీడియా ప్రచారాన్ని నమ్మి నోబెల్ ఇవ్వం’ అని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ కోసం ట్రంప్ డిమాండ్నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆసక్తి ఇప్పటిది కాదు. ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచే దానిపై మనసు పారేసుకున్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఏకంగా తనకు నోబెల్ పురస్కారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. తనకు ఆ పురస్కారం రాకపోవటంకంటే తన రాజకీయ ప్రత్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇవ్వటమే ట్రంప్‌ను అధికంగా మనోవేదనకు గురిచేస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. ఈ ఏడాది మొదట్లో అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ఆయన నోబెల్ శాంతిబహుమతిపై కన్నేశారు. పలు దేశాలను బెదిరించి మరీ తనకు నామినేషన్ వేయించుకున్నారు. పది నెలల తన పాలనా కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని, ఇంతకంటే శాంతి ప్రదాత ఎవరు ఉంటారని ప్రశ్నిస్తూ వచ్చారు. తనకు నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్లేనని ఇటీవలే వ్యాఖ్యానించారు. పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడా ఆయన దీనిపై స్పందించారు. ‘ఒబామా ఏమీ చేయకుండానే నోబెల్ పురస్కారం ఇచ్చారు. అమెరికాను ధ్వంసం చేసినందుకు ఆయనకు ఇచ్చారు. సరే.. వాళ్లు ఇప్పుడు ఏం చేయగలరో చేయనివ్వండి. ఏ నిర్ణయం ప్రకటించినా మంచిదే. దానికోసం (అవార్డు కోసం) నేను పనిచేయలేదు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకే నేను ఇదంతా (యుద్ధాలను ఆపటం) చేశాను’అని గురువారం తెలిపారు. నోబెల్ కోసం సొంత టీమ్‌తో ప్రచారం చేయించుకున్న ట్రంప్.. ఈ ఏడాది జూలైలో ఏకంగా నార్వే ఆర్థికమంత్రి జెన్స్ స్టాల్టె్టన్బెర్గ్కు స్వయంగా ఫోన్ చేసి తనకు నోబెల్ ఇవ్వకుంటే టారిఫ్‌లు తప్పవన్నట్లు మాట్లాడారని నార్వే మీడియా పేర్కొంది.గడువు ముగిసిన తర్వాత నామినేషన్లుఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఫిబ్రవరి 1వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసిపోయింది. ట్రంప్ తరఫున అనేక నామినేషన్లు వచ్చినప్పటికీ, చాలావరకు ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చినవే ఉన్నాయి. ఈ ఏడాది మేలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాక్‌ను ట్రంప్ చేరదీసి భరోసా ఇవ్వ టంతో.. ఆ తర్వాత పాకిస్తాన్.. ట్రంప్‌కు నోబెల్ శాంతిపురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌తో కూడా బ లవంతంగా గత నెలలో ట్రంప్ నామి నేషన్ ఇప్పించుకున్నారు. అయితే, ఈ పురస్కా రం కోసం ట్రంప్ యంత్రాంగం గత ఏడాది డిసెంబర్ నుంచే ప్రచారం మొద లుపెట్టింది. అందుకోసం అధ్యక్ష కార్యాల యం ఓవల్ ఆఫీస్‌నే కేంద్రంగా చేసు కోవటం గమనార్హం.నోబెల్ కమిటీపై వైట్‌హౌస్ ఫైర్ ట్రంప్‌కు నోబెల్ పురస్కారం ఇవ్వకపోవటంపై అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రతినిధి స్టీవెన్ చెంగ్ అక్కసు వెళ్లగ క్కారు. ‘శాంతి ఒప్పందాలు కుదురుస్తూ, యుద్ధాలు ఆపుతూ, ప్రజల ప్రాణాలు కాపాడే పనిని అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తూనే ఉంటారు. ఆయనది గొప్ప మానవతా హృదయం. తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగల ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండదు. నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది’అని విమర్శించారు. అయితే, శాంతి పురస్కా రానికి అభ్యర్థి ఎంపికపై నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్డాన్ స్పష్టత ఇచ్చారు. ‘నాకు తెలిసి ఈ కమిటీ ఇలాంటి ప్రచారాలు, మీడియా రిపోర్టులను చాలా చూసే ఉంటుంది. శాంతి స్థాపన కోసం అది చేశాం, ఇది చేశామని పేర్కొంటూ మాకు ఏటా వేల లేఖలు వస్తాయి. నోబెల్ పురస్కా రాలు పొందిన గొప్ప వ్యక్తుల చిత్రపటాలతో నిండిన ఓ గదిలో ఈ కమిటీ కూర్చుని చర్చిస్తుంది. ఆ గది సమగ్రత, ధైర్యసాహసాలతో నిండి ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ సేవలు, ఆయన రాసిన విల్లులోని అంశాల ఆధారంగానే మేం నిర్ణయాలు తీసుకుంటాం’అని స్పష్టంచేశారు. -
ప్రజాస్వామ్య గళానికి శాంతి నోబెల్
ఓస్లో: ఎవరిని వరిస్తుందా అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో (57)కు లభించింది. ఓస్లోలో నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ‘చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య అగ్నిజ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు’అని మచాడోను నోబెల్ కమిటీ ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని ఎంత బలంగా వాదించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశే ఎదురయ్యింది. నిర్బంధాలను ఎదిరించి నిలిచిన నేతకమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో పోరాడుతున్నారు. నికొలాస్ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తున్నారు. దీంతో ఆమెపై మధురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి వెళ్లిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు. గత సంవత్సరం వెనెజువెలాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు మదురోకు పోటీగా ఎన్నికల్లో నిలబడుతున్నట్లు మరియా ప్రకటించారు. కానీ, ఆ దేశ ఎన్నికల సంఘం ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. దీంతో ఆమె మరో ప్రతిపక్ష నేత ఎడ్ముండో గోంజాలెజ్‌కు మద్దతు పలికారు. కానీ, ఎన్నికల్లో మదురో 51.95 శాతం ఓట్లు సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మదురో వరుసగా మూడోసారి అధ్యక్షుడ య్యారు. ఆ వెంటనే ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపారు. దీంతో చాలామంది దేశం విడిచి వెళ్లిపోవటమో, అజ్ఞాతంలోకి వెళ్లటమో జరిగింది. మరియా కూడా ఏడాది కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నారు. గోంజాలెజ్ స్పెయిన్‌లో రాజకీయ ఆశ్రయం పొందారు. అయితే, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గోంజాలెజ్ 67 శాతం ఓట్లు సాధించి స్పష్టమైన విజయం సాధించారని మరియా ఎన్నికల తర్వాత వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఇంజనీర్ నుంచి రాజకీయ నేతగామరియా మచాడో వెనెజువెలా రాజధాని కారకాస్‌లో అక్టోబర్ 7, 1967లో జన్మించారు. ఇండస్ట్రియల్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరమే ఆమె రాజకీయ హక్కులు, ఎన్నికల పర్యవేక్షణ కోసం సుమటే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారా వెనెజువెలాలో ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. ‘బుల్లెట్ల స్థానంలో బ్యాలెట్‌ను ప్రోత్సహించటమే నా లక్ష్యం’అని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మచాడో వెనెజువెలా కులీన (ప్రభువర్గం) వర్గానికి చెందినవారు. వెనెజువెలా మూడో మార్వి్కజ్ ఆఫ టోరో (ఆ దేశంలో ప్రభువులకు ఇచ్చే బిరుదు) సెబాస్టియన్ జోష్ ఆంటోనియో రోడ్రిగేజ్ డెల్ టోరో యే అసానియో వారసురాలు. ఆ దేశ ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు ఎడ్వార్డో బ్లానో ఆమెకు ముత్తాత అవుతారు. ఆమె ఆండ్రెస్ బెల్లో క్యాథలిక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చది వారు. ఇన్స్టిట్యూటో డి ఎస్టుడియోస్ సుపీరియరెస్ డి అడ్మినిస్ట్రాసియోలో మాస్టర్స్ చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం. 1992లో ఈటెనా ఫౌండేషన్‌ను స్థాపించారు. అయితే, 2002 నుంచి సుమటే కార్యక్రమాలతో ఆమెకు దేశంలో మంచి పేరు వచ్చింది. 2011 నుంచి 2014 వరకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం ‘వెంటే వెనెజువెలా’రాజకీయ పార్టీకి సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున ఆమె 2012లోనే అధ్యక్ష బరిలో దిగారు. కానీ, ప్రైమరీ ఎన్నికల్లోనే ఓడిపోయారు. 2023లో మరోసారి ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. కానీ, ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా జరుగు తున్న ప్రజాస్వామ్య పోరాటాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు.ఒక అసాధారణ మహిళమరియా మచాడో సేవలను నోబెల్ కమిటీ గొప్పగా ప్రశంసించింది. ‘ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ పౌర సాహసికుల్లో మచాడో ఒకరు’అని కొనియాడింది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నారని జోర్డాన్ వాట్నీ పేర్కొన్నారు. ఓస్లోలో ఈ అవార్డు ప్రకటించిన సమయంలో వెనెజువెలాలో రాత్రి సమయం కావటంతో ఆమె ఒక గుర్తు తెలియని ప్రాంతంలో నిద్రపోతున్నారు. నోబెల్ కమిటీ సభ్యులు ఆమెకు నేరుగా ఫోన్ చేసి విషయం చెప్పగానే షాక్‌కు గురయ్యారు. ‘దేవుడా.. నాకు మాటలు రావటం లేదు. ఇది ఒక ఉద్యమం, మొత్తం సమాజం సాధించిన ఫలితం ఇది. నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే. వ్యక్తిగతంగానే ఈ పురస్కారానికి నేను అర్హురాలిని కాదు’అని పేర్కొన్నారు. మచాడోకు నోబెల్ పురస్కారం రావటంపై వెనెజువెలాలోని ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుంటే, మదురో మద్దతు దారులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ‘దేశంలో పరిస్థితిని మెరుగుపర్చటం ఎలాగో నాకు తెలియదు కానీ, నోబెల్ శాంతి పురస్కారానికి ఆమె (మచాడో) మాత్రం సంపూర్ణంగా అర్హురాలు’అని సాండ్రా మార్టినెజ్ అనే 32 ఏళ్ల మహిళ సంతోషం వ్యక్తంచేశారు. -
ట్రంప్‌కు దక్కని నోబెల్!
ప్రకటించటానికి ముందే రివాజుకు భిన్నంగా అందరి నోళ్లలోనూ నానిన నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది వెనిజులా విపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకుదక్కింది. ఆ దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసమూ... నిరంకుశత్వం నుంచి ప్రజాస్వా మ్యానికి న్యాయమైన, శాంతియుతమైన పరివర్తన సాధించేందుకూ ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా దీన్ని అందిస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పురస్కారంపై బాగా ఆశలు పెట్టుకున్నారు గనుక సహజంగానే ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్ తప్పుబట్టింది. శాంతికన్నా రాజకీయాలకే కమిటీ ప్రాధాన్యమిచ్చిందని విమర్శించింది. కమిటీపై ఈ మాదిరి విమర్శలు గతంలో చాలా వచ్చాయి. మేధావులూ, సామాజిక అధ్యయనకారులూ ఆ పని చేసేవారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రాధాన్యతా అంశంగా భావించే వైపు ప్రపంచ ప్రజల చూపు మర ల్చటం కోసం నోబెల్ కమిటీ ప్రయత్నిస్తున్నదని విమర్శించేవారు. ఇప్పటికే ట్రంప్ వెనిజులాను అష్టదిగ్బంధం చేశారు. గత నెల మొదట్లో వెనిజులా స్పీడ్ బోట్లు రెండింటిపై అమెరికా సైన్యం విరుచుకు పడటంతో 17 మంది మరణించారు. ఇంతవరకూ అవి మాదక ద్రవ్యాలున్న బోట్లని చెప్పే ఆధారాలేమీ అమెరికా ప్రకటించలేదు. ఇది కేవలం మొదటి దశ అని, రెండో దశ వెనిజులా గడ్డపై ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అది సైనిక జోక్యం కావొచ్చన్న అంచనాలున్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వీటన్నిటిపైనా మచాడో స్పందనేమిటో తెలియదు. నిజానికి ఈ ఏడాది సూడాన్‌లో అత్యవసర సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఈ రేసులో ఉంటా యని పలువురు అనుకున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించటమో, కాల్పుల విరమణ సాధించటమో పురస్కారానికి అర్హత సాధించిపెడుతుందని ట్రంప్ అనుకున్నందుకు ఆయన్ను నిందించి ప్రయోజనం లేదు. అందుకు నోబెల్ కమిటీ బాధ్యత కూడా ఉంది. గతంలో కమిటీ ఇచ్చిన కొన్ని పురస్కారాలు గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ పురస్కారం ప్రకటించే నాటికి ఆయన అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైంది. ‘విశ్వ మానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ పురస్కారం ధ్రువీకరిస్తున్నద’ని ఒబామా ఘనంగా చెప్పుకొన్నారు. కానీ ఆ బహుమతి తనకెందుకిచ్చారో ఇప్పటికీ తెలియటం లేదని 2016లో ఆయన నిజాయతీగా ఒప్పుకొన్నారు. బుష్ మొదలెట్టిన యుద్ధాలను ఆయన మరింత ముందుకు తీసుకుపోయారు. ఒబామా ఏలుబడిలో లిబియా, సిరియా, సోమాలియా, అఫ్గాన్లలో అమెరికా సైన్యం దాడుల్లో వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో నోబెల్ ఎంపిక కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన గీర్లెండ్స్టెడ్ అది ఘోర తప్పిదమని 2015లో అంగీకరించారు. వాస్తవానికి 1973లో నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. 1971లో బొలీవియా, 1973లో చిలీ దేశాల్లో సైనిక తిరుగు బాట్లకు పథక రచన చేయటం, బంగ్లాదేశ్‌లో పాక్ సైన్యం సాగించిన నరమేధానికిఅండదండలీయటం, అనేక చోట్ల నియంతృత్వ ప్రభుత్వాలకు చేయూతనందించటం వగైరాల్లో ఆయన పాత్ర అత్యంత దారుణమైనది. నిరాయుధీకరణకూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికీ చిత్తశుద్ధితో పనిచేసేవారికి మొదట్లో ఆ బహుమతి ఇచ్చేవారు. అటుతర్వాత ఇతరేతర ప్రయోజనాలూ, ఉద్దేశాలూ వచ్చిచేరాయి. వర్తమానంలో ఆయుధాలు పోగేసుకోవటం, బెదిరించటం, క్షిపణులూ, బాంబులతో విధ్వంసం సృష్టించటం ఘనకార్యాలుగా చలామణీ అవుతున్నాయి.అలాంటి అధినేతలు దృఢమైన నాయకులుగా నీరాజనాలందుకుంటున్నారు. ఆ దృక్ప థాన్ని మార్చి శాంతి అంటే యుద్ధం లేకపోవటం మాత్రమే కాదనీ, సమాజంలో సమానత్వ సాధనకు కృషి చేయటం, ప్రపంచ శాంతికి దోహదపడటం అని అందరూ గుర్తించేందుకు నోబెల్ కమిటీ తన వంతు ప్రయత్నించిన దాఖలా లేదు. మరి ఈ పురస్కారాల పరమార్థం ఏమిటో ఆ కమిటీయే ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
అంతా ట్రంప్ చలవే.. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం: ‘నోబెల్ శాంతి’ విజేత
నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన తర్వాత వైట్‌హౌస్ నుంచి విమర్శల వాన కురిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాకుండా వెనెజులా ప్రతిపక్ష నేత, ఆ దేశంలో ప్రజాస్వఘ్యానికి పాటుబడ్డ మరియా కొరీనా మచోడాకు నోబెల్ శాంతి పురస్కారం లభించడమే అందుకు కారణం.నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్‌హౌస్. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్‌ను జోడించారని విమర్శించింది. ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్‌పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వెనెజులా శాంతి స్థాపనలో ట్రంప్ కృషి వెలకట్టలేనిదని నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న మరియా ప్రశంసించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘ అంతా మీ చలవే.. ట్రంప్‌ను గుర్తుపెట్టుకుంటాం’ అంటూ ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి. 2025 నోబెల్ శాంతి పురస్కారం విజేత మరియా కొరీనా మచాడో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పలు సందర్భాల్లో కొనియాడారు. ముఖ్యంగా వెనిజులా ప్రజాస్వామ్య పోరాటానికి ఆయన మద్దతును కొనియాడారు.. ట్రంప్‌ను “వెనిజులా స్వేచ్ఛకు అత్యంత గొప్ప అవకాశంగా” ఆమె అభివర్ణించారు. ట్రంప్ పాలనలో మడురో ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు దోహదపడిందన్నారు.President Trump,Your unwavering support for Venezuela’s fight for democracy is deeply valued. With extraordinary courage, the Venezuelan people have consistently defied fear and brutal repression, standing united to reject a criminal regime desperate to cling to power and… https://t.co/7EVCvHiQ2v— María Corina Machado (@MariaCorinaYA) January 11, 2025 ఇక ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంతో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ నా నోబెల్ నాకు కావాలి’ అంటూ ట్రంప్‌ను ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారంనోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ! -
నోబెల్ బహుమతి అంటే పేరు మాత్రమే కాదు.. కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా!
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరనీ మచాడోను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కల కోసం పోరాడినందుకు గానూ నార్వే నోబెల్ కమిటీ ఆమెకు ఈ బహుమతి అందిస్తున్నట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన నోబెల్ శాంతి పురస్కారం పొందిన గ్రహితలకు అందే ప్రొత్సహకాలపై చర్చ మొదలు కాగా.. వాటి వివరాలు నోబెల్ పీస్ ప్రైజ్ వెబ్సైట్లో ఉన్నాయి. వాటి ఆధారంగా ఎవరైతే నోబెల్ శాంతి బహుమతి పొందారో వారికి ప్రైజ్ మనీ కింద 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (SEK) అందుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.10 కోట్లు పైచిలుకు మొత్తాన్ని దక్కించుకోవచ్చు. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ కోరిక మేరకు 1901 నుంచి అవార్డుల ఇవ్వడం ప్రారంభమైంది. మానవాళికి ప్రయోజనం చేకూర్చుతూ పాటుపడిన శాంతి, సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, ఆర్థిక శాస్త్రాలు ఆరురంగాల వారికి అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.తన మరణానికి ఒక సంవత్సరం ముందు, 1895 నవంబర్ 27న తన వీలునామాపై సంతకం చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్, తన సంపదలో ఎక్కువ భాగాన్ని, SEK 31 మిలియన్లకు పైగా (నేడు సుమారు SEK 2.2 బిలియన్లు) సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏటా మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులుగా పంపిణీ చేసేలా వీలునామాలో పేర్కొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా పైన పేర్కొన్న ఆరు రంగాల్లో విశేష కృషి చేసినందుకు నోబెల్ బహుమతి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. నోబెల్ బహుమతి పొందిన వారికి భారీ మొత్తంలోప్రైజ్ మనీ దక్కనుంది.పతకం రూపకల్పన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని నార్వేజియన్ శిల్పి గుస్తావ్ విజిలాండ్, స్వీడిష్ శిల్పి ఎరిక్ లిండ్బర్గ్ సహకారంతో రూపొందించారు. ఈ పతకం మొదట 1902లో అవార్డు వేడుకలో ఉపయోగించారు. ఆరంభంలో.. 23-క్యారెట్ బంగారంతో తయారు చేశారు. బరువు 192 గ్రాములు 1980 తర్వాత.. 18 క్యారెట్ బంగారంగా మార్చారు. బరువు కొద్దిగా పెరిగి 196 గ్రాములు అయ్యింది.వ్యాసం: 6.6 సెంటీమీటర్లు ఇది స్థిరంగా ఉంది.పతకం రూపం,చిహ్నాలు:నోబెల్ ప్రైజ్ ముందు భాగం ఆల్ఫ్రెడ్ నోబెల్ పోర్ట్రెయిట్ఆయన పేరు, జనన తేదీ, మరణ సంవత్సరంవెనుక భాగం:ముగ్గురు నగ్న పురుషులు కౌగిలించుకున్న దృశ్యంఇది అంతర్జాతీయ సోదరభావానికి చిహ్నంలాటిన్ శాసనం: Pro pace et fraternitate gentium ‘ప్రజల మధ్య శాంతి, సోదరభావం కోసం’అంచు:5 మిల్లీమీటర్ల మందపాటి అంచు చుట్టూసంవత్సరం, అవార్డు గ్రహీత పేరు చెక్కబడి ఉంటుందిఈ పతకం రూపకల్పన, దాని చిహ్నాలు, దాని వెనుక ఉన్న భావన నోబెల్ శాంతి బహుమతికి ఉన్న ఆధ్యాత్మికత, గౌరవం, ప్రపంచ శాంతికి అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. -
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం
వెనెజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా మచాడో.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనిజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు, టైమ్ మ్యాగజైన్ -'2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు' జాబితాలో ఆమె చోటు సంపాదింకున్నారు కూడా. 2012లో వెనుజులా అధ్యక్ష పదవి కోసం పోటి చేసిన మరియా.. 2014లో దేశంలో ఆందోళనలకు న్యాయకత్వం వహించారు .వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటి స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది.రాజకీయ పాత్ర..Vente Venezuela అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. Súmate అనే సంస్థ స్థాపించి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పనిచేశారు2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హత పొందిన తర్వాత, ప్రత్యామ్నాయ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ప్రజలలో చైతన్యం కలిగించారు.ఎన్నికల మోసాలను బయటపెట్టేందుకు స్వయంగా పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.విద్యా నేపథ్యం:ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ఫైనాన్స్ స్పెషలైజేషన్యేలె యూనివర్శిటీ వరల్డ్ ఫెల్లోస్ ప్రోగ్రామ్అంతర్జాతీయ గుర్తింపుబీబీసీ-100 మంది అత్యంత ప్రభావంతుల జాబితాలో చోటు(2018)చార్లెస్ టి. మానాట్ ప్రైజ్(2014)లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్(2019)ఇదీ చదవండి: బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి -
వెనిజులాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
కారాకస్: దక్షిణ అమెరికాలోని వెనిజులాలో(venezuela) భారీ భూకంపం సంభవించింది. భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప తీవ్రత కారణంగా ప్రజలందరూ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో వెనిజులాలో భూకంపం సంభవించింది. జులియా రాష్ట్రంలోని మెనేగ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల (15 మైళ్లు) దూరంలో, రాజధాని కారకాస్ కు పశ్చిమాన 370మైళ్లు (600 కిలోమీటర్లు)కంటే ఎక్కువ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంపం ఐదు మైళ్లు (7.8కిలో మీటర్లు) లోతులో ఉందని ఏజెన్సీ నివేదించింది. మెనే గ్రాండే దేశ చమురు పరిశ్రమకు ముఖ్యమైన ప్రాంతమైన మారకైబో సరస్సుకు తూర్పున భూకంప కేంద్రం ఉంది.BREAKING: A powerful M6.2 earthquake has struck northwest Venezuela near Maracaibo, Zulia state.•Depth: just 7.8 km (very shallow)•230,000+ people felt strong to very strong shaking•USGS: 10–100 deaths possible, major damage likely•Tremors reached Caracas and parts of… pic.twitter.com/j3Ysx1sTK5— Sarcasm Scoop (@sarcasm_scoop) September 25, 2025కాగా, భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వెనిజులాలోని అనేక రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కొలంబియా, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబాలతోపాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా వెనిజులా, కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Un fuerte terremoto de magnitud 6.1 sacude varias regiones en Venezuela este miércoles. pic.twitter.com/D8lrT4WqaU— Diario La Noticia (@lanoticiahn) September 25, 2025Blast evacuates Caracas subway as massive quake pummels VenezuelaNO reports the earthquake caused metro shutdown pic.twitter.com/SDgmCjmLBH— RT (@RT_com) September 25, 2025 -
సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్‌లో...
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సొంతగడ్డకు ఘనంగా వీడ్కోలు పలికాడు. కెరీర్‌కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ అర్జెంటీనాలో మాత్రం ఇదే తన ఆఖరి పోరని ఇది వరకే స్పష్టం చేసిన మెస్సీ సొంత అభిమానులను 2 గోల్స్‌తో మురిపించాడు. దీంతో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–0తో వెనిజులాపై ఘనవిజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 39వ నిమిషంలో, ద్వితీయార్ధంలో 80వ నిమిషంలో మెస్సీ గోల్స్ కొట్టాడు. మరో గోల్‌ను మార్టినెజ్ (76వ నిమిషంలో) చేశాడు. మెస్సీ కుమారులు, కుటుంబసభ్యులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మైదానానికి వచ్చి తిలకించారు. వచ్చే ఏడాది ప్రపంచకప్ కోసం దక్షిణ అమెరికా నుంచి తాజాగా ఉరుగ్వే, కొలంబియా, పరాగ్వే జట్లు మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అర్జెంటీనా మార్చిలోనే క్వాలిఫై అయ్యింది. -
పడవలో తెగిపడిన తలలు యుద్ధం ఆరంభం
-
‘మదురో అరెస్టు’ బహుమతి రెట్టింపు
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి రూ.438 కోట్లు బహుమానంగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. మదురోను ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్‌గా అభివర్ణించింది. గతంలో రూ.250 కోట్లుగా ఉన్న బహుమతిని మళ్లీ పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ప్రకటించారు. మదురోకి డ్రగ్స్ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలున్నాయని ఆమె ఆరోపించారు. మదురో, అతని సహచరులతో సంబంధం ఉన్న 30 టన్నుల కొకైన్‌ను డ్రగ్ ఎన్పోర్స్మెంట్ అడ్మిని్రస్టేషన్ (డీఈఏ) స్వా«దీనం చేసుకుందని, అందులో 7 టన్నులు మదురోకి చెందినవని అన్నారు. ఈ ఆరోపణలను వెనిజులా విదేశంగ మంత్రి ఇవాన్ గిల్ ఖండించారు. బహుమతి ప్రకటనను రాజకీయ ప్రచారంగా అభివరి్ణంచారు. తమ దేశ గౌరవం అమ్మకానికి లేదన్నారు. జెఫ్రీ ఎపిస్టీన్ కేసు వ్యవహారంలో విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే బోండీ ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మొదటి పదవీకాలం నుంచే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మదురోపై చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. తన తొలి పదవీకాలంలోనే మదురో, పలువురు ఉన్నతాధికారులపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, అవినీతి ఆరోపణలు మోపారు. మదురో కొలంబియా రెబెల్ గ్రూప్ ‘ఫార్క్’తో కలిసి కొకైన్‌ను అమెరికాకు పంపేందుకు ప్రయతి్నంచారని ఆరోపించారు. ఆ సమయంలో మదురో అరెస్టుకు రూ.150 కోట్ల బహుమతిని ప్రకటించారు. బైడెన్ పాలనలో ఆ మొత్తాన్ని 250 కోట్లకు పెంచింది. 2024 జూలై 29న వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో గెలిచారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌పై విజయం సాధించారు. మూడోసారి అధ్యక్షపీఠాన్ని అధిష్టించారు. బస్సు డ్రైవర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన మదురో వివాదాస్పదంగా నిలిచారు. హ్యూగో చావెజ్ మరణం తరువాత 2013లో యునైటెడ్ సోషలిస్టు పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అమెరికా వెనిజులాపై ఆంక్షలు విధించింది. మదురోను అధ్యక్షుడిగా తిరస్కరించింది. అమెరికాతోపాటు యురోపియన్ యూనియన్, యూకే కూడా వెనిజులా చర్యలను ఖండించాయి. తమ దేశంలో తవ్వకాలు జరిపేందుకు అమెరికా చమురు దిగ్గజం చెవ్రాన్ను అనుమతించడంతో వెనిజులాపై కొన్ని ఆంక్షలను సడలించింది. -
ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికాలో 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ చట్టం కింద నిర్బంధానికి గురైన వెనిజులా పౌరులకు భారీ ఊరట లభించింది. వారిని బలవంతంగా వెనక్కి పంపించకుండా అమెరికా సుప్రీంకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది.కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఉత్తర టెక్సాస్‌లో 261 మంది వెనిజులా పౌరులను ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798 కింద నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. ఈ 261 మందిని ట్రంప్ ప్రభుత్వం ఎల్‌సాల్వెడార్ దేశంలో భూలోక నరకంగా పరిగణించే ఓ జైలుకు తరలించింది. తర్వాత వారందరినీ వెనిజులాకు పంపించాలని నిర్ణయించింది. దీంతో బాధితులకు మద్దతుగా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులను ఆశ్రయించారు. 261 మందిని వారి స్వదేశానికి తరలించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ కింది కోర్టు మార్చి 15న ఆదేశాలిచ్చింది.అయితే, వారిని వెనక్కి పంపించడానికి 1798 నాటి వార్‌టైమ్ చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెలువరించింది. కానీ, డిపోర్టేషన్‌ను సవాలు చేసే అవకాశం వారికి ఇవ్వాలని స్పష్టంచేసింది. దాంతో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం డిపోర్టేషన్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. వెనిజులా పౌరులకు ఇది అతిపెద్ద విజయమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.వెనిజులా వాసులు ప్రస్తుతానికి ఎల్ సాల్వెడార్ జైలులోనే ఉండనున్నారు. 216 మందిలో 137 మందిపై ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798ను తొలగించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులను అక్రమ వలసదార్లను గుర్తించి, అరెస్ట్ చేసి డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి బయటకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. The US Supreme Court just blocked President Trump from Deporting illegals under the Alien Enemies Act.Thomas & Alito dissented.They did this while we weren't looking and they did this before the 5th or the 4th circuit could dismiss the appeals.Barack Obama deported 3… pic.twitter.com/aTJvfUhsSJ— Matthew Zimmerman 🇺🇸 (@MattZimmerman26) April 19, 2025 -
సైనిక నిర్బంధంలో వెనిజులా వలసదారులు
వాషింగ్టన్: గ్వాంటనామో బేలోని వలసదారుల నిర్బంధ కేంద్రానికి చేరుకున్న వెనిజులా వలసదారుల పర్యవేక్షణా బాధ్యతలను సాధారణ ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి బదులు సైనిక అధికారులు చూస్తున్నారు. వలసదారులు ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కస్టడీలో ఉన్నారని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వలసదారులను సైనిక బలగాలు, వైద్యుల బృందాలు చూసుకుంటున్నాయని తాజాగా న్యూయార్క్‌టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. గ్వాంటనామోలో వలసదారుల నిర్బంధ కేంద్రాలను విస్తరించే ప్రణాళికలను ట్రంప్ ప్రకటించిన తరువాత ఇటీవల కొందరు వలసదారులను గ్వాంటనామోకు పంపిన విషయం తెల్సిందే. గ్వాంటనామోలో ఉంచిన వలసదారులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల్లో వారి జాతీయత మినహా మరే సమాచారం లేదు. ఆరో నంబర్ వలసదారుల శిబిరంలో 53 మంది పురుషులను ఉంచారు. గతంలో ఈ శిబిరంలో అల్‌ఖైదా అనుమానిత ఉగ్రవాదులను నిర్బంధించారు. ఈ శిబిరంలో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. సౌకర్యాలులేని శిబిరంలో వలసదారులను ఉంచారని, తాజా ఆహారం అందించకుండా ప్యాక్‌చేసి తీసుకొచ్చిన సైనిక ఆహారాన్నే వలసదారులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా రావడమే నేరం: ట్రిసియా దాదాపు 100 మందిని గ్వాంటనామో కేంద్రానికి తీసుకొచ్చాం. వీరందరికీ బహిష్కరణ ఉత్తర్వులు అందాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరూ నేరానికి పాల్పడ్డారు. వీరిలో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన ముఠా సభ్యులు, అక్రమ విదేశీయులు ఉన్నారు’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిసియా మెక్ లాఫ్లిన్ చెప్పారు. అయితే, బందీలందరూ చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించలేదని, కొందరు శరణార్థులుగా పరిగణించి ఆశ్రయం కల్పించాలని కోరగా వారి అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించి వారిని కూడా అరెస్ట్చేసిందని వార్తలొచ్చాయి. -
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!
వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది.మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు -
మదురో హత్యకు సీఐఏ కుట్ర!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర పన్నిందా? అవునని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక యూఎస్ నేవీ సీల్ ఆఫీసర్‌తో సహా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు ఇద్దరు స్పెయిన్, ఒక చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 400 అమెరికా రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్రలో సీఐఏతో పాటు స్పెయిన్ జాతీయ నిఘా విభాగం కూడా పాలుపంచుకుందని కాబెల్లో ఆరోపించారు. వీటిని అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మదురోను గద్దె దించే కుట్రలో తమ ప్రమేయముందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరన్నారు. వెనిజులా రాజకీయ సంక్షోభానికి ప్రజాస్వామ్య పరిష్కారం కోసం అమెరికా మద్దతిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై అదనపు సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. తాము కూడా దీనిపై వెనిజులాను సమాచారం అడుగుతున్నట్లు స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. మదురో ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద రీతిలో గెలవడం తెలిసిందే. ఆ విజయాన్ని గుర్తించడానికి వెనిజులా ప్రతిపక్షంతో పాటు అమెరికా కూడా నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. – కారాకస్ -
స్పెయిన్‌కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు. – కారకాస్ -
మదురో విమానం సీజ్
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విమానాన్ని అమెరికా సీజ్ చేసింది. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ విమానాన్ని సమకూర్చుకున్నారని, ఇతర క్రిమినల్ అభియోగాలతో మదురో విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్లో అమెరికా స్వా«దీనం చేసుకుంది. దాన్ని సోమవారం ఫ్లోరిడాకు తరలించింది. వెనిజులా– అమెరికాల మధ్య చాలాఏళ్లుగా సంబంధాలు బెడిసికొట్టాయి. వెనిజులాపై ఆర్థిక ఆంక్షలే కాకుండా పలుఇతర ఆంక్షలను కూడా అమెరికా విధించింది. వెనిజులాలో బతుకు దుర్భరమై లక్షల మంది మెక్సికో– అమెరికా సరిహద్దు ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయానికి సంబంధించి సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా వెనిజులా నుంచి నిర్దిష్ట పోల్ డేటాను కోరింది. వెనిజులాకు చెందిన ఈ డసాల్డ్ ఫాల్కన్ 900 విమానం ఖరీదు రూ.109 కోట్లు. కొద్దినెలలుగా ఇది డొమినికన్ రిపబ్లిక్లో ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు మదురో విమానాన్ని స్వా«దీనం చేసుకొని ఫ్లోరిడాకు తరలించాయి. అమెరికా దీన్ని జప్తు చేసుకొనేందుకు చర్యలు చేపట్టింది. -
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో...
పారిస్: ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల విజయగాథలే కాదు... వీటిలో పాల్గొనే వారిలో ఎన్నో భిన్నమైన, ఆసక్తికర నేపథ్యాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. వెనిజులాకు చెందిన షూటర్ లియోనెల్ మార్టినెజ్ పారిస్‌లో ట్రాప్ ఈవెంట్లో పోటీ పడ్డాడు. ఓవరాల్‌గా 28వ స్థానంతో ముగించాడు. అయితే అతను పోటీల్లో పాల్గొనడం విశేషం కాదు... 60 ఏళ్ల వయసున్న మార్టినెజ్ 40 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగడమే అసలు ఘనత! 20 ఏళ్ల కుర్రాడిగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మార్టినెజ్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆటకు దూరమై పలు వ్యాపారాల్లో స్థిరపడ్డాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ షూటింగ్ వైపు మనసు మళ్లింది. మొదటి నుంచి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్న మారి్టనెజ్కు మరోసారి క్రీడల్లోకి అడుగు పెట్టడం కష్టం కాలేదు. తన షూటింగ్‌కు పదును పెట్టుకున్న అతను 2023 పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2028 లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలనేదే మారి్టనెజ్ తర్వాతి లక్ష్యం. అప్పటికి 64 ఏళ్లు వచ్చినా సరే... ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ముగిస్తాను అంటూ అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మారి్టనెజ్కు ముందు జపాన్ ఈక్వె్రస్టియన్ ఆటగాడు హొకెసు హిరోషి మాత్రమే రెండు ఒలింపిక్స్ మధ్య ఎక్కువ విరామం (44 ఏళ్లు) తీసుకున్నవాడిగా నిలిచాడు. తొలిసారి 1964 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. -
మస్క్ వర్సెస్ మడురో: ఆయన గెలిస్తే గనుక..
వెనిజులా అధ్యక్షుడు(నూతన)నికోలస్ మడురో విసిరిన సవాల్‌కు ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. మడురోపై పోటీకి తాను సిద్ధమని అన్నారాయన. పోటీకి ఎక్కడైనా, ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారాయన.నాతో పోరాడాలనుకుంటే బరిలో దిగమని మస్క్‌కు నికోలస్ మడురో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో టెస్లా సీఈవో మస్క్ తాను సిద్ధమని ప్రకటించారు. ఆయన ఎక్కడ పోటీ అంటే అక్కడికి వస్తానని, తన వెంట మడురో ప్రియమైన గాడిదను కూడా తీసుకొస్తానంటూ వ్యంగ్యంగా బదులిచ్చారాయన. ఒకవేళ మడురో ఓడిపోతే.. ఆయన రాజకీయ సన్యాసం చేయాలి. తాను ఓడిపోతే గనుక ఉచితంగా ఆయన్ని మార్స్ ప్రయాణానికి తీసుకెళ్తానని స్పేస్ ఎక్స్ అధినేత ప్రకటించారు. వెనిజులా ఎన్నికల్లో మడురో విజయం సాధించారు. అయితే ఆయన అప్రజాస్వామ్యిక పద్ధతుల్లో గెలిచారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. మడురో ఆయన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వెనిజులాలో మస్క్ కంప్యూటర్ల హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ దేశానికి వెళ్లొద్దు.. అమెరికా హెచ్చరిక
వెనిజులా దేశ సందర్శనకు ఎవరూ వెళ్లొద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనించడం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ పెరుగుతన్న నేపథ్యంలో వెనిజులా సందర్శన విషయంలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రయాణ సలహాను మరోసారి జారీ చేసింది.వెనిజులా సందర్శనలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే తాము ఏమీ చేయలేమని అమెరికా పౌరులను ఆ దేశ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో 'ప్రూఫ్ ఆఫ్ లైఫ్' ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాన్నారు. ఎవరైనా కిడ్నాప్, అపహరణ లేదా నిర్బంధానికి గురైనప్పుడు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడా లేదా అని ధ్రువీకరించుకునేందుకు పాటించే ప్రక్రియే ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ప్రోటోకాల్. వెనిజులాలో అమెరికా పౌరులను అక్రమంగా నిర్బంధించే ప్రమాదం ఉందని, అక్కడి భద్రతా దళాలు అమెరికా పౌరులను ఐదేళ్ల వరకు నిర్బంధించాయని విదేశాంగ శాఖ తెలిపింది.విస్తారమైన కరేబియన్ సముద్రతీరానికి, సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఒకప్పుడు ఏటా లక్షలాది అమెరికన్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేవారు. 2013లో నియంత హ్యూగో చావెజ్ మరణం తరువాత నికోలస్ మదురో అధికారం చేపట్టినప్పటి నుంచి సందర్శకుల సంఖ్య బాగా క్షీణించింది. 2019లో వెనిజులా నుంచి అమెరికా సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు మొదటిసారి ఇలాంటి హెచ్చరికను జారీ చేసిన అమెరికా.. ఇప్పుడు మరోసారి తమ పౌరులను హెచ్చరించింది. -
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లేజర్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు షాకింగ్ ఘటన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో.. అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికులు గాయపడ్డారు. వెనెజులా రాజధాని కారకాస్ శివారులోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు లేజర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెనెజులా నుంచి డొమినికన్ రిపబ్లికన్‌కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఉన్నట్టుండి విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కొందరు వెంటనే అత్యవసర స్లైడ్ ద్వారా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Following an APU failure aboard a <a href="https://twitter.com/laserairlines?ref_src=twsrc%5Etfw">@laserairlines</a> MD-80, passengers were evacuated due to smoke in the cabin. Regrettably, most passengers exited with their carry-on luggage, resulting in avoidable hazards. <a href="https://t.co/7FsfZ3Zkuk">pic.twitter.com/7FsfZ3Zkuk</a></p>&mdash; Enrique Perrella (@Enrique77W) <a href="https://twitter.com/Enrique77W/status/1784737773464735912?ref_src=twsrc%5Etfw">April 29, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడి కన్నుమూత
కారకాస్ (వెనెజులా): ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఏకంగా 41 మంది మనవలు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలు, మనవరాళ్లున్నారు! ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులుండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమనేవారు! -
వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్‌ను కలిపే జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రక్కు పలు కార్లను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టి కుప్పగా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. మంటల్లో చిక్కుకున్న వాహనాలు, ఉవ్వెత్తున ఎగసిన పొగతో కూడిన ఫొటోలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనలో 16 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
బతికుండగానే అంత్యక్రియలు, మోడల్ అరియానా కన్నుమూత
బ్యూటీ క్వీన్, వెనిజులా మోడల్ అరియానా వీర రోడ్డుప్రమాదంలో మరణించింది. జూలై 13న ఫ్లోరిడాలో జరిగిన కారు యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. కారు నడిపే క్రమంలో అలసటకు లోనైన అరియానా డ్రైవింగ్‌లో రెప్పవాల్చడంతోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అరియానా తల్లి వివియన్ ఓచోవా మీడియాకు వెల్లడించింది. తను ఎంతోమందికి సాయం చేసిందని, అలాంటి నా కూతుర్ని భగవంతుడు త్వరగా తీసుకెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా ఈ బ్యూటీ మే నెలలో అంత్యక్రియల వీడియో పోస్ట్ చేసింది. 'నా వీడియోలను నేనే తీసుకుంటాను. నేను చనిపోయాక నా అంత్యక్రియలను ఎవరైనా రికార్డు చేస్తారో లేదో? అందుకే ఎప్పుడో జరగాల్సిన నా అంత్యక్రియలను ఓసారి నేనే రికార్డు చేసి పెట్టుకుంటున్నాను' అంటూ సదరు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా అరియానా మోడల్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. తను ఫుల్ హౌస్ క్లీనింగ్ సర్వీస్ అనే కంపెనీ కూడా నిర్వహిస్తోంది. ఇకపోతే అక్టోబర్‌లో జరగబోయే 'మిస్ లాటిన్ అమెరికా ఆఫ్ ద వరల్డ్ 2023' పోటీల్లో అరియానా.. వెనిజులా తరుపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే ఈ దారుణం జరగడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. View this post on Instagram A post shared by Ariana Valentina (@arianaviera__) View this post on Instagram A post shared by Ariana Valentina (@arianaviera__) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే? -
World Athletics Championship: ‘ట్రిపుల్’ ధమాకా
యుజీన్ (అమెరికా): వెనిజులా స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత యులిమర్ రోజస్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ రోజస్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రోజస్ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్), 2019 (దోహా)లలో కూడా ఆమె కనకపు పతకాన్ని అందుకుంది. ట్రిపుల్ జంప్‌లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. ‘రికార్డు స్థాయిలో ఎక్కువ దూరం దూకాలనే బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదు. అయితే తాజా ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మళ్లీ పోటీలో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. పెద్దగా సన్నాహకాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను. గాయాలతో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ గెలవగలిగాను’ అని రోజస్ వ్యాఖ్యానించింది. సబ్లేకు 11వ స్థానం పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
ఇదేం పిచ్చో.. బాల్కనీ అంతా దెయ్యం బొమ్మలతో నింపేశాడు!
బొమ్మలతో మనం మాట్లాడితే పర్వాలేదు. అవే బొమ్మలు మనతో మాట్లాడితే భయపడక తప్పదు. ఇలా బొమ్మలతో భయపెట్టే సినిమాలు ఎన్నో! విచిత్రంగా ఓ సామాన్యుడు కూడా బొమ్మలతో భయపెట్టిస్తున్నాడు. నిజానికి అతని ఉద్దేశం వేరే అయినా స్థానికులు మాత్రం అతని ఇంటిలోపలికి కాదుకదా కనీసం కింద నుంచి బాల్కనీ వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. వెనెజులా రాజధాని కారకస్‌కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ ఎటాన్లస్ గోన్‌సాల్వెజ్‌కు ఓ డ్రైవర్‌తో మంచి స్నేహం ఉండేది. అతని కారులో ఎప్పుడూ బొమ్మలు ఉండేవి. అది చూసిన గోన్సాల్వెజ్ కొడుకు తనకు కూడా ఇలా బొమ్మలను ఒక చోట సెట్ చేయమని కోరాడు. దీంతో, గోన్సాల్వెజ్ మూడేళ్లపాటు శ్రమించి బాల్కనీ నిండా బొమ్మలతో విచిత్రంగా నింపాడు. అయితే, ఆ బొమ్మల బాల్కనీ చూసిన కొడుకు సంతోషించినా, స్థానికులు మాత్రం కలవరపడుతున్నారు. అచ్చం దెయ్యం బొమ్మల్లా కనిపించే వాటిని చూసి, అతనేదో క్షుద్రపూజలు చేస్తున్నాడని, వాటిని తీసేయాల్సిందే అంటూ గొడవకు దిగారు. ఇలా కొన్ని నెలలపాటూ ఈ బొమ్మలపై గొడవ జరిగింది. ఏం చేసినా గోన్సాల్వెజ్ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానికులే సైలెంటైపోయారు. దీంతో, ప్రస్తుతం ఈ బొమ్మల బాల్కనీ అక్కడ ఓ ల్యాండ్ మార్క్‌గా మారింది. కొంతమంది కేవలం ఆ బాల్కనీని చూడ్డానికి అదేపనిగా వస్తున్నారు. ప్రస్తుతం అతను ఇంటిలోనికి అనుమతించడటం లేదు కానీ, కింద నుంచి చూసే అవకాశం మాత్రం ఉంది. -
పెద్దలు దోచుకుంటే వెనిజులా కాదా?
పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేదల ఖాతాల్లో ప్రభుత్వాలు నేరుగా నగదు బదిలీ చేసినా.. గుండెలు బాదేసుకోవడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. ‘ఏంటి పేదల్ని సోమరిపోతులుగా మార్చేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇలాగే పోతే రాష్ట్రం వెనిజులాగా మారిపోతుం’దంటూ అంతర్జాతీయ మేధావుల్లా శాపాలూ పెట్టేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలివి? రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కానీ బతుకు బండి ముందుకు నడవని పేదలు ఎప్పటికీ సోమరిపోతులు కారు. కాలేరు. వారి గురించి ఎవరూ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. మరి సోమరిపోతులెవరు? బ్యాంకులకు వేల కోట్ల రూపాయల బాకీలు ఎగ్గొట్టి.. అరెస్ట్ చేసే ముందు పాలకుల అండతో విదేశాలకు చెక్కేసే విజయ్ మాల్యాలూ.. నీరవ్ మోదీలు.. మొహుల్ ఛోక్సీలే నిజానికి సోమరిపోతులు. ఎందుకంటే వాళ్లు ఏనాడూ ఎండలో ఓ గంట సేపు కష్టపడిన వారు కాదు. ఏసీ గదుల్లో కూర్చుని.. బ్యాంకుల్లో ఏసీ గదుల్లో ఉన్నతాధికారులను బుట్టలో వేసుకుని వేల కోట్ల రూపాయల రుణాలు కొట్టేసి వాటిని దారి మళ్లించేసి అసలు వ్యాపారాలు దివాలా తీశాయని కాగితాలపై కట్టుకథలు రాసే కార్పొరేట్ దొంగలే సోమరిపోతులు. రాష్ట్రాలైనా..దేశాలైనా ఇలాంటి వారి వల్లనే దివాళా తీస్తాయి కానీ నిరుపేద రైతులు, శ్రామిక వర్గాల కిచ్చే చిల్లర పైసల వల్ల కాదు. అసలు వెనిజులా విషయంలోనూ వీళ్లకి అవగాహన లేదు. వెనిజులా దివాలా తీయడానికి కారణం కేవలం సంక్షేమ పథకాలు కాదు. చమురు ధరలు పడిపోవడంతో ఆదాయం తగ్గింది. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కాబట్టి అమెరికా పగబట్టింది. వెనిజులాకి ఆహార ఉత్పత్తులు, మందులు సరఫరా చేయకుండా తన మిత్ర దేశాలపై పరోక్ష ఆంక్షలు విధించింది అమెరికా. అటువంటి వెనిజులాను బూచిలా చూపించి పేదల నోళ్లు కొట్టేయడానికి మన దగ్గర చాలా మంది మేధావులు పేట్రేగిపోతున్నారు. ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఆర్థిక అసమానతలు పెరిగిపోయినపుడు ధనవంతులు మరింత ధనవంతులుగానూ పేదలు మరింత పేదలుగానూ మారిపోతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలో ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పారు. పేదల దగ్గర కొనుగోలు శక్తి లేకపోతే అన్ని వ్యవస్థలూ.. ఉత్పాదక సంస్థలు దివాలా తీస్తాయి. అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది. అటువంటి సమయాలలో ఏదో ఒక రూపంలో ప్రజల చేతుల్లో డబ్బులు చేరేలా చేయడం ద్వారా కొనుగోలు శక్తి పెంచాలి. అలా పెంచడం వల్లనే ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా నిలబడుతుంది. కరోనా వంటి సంక్షోభ కాలంలో మహా మహా ఆర్థిక శక్తులే కుప్పకూలిపోయాయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయడమొక్కటే వ్యవస్థను కాపాడుకోడానికి మార్గమని ఆర్థిక మేధావులు అంటున్నారు. దాన్నే ‘హెలికాప్టర్ మనీ’ అంటారు. మన అధికార యంత్రాంగాలు ఎలా ఆలోచిస్తాయంటే రైతులకు రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ వస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన అరుంధతీ భట్టాచార్య ‘అయ్య బాబోయ్ రుణమాఫీయే.. అలా అయితే రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేదే ఉండదు. అది ఎంత మాత్రం కుదరదు‘ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇదే అరుంధతీ భట్టాచార్య బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యాకి సంబంధించిన అయిదున్నర వేల కోట్ల బాకీని మాత్రం రైటాఫ్ చేసేశారు. అలా చేస్తూ.. ‘పాపం వ్యాపారంలో నష్టపోయినపుడు ఆదుకోకపోతే ఎలాగ?‘ అన్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పేదలపై ఎంత చులకన భావం ఉంటుందో.. పెద్దలపై ఎంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోడానికి. పేదల జేబుల్లోకి రూపాయి వెళ్తోందంటే చాలు నయా మేధావులు చాలా బెంగపెట్టేసుకుంటారు. మాల్యా వంటి పెద్దలు కోట్లకు కోట్లు ఎగనామం పెట్టేసి ఆ భారాన్ని ప్రభుత్వ ఖజానాలపై మోదేసినా ఎవ్వరూ మాట్లాడరు. మాట్లాడితే వెనిజులా అనే వాళ్లు అందరికీ ఉచిత విద్యుత్‌ను అందించే క్యూబా గురించి మాట్లాడరు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఏడు దేశాల్లో పన్నుల్లేకపోయినా.. విద్య, వైద్యాలు ఉచితంగానే అందిస్తోన్నా... ‘ఇలా ఎలా ఇస్తారు‘ అని ఎవ్వరూ అడగరు. కమ్యూనిస్టు దేశాలు ఉండకూడదని అమెరికా ఎలా అనుకుంటుందో.... అలానే పేదలకు సంక్షేమ పథకాలు ఉండనే కూడదని వీళ్లు అనుకుంటారు. పేదలపై ఎందుకో మరి అంత కోపం? పేదరికం అంటే ఎందుకో అంత ఏహ్యభావం! నిజానికి మాల్యాల వంటి వాళ్లు అదే పనిగా దోచుకుంటే దేశం వెనిజులాగా కాదు... సోమాలియాలా మారిపోయే ప్రమాదం ఉంది. అందరూ దృష్టి సారించాల్సింది దానిపై మాత్రమే. – సి.ఎన్.ఎస్. యాజులు మొబైల్ : 95055 55384 -
విషాదం: ఈ తల్లి త్యాగానికి చేతులెత్తి మొక్కాల్సిందే!
Venezuela Mother Sacrifice Story: మనిషికి మాత్రమే కాదు.. మిగతా జీవరాశికి తల్లి స్పర్శే మొదటి ప్రేమ. అమ్మ ప్రేమ జీవికి ఆప్యాయతను పరిచయం చేస్తుంది. ‘అమ్మ’.. మాటల్లో వర్ణించలేని ఓ మధురానుభూతి. అందుకేనేమో తల్లికి మాత్రమే సాధ్యపడే త్యాగానికి ఆమె సిద్ధపడింది. ప్రాణం పోతోందని తెలిసి కూడా సాహసానికి పూనుకుంది. తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ త్యాగంతో పిల్లల్ని బతికించుకుని.. మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. ఆ తల్లి గాథ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరితో కంటతడి పెట్టిస్తోంది. వెనిజులా బోట్ ప్రమాదం.. సెప్టెంబర్ 3న కరేబియన్ దీవులవైపు వెళ్లిన వెనిజులా టూరిస్ట్ క్రూజ్ బోట్ ఒకటి అదృశ్యం అయ్యిందని నావికా అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత ‘లా టార్టు’ దీవి సమీపంలో ఓ చిన్నసైజు లైఫ్ బోట్‌ను గుర్తించి.. దగ్గరి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. తల్లి మృతదేహం పక్కనే ఒదిగిన ఇద్దరు చిన్నారుల్ని గుర్తించి వెంటనే కాపాడారు. ఆ తల్లి పేరు మార్లేస్ బీట్రిజ్ చాకోన్ మర్రోక్విన్. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సరదా ట్రిప్ కోసం వెళ్తే.. అది కాస్త వాళ్ల జీవితాల్లో విషాదాన్ని నింపింది. నరకం ఓర్చుకుంది.. భారీ అలల కారణంగా క్రూజ్ దెబ్బతినగా.. చిన్న లైఫ్ బోట్ సాయంతో మార్లేస్, తన బిడ్డల్ని రక్షించుకునే ప్రయత్నం చేసింది. వెనిజులా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అక్వాటిక్ స్పేసెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగాక నాలుగు రోజులపాటు ఆ తల్లీబిడ్డలు ఆ చిన్న లైఫ్బోట్లోనే ఉన్నారు. తన ఇద్దరు బిడ్డల్ని(ఒకరికి రెండేళ్లు, ఒకరికి ఆరేళ్లు) డీహైడ్రేషన్, అలల నుంచి కాపాడుకునేందుకు మార్లేస్ వీలైనంత ప్రయత్నం చేసింది. వాళ్ల ఆకలి తీర్చేందుకు పాలు పట్టింది. తన మూత్రాన్ని తానే తాగి ఆకలి తీర్చుకుంది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టాయి. అయినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదనుకుని.. బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచిందామె. మొత్తం తొమ్మిది మంది లైఫ్ బోటులో తల్లి మృతదేహంలో ఒదిగి పడుకున్న పిల్లలను.. కారాకస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల ఒంటిపై సూర్య తాపానికి బొబ్బలు వచ్చాయి. తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు కూడా. మరోవైపు ఈ ఇద్దరు పిల్లల్ని చూసేందుకు నియమించిన యువతి వెరోనికా మార్టినెజ్(25).. పక్కనే ఓ ఐస్ బాక్స్‌లో పడుకుని బతికి బట్టకట్టింది. ప్రస్తుతం కోలుకున్న ఆ యువతి.. మానసికంగా మాత్రం కోలుకోలేకపోతోంది. అయితే ఆ మార్లేస్ భర్త రెమిక్ డేవిడ్ కాంబ్లర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. సరదా ట్రిప్‌లో భాగంగా వెనిజులా హిగుయిరోట్ నుంచి లా టార్టుగా ఐల్యాండ్(కరేబియన్ దీవులు) వైపు తొమ్మిది మందితో వెళ్లింది. భారీ అల కారణంగా మొదట పాడైన బోటు.. ఆ తర్వాత అలల ధాటికి చెల్లాచెదురై ఉంటుందని, సుమారు 70 మైళ్ల దూరం కొట్టుకుని పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో మిగిలిన వాళ్లెవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఆ మాతృమూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు -
ఒక రూపాయికే పెట్రోలు.. ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ: రికార్డు స్థాయికి చేరిన పెట్రోలు ధరలు వాహనదారులను వణికిస్తున్నాయి. ఇటీవలికాలంగా వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా సెగలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100దాటేసింది. ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా 13 సార్లు ధరలు పెరిగాయంటేనే ధరల మంట తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీంతో పెట్రో ధరలపై ఇటీవల బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. తాజాగా మరో వార్త ఆసక్తికరంగా మారింది. ఒకపక్క పొరుగు దేశాలతో పోలిస్తే దేశీయంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరోపక్క దక్షిణ అమెరికా దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి మాత్రమే. ప్రపంచంలో వెనకబడిన దేశమైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర 0.020 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.1.45గా ఉండటం విశేషంగా నిలిచింది. అత్యంత చౌకగా పెట్రోలు విక్రయించే మొదటి పది దేశాల్లో ఐదు ఆసియాలో, నాలుగు ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో ఒకటి ఉన్నాయి. మరోవైపు 2.40 డాలర్ల వద్ద హాంకాంగ్‌లో పెట్రోలు అత్యంత ఎక్కువ రేటు పలుకుతోంది. తరువాత స్థానాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ , నెదర్లాండ్స్ ఉన్నాయి. (బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత) పొరుగు దేశాలలో పెట్రోల్ ధర భారత్‌తో పోలిస్తే, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ , భూటాన్ దేశాల్లో పెట్రోల్ తక్కువ రేటుకేఅందుబాటులోఉంది. ముఖ్యంగా భూటాన్‌లో పెట్రోలు ధర బాగా చౌక. భారత కరెన్సీ ప్రకారం, పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు 51.14 రూపాయలు. భూటాన్‌లో పెట్రోల్ లీటరుకు రూ .49.56 వద్ద లభిస్తుంది. శ్రీలంకలో పెట్రోల్ ధర రూ .60.26. బంగ్లాదేశ్‌లో రూ. 76.41 రూపాయలు, నేపాల్‌లో 68.98 రూపాయలు వద్ద ఉంది. ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.50 ఉండగా, అంగోలాలో రూ.17.78 ఉంది. అల్జీరియాలో రూ.25.10 ఉండగా, కువైట్ లో రూ.25.18 ఉన్నది. సూడాన్ లో రూ.27.50, నైజీరియాలో రూ.31.65 గా ఉన్నది. మనదేశంలో ఒక్క ఫిబ్రవరిలో ఇప్పటివరకు పెట్రోల్ రూ .3.24, డీజిల్ రూ .3.47 పెరిగింది. మొత్తంమీద ఏడాది కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ .17 పెరగడం గమనార్హం. -
మిస్టరీ: ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారం..
కారకాస్: ఆశ్చర్యపరిచే సంఘటన... ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. కానీ ఈ దేశంలో మాత్రం బంగారం నెలకు దిగొచ్చి సామన్యుడి చేతికందొచ్చింది. భారీ స్థాయిలో బంగారం సముద్రపు అలలతో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. నమ్మశక్యం కానీ ఈ సంఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. ఆదివారం గ్వాకలోని సముద్ర తీరానికి బంగారు, వెండి ఆభరణాలు వేల సంఖ్యలో కొట్టుకొచ్చాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 2 వేలకు పైగా మత్స్యాకార కుటుంబాలు ఈ బీచ్ వద్ద నివసిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ మత్స్యకారుడు చేపల వేట కోసం ఉదయాన్నే తీరానికి రాగా అతడికి ఒడ్డున ఇసుకలో మెరుస్తున్న వస్తువు కనిపించింది. అదేంటని చేతిలోకి తీసుకుని చూడగా అది బంగారు ఆభరణం. (చదవండి: వైరల్: కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి!) దాంతో ఆశ్చర్యపోయిన ఆ మత్స్యకారుడు బంగారం దొరికిందోచ్..! అంటూ గట్టిగా కేకలు వేశాడు. అతడి కేకలు విన్న మిగతా గ్రామస్తులు, మత్స్యకారులు వచ్చి చూసేసరికి బీచ్ ఒడ్డున ఇసుకల్లో బంగారం, వెండి ఆభరణాలు కనిపించాయి. అనంతరం గ్రామస్తులు బీచ్ మొత్తం జల్లెడ పట్టడం ప్రారంభించారు. బంగారు ఆభరణాలు దొరకడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారని చెప్పారు. ఈ బంగారం ఒడ్డుకు ఎలా వచ్చిందో, అసలు సముద్రంలోకి ఎలా చేరాయో ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెనిజులా నిపుణులు ఒడ్డుకు బంగారు ఆభరణాలకు ఎలా కొట్టుకువచ్చాయని శోధించే పనిలో పడ్డారట. (చదవండి: పాకిస్తాన్: ‘అందుకే విగ్రహం ధ్వంసం చేశా’) -
డెలివరీ బాయ్‌గా మారిన అంతర్జాతీయ క్రికెటర్
ఒలింపిక్ చాంపియన్... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. లాడ్జ్ (పోలాండ్): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్ క్రీడాంశంలో రూబెన్ లిమార్డో గాస్కన్ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా రూబెన్ లిమార్డో; ‘లండన్’ స్వర్ణంతో... రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్ దేశం పోలాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్‌పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్‌గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్ చాంపియన్ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్ డాలర్ విలువ సుమారు 10 వేల వెనిజులన్ బొలీవర్స్కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్ కూడా... నెదర్లాండ్స్‌కు చెందిన 28 ఏళ్ల పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు. అక్టోబర్–నవంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్ మీకెరన్ కూడా ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్‌గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్ క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్ ట్వీట్ చేశాడు. -
లాక్డౌన్ : వైన్‌తో పండుగ చేసుకున్నారు
కరాకస్ : కరోనా నేపథ్యంలో అక్కడికి ప్రజలకు ఈ మహమ్మారి సోకకుండా మార్చి నుంచే వెనిజులా తమ దేశంలో లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఎటు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో బోర్‌గా ఫీలయ్యేవారు. దీంతో పాటు అక్కడి ప్రభుత్వం ఎవరు బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని అక్కడి అధికారులు ఆదేశించారు. వెనిజులాకి చెందిన రియల్ ఎస్టేట్ ఏంజెంట్ బెర్తా లోపెజ్ అనే యువతి లాస్ పాలోస్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఆమె ఉంటున్న నివాసానికి అన్ని వైపుల అపార్ట్మెంట్లే కావడంతో బెర్తాకు వెంటనే ఒక ఆలోచన తట్టింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూనే తను ఉంటున్న రూఫ్ టాప్ మీదకు ఎక్కి వైన్ తాగాలని భావించింది. ఇదే విషయాన్ని తన తోటివాళ్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. మొదట ఆమె చేస్తున్న పనిని ఒప్పుకోకున్నా.. తరువాత ఆలోచించి చూస్తే నిబంధనలు బేఖాతరు చేయడం లేదని వారు భావించారు. అపార్ట్మెంట్లో ఉంటున్న వారు తమ బిల్డింగ్ రుఫ్టాప్ ఎక్కి చేపలు పట్టే యంత్రానికి గ్లాసును కట్టేసి వైన్ తాగడం ప్రారంభించారు. ('ఆ రెండు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయాల్సిందే') వైన్ తాగడానికి ఇంత చేయడం అవసరమా అని బెర్తాను అడిగితే.. ఆమె స్పందిస్తూ.. ' లాక్డౌన్ వల్ల ఇంట్లో బోర్‌గా పీలవుతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరాన్ని కూడా పాటిస్తున్నాం. ఇక ఫిషింగ్ లైన్ ఎందుకంటే ఎదుటివారికి చీర్స్ చెప్పేందుకు ఉపయోగిస్తున్నాం. ఇక రూఫ్‌టాప్ మీద వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. వారు నాకు కనిపించేంత దూరంలో ఉండడంతో ఆనందంగా గడిపేస్తున్నాంటూ' చెప్పుకొచ్చింది. అయితే బెర్తా చేసిన చిన్న పని లంచ్, డిన్నర్ల వరకు తీసుకెళ్లింది. అయితే అందరు భౌతిక దూరం పాటిస్తూనే ఈ పని చేస్తుండడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 3లక్షలకు చేరువలో ఉంది. (కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్) -
వెనిజులా ఆ ఆయుధాన్ని వదిలింది: అమెరికా
వాషింగ్టన్/కారకస్: నార్కో టెర్రరిజాని(మాదక ద్రవ్యాల అక్రమ రవాణా)కి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా అభియోగాలు దాఖలు చేసింది. ఆయనతో పాటు ఆ దేశ పలువురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసింది. తాము ఉగ్రవాద సంస్థగా గుర్తించిన రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(ఎఫ్ఏఆర్సీ)తో మదురో అనుచరులు సంబంధాలు కొనసాగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. కొకైన్‌ను అక్రమంగా రవాణా చేసే ‘ది కార్టెల్ ఆఫ్ ది సన్స్’ గ్యాంగ్‌కు మదురో నాయకత్వం వహిస్తున్నారని.. వారి సహాయంతో టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు అమెరికాకు చేరవేస్తున్నారని మండిపడింది.(‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’) గత రెండు దశాబ్దాలుగా ఈ తతంగం కొనసాగుతోందని... ఈ వ్యాపారం ద్వారా వాళ్లు మిలియన్ల కొద్దీ డాలర్లు ఆర్జించారని ఆరోపించింది. ఈ మేరకు న్యూయార్క్, వాషింగ్టన్, మియామీ తదితర ప్రాంతాల్లో ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అదే విధంగా వెనిజులా డ్రగ్ మాఫియాకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి 15 మిలియన్ డాలర్ల భారీ రివార్డు ప్రకటించింది.(అమెరికాతో యుద్ధానికి సిద్ధం ) అమెరికాను నాశనం చేసేందుకే ఈ విషయం గురించి అమెరికా అటార్నీ జనరల్ బిల్ బార్ మాట్లాడుతూ... ‘‘ అమెరికాను నాశనం చేసేందుకు మదురో, ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎఫ్ఏఆర్సీతో కుట్రపన్ని... దాదాపు 20 ఏళ్ల నుంచి టన్నుల కొద్దీ కొకైన్‌ను ఇక్కడికి పంపిస్తున్నారు. అమెరికా సమాజాన్ని నాశనం చేసేందుకు కొకైన్ అనే ఆయుధాన్ని వదిలారు. మదురో పాలనాదక్షత ఏంటో ఇప్పుడే అర్థమవుతోంది. ఆయన పాలన అవినీతి, నేరాలతో నిండిపోయింది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురో ఉద్దేశపూర్వకంగానే కొకైన్‌ను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. మదురో అంటే నేరగాడు.. డ్రగ్ మాఫియా! ఇక అమెరికా అభియోగాలపై స్పందించిన వెనిజులా విదేశాంగ శాఖ మంత్రి జార్జ్ అర్రెజా .. తమ దేశాధినేతపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెనిజులా ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ట్రంప్ ప్రభుత్వం మరోసారి దాడికి దిగిందని దుయ్యబట్టారు. అత్యంత హేయమైన, నీచమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాగా వెనిజులా అధ్యక్షుడిగా మదురోను గుర్తించేందుకు అమెరికా సహా 50 ఇతర దేశాలు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా తాము గుర్తిస్తున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో అమెరికా తాజా ఆరోపణలకు జువాన్ గైడో విదేశీ వ్యవహారాల కమిషనర్ జులియో బోర్గ్స్ మద్దతు పలికారు. ‘‘ మదురో అంటే డ్రగ్ మాఫియా. మదురో అంటే వ్యవస్థీకృత నేరగాడు’’అని వ్యాఖ్యానించారు. -
ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: గతంలో చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన దేశాల పౌరుల వీసా అనుమతులపై ఆంక్షలు విధించే పత్రంపై సంతకం చేశారు. ఇవి అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆయన వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమన్, సోమాలియా పౌరుల అమెరికా ప్రవేశంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాల అనుమతిపై నిషేధం విధించింది. సూడాన్, టాంజానియా దేశాలు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానియా గ్రెషమ్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆంక్షలేవీ పర్యాటకులకు, వ్యాపారస్తులకు, వలసేతర ప్రయాణికులకు వర్తించవనిన్నారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే ఎలా ఉంటుందో ఆయా దేశాలకు అర్థమయ్యేందుకే ఈ నిషేధమని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ వెల్లడించారు. ‘దేశ భద్రత, ప్రజల రక్షణే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రథమ బాధ్యత అనీ, ఈ ఆంక్షలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయని’ వోల్ఫ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
వైరల్ : 8 ప్యాంట్లు తొడుక్కొని.. అడ్డంగా బుక్కైంది
మనం సాధారణంగా వస్త్ర దుకాణానికి వెళితే కావలిసినవి కొనుక్కుంటాం. కానీ ఓ యువతి మాత్రం షాప్‌కు వెళ్లి చోరీ చేద్దామని భావించి అడ్డంగా బుక్కైంది. ఈ వింత ఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వెనిజులాలో ఓ యువతి వస్త్ర దుకాణానికి వెళ్లింది. అక్కడ జీన్స్ ర్యాక్ వద్దకు వెళ్లి 8 ప్యాంట్లు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఒకదాని మీద ఒకటి ధరించి చోరీ చేసేందుకు యత్నించింది. కాగా, యువతి ప్రవర్తనపై అనుమానం కలిగిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డగించి వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారు. ఆమె వేసుకున్న ప్యాంట్‌ను విప్పమన్నారు. దీంతో సదరు యువతి ఒక్కొక్క ప్యాంట్ విప్పుతూ.. మొత్తం 8ప్యాంట్లను బయటికి తీయడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఇదంతా వీడియో తీసీ ఫేస్బుక్లో షేర్ చేయడంతో 4.2 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ' ఈమె చోరీలు చేయడంలో చాలా నేర్పరి. కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించి ఉంటే దర్జాగా బయటకు వెళ్లిపోయేదే' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
నగ్న శరీరాలపై కోళ్ల పందెం
వెనిజులా : ఖైదీలను హింసించటానికి వెనిజులాలోని ఓ జైలు అధికారులు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. సరిపడా తిండి, నీరు ఇవ్వాలంటూ నిరసన చేపట్టిన ఖైదీలను నగ్నంగా నేలపై పడుకోబెట్టి వారి శరీరాలపై కోళ్ల పందెం పెట్టారు. ఈ సంఘటన వెనిజులా, అనాకోలోని పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత శుక్రవారం అనాకోలోని పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్లోని ఖైదీలు తమకు సరిపడా ఆహారం, నీరు ఇవ్వటం లేదంటూ, బంధువులు చూడటానికి వచ్చినపుడు మెడిసిన్స్ తేవటానికి అనుమతి ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు. దాదాపు 70మంది ఖైదీలను 2 గంటల పాటు విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా వారిని నగ్నంగా చేసి, నేలపై పడుకోబెట్టి శరీరాలపై కోళ్ల పందెం పెట్టారు. అవి వారి శరీరాలను చీరుతుంటే చూసి ఆనందించారు. ఆ తర్వాత కొన్ని గంటలు వారికి తిండి, నీరు కూడా ఇవ్వలేదు. వెనిజులాకు చెందిన ఓ రిపోర్టర్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. దీంతో స్పందించిన ప్రభుత్వం సంఘటనపై విచారణకు ఆదేశించింది. -
‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’
కరాకస్ : దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వెనిజులా నుంచి లక్షలాది మంది పౌరులు పొట్టచేతబట్టుకుని... పెరు సహా ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. తమకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ చిల్లర పోగుచేసుకుంటూ దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో వ్యవహారశైలి వల్లే ఆ దేశ పౌరులకు ఇలాంటి దుర్గతి పట్టిందంటూ ప్రతిపక్షాలతో పాటు మానవ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వెనిజులన్ మహిళ దీనస్థితిని కళ్లకుగట్టే వీడియోను ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ మంగళవారం షేర్ చేసింది. ‘ మీరు ఈరోజు వినాల్సిన సుందరగానం ఇది’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో...తన తొమ్మిది నెలల పాపాయిని చేతుల్లో పెట్టుకుని...గానం చేస్తూ ఆ తల్లి డబ్బు యాచిస్తోంది. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ‘తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొడుతూ... హాయిగా పడుకోవాల్సిన ఆ చిన్నారి నేడు ఇలా రోడ్డుపై అమ్మ చేతుల్లో నిద్రపోతోంది. ఈ దుస్థితి కారణం ఎవరు’ అంటూ దేశ అధ్యక్షుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఏడాది కాలంలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది వెనిజులన్లు పెరూకు వలస వచ్చారు. వారిలో చాలా మందిని అక్రమవలసదారులుగా గుర్తించిన పెరూ ప్రభుత్వం... పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నవారిని మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతినిచ్చింది. వీసాలు లేని వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొలంబియా యుద్ధాన్ని కోరుకుంటోందని...వారి కుట్రలు తిప్పికొట్టేందుకు తమ సైన్యం సన్నద్ధంగా ఉన్నదంటూ వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రకటన జారీ చేశారు. వివిధ రక్షణ విభాగాలకు చెందిన సైన్య దళాధిపతులతో సమావేశమైన ఫొటోలను విడుదల చేశారు. ‘కొలంబియా యుద్ధం, హింస కోరుకుంటోంది. అందుకు మేము ధీటుగా బదులిస్తాం’ అని మదురో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: అమెరికాతో తెగదెంపులు! ఇక ఈ ఏడాది జరిగిన వెనిజులా ఎన్నికల్లో ప్రముఖ ప్రతిపక్ష నాయకులు నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించుకున్నారు. ఇందుకు నిరసనగా మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.అప్పటి నుంచి దేశంలో రాజకీయ అనిశ్చితితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. గుర్తిస్తున్నామంటూ అమెరికా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కొలంబియా సహా ఇతర దేశాలు వంతపాడాయి. ఈ క్రమంలో అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో.. అగ్రరాజ్యంతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
అమెరికాతో యుద్ధానికి సిద్ధం
మా దేశాన్ని చుట్టుముట్టి నిర్బంధిస్తే అమెరికాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హెచ్చరించారు. యుద్ధానికి తమ సేనలను సమాయత్తం చేస్తున్నామని ప్రకటించారు. అమెరికా చట్ట వ్యతిరేకమైన బెదిరింపులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ వెనెజులా వ్యవహారంలో రష్యా, చైనా, ఇరాన్, క్యూబాల జోక్యాన్ని తాము సహించమని, అందుచేతనే ఆ దేశాన్ని దిగ్బంధించే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా బెదిరింపులు చూస్తుంటే ఆ దేశం తీవ్ర నిరాశ, చికాకులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఏ సైనిక చర్య తీసుకున్నా తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. ‘నేర సామ్రాజ్యవాద దేశానికి నేనిచ్చే సందేశం ఇదే. ఎవరైనా మమ్మల్ని ముట్టడిస్తే యుద్ధానికి సిద్ధం కావడానికి మేం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వారు మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా మేం మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే అమెరికా వెనెజులాపై అనేక రకాల ఆంక్షలు విధించింది. దేశాధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత యువాన్ గ్వాయిడోను గుర్తిస్తున్నామని అమెరికా దాని మిత్ర పక్షాలు ప్రకటించడమే గాక మదురోను తొలగించడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీని ఫలితంగానే గత కొంతకాలంగా అధ్యక్ష కార్యాలయాన్ని గ్వాయిడో అనుచరులు స్వాధీనం చేసుకోవాలని చూస్తుండటంతో ప్రస్తుతం వెనెజులాలో ఘర్షణ వాతావారణం నెలకొంది. -
రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు చమురు ఎగుమతులతో సమద్ధిగా ఎదిగిన దేశం వెనిజులాలో నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు నిత్యం ఆందోళనలు చేయడం, వారిని పోలీసులు పాశవికంగా అణచివేయడం నిత్యకత్యమైంది. అలాగే వంట గ్యాస్ కోసం తల్లి ఆండ్రియానా వెంట కుమారులు రూఫో ఛాకన్ (16), ఆండ్రియాన్ (14)లు తారిబా పట్టణంలో రెండు వారాల క్రితం ఆందోళన చేస్తుండగా, వారిపైకి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్చారు. ఆ బుల్లెట్లకు సంబంధించిన 51 ముక్కలు వచ్చి రూఫో ఛాకన్ ముఖానికి తగులగా, వాటిల్లో 16 ముక్కలు నేరుగా రెండు కళ్లలోకి దూసుకుపోయాయి. దీంతో రెండు కళ్ల నుంచి రక్తం చిమ్మింది. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స అందించినప్పటికీ రెండు కళ్లు పోయాయి. చూపు తెప్పించే ఆస్కారమే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వంట గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న తల్లికి అండగా తాను ఆందోళనకు వెళ్లినందుకు ఇప్పుడు తల్లికి భారంగా మారాల్సి వచ్చిందని ఆ తనయుడు బాధ పడుతున్నాడు. ఇంక తానే మాత్రం ఏడ్వదల్చుకోలేదని, ఆస్పత్రిలోనే కావాల్సినంత ఏడ్చేశానని మీడియా ముందు వాపోయాడు. తాను మదిలో రంగులు మర్చిపోకముందే చూపు రావాలని కోరుకుంటున్నానని, తనకు జీవితంలో ఏ కలలు చావలేదని, చూపు కోసం తాను ఎంత కష్టపడాలన్నా పడతానని, అలాంటి దారి ఉంటే చూపుమని మీడియాను కూడా వేడుకున్నాడు. బాధ్యతారహితంగా రబ్బర్ బుల్లెట్లను పేల్చిన ఇద్దరు పోలీసులను వెనిజులా యంత్రాంగం గుర్తించి వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికా ఆంక్షల వల్ల ఇప్పుడు వెనిజులాలో చమురు, వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. -
టాయిలెట్ పేపర్‌గా కరెన్సీ!
సాక్షి, బిజినెస్ డెస్క్: గతేడాది రూపాయికి కొనుక్కున్న వస్తువు ఈ ఏడాది ఏకంగా 10 లక్షల రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే? అదీ కాదు.. కాసేపటి క్రితం 5 రూపాయలకు కొన్న బిస్కెట్ ప్యాకెట్‌ని 10 నిమిషాల తర్వాత 10 రూపాయలకి.. ఆ తర్వాత మరో 10 నిమిషాలకు ఇరవై, ముప్ఫై, నలభై రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే.. ప్రస్తుతం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలతో అస్తవ్యస్తమైన వెనెజులా దేశంలో అచ్చం ఇలాంటి పరిస్థితే ఉంది. కరెన్సీ విలువ పడిపోవడం, ఆహారం మొదలైన నిత్యావసరాల కొరత నెలకొనడం, దానికి తగ్గట్లుగా రేట్లు పెరిగిపోవడం దీనికి కారణం. దీంతో ఒక దశలో టాయ్‌లెట్ పేపర్‌ను కొనుక్కోవడం బదులు కరెన్సీ నోట్లనే టాయ్‌లెట్ పేపర్‌గా వాడుకుంటున్నారంటే పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా అంటే.. క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో ఆ దేశ కరెన్సీ బొలివర్కూ డిమాండ్ విపరీతంగా పడిపోయింది. విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల భారం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం మరింత ఎక్కువగా కరెన్సీని ముద్రించింది. దీంతో అందరి చేతుల్లో డబ్బు ఉన్నా, నిత్యావసరాల సరఫరా పరిమితంగా ఉండటంతో వాటి రేట్లు పెరిగిపోయాయి. చివరికి ఇదో ఇదో విషవలయంలా తయారైంది. ఇది గాక, దాచుకున్న డబ్బును వెనెజులన్లు అమెరికన్ డాలర్లలోకి మార్చుకోవడం మొదలెట్టారు. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి.. వెనెజులా బొలివర్ మారకం రేటు మరింతగా పడిపోయింది. ప్రభుత్వం నియంత్రణ విధించడంతో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. అధికారిక మారకం రేటుకు.. బ్లాక్‌మార్కెట్ రేటుకూ భారీ వ్యత్యాసాలు వచ్చేయడంతో వెనెజులా కరెన్సీ విలువ మరీ పాతాళానికి పడిపోయింది. ఆహారం దగ్గర్నుంచి ప్రతీ దానికి కొరత నెలకొనడంతో సుమారు 30 లక్షల మంది వెనెజులన్లు (జనాభాలో దాదాపు పది శాతం) దేశం విడిచి వెళ్లిపోయారు. కిలో టమాటా... 30,000పైమాటే.. లీటరు పాలు... దాదాపు.. 50,000 ► 10 లక్షల శాతం: ఈ ఏడాది ఆఖరుకు వెనెజులాలో ద్రవ్యోల్బణం చేరబోయే స్థాయి (ఐఎంఎఫ్ అంచనా). ► ప్రభుత్వం పాత కరెన్సీ బొలివర్ ఫుర్టె స్థానంలో బొలివర్ సోబ్రానో కరెన్సీని ప్రవేశపెట్టింది. ఒక సోబ్రానో.. లక్ష ఫుర్టెలకు సమానం. ► ప్రస్తుతం 1 వెనెజులా బొలివర్ సొబ్రానో .. భారత కరెన్సీలో సుమారు రూ. 6.88కి సమానం. ► కిలో టమాటా దాదాపు 4,411 బొలివర్లు.. అంటే రూ.30,387 అన్నమాట. లీటరు పాలప్యాకెట్ ధర సుమారు 7,029 బొలివర్లు (రూ.48,400). -
వెనెజులాలో తిరుగుబాటు యత్నం
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్‌లో మంగళవారం ఘర్షణలు చెలరేగాయి. తనకు తానే అధ్యక్షునిగా ప్రకటించుకున్న జువాన్ గయిడో నేతృత్వంలో కొందరు సైనికులు, ఆందోళనకారులు రాజధాని సమీపంలోని వైమానిక స్థావరాన్ని, ప్రధాన రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వ సైనికులు వారిని చెదరగొట్టారు. తన ప్రభుత్వానికే సైన్యం మద్దతు ఉందంటూ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించుకున్నారు. తిరుగుబాటు యత్నాలను సైన్యం తిప్పికొడుతోందన్నారు. కాగా, గయిడో ప్రభుత్వాన్ని రష్యా, చైనా మినహా 50 వరకు దేశాలు గుర్తించాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనెజులాలో ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి. మదురోను గద్దె దించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని గయిడో ప్రకటించారు. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు గాయపడ్డారు. ఆగ్రహించిన ఆందోళనకారులను బస్సుకు నిప్పుపెట్టి జాతీయ రహదారిని దిగ్బంధించారు. సంయమనం పాటించాలని వెనిజులా అధికార, ప్రతిపక్షాలను ఐక్యరాజ్యసమితి కోరింది. -
వెనిజులాలో అగ్రరాజ్యాల ఆధిపత్యం!
మాస్కో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న వెనిజులాలో రష్యా సైన్యం అడుగుపెట్టింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు మద్దతుగా తమ సైన్యం ఆ దేశానికి చేరుకున్నట్లు రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా తెలిపారు. ఇరుదేశాల మధ్య కుదిరిన సైనిక సహకార ఒప్పందం మేరకే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. వెనిజులాలో ఉండే ప్రతీ హక్కు రష్యా సైన్యానికి ఉందని తేల్చిచెప్పారు. అయితే వెనిజులాకు ఎంతమంది రష్యా సైనికులు చేరుకున్నారన్న విషయమై మారియా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–రష్యా సంబంధాలు మరింత దిగజారనున్నాయి. -
అమెరికా దుందుడుకుతనం
అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో చేతులు కలిపి అడ్డదారులు తొక్కారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ దాన్నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించడానికి వెనిజులాలో చిచ్చు రగిలిస్తున్నారు. నిరుడు మే నెలలో అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన విపక్షాన్ని ప్రోత్స హించి ఉద్యమాలతో ఆ దేశంలో అశాంతి సృష్టిస్తున్నారు. గత కొన్నిరోజులుగా వెనిజులా నిరసన లతో, సమ్మెలతో అట్టుడుకుతోంది. ప్రస్తుత దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలాగైనా గద్దె దించా లన్నది అమెరికా లక్ష్యం. దీనికి యూరప్ యూనియన్(ఈయూ)లోని ప్రధాన దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లు వత్తాసు పలుకుతున్నాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జువాన్ గైదో తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకోగా, ఆయన్ను గుర్తిస్తున్నట్టు ట్రంప్ ఆదరా బాదరాగా ప్రకటించారు. పైగా సైనిక దాడులకు దిగుతామని బెదిరిస్తున్నారు. అయితే ఈయూ దేశాలు మాత్రం తాము అమెరికా తోక పట్టుకుని పోవడం లేదని చెప్పడానికన్నట్టు వేరే పల్లవి అందుకున్నాయి. ఎనిమిది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని మదురోకు షరతు విధిం చాయి. అందుకు సిద్ధపడకపోతే గైదోను దేశాధ్యక్షుడిగా తాము కూడా గుర్తిస్తామని హెచ్చరిం చాయి. అసలు వేరే దేశంలో ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పడానికి వీరె వరు? వెనిజులా ప్రజలు తమను ఎవరు పాలించాలో తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందా? తాజా సంక్షోభంలో తాము మదురోకు అండగా నిలు స్తామని రష్యా, చైనా ప్రకటించాయి. మన దేశం కూడా వెనిజులా సమస్యల్ని అక్కడి ప్రజలే పరిష్క రించుకోవాలని సూచించింది. గైదోను గుర్తించేందుకు నిరాకరించింది. వెనిజులాపై అమెరికా, పాశ్చాత్య దేశాల కడుపు మంట ఈనాటిది కాదు. అక్కడ అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలన్నాయి. అక్కడి భూగర్భంలో పసిడి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అపురూపమైన వజ్రాలకు అది పెట్టింది పేరు. ఇంత సంపద ఉన్నప్పుడు ఎవరికైనా కన్నుకుట్టడం సహజం. పైగా ఆ దేశంలో వరసగా వచ్చిన ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకుని, అక్కడి సంపదను కొల్లగొట్టడం అలవాటు చేసుకున్న అగ్రరాజ్యాలకు 1999లో మొదటిసారి హ్యూగో చావెజ్ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఆ దేశంలో రెండు ప్రధాన పార్టీలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ... ఒకరి తర్వాత మరొకరు పీఠం ఎక్కుతూ సహజ వనరులను బహుళజాతి సంస్థలకు దోచిపెడుతున్న తరుణంలో చావెజ్ ఆ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాడు. 19వ శతాబ్దిలో స్పెయిన్ వలస దేశాలను ఏకం చేసిన వెని జులా జాతీయ యోధుడు సైమన్ బొలివర్‌ను ఆదర్శంగా తీసుకుని కుమ్మక్కు రాజకీయాలపై కత్తి దూశాడు. 1999 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదలుకొని 2013లో మరణించేవ రకూ అధికారంలో కొనసాగారు. కేన్సర్ వ్యాధితో అంతిమ దశలో ఉండగా తన వారసుడిగా మదు రోను ప్రకటించారు. అదే ఆయనకు బలంగా మారింది. పాలనా సామర్థ్యంలో చావెజ్‌తో సరి తూగ కపోయినా... అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాక ఇబ్బందులు తలెత్తినా ఉన్నం తలో మదురో మెరుగైన పాలనే అందించారు. అందుకే 2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఆయనే విజయం సాధించారు. వాస్తవానికి తదుపరి ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉంది. కానీ విపక్షాల డిమాండ్‌కు తలొగ్గి నిరుడు మే నెలలో... అంటే 19 నెలల ముందు అధ్యక్ష ఎన్నికలు జరి పారు. ఆ ఎన్నికల్లో 67.84 శాతం ఓట్లు సాధించారు. అవి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని వివిధ దేశాల నుంచి పరిశీలకులుగా వచ్చిన 150మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అందులో 8 దేశా లకు చెందిన 14మంది ఎన్నికల అధికారులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. పైగా వెనిజులా ఎన్ని కల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా ఉంటుంది. ఎన్నికలకు ముందు... అవి కొనసాగుతుండగా... పూర్తయ్యాక– ఇలా మూడు దఫాలుగా 18సార్లు ఈవీఎంలను తనిఖీ చేసే ప్రక్రియ తప్పనిసరి. ఇందులో యాదృచ్ఛికంగా ఎంపిక చేసే 53శాతం ఈవీఎంలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దొంగ ఓట్లకు అక్కడ ఆస్కారం ఉండదు. ఓటరు వేలిముద్రే అతడి/ఆమె గుర్తింపు కార్డు. అన్నిటికన్నా ముఖ్యమేమంటే... మదురో ప్రత్యర్థులెవరూ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించలేదు. 2015 పార్లమెంటరీ ఎన్నికల్లో మదురో పార్టీ కాకుండా, విపక్షాలే అత్యధిక స్థానాలు చేజిక్కించుకున్నాయి. నిజంగా అక్రమాలకు ఆస్కారం ఉంటే అది అసాధ్యమయ్యేది. వెనిజులా ఒడిదుడుకుల్లో ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ ఒడిదుడుకులన్నీ అమెరికా ప్రాప కంతో సాగుతున్న దిగ్బంధం పర్యవసానంగా, చమురు ధరల కుంగుబాటు కారణంగా ఏర్పడ్డాయి. ఒబామా హయాంలో మొదలైన ఆంక్షలు ట్రంప్ వచ్చాక మరింత పెరిగాయి. వీటి విలువ దాదాపు 600 కోట్ల డాలర్లు. ఇవిగాక వెనిజులాకు దక్కాల్సిన చమురు సంస్థ లాభాలు 100 కోట్లను బదిలీ కాకుండా అమెరికా అడ్డగించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో వెనిజులాకు ఉన్న 120 కోట్ల డాలర్ల బంగారం నిల్వలు స్తంభింపజేసింది. దేశంలో నిత్యావసరాల కొరత, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం సరేసరి. నిజంగా వెనిజులా ప్రజల శ్రేయస్సుపై ఏ కాస్త ఆందోళన ఉన్నా అమెరికా ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడదు. వారిని కష్టాలపాటు చేయదు. తాము సృష్టించి, పెంచుతున్న సంక్షో భానికి మదురోను బాధ్యుడిగా చేసి, ఆయన తప్పుకోవాలనటం అమెరికా వక్రబుద్ధికి తార్కాణం. ప్రజామోదంతో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుణ్ణి బెదిరించడం, సైనికచర్యకు దిగుతాననడం దురహం కారం తప్ప మరేం కాదు. ఈ దురహంకారానికి ఇప్పటికే పలు దేశాలు బలయ్యాయి. వెనిజులాలో నెత్తురు పారకుండా, అరాచకం తాండవించకుండా, అస్థిరత దాన్ని చుట్టుముట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ పౌరులందరిదీ. ఈ విషయంలో మన దేశం వైఖరి హర్షించదగ్గది. -
అక్కడ కాఫీ తాగాలంటే లక్షలు పెట్టాల్సిందే..
వెనిజులా : పట్టపగ్గాల్లేకుండా పెరిగిన ద్రవ్యోల్బణంతో వెనిజులాలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా స్ధానిక కరెన్సీలో లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. కప్పు కాఫీ ధర అక్కడి కరెన్సీలో పది లక్షల వెనిజులా బొలివర్స్ కావడం గమనార్హం. డాలర్‌తో బొలివర్స్ మారకం విలువ 637కు చేరడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. వెనిజులాలో ఈ ఏడాది ద్రవ్యోల్బణం పదిలక్షల శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేయడంతో జనం బెంబేలెత్తుతున్నారు. నిత్యావసరాల ధరలు ప్రతి 19 రోజులకు రెట్టింపవుతున్నాయి. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు వెనిజులా ప్రభుత్వం బ్యాంకు నోట్లను ఇబ్బడిముబ్బడిగా ముద్రిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. గత కొన్నేళ్లుగా వెనిజులాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం దేశాన్ని ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేసింది. జీవన స్ధితిగతులు దిగజారిపోవడంతో అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దేశప్రజలే కాదు విదేశాలు సైతం ఆయన విధానాలను తీవ్రంగా ఎండగడుతున్నాయి. సంపన్న చమురు దేశాన్ని సామాజికార్థిక, రాజకీయ రంగాల్లో నిర్వీర్యం చేసిన అధ్యక్షుడి తీరును తప్పుపడుతున్నాయి. -
వెనెజులాలో రాజకీయ సంక్షోభం
కారకస్: దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజులాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విపక్ష నేత జువాన్ గుయాడో ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండగా, అధ్యక్షుడు నికోలస్ మదురోకు సైన్యం తోడ్పాటు లభించింది. అమెరికాతోపాటు అనేక వెనెజులా పొరుగుదేశాలు గుయాడోకు మద్దతు తెలిపి ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించగా, రష్యా, చైనా సహా పలు దేశాలు మదురోకు మద్దతుగా నిలిచాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతోపాటు ప్రజలకు నిత్యావసరాలు కూడా సరిగ్గా దొరకక తిండి కోసం నానా తిప్పలు పడుతున్నారు. -
అమెరికాతో తెగదెంపులు!
కారకస్ : ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. అమెరికా గుర్తించడం పట్ల ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో ఘాటుగా స్పందించారు. అగ్రరాజ్యం అమెరికాతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని పేర్కొన్నారు. 72 గంటల్లోగా అమెరికన్ ప్రతినిధులంతా తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ ఆయన హెచ్చరించారు. వెనిజులా అధ్యక్షుడిగా మదురో గతేడాది మేలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే మదురో పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న కారణంగా ఆయనను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా నిరాకరించింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత జువాన్ గైడోను అసలైన అధ్యక్షుడిగా గుర్తిస్తున్నామంటూ పేర్కొంది. ఈ మేరకు.. ‘ వెనిజులా ప్రజలు మదురో పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా నేను ఈ రోజు అధికారికంగా గుర్తిస్తున్నాను’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో బుధవారం తన మద్దతుదారులతో కలిసి అధ్యక్ష భవనంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిగా.. అమెరికాతో దౌత్యపరమైన, రాజకీయ ఇలా అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించాను. దేశ ప్రజల ముందు, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ విషయం తెలియజేస్తున్నాను. గెట్ అవుట్.. వెనిజులాను వదిలి వెళ్లండి. మాకు ఆత్మగౌరవం ఉంది.. డ్యామిట్’ అని మదురో వ్యాఖ్యానించారు. వెనిజులాను తోలు బొమ్మను చేసి అమెరికా అధికారం చెలాయించాలని చూస్తోందని ఘాటుగా విమర్శించారు. కాగా దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఇక ప్రతిపక్ష నేత జువాన్‌ను అధ్యక్షుడిగా అమెరికా గుర్తించడాన్ని కొలంబియా కూడా సమర్థించింది. The citizens of Venezuela have suffered for too long at the hands of the illegitimate Maduro regime. Today, I have officially recognized the President of the Venezuelan National Assembly, Juan Guaido, as the Interim President of Venezuela. https://t.co/WItWPiG9jK — Donald J. Trump (@realDonaldTrump) January 23, 2019 -
వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో
కారకస్: వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. రాజధాని కారకస్‌లో జరిగిన మదురో ప్రమాణస్వీకార కార్యక్రమానికి 94 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మదురో బాధ్యతలు చేపట్టడాన్ని అమెరికా, కెనడా సహా డజను లాటిన్ అమెరికా దేశాలు వ్యతిరేకించాయి. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. -
మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పీన్స్ భామ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. 93 దేశాలకు చెందిన యువతులు ఈ కిరీటం కోసం పోటీపడగా కాట్రియానా విజేతగా నిలిచింది. సోమవారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో న్యాయనిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజెవిలాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సింగర్, మోడల్‌గా పేరొందిన కాట్రియానా వేదికపై ఎరుపు రంగు గౌనులో తళుక్కుమంది. ఓ అగ్నిపర్వతాన్ని ప్రేరణగా తీసుకుని తాను ఎరుపు రంగు గౌనును ధరించానని కాట్రియానా చెప్పింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డేమీ లీ నీల్పీటర్స్ కాట్రియానాకు కిరీటాన్ని అలంకరించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కాట్రియానాకు అభినందనలు తెలిపారు. -
వెనిజువెలా అధ్యక్షుడిపై హత్యాయత్నం!
కరాకస్: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురోపై ఆదివారం ఉదయం (భారతకాలమానం ప్రకారం) హత్యాయత్నం జరిగింది. భారీ పేలుడు పదార్థాలున్న డ్రోన్ ఆయన ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో పేలింది. ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగానే బయటబడినా.. ఏడుగురు సైనికులకు గాయాలయ్యాయి. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా కరాకస్‌లో మిలటరీ పరేడ్‌నుద్దేశించి మడురో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి కొలంబియానే కారణమని మొదట పేర్కొన్న మడురో అనంతరం.. అనుమానాస్పద రెబల్ గ్రూప్ హత్యాయత్నం చేసి ఉండొచ్చన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మిలటరీ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘నేను బాగున్నాను. బతికే ఉన్నాను. ఈ దాడి తర్వాత మరింత విప్లవాత్మకంగా పనిచేయాలని నిశ్చయించుకున్నాను. ఈ ఘటనకు బాధ్యులకు తీవ్రమైన శిక్షలు తప్పవు. ఎవరినీ క్షమించబోం’ అని దాడి అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ మడురో హెచ్చరించారు. ‘నన్ను చంపేందుకు పన్నిన కుట్ర ఇది. నేడు నన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. ఓ ఎగురుతున్న వస్తువు హఠాత్తుగా నా ముందు పేలింది’ అని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలను అణచివేస్తున్న మడురో.. 248 మందిని రాజకీయ ఖైదీలుగా జైల్లో పెట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై కనికరం చూపించబోమని అటార్నీ జనరల్ తారెక్ విలియమ్ సాబ్ హెచ్చరించారు. కాగా, ఈ దాడికి తమదే బాధ్యతని వెనిజువెలా మిలటరీ రెబల్ గ్రూప్ ‘నేషనల్ మూమెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్స్’ (ఎన్‌ఎంఎస్‌టీ) ప్రకటించుకుంది. పేలింది డ్రోనా? సిలిండరా? వెనిజువెలా అధికార చానెల్లో చూపించిన దృశ్యాల్లో.. సైనికుల మధ్యలో మడురో నిలబడి ప్రసంగిస్తుండగా ఓ భారీ శబ్దం వినిపించింది. దీంతో పరేడ్‌లో ఉన్న జాతీయ గార్డులు దూరంగా జరిగిపోయారు. పేలుడు జరగగానే గార్డులు అధ్యక్షుడికి రక్షణ కల్పిస్తూ ఆయన చుట్టూ వలయంలా మారిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఆ వెంటనే లైవ్ కట్ అయింది. అధ్యక్షుడు ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో ఈ డ్రోన్ పేలిందని వెనిజువెలా సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు. సంప్రదాయవాదులే (విపక్షం) ఈ పనిచేసి ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కరాకస్ మిలటరీ క్షేత్రానికి సమీపంలోని భవనం వద్దనుంచే ఈ డ్రోన్‌ను ఆపరేట్ చేసినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు. అయితే.. సమీపంలోని భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే భారీగా శబ్దం వచ్చిందని, హత్యాయత్నం జరగలేదని పలు అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నా యి. మడురో మిత్రులైన క్యూబా, బొలీవియా దేశాలు ఈ హత్యాయత్నాన్ని ఖండించాయి. మాకేం సంబంధం లేదు: అమెరికా వెనిజువెలా ఘటనను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడి వెనక తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ‘అమెరికా ప్రమేయం లేదు. ఆ దేశంలో జరిగే మార్పులతో మాకు సంబంధం లేదు’ అని అమెరికా భద్రతా సలహాదారు. జాన్ బోల్టన్ తెలిపారు. కొలంబియా ప్రభుత్వం కూడా మడురో ఆరోపణలను ఖండించింది. ‘మడురో ఆరోపణలు అర్థరహితం. ఎలాంటి ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు’ అని హెచ్చరించింది. బాధ్యత మాదే! ఈ దాడికి తామే బాధ్యులమని మిలటరీ రెబల్ గ్రూప్ ‘నేషనల్ మూమెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్స్’ (ఎన్‌ఎంఎస్‌టీ) ప్రకటించుకుంది. ‘రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వారు, అధికారాన్ని స్వార్థప్రయోజనాలకు వాడుకునే వారికి మిలటరీ ఇస్తున్న అసలు సిసలు గౌరవం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘దేశ ప్రజలు సంతోషంగా ఉండేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోలేని ప్రభుత్వాన్ని మేం సహించబోం. కరెన్సీకి విలువ లేదు. వ్యాధులకు మందుల్లేవు. విద్యావ్యవస్థ దారుణంగా ఉంది. కమ్యూనిజాన్ని మాత్రమే ప్రభుత్వం బోధిస్తోంది’ అని ఎన్‌ఎంఎస్‌టీ పేర్కొంది. దేశంలో రాజ్యాంగ సంక్షోభం భారీ చమురు నిక్షేపాలున్నప్పటికీ.. వెనిజువెలా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దేశంలో కొంతకాలంగా రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. మడురో సన్నిహితులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థితికి చేరుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సంప్రదాయవాదులను (విపక్షాలు) మడురో జైల్లో పెట్టిస్తున్నారు. వీరికి అమెరికా సాయం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగగా.. మడురో ఏకపక్ష నిర్ణయాలతో విపక్షం ఎన్నికలను బహిష్కరించింది. దీంతో మరో ఆరేళ్లపాటు ఈయనే అధికారంలో ఉండనున్నారు. డ్రైవర్ నుంచి అధ్యక్షుడి దాకా.. 1962లో పుట్టిన నికోలస్ మడురో తండ్రి వెనిజువెలాలో ప్రముఖ కార్మిక నేత. చిన్నప్పటినుంచే కమ్యూనిజం, కార్మిక చట్టాలను మడురో ఒంటబట్టించుకున్నారు. విద్యార్థి సంఘం నేతగా ఎదిగిన మడురో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేయలేదు. అనంతరం కరాకస్ మెట్రో కంపెనీలో బస్ డ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1993లో అప్పటి వెనిజువెలా అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ను కలుసుకున్న మడురో.. ఆ తర్వాత బొలివియన్ ఉద్యమంతో కీలకనేతగా ఎదిగారు. ఈ ఉద్యమం ద్వారానే 1998లో చావెజ్ అధ్యక్ష పీఠాన్ని మళ్లీ అధిరోహించారు. అప్పుడే మడురో ఎంపీగా గెలిచారు. 1999లో నేషనల్ అసెంబ్లీలో డిప్యూటీ నేతగా ఎంపికయ్యారు. చావెజ్ 2006లో మడురోను విదేశాంగ మంత్రిగా నియమించారు. 2013లో చావెజ్ మరణంతో ఆపద్ధర్మ నేతగా, ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో నెగ్గి అధ్యక్షుడయ్యారు. -
వెనెజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం
కరాకస్, వెనెజులా : వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి హాని కలుగలేదు. దేశ రాజధాని కరాకస్‌లో వేల మంది సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుండగా ఆయుధ సామర్ధ్యం కలిగిన డ్రోన్లు పేల్చివేశారు. ఈ మేరకు వెనెజులా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విచారణలో డ్రోన్ల ద్వారా బాంబు పేల్చినట్లు తేలింది. పేలుడు తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. అయితే, ఇది నిజంగా డ్రోన్ దాడి కాదని, దగ్గరలోని అపార్ట్మెంటులో గ్యాస్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. -
10 లక్షల శాతం పెరిగిన ఆ దేశ ద్రవ్యోల్బణం
లాటిన్ అమెరికా దేశం వెనిజులా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ ఆకలి కేకలు ప్రపంచమంతా మారు మోగిపోతున్నాయి. పెట్రోల్ ఉత్పత్తులు ధరలు క్రాష్ కావడంతో మొదలైన సంక్షోభం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మరింత ఎక్కువైంది. సామాన్యుడికి అందుబాటులో లేని ధరలతో... జనాలకు సరిగా తిండి లేకుండా పోయింది. ఒక్క బ్రెడ్ కోసం గంటల తరబడి క్యూలైన్లు కడుతున్నారు. ప్రస్తుతం వెనిజులా ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ దేశ ద్రవ్యోల్బణ రేటు కూడా పది శాతం, వంద శాతం, రెండొందల శాతం కాకుండా... ఏకంగా 10 లక్షల శాతం మేర పెరిగిపోతుందట. 2018లో వెనిజులా ద్రవ్యోల్బణం 10 లక్షల శాతాన్ని తాకే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించింది. ఈ అధునాతన చరిత్రలో అత్యంత హీనాతిహీనమైన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం వెనిజులానే అని తన అధికారిక ప్రకటనలో తెలిపింది. 2014లో ఆయిల్ ధరలు క్రాష్ అవడంతో మొదలైన పతనం, అలా కొనసాగుతూనే ఉందని, వెనిజులానే కుప్పకూలేలా చేసిందని పేర్కొంది. ధరల పెంపుదలను, సౌమ్యవాద వ్యవస్థనువెనిజులా నియంత్రించలేకపోతుందని చెప్పింది. ‘1923లో జర్మనీ, 2000లో జింబాబ్వే ఎదుర్కొన్న మాదిరిగా వెనిజులా ప్రస్తుత పరిస్థితి ఉంది. దీని ద్రవ్యోల్బణం 2018 చివరి నాటికి 10 లక్షల మేర పెరిగే అవకాశముందని అంచనావేస్తున్నాం‘ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పశ్చిమ అర్థగోళ విభాగపు డైరెక్టర్ అలెజాండ్రో వెర్నర్ ఏజెన్సీ బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఐఎంఎఫ్ అంచనాలపై వెనిజులా సమాచార మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది వినియోగదారుల ధరలు 46,305 శాతం పెరిగాయి. వాషింగ్టన్ మద్దతుతో వ్యతిరేక వ్యాపారులు నిర్వహించే ఆర్థిక యుద్ధానికి వెనిజులా బలైపోయిందని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో చెప్పారు. అయితే దీనికంతటికీ కారణం, అధికార నాయకులు తీసుకునే చెత్త పాలసీ నిర్ణయాలేనని ప్రత్యర్థులూ విమర్శిస్తున్నారు. నగదు సరఫరా విస్తరణను పరిశీలించకపోవడం, కరెన్సీని నియంత్రించలేకపోవడం, ముడి పదార్థాలను, మెషిన్ పార్ట్‌లను దిగుమతి చేసుకోలేకపోవడమే దీనికి కారణమని కూడా పేర్కొంటున్నారు. -
వెనిజువెలా ఎన్నికల్లో మదురో ఘనవిజయం
కారకస్: వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్ నేత నికోలస్ మదురో(55) ఘనవిజయం సాధించారు. జాతీయ ఎన్నికల కౌన్సిల్ ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజువెలాకు చెందిన మదురో 68 శాతం ఓట్లను దక్కించుకున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మదురోకు 58 లక్షల ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 18 లక్షల ఓట్లు పోలయ్యాయి. తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు మదురో వెనిజువెలాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇది చరిత్రాత్మక విజయం. ఈ ఎన్నికల్లో వెనిజువెలా గెలిచింది. శాంతి గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. వెనిజువెలాలో అతిపెద్ద, శక్తిమంతమైన రాజకీయ శక్తిగా మనం చాలాకాలం ఉంటాం. వాళ్లు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. నేను నియంతనని ప్రతిపక్షాల చేసే విమర్శలు నన్ను బాధపెట్టవు. వెనిజువెలా ఆర్థికవ్యవస్థను అమెరికా, కొలంబియా దేశాల మద్దతు ఉన్న మాఫియాలు తీవ్రంగా దెబ్బతీశాయి. రాబోయే రెండేళ్లలో ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారిస్తాం’ అని పేర్కొన్నారు. వెనిజువెలాతో అనుసరిస్తున్న యుద్ధవైఖరిని అమెరికా పునఃసమీక్షించాలని మదురో విజ్ఞప్తి చేశారు. 2013, మార్చి 5న అప్పటి దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్ మరణంతో మదురో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈ ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు మరోసారి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మదురో ప్రభుత్వం ఎన్నికలకు ముందు, పోలింగ్ సందర్భంగా తీవ్రమైన అవకతవకలకు, ఉల్లంఘనలకు పాల్పడిందని రెండో స్థానంలో నిలిచిన హెన్రీ ఫాల్కన్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌కేంద్రాల సమీపంలో ‘రెడ్ టెంట్ల’ను ఏర్పాటుచేశారనీ, సంక్షేమ పథకాలకు అవసరమైన ‘ఫాదర్ల్యాండ్ కార్డు’లను మదురో మద్దతుదారులు అక్కడ స్కాన్ చేశారని వెల్లడించారు. కాగా, మదురో విజయంపై మయామీ, మ్యాడ్రిడ్‌లో వలసదారులు నిరసన తెలిపారు. వెనిజువెలాలో ఎన్నికలు జరిగిన తీరు సిగ్గుచేటనీ, ఈ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో పాటు 17 పొరుగుదేశాలు తేల్చిచెప్పాయి. తాజాగా మదురో విజయం నేపథ్యంలో వెనిజువెలా జీడీపీలో 25 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న చమురురంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
వెనిజులా ప్రధానిగా నికోలస్ మడురో
కారకస్ : నికోలస్ మడురో రెండవ సారి కూడా వెనిజులా ప్రధానిగా ఎన్నికయ్యారు. మరో ఆరు సంవత్సరాల పాటు ఆయన వెనిజులా ప్రధానిగా కొనసాగనున్నారు. మొత్తం 90 శాతం ఓట్లు పోల్ కాగా ఇందులో మడురోకు 68 శాతం, ఆయన ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 21శాతం ఓట్లు లభించాయి. ఆదివారం ఎన్నికల అధికారులు మడురోను విజేతగా ప్రకటించారు. కాగా మడురో ఎన్నికలలో రిగ్గింగ్‌కు పాల్పడి నెగ్గినట్లు ఫాల్కన్ ఆరోపిస్తున్నారు. 2018 డిసెంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలను మడురోకు అనుకూలంగా ఉండేలా కొద్ది నెలల ముందుగానే నిర్వహించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ ఎన్నికలు చెల్లవని, వచ్చే ఏడాది కొత్తగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. దేశంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా కేవలం 46శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినిమోగించుకున్నారని ప్రతిపక్షం తెలిపింది. -
వెనెజులా జైలులో 68 మంది దుర్మరణం
కారకస్: వెనెజులాలోని కారాబొబొ రాష్ట్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయం జైలు నుంచి బుధవారం ఖైదీలు తప్పించుకోవడానికి యత్నించిన ఘటనలో మంటలు చెలరేగి 68 మంది దుర్మరణం చెందారు. జైలు నుంచి తప్పించుకోవడంలో భాగంగా ఖైదీలు పరుపులకు మంట పెట్టారనీ, భద్రతా సిబ్బంది నుంచి తుపాకీ లాక్కున్నారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మృతుల్లో 66 మంది ఖైదీలు కాగా, ఇద్దరు మహిళా సందర్శకులు ఉన్నారని వెల్లడించారు. వీరిలో కొందరు మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారని పేర్కొన్నారు. -
లైంగిక ఆరోపణలు.. అందాల పోటీలకు బ్రేక్
కారకాస్ : లైంగిక ఆరోపణల నేపథ్యంలో వెనెజులా అందాల పోటీలకు బ్రేక్ పడింది. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులకు పడక సుఖానికి అందించి కొందరు పోటీదారులు పెద్ద ఎత్తున్న డబ్బు తీసుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోటీలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వెనిజులాలో గత 40 ఏళ్లుగా అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ దఫా పోటీల్లో న్యాయనిర్ణేతలు, నిర్వాహకులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ పోటీదారులు ఆరోపణలకు దిగారు. వెంటనే తెరపైకి వచ్చిన మాజీ పోటీదారులు... గతంలోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగాయని ఆరోపించారు. నిర్వాహకులతోపాటు బడా వేత్తలకు లైంగిక సుఖాన్ని అందించారని, తద్వారా డబ్బుతోపాటు కొందరు కిరీటాన్ని కూడా కైవసం చేసుకున్నారంటూ బాంబు పేల్చారు. ఈ ఆరోపణలు కాస్త తారా స్థాయికి చేరటంతో ఆన్లైన్లో పెద్ద ఉద్యమమే నడిచింది. దిగొచ్చిన నిర్వాహకులు కారాకస్‌లోని వేదికను మూసేస్తూ ఆడిషన్స్‌ను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్రకటించారు. ఈ ఆరోపణలపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, వెనెజులా ఇప్పటిదాకా ఏడు మిస్ యూనివర్స్, ఆరు మిస్ వరల్డ్ టైటిళ్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
వెనిజులా ఎందుకిలా ?
-
ఆకలి, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత
కారాకాస్, వెనెజులా : ఆ బ్రిడ్జి దాటితే చాలు.. గుక్కెడు నీళ్లు తాగొచ్చు. ఆ బ్రిడ్జి దాటితే చాలు ఒక్క ముద్ద యంగిలి పడొచ్చు. ఇది సగటు వెనెజులా వాసి ఆలోచన. కొలంబియా దేశానికి వలస పోవడమే లక్ష్యంగా వేలాది మంది వెనెజులియన్లు కదులుతున్నారు. రోజు రోజుకూ తీవ్రమవుతోన్న ఆర్థిక సంక్షోభం, పరుగెడుతున్న ద్రవ్యోల్బణం, ఆకలి, రాజకీయ అస్థిరత వెనెజులా ప్రజల పాలిట శాపంగా మారింది. రాయిటర్స్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో వెనెజులా రాజధాని కరాకస్‌లో 162 దోపిడీలు జరిగాయి. వీటిలో 42 ట్రక్కుల దోపిడీలు ఉన్నాయి. ఈ దోపడిల్లో ఎనిమిది హత్యలు జరిగాయి. అత్యధిక హత్యలు జరుగుతున్న దేశాల్లో వెనెజులా కూడా ఒకటి. ట్రక్కులపై దాడులు పెరుగుతుండటంతో రవాణా ఖరీదు కూడా బాగా పెరిగింది. ఆకలిని తట్టుకోలేక.. ప్రజలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రవాణా మార్గం ద్వారా తరలిస్తున్న ఆహార పదార్థాలను దోచుకునే గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. రవాణా చేస్తున్న వాహనంలో ఉన్న వారిని హత్య చేసి పదార్థాలను దుండగులు దోచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరగడంతో వాటికి ‘మ్యాడ్ మ్యాక్స్ వైలెన్స్’ అని పేరు పెట్టారు. వెనెజులా-కొలంబియాల మధ్య కీలక మార్గంగా ఉన్న సిమోన్ బొలివర్ ఇంటర్నేషనల్ బ్రిడ్జి గుండా కొలంబియాలోకి ప్రవేశించేందుకు వెనెజులియన్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణలో పడిన కొలంబియా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. దేశంలోకి ప్రవేశించడానికి యత్నించేవారిని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొలంబియాను ఆనుకుని ఉన్న బ్రెజిల్ సైతం సరిహద్దులో భద్రతను పెంచింది. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పింది. -
వెనిజులా పార్లమెంట్లో హింస
కారకస్: వెనిజులాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశం హింసాత్మకంగా మారింది. గురువారం ప్రభుత్వ మద్దతుదారులు దుడ్డు కర్రలు, పైపులతో నేషనల్ అసెంబ్లీలోకి చొరబడి ప్రతిపక్ష సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఆ తరువాత అధ్యక్షుడు మదురో మద్దతుదారులు పార్లమెంట్‌ను 9 గంటలపాటు ముట్టడించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తొలుత జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన పోలీసులు తర్వాత∙సైన్యంసాయంతో ఎంపీలను విడిపిం చారు. ఉదయం సుమారు 100 మంది దుడ్డు కర్రలు, పైపులతో తొలుత పార్లమెంట్ ముందు గేటు, ఆ తరువాత ఇంటీరియర్ గార్డెన్, భవనం గేట్లను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. కారిడార్లోకి చొచ్చుకెళ్లి చట్ట సభ్యులపై దాడి చేశారు. స్టన్ గ్రెనేడ్లను పేల్చారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని పాత్రికేయులను బెదిరించారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఐదుగురు ఆసుపత్రిలో చేరారని ప్రతిపక్ష పార్టీ వెల్లడించింది. ప్రభుత్వ మద్దతుదారులు..ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఉగ్రవాదులు, హంతకులు అని అరుస్తూ పార్లమెంట్‌ను చుట్టుముట్టారు. పోలీసులు ఎట్టకేలకు ప్రతిపక్ష సభ్యులను బయటికి తీసుకురాగలిగారు. -
అక్కడ లిప్‌స్టిక్ ధర రూ.72 వేలు
న్యూఢిల్లీ: భారతీయ మహిళలు ఎరుపెక్కిన పెదాలు, గులాబీ బుగ్గలు, తీరైన నల్లటి కనుబొమలు, కొసదేరిని ముక్కు, అందమైన కురులతో అందంగా కనిపించడం కోసం తహతహలాడుతుండడంతో దేశంలో బ్యూటీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. అయినప్పటికీ ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా బ్యూటీ బిజినెస్ ఎక్కువగా ఉన్న 50 దేశాల్లోకెల్లా భారత్‌లోనే లిప్‌స్టిక్ ధరలు చాలా తక్కువగా ఉండడం విశేషం. భారత్‌లో ఓ లిప్‌స్టిక్ ధర సరాసరి 926 రూపాయలు ఉండగా, ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వెనిజులా దేశంలో ఉండడం ఆశ్చర్యం. ఆ దేశంలో సరాసరి లిప్‌స్టిక్ ధర 71,627 రూపాయలు పలుకుతుంది. అక్కడి ద్రవ్య సంక్షోభమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వెనిజులా తర్వాత పెరూలో లిప్‌స్టిక్ ధర 3,792 రూపాయలు పలుకుతోంది. భారత్‌లో కాస్మోటెక్ సర్జరీలు కూడా చవగ్గా అందుబాటులో ఉన్నాయని మెక్సికో ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ 'లినియో' బ్యూటీ ప్రైస్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. బ్రెస్ట్ పెంచుకునేందుకు చేసుకునే కాస్మోటిక్ సర్జరీలకు స్విడ్జర్లాండ్ దేశాల్లో ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండగా, భారత్‌లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఖర్చవుతుందట. అయితే భారత దేశంలో ముక్కు కాస్మోటిక్ సర్జరీకి ఎక్కువ ఖర్చు అవుతుందట. సరాసరి 83,922 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. బ్యూటీ బ్రాండ్లు, సర్వీసులు, కాస్మోటెక్ ప్రొసీజర్లను పరిగణనలోకి తీసుకొని లినియో కంపెనీ బ్యూటీ ధరల సూచికను తయారు చేసింది. సోషల్ మీడియా, బ్లాగుల కారణంగా భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో బ్యూటీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మార్కెట్ ఒక్క 2016లోనే 16 శాతం వద్ధి చెందింది. ఒక్క లిప్‌స్టిక్ రంగంలోనే 3,338 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. లాక్మీ, నైకా లాంటి స్థానిక బ్రాండ్లను ఆదరిస్తున్న మహిళలు, స్మాష్బాక్స్, సెఫోరా లాంటి విదేశీ బ్రాండ్లను సైతం ఆదరిస్తున్నారు. కనుబొమలపై అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు జుట్టును అందంగా తీర్చిదిద్దినట్లు కత్తిరించడం లాంటి బ్యూటీ సర్వీసులకు కూడా భారత్‌లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా మగవాళ్లకు రోడ్డుపక్కనుండే సాలూన్ షాపులు తక్కువ ధరలకే సేవలిందిస్తున్నాయి. భారతీయ మహిళలు అందమైన కనుబొమల కోసం సరాసరి 150 రూపాయలు ఖర్చు పెడుతుండగా, అదే అమెరికా మహిళలు దాదాపు 700 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. భారత్‌లో హేర్ కటింగ్ కోసం పురుషులు సరాసరి 175 రూపాయలు ఖర్చు పెడుతుండగా, అమెరికాలో పురుషులు దాదాపు 910 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. -
ద.అమెరికా లో హింస, 78 మంది మృతి
కారకాస్(వెనిజువెలా): దక్షిణ అమెరికా, వెనిజువెలాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జరిగిన గొడవల్లో మొత్తం మృతుల సంఖ్య 78కి చేరుకుందని అధికార యంత్రాంగం తెలిపింది. అధ్యక్షుడు నికొలస్ మడురో ప్రభుత్వం ప్రభుత్వంపై విసుగెత్తిన ప్రజలు, ప్రతిపక్షాలు ఆయన గద్దెదిగాలని కోరుతూ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మూడు నెలలు కొనసాగుతున్న అశాంతితో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు ఇప్పటి వరకు 1500 మందిని పౌరులను అదుపులోకి తీసుకున్నారు. అధికారంలో మరింత కాలం కొనసాగేందుకు అధ్యక్షుడు మడురో అక్రమాలకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
వెనిజులాలో నోట్లురద్దు: ఉద్రిక్త వాతావరణం
-
రెండు దేశాలు, ఒక ప్రయోగం
రెండో మాట వెనిజులా అంతటా వాడుకలో ఉన్న పెద్ద కరెన్సీ నోట్లు రద్దు కావడంతో ప్రజలు అశాంతితో దాడులకు, దోపిడీలకూ నడుం కట్టవలసి వచ్చినట్టే భారతదేశంలోనూ పేదలు, ఉద్యోగులు, ముసలీ ముతకా గంటల తరబడి, రోజులకొద్దీ నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడి, సహనం కోల్పోయి పలుచోట్ల అశాంతితో దాడులు చేయడం, బ్యాంకర్లను వేధిం చడం, కొట్టడం జరుగుతోంది. అశాంతి మధ్య వెనిజులాలో నలుగురు చనిపోగా.. మన దేశంలో అలా చనిపోయిన వారి సంఖ్య 110 దాకా ఉన్నట్లు సమాచారం. ‘గ్రామీణ భారతదేశం నూటికి నూరుపాళ్లు నగదు లావాదేవీల మీదే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను డిజిటల్ (ఎలక్ట్రానిక్) లావా దేవీల మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా మార్చేముందు గ్రామీణ నిరక్షరాస్యత లాంటి సమస్యలను ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుని ఉండాల్సింది. అనా లోచితంగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడం వల్ల కోట్లాదిమంది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ చర్య వల్ల ఏ అవినీతిపరులని, నల్లధనం కూడబెట్టిన వారిని ప్రభుత్వం దెబ్బతీయాలనుకున్నదో అలాంటివారు తప్పిం చుకున్నారు. ఇంతకూ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందే దీనిని బయటకు వెల్లడించిన వారెవరో తెలియాలి.’ – జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి (సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. 18–12–16న జరిగిన అఖిల భారత బ్యాంకింగ్ అసోసియేషన్ సమావేశంలో) పాలకులు, పాలనా వ్యవస్థలు; వారి జెండాలు, ఎజెండాల సంగతి ఎలా ఉన్నా, అనుభవం కలిగిన ఒక న్యాయ నిపుణునిగా జస్టిస్ జీవన్‌రెడ్డి భారత ప్రజాబాహుళ్యం నాడిని పట్టుకుని స్పందించిన తీరు విశిష్టంగా ఉంది. దీనిని చూస్తుంటే ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనానికి బీజం ఎక్కడ ఉందో అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో జాన్ ఫాస్టర్ డల్లెస్ ఒకనాడు వెల్లడిం చిన తీరు గుర్తుకు వస్తున్నది. ‘ఒక దేశాన్ని జయించడానికి రెండే మార్గాలు: 1. సాయుధ శక్తి ద్వారా ఆ దేశ ప్రజలను లొంగదీసుకోవడం. 2. ఆ దేశాన్నీ, ప్రజలనీ ఆర్థికంగా తన నియంత్రణలోకి తెచ్చుకోవడం’ అన్నారు డల్లెస్. మెక్సికో మాజీ అధ్యక్షుడు పోర్టిటిల్లో తన దేశ స్వీయానుభవాన్ని రంగరించి ఇదే అంశాన్ని విశ్లేషించారు. ఈ పరిస్థితులకు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఎంతవరకు కారణమో ఆగ్రహంతో వివరిం చారు. ‘ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థలు ప్లేగు వ్యాధిని వ్యాపింపచేసే ఎలుకలు’ అని పోర్టిటిల్లో వ్యాఖ్యానించారు. ఈ ఎలుకలను పెంచి పోషి స్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదమే ఆర్థిక, సైనిక అవసరాల కోసం తనపైన ఆధారపడిన దేశాల కరెన్సీలనూ, వాటి విలువలనూ శాసిస్తున్నది. భారత్–వెనిజులా అనుభవాలు 1991లో కాంగ్రెస్, తరువాత బీజేపీ–పరివార్–ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణలను బేషరతుగా అంగీకరించి, ఏనాడైతే అమలులోకి తెచ్చాయో, ఆనాటి నుంచే భారతీయ కరెన్సీ విలువ, దాని నిలకడ మన పాలకుల చేతి నుంచి జారిపోయాయి. 1967–68 సంవ త్సరంలో ఇందిరాగాంధీ హయాంలో డాలర్‌కు రూపాయి విలువలో తొలి పతనం ప్రారంభమైంది. తరువాత నేటికి రూపాయి విలువ కేవలం 20 పైసలకు దిగజారింది. డాలర్ ఒక్కంటికి రూ.6 చెల్లించిన దశ నుంచి నేడు రూ. 70లు ధారపోయవలసిన స్థితికి చేరుకున్నాం. ఇలాంటి దుర్దశలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అకస్మాత్తుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించడం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని భావించడం వాస్తవదూరం కాదు. ఎక్కువ వినియోగంలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేయడా నికి ప్రధాన కారణం డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడిన గుత్త కంపె నీలు, కొన్ని ప్రభుత్వాలు నగదు రహిత వ్యవస్థ కోసం ఒత్తిడి చే యడమే. భారత్ నోట్ల రద్దు తరువాత వెనిజులా కూడా అందుకు సాహసించింది. అమెరికా ఒత్తిడికి లొంగిన ఈ లాటిన్ అమెరికా దేశం తమ ఆర్థిక వ్యవస్థలో పెద్ద నోటు బిల్‌ను రద్దు చేసుకుంది (అమెరికా డాలర్ ప్రకారం 100 బిల్ నోటు విలువ 15 సెంట్లు. అంటే ఒక డాలర్=వెనిజులన్ 100 బిల్లు). ఇటీవలి కాలం వరకు వెనిజులాలో చలామణిలో ఉన్న కరెన్సీలో 77 శాతం బిల్ రూపంలోనే ఉంది. అక్కడ చావెజ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికన్ చమురు సంస్థలను ఆయన జాతీయం చేయడంతో అగ్రదేశం కన్నెర్ర చేసింది. అయితే ఆయన మీద కక్ష సాధించడానికి అమెరికా చేసిన యత్నం ఫలించ లేదు. చావెజ్ తరువాత అధికారంలోకి వచ్చిన మదురో (ఆయన అనుచ రుడే) అడ్డు తొలగించుకునేందుకు, దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించేం దుకు అమెరికా కుట్ర పన్నింది. అక్కడి మాఫియాల ద్వారానే మరో పెద్ద నోటు 100 బోలివార్ కరెన్సీని నిల్వ చేయించి బిల్ విలువకు ఎసరు పెట్టింది. మదురో పైఎత్తు వేసి, మాఫియాలకు మద్దుతుగా నిలిచిన కొలంబియా, బ్రెజిల్ దేశాల సరిహద్దులను మూసేశారు. 100 బోలీవార్ నోటును రద్దు చేశారు. చలామణిలో ఉన్న పెద్ద నోటు రద్దు కావడంతో వెనుజులా ప్రజలు నిత్యావసరాలకు అల్లల్లాడిపోయారు. పెద్దపెట్టున ఆందోళన, నిరసన ప్రదర్శ నలకు దిగవలసి వచ్చింది. వెనిజులా అంతటా వాడుకలో ఉన్న పెద్ద కరెన్సీ నోట్లు రద్దు కావడంతో ప్రజలు అశాంతితో దాడులకు, దోపిడీలకూ నడుం కట్టవలసి వచ్చినట్టే భారతదేశంలోనూ పేదలు, ఉద్యోగులు, ముసలీ ముతకా గంటల తరబడి, రోజులకొద్దీ నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడి, సహనం కోల్పోయి పలుచోట్ల అశాంతితో దాడులు చేయడం, బ్యాంకర్లను వేధించడం, కొట్టడం జరుగుతోంది. అశాంతి మధ్య వెనిజులాలో మూడు రోజుల్లో నలు గురు చనిపోగా మన దేశంలో గంటలకొద్దీ క్యూలలో నిలబడి వేసారి అలసి పోయి సొమ్మసిల్లి చనిపోయిన వారి సంఖ్య సుమారు 110 మంది దాకా ఉందని సమాచారం. అయితే–వెనిజులాలో ప్రెసిడెంట్ మదురో సకాలంలోనే (మూడు రోజుల్లోనే) ప్రజా బాహుళ్యం నాడిని, అశాంతిని గమనించి రద్దును నిలిపి వేయవలసి వచ్చింది. ఆ పాఠం పనికిరాదా? నోట్లరద్దు అనంతరం వెనిజులాలో కనిపించిన దృశ్యాలు ఇక్కడా కనిపించినా ఈ పాఠాన్ని మొండితనంవల్ల మోదీ ఆమోదించ నిరాకరిస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని అనేకమంది ప్రపంచవ్యాప్త (అమెరికన్లు సహా) ఆర్థిక వేత్తలు విమర్శిస్తున్నా, మూడే.. ఫిజ్, స్టాండర్డ్ అండ్ పూర్, మెరిలించ్ వంటి రేటింగ్ ఏజెన్సీలూ, విదేశీ పెట్టుబడి సంస్థలూ, మల్టీ నేషనల్ కంపెనీలూ మాత్రమే స్వాగతించాయి. డిజిటల్ (ఎలక్ట్రానిక్)తంత్రం ద్వారా జరిపే ధన లావాదే వీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మోసాలకు నిలయమైనాయో ఉదా హరణలు అనేకం. అందుకే భారత గ్రామీణ వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న నగదు లావాదేవీల వ్యవస్థను ఒక్కసారిగా కూల్చి నిరక్షరాస్యులకు అంతు చిక్కని డిజిటల్ లావాదేవీల వ్యవస్థకు మరలడం వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలకే ఎంత ప్రమాదమో–గత మూడేళ్లుగా మన దేశం సహా పలు ప్రపంచ దేశాలపై జరిగిన సైబర్ గ్యాంగ్ ముఠాల దాడులే నిదర్శనం. సైబర్ ఎటాక్స్ అంటే కన్పించని అజ్ఞాతశత్రువు జరిపే యుద్ధం లాంటిదిది. ఈ– మెయిల్స్, ఇతర డిజిటల్ సమాచార డేటాలు, యాహూ, జీ–మెయిల్, డాట్ కామ్ వ్యవస్థలన్నీ సైబర్ దాడులకు గురవుతూనే ఉన్నాయి. ఇటీవలనే ఈ డిజిటల్ టెక్నాలజీవల్ల సైబర్ నేరాలు (నేరస్థుడు కనబడడు–చిక్కడు– దొరకడు) మరింతగా పెరగనున్నాయని పోలీసు వర్గాలే వెల్లడించక తప్పడం లేదు! ప్రపంచ ఘరానా బ్యాంకులలో ఒకటి జేపీ మోర్గాన్ సంస్థ ద్వీపాంతర బ్రాంచీలలో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. ఈ ఘరానా బ్యాంకులో కొన్ని కోట్ల మంది ఖాతాదారుల ‘సెన్సిటివ్’ (అతికీలకమైన) సమాచారం కనుమ రుగైపోయింది. కానీ ఆ బ్యాంకు ఈ రహస్యాన్ని బయటకు పొక్క నివ్వకుండా తొక్కిపట్టేసింది. చివరికి ఈ సైబర్ దాడుల నుంచి అమెరికా రక్షణశాఖ వెబ్ సైట్, ‘నాసా’ వెబ్‌సైట్‌ని కూడా అజ్ఞాత నేరస్తులు మినహాయించలేదని గుర్తించాలి. అంటే దొంగ ఒకోసారి దొరకొచ్చు. మరోసారి దొరక్కపోవచ్చు! అందుకనే సైబర్ దాడులకు, కరెన్సీ నోట్ల రద్దు చర్యకు కూడా అవినాభావ సంబంధం ఉందని సైబర్ నిపుణులు భావిస్తున్నారు! ఫలానా వెబ్‌సైట్‌కి మీరు బదలాయిస్తే (ట్రాన్స్ఫర్) మీ డబ్బులు ఆదా అవుతాయని ఒక అజ్ఞాత నేరస్థుడు మొబైల్ సందేశాలు పంపుతుంటాడు. ఖాతాదార్లు బుట్టలో పడ డం, లక్షలు, కోట్లాది రూపాయలు కోల్పోవడం ఒక రివాజుగా మారిందట! కనుకనే, పెద్ద నోట్లను రద్దు చేయడానికి ప్రయత్నించిన పాత సోవియట్ యూనియన్, మయన్మార్, జింబాబ్వే లాంటి దేశాలు చేతులు కాల్చుకు న్నాయి. నగదు రహిత లావాదేవీలు ఉన్న అమెరికా, కెనడా, జపాన్‌లు కూడా సైబర్ దాడుల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అన్ని దేశాల అనుభవమూ అదే! బలవంతాన జరిపే పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడి పోతుందని జింబాబ్వే, మయన్మార్ల అనుభవం. బ్లాక్ మార్కెటింగ్‌ను, దొంగ సరుకు దిగుమతులను, నల్లధనం అణచివేత పేరిట మయన్మార్ సైనిక ప్రభుత్వం తమ కరెన్సీ ‘క్యాత్’ను మూడుసార్లు రద్దు చేసినా ఫలితం శూన్యం. పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలిక ఇబ్బందులున్నా, భవిష్యత్తులో లాభాలుంటాయని నరేంద్ర మోదీ, చంద్రబాబు, కేసీఆర్ భ్రమల్లోకి నెడు తున్నారు. ఇది ఎంత అసాధ్యమో కరెన్సీల ఆటుపోట్లను అధ్యయం చేసిన ప్రసిద్ధ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉండా ల్సిన నగదు తరిగిపోతున్నప్పుడు సరకుల ధరలు పడిపోతాయి. ముఖ్యంగా చిన్న, మధ్య రకం నోట్లు తరిగిపోయి వస్తువుల ధరలు పడిపోతాయి. నోట్ల ముమ్మరం దశ (ఇన్ఫ్లేషన్) ధరల పతనానికి (డిఫ్లేషన్) దారితీస్తుంది. ఈ దుస్థితి చివరికి తమ కరెన్సీ పైనే ప్రజలకు విశ్వాసం లేకుండా పోయే దశకు తీసుకువెళుతుంది. ఆసియా దేశాలలో ఒక్క పాకిస్తాన్ మాత్రమే కొత్త డిజైన్ లతో కొత్త నోట్లను ముద్రించే ముందు పాత నోట్లను రద్దు చేస్తూ (2016 డిసెంబర్ నుంచే) వాటిని మార్చుకోవడానికి ఒకటిన్నర సంవత్సరం పాటు వ్యవధి కల్పించింది. ఇవన్నీ ఎలా ఉన్నా, మన ‘‘చాయ్‌వాలా’’ మోదీ ప్రభుత్వ పరిస్థితి ఇలా పక్క తోవలు పట్టినా, అదే గుజరాత్‌లోని సూరత్‌లో పుట్టి పెరిగిన మరొక చాయ్‌వాలా ఆ దశ దాటి వడ్డీ వ్యాపారిగా రూపమెత్తి, లెక్కకురాని రూ. 12 కోట్ల ఆస్తులకు పడగెత్తిన వ్యక్తి ఆస్తిని ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నందుకు సంతృప్తిపడదామా?! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వెనిజులాలో నోట్ల రద్దు నిర్ణయం వాయిదా
-
వెనిజులాలో ఆందోళనలు, లూటీలు
నోట్ల రద్దు ఎఫెక్ట్ కారకస్: వెనిజులాలో పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్ల సరఫరాలో జాప్యంతో ప్రజల కష్టాలు తారస్థాయికి చేరాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక కన్నబిడ్డలను వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో నోట్ల రద్దు ప్రజల జీవితాలను మరింత అగాథంలోకి నెట్టింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తూ వెనిజులా అధ్యక్షుడు మదురో గత ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. అయితే పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక, తినడానికి తిండి లేక ప్రజలు డెలివరీ ట్రక్కులను దోచుకుంటుంటూ పోలీసులతో గొడవలకు దిగుతూ రెచ్చిపోతున్నారు. క్రిస్మస్ వస్తున్న తరుణంలో కనీసం ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లర లేక శుక్రవారం ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. మరకైబో నగరంలో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లురువ్వారు. (చదవండి: మోదీ బాటలోనే వెనిజులా.. పెద్ద నోట్ల రద్దు) మటురిన్ నగరంలో చికెన్ ట్రక్కును లూటీ చేశారు. పుయెర్టో లా క్రజ్ నగరంలో డబ్బులు తీసుకోడానకి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఆందోళనకు దిగారు. శాంటా బార్బరాలో బ్యాంకు నగదును తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది దోచుకోవడానికి ప్రయత్నించగా డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురికి గాయాలయ్యాయి. వెనిజులా రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను మార్చుకునే వీలుండటంతో బ్యాంకు ముందు వేలమంది క్యూలో నిలబడుతున్నారు. పాతనోట్లను తీసుకొని ’ప్రత్యేక ఓచర్లు’ ఇస్తున్నారే తప్ప కొత్త నోట్లు ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బుల కోసం నిరసనలు.. లూటీలు!
పెద్దనోట్ల రద్దు అనంతరం జనం పడుతున్న పాట్లు మన దేశంలో కంటే వెనిజులాలో మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ కొత్త నోట్లు దొరక్క, పాత నోట్లు చెల్లక జనం డెలివరీ ట్రక్కులను దోచుకుంటున్నారు, పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు. రద్దు చేసిన 100 బొలివర్ నోట్ల స్థానంలో వాటి విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ నోట్లు అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తోంది. కానీ ఇప్పటివరకు నోట్లు సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. అసలే ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉంది. దాంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొత్త నోట్లు ఇంకా సిద్ధం కాకముందే 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. ఆయన ప్రకటించే సమయానికి 100 బొలివర్ విలువ మూడు సెంట్లు (అమెరికా కరెన్సీలో) మాత్రమే. వెనిజులాలో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో అవే 77 శాతం వరకు ఉన్నాయి. క్రిస్మస్ సమీపిస్తుండటం, తమ వాళ్ల కోసం బహుమతులు కాదు కదా.. కనీసం ఆహారం కొనుక్కోడానికి కూడా జనం దగ్గర డబ్బులు లేకపోవడంతో నిరసనలు వెల్లువెత్తాయి. మరకైబో నగరంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అలాగే మటురిన్ నగరంలో ఒక పెద్ద మాల్‌ను డజన్ల కొద్దీ ప్రజలు దోచుకున్నారు. తాను చూస్తుండగానే ఒక చికెన్ ట్రక్కును కొందరు దోచుకున్నారని మటురిన్ నగరానికి చెందిన జువాన్ కార్లోస్ లీల్ అనే రైతు చెప్పారు. డబ్బు తీసుకుందామని బ్యాంకులకు వెళ్లిన జనం, అక్కడ వారికి దొరక్కపోవడంతో దోపిడీలకు పాల్పడుతున్నారని ప్యూర్టో లా క్రజ్ అనే బేకరీ వ్యాపారి తెలిపారు. నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం దుకాణాలు మూయించేశారు. ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నట్లు ట్విట్టర్లో చెబుతున్నారు. శాంటా బార్బరా నగరంలో డబ్బు తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది వ్యక్తులు దోచుకోడానికి ప్రయత్నిస్తుంటే, దాని డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం కేవలం ఆ దేశ రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను తీసుకుంటుండటంతో.. అక్కడ వేలాది మంది క్యూలు కడుతున్నారు. ఇప్పటికైతే వాటిని కేవలం డిపాజిట్ చేయించుకుని, వాటి బదులు 'ప్రత్యేక ఓచర్లు' ఇస్తున్నారే తప్ప కొత్తనోట్లు ఇవ్వడంలేదు. ప్రపంచం మొత్తం తలకిందులైనట్లు అనిపిస్తోందని, ఆహారం కొనడానికి డబ్బులు లేవని జీసస్ గారికా అనే కూరగాయల వ్యాపారి చెప్పారు. -
వెనిజులాలో ‘నోట్ల’ కష్టాలు మనకన్నా దారుణం
కారకాస్: మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టయింది వెనిజులా ప్రజల పరిస్థితి. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక బిడ్డలను సైతం వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో దేశాధ్యక్షుడు నికోలస్ మడురో వంద బోలివర్ నోట్లను హఠాత్తుగా రద్దు చేయడం వారి బతుకులను మరింత అగాతంలో పడేసింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి మూడు రోజుల్లోగా వంద బోలివర్ నోట్లను కొత్త కరెన్సీతో మార్చుకోవాలని దేశాధ్యక్షుడు గడువు విధించినా శుక్రవారం నాటికి కూడా కొత్త కరెన్సీ మెజారిటీ బ్యాంకులకు చేరుకోలేదు. పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక తినడానికి తిండిలేక అలమటిస్తున్నామని బ్యాంకుల ముందు చాంతాడంతా క్యూల్లో నిలబడిన పేదలు, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. కొన్ని ఏటీఎంలలో ఇప్పటికీ కూడా పాత వంద నోట్లే వస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడికక్కడ వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయని చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో వంద బోలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు గత ఆదివారం నాడు దేశాధ్యక్షుడు నికోలస్ హఠాత్తుగా రేడియోలో ప్రకటించారు. గురువారం నాటికి దేశంలోని అన్ని బ్యాంకులకు 500 నుంచి 20,000 బోలివర్ నోట్లు ఆరు డినామినేషన్లలో చేరుకుంటాయని, అప్పటి నుంచి 72 గంటల్లోగా పాత నోట్లను మార్చుకోవాలని గడువు విధించారు. బుధవారం రాత్రి నుంచే బ్యాంకుల ముందు క్యూలు కట్టినా దేశంలోని చాలా బ్యాంకులకు డబ్బులురాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కరెన్సీ ముద్రణా సంస్థలు కూడా ఈ విషయంలో పెదవి విప్పడం లేదు. ‘నా ఆరేళ్ల పాపను సాదుకునేందుకు ఎవరికైనా ఇచ్చేస్తాను. గత అక్టోబర్‌లోనే మా పక్కింటి వాళ్లను అడిగాం. వారికి కుదరదని చెప్పారు. మా మామకు వచ్చే ఆరు డాలర్లకు సమానమైన పింఛనుపై పాపతో సహా నలుగురం బతుకుతున్నాం. కష్టమవుతోంది. మా దగ్గరుండి ఆకలితో చనిపోవడమో లేదా వ్యభిచారిగా మారడమో కాకుండా కాస్త డబ్బున్నవాళ్లు పెంచుకుంటే బాగుంటుందని భావిస్తున్నాం’ అని 43 ఏళ్ల నిరుద్యోగ మహిళ జులే పుల్గర్ వాపోయారు. ఇప్పుడు ఇలాంటి వాళ్లు వెనిజులాలో ఎందరో ఉన్నారు. ఇలా రోజుకు తమ పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సిందిగా డజనుకుపైగా తల్లిదండ్రులు తమ సంస్థ వద్దకు వస్తున్నారని కరిరుబానా అనే సాంఘిక సేవా సంస్థ తెలియజేసింది. మరికొంత మంది తల్లిదండ్రులు తమను సంప్రతించకుండానే తెల్లవారక ముందే తమ కార్యాలయం ముందు పిల్లలను వదిలేసి వెళుతున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ధనవంతులు నివసిస్తున్న ప్రాంతాల్లో కొంత మంది పేద తల్లులు తమ పిల్లలను వదిలేసి వెళుతున్నారని మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్నారు. భారత్‌లోలాగా వెనిజులా కూడా బ్యాంక్ ఖాతాలుండే వారు చాలా తక్కువ. వ్యాపార వర్గాల మధ్య కూడా ఎక్కువగా నగదు లావాదేవీలే జరుగుతుంటాయి. చమురు విలువలు అపారంగా ఉన్న దేశంలో కూడా నోట్ల కష్టాలు తప్పడం లేదు. -
ఫార్మాపై వెనెజులాతో భారత్ చర్చలు
* చమురు రూపంలో బకాయిల సర్దుబాటు ప్రతిపాదనపై కసరత్తు * కేంద్ర వాణిజ్య విభాగం డెరైక్టర్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్గత సంక్షోభం, కరెన్సీ పతనం తదితర సమస్యలతో సతమతమవుతున్న వెనెజులా నుంచి దేశీ ఫార్మా కంపెనీలకు అందాల్సిన చెల్లింపులను రాబట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. బకాయిలను చమురు సరఫరా రూపంలో సర్దుబాటు చేసే ముసాయిదా ప్రతిపాదనను వెనెజులా ప్రభుత్వం ముందుంచింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య విభాగం డెరైక్టర్ అనిస్ జోసెఫ్ చంద్ర తెలిపారు. ఇటు దేశీయంగా ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, ఆర్బీఐ తదితర వర్గాలతో కూడా ఈ అంశంపై చర్చిస్తున్నట్లు ఆమె వివరించారు. వెనెజులాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఔషధాల ఎగుమతి ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ నిర్వహిస్తున్న ఫార్మా సీఈవోల సదస్సులో గురువారమిక్కడ పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. దేశీ ఫార్మా సంస్థలకు వెనెజులా నుంచి రూ. 2,000 కోట్లు రావాల్సి ఉందని అంచనా. ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి..: రష్యా వంటి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇతర మార్కెట్లు లోటు భర్తీ చేయగలవని, ఫార్మా ఎగుమతులు మెరుగ్గానే ఉండగలవని ఫార్మెక్సిల్ చైర్మన్, అరబిందో ఫార్మా హోల్‌టైమ్ డెరైక్టర్ మదన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో సుమారు 10-12 శాతం వృద్ధి నమోదు కాగలదని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈసారి సుమారు 19 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోగలమని ఫార్మెక్సిల్ వైస్ చైర్మన్ దినేష్ దువా పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిసారి ముంబైలో జరిగే ఫార్మా ఎక్స్పో ఐఫెక్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పీవీ అప్పాజీ తెలిపారు. ఫార్మా సంస్థలకు పురస్కారాలు.. సదస్సు సందర్భంగా వివిధ విభాగాల్లో ఫార్మా సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఎగుమతులకు సంబంధించి బల్క్ డ్రగ్స్ విభాగంలో (లార్జ్) అరబిందో ఫార్మా, ఫార్ములేషన్స్లో (మధ్య స్థాయి) హెటెరో ల్యాబ్స్ పురస్కారాలు దక్కించుకున్నాయి. ఆల్ రౌండ్ పార్ ఎక్సలెన్స్ (లార్జ్) పురస్కారాన్ని మైలాన్ ల్యాబరేటరీస్ దక్కించుకోగా, మిడ్ సెగ్మెంట్లో క్యాడిలా అవార్డు దక్కించుకుంది. పేటెంట్ అవార్డుల్లో ఎన్సీఈ/డ్రగ్ డిస్కవరీకి సంబంధించి సువెన్ లైఫ్ సెన్సైస్ పసిడి పురస్కారం అందుకోగా, బల్క్ డ్రగ్స్/ఏపీఐ విభాగంలో హెటెరో డ్రగ్స్ పసిడి, లారస్ ల్యాబ్స్ .. న్యూలాండ్ ఫార్మా రీసెర్చ్..ఎంఎస్ఎన్ ల్యాబ్స్ రజత పురస్కారం దక్కించుకున్నాయి. -
‘నామ్’కు కాలం చెల్లిందా?
ఒకప్పుడు ప్రపంచ రాజకీయ రంగస్థలిపై ప్రభావశీల శక్తిగా వెలిగిన అలీనోద్య మానికి కాలదోషం పట్టిందా? వెనిజులాలోని మార్గరిటా ద్వీపంలో ఈ నెల 17-18 తేదీలలో జరిగిన 17వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం తీరును చూస్తే ఆ అనుమానం రాకమానదు. 120 సభ్య దేశాలతో ఐక్యరాజ్య సమితిలో అతి పెద్ద రాజకీయ కూటమిగా ఉన్న అలీనోద్యమం (నామ్) శిఖరాగ్ర సదస్సుకు 12 మంది దేశాధినేతలు మాత్రమే హాజరయ్యారు. వెనిజులాలో నెలకొన్న రాజకీయ అస్థిరత, అధ్యక్షుడు నికొలస్ మధురో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉండటం వల్లనే ఈ సదస్సు చప్పగా సాగిందని అనుకోలేం. మూడేళ్ల క్రితం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 16వ నామ్ సదస్సుకు హాజరైనది 30 మంది దేశాధినేతలే. ఈ ధోరణిని బట్టి నామ్ సభ్య దేశాలలో ఈ ఉద్యమంపట్ల నమ్మకం సడలుతోంది, ఆసక్తి తగ్గుతోందనేది స్పష్టమే. వ్యవస్థాపక సభ్య దేశమైన భారత దేశాధినేత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరు కాకపోవడం విశేషం. 1961లో ఏర్పడిన నాటి నుంచి నామ్ చరిత్రలో మోదీకి ముందు ఒకే ఒక్క భారత ప్రధాని.. కాంగ్రెస్ బ్లాక్ మెయిలింగ్ మద్దతుతో ఊగిసలాడే ప్రభుత్వానికి నేతృత్వం వహించిన చరణ్‌సింగ్ (1979లో క్యూబాలో జరిగిన 7వ సదస్సు) మాత్రమే ఇలా గైర్హాజరయ్యారు. ప్రధాని ఈ సదస్సుకు హాజరు కానంత మాత్రాన మోదీ ప్రభుత్వం అలీనోద్యమంలో ఆసక్తిని కోల్పోయిందనుకోరాదని ప్రభుత్వ వివరణ. అదెలా ఉన్నా, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య సాగిన ఆధిపత్య పోటీలో నలిగిపోతున్న వర్ధమాన దేశాల ఉద్యమంగా పుట్టిన నామ్‌కు నేటి ప్రపంచంలో సమంజసత్వమే లేదనే వాదన నేడు గట్టిగా విన వస్తోంది. అమెరికా, సోవియట్ యూనియన్ అగ్రరాజ్యాలు రెంటికి సమదూరాన్ని పాటించడానికి నేడు అలాంటి ప్రపంచాధిపత్య పోటీ లేదు కాబట్టి అలీన విధానం అవసరం ఇక లేదనే భావన మోదీకి ఏర్పడినట్టుంది. ఇటీవలే అమెరికాతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న దృష్ట్యా వెంటనే పాశ్చాత్య వ్యతిరేక ముద్ర ఉన్న నామ్ సదస్సుకు హాజరు కాకపోవడమే ఉత్తమమనేది కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రభా వితం చేసి ఉండొచ్చు. పైగా అలీన విధానం అనే భావనకు కర్త జవహర్లాల్ నెహ్రూపట్ల, ఆయన వారసత్వంపట్ల ప్రధానికి ఉన్న విముఖత అందరికీ తెలిసినదే. అలీనోద్యమాన్ని ప్రచ్ఛన్న యుద్ధ శిశువుగా మాత్రమే చూసేవారెవరైనా దానికి కాలం చెల్లిపోయిందనుకోవడం సహజమే. కానీ 1950లలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేస్తున్న కాలంలోనే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని చాలా దేశాలు వలస సంకెళ్లను తెంచుకున్నాయి. అవి ప్రపంచంలో తమదైన సొంత అస్తిత్వాన్ని చాటుకోవాలని, నిలుపుకోవాలని, స్వతంత్రంగా అభివృద్ధి చెందాలని తహతహ లాడాయి. ఆ ఆకాంక్షల నుంచే అలీన విధానం అనే భావన 1954 నాటికి ఊపిరి పోసుకుంది. దాన్ని విస్మరిస్తే అలీన విధానానికి అసలు పునాది వలసవాద వ్యతి రేకత అనే చారిత్రక వాస్తవం మరుగున పడిపోతుంది. అదే నేడు జరుగుతోంది. అలీనోద్యమాన్ని ప్రచ్ఛన్న యుద్ధానికి అంటగట్టేసే యాంత్రిక ధోరణికి కారణ మౌతోంది. మన కళ్లెదుటే మధ్యప్రాచ్యంలో సాగుతున్న సిరియా మారణహోమం నుంచి, దక్షిణ చైనా సముద్రంలో కమ్ముకుంటున్న ప్రచ్ఛన్న యుద్ధ మేఘాల వరకు ప్రతిచోటా ప్రపంచ శక్తుల సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగిన కాలంలోలాగే నేడూ పలు వర్ధమాన దేశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక ప్రపంచ శక్తి వెనుక నిలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవంక అమెరికా, చైనాల మధ్య ఆర్థిక ఆధిపత్య పోటీ నానాటికీ విస్తరిస్తోంది, ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వీటికి తోడు అన్ని అంతర్జాతీయ సంస్థలలోను, వేదికలపైన సంపన్న దేశాలు, వర్ధమాన దేశాల ప్రయోజనాల మధ్య సంఘర్షణ నగ్నంగా కనిపిస్తూనే ఉంది. డబ్ల్యూటీఓ నుంచి పర్యావరణం, వాతావరణ మార్పుల వరకు అడుగడుగునా వర్ధమాన దేశా లపట్ల వివక్ష కొనసాగుతోంది. 21వ శతాబ్దం విసురుతున్న సవాళ్లు అలీనోద్యమం పుట్టిన నాటి కంటే భిన్నమైనవే. కానీ అవి అలీనోద్యమానికి కాలదోషం పట్టిం చకపోగా మరింత ఆవశ్యకం చేస్తున్నాయి. ‘నామ్, పేద దేశాల అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్’ అని ఒకప్పుడు అనేవారు. అలాంటి కూటమిగా నామ్ ఆవశ్యకత ఎప్పటికన్నా నేడు ఎక్కువగా ఉన్నది. 2003 కౌలాలంపూర్ నామ్ సదస్సులో నాటి భారత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చెప్పింది సరిగ్గా ఇదే: ‘అలీనోద్యమం ఈ నూతన శతాబ్దంలోని గొప్ప చారిత్రక సందర్భం. గతాన్ని పునరాలోచించుకుని, విజయాలను వైఫల్యాలను మదింపు చేసి మన ఉద్యమాన్ని పునరుజ్జీవింపచేయ డానికి నిర్దిష్ట చర్యలను చేపట్టాల్సి ఉంది. ఈ కృషిలో భారత్ తనవంతు పాత్రను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.’ ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచాన్ని అణు యుద్ధం అంచున నిలిపిన 1960లు, 1970లలో భారత్ సహా చాలా వర్ధమాన దేశాలు ఏదో ఒక అగ్రరాజ్యాన్ని ఆశ్రయిం చాల్సి వచ్చింది. అయినా అలీనోద్యమం తన సొంత గొంతుకను వినిపించగలి గింది. 1981లో, నాడు సోవియట్ యూనియన్‌కు మిత్ర దేశంగా ఉన్న భారత్ అధ్యక్షతన నామ్.. అఫ్ఘానిస్థాన్ నుంచి సోవియట్ యూనియన్ తక్షణమే సేనలను ఉపసంహరించాలని తీర్మానించింది. 2013 నామ్ టెహ్రాన్ సదస్సు దక్షిణ చైనా సముద్ర వివాదంపై నీళ్లు నమలకుండా ఐరాస అంతర్జాతీయ సముద్ర మౌలిక సూత్రాలను అన్ని పక్షాలు తు.చ. తప్పక పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. నేటి మార్గరిటా సదస్సు కూడా చైనా, ఫిలిప్పీన్స్ దక్షిణ చైనా సముద్ర వివాదాన్ని మధ్య వర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. ఆ అంశంపై భారత్ అను సరిస్తున్న సూత్రప్రాయమైన వైఖరి కూడా అదే. నేటికీ బహుముఖ అంతర్జాతీయ వేదికగా అలీన ఉద్యమానికి ఉన్న శక్తిని, ప్రాధాన్యాన్ని గుర్తించి, దాన్ని పునరు జ్జీవింపజేసి, సమర్థ నాయకత్వాన్ని అందించాల్సిన చారిత్రక బాధ్యత ఆ ఉద్యమ నిర్మాతగా, నామ్‌లోని శక్తివంతమైన దేశంగా భారత్‌దే. ఇప్పటికైనా అది గుర్తిం చడం అవసరం. -
అధ్యక్షుడు దిగిపోవాలంటూ ఫుడ్ ఎమర్జెన్సీ !
కారాకాస్ (వెనిజులా): వెనిజులాలోని రెండో అతిపెద్ద రాష్ట్రమైన మిరాండా పాఠశాలల్లో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. కేంద్రంలోని సోషలిస్టు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీల సమ్మేళనం ‘డెమొక్రాటిక్ యూనిటీ రౌండ్ టేబుల్’కు చెందిన హెన్రిక్ కాప్రిల్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిరాండా రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి వామపక్ష సోషలిస్టు ప్రభుత్వమే కారణమని, నికోలస్‌ను గద్దె దింపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రజానీకానికి సరిపడా ఆహారం దేశంలో లేదంటూ కాప్రిల్స్ వ్యాఖ్యానించారు. ఈయన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. చమురు నిక్షేపాల దేశంగా పేరొందిన వెనిజులా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోంది. ఫలితంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ప్రభుత్వం గద్దె దిగాలంటూ పలుచోట్ల నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
సుష్మాకు 'నామ్' సమ్మిట్ ఆహ్వానం
న్యూఢిల్లీః విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు వెనెజులా నాన్ అలైన్డ్ మూవ్ మెంట్ (నామ్) ఆహ్వానం అందింది. వచ్చేనెల వెనెజులాలో జరిగే నామ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఆయనకు బదులుగా సుష్మా స్వరాజ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వెనెజులా బొలీవియన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి డెల్సీ రోడ్రిక్వెజ్ 2016 ఆగస్టు 18న ఇండియా సందర్భించారు. వెనెజులాలోని మార్గరిటా ఐస్లాండ్ లో 17వ 'నామ్' సదస్సు జరగనున్న నేపథ్యంలో సమావేశానికి భారతదేశాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రోడ్రిక్వెజ్ భారత్ కు వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 2016 సెప్టెంబర్ 17-18 తేదీల్లో నామ్ సదస్సు జరగనుంది. అయితే ఇంతకు ముందు 1979 సంవత్సరం చరణ్ సింగ్ భారత కేర్ టేకర్ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన నామ్ శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత ప్రధాని హాజరు కాలేదు. దీంతో ఈసారి తప్పనిసరిగా భారత ప్రాతినిథ్యం ఉండేందుకు వీలుగా ప్రధానికి బదులుగా సుష్మా స్వరాజ్ హాజరయ్యే అవకాశం ఉంది. -
మెస్సీ ‘రికార్డు’ షో
► సెమీఫైనల్లోకి అర్జెంటీనా ► వెనిజులాపై 4-1తో విజయం ► కోపా అమెరికా కప్ ఫాక్స్‌బరో (అమెరికా): కోపా అమెరికా కప్‌లో సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీలో నాలుగో గోల్ సాధించడంతో పాటు అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ (54) చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆదివారం వెనిజులాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌ను మెస్సీ అంతా తానై శాసించడంతో అర్జెంటీనా 4-1తో నెగ్గి సెమీస్‌కు చేరింది. 60వ నిమిషంలో చేసిన గోల్‌తో మెస్సీ ఇప్పటిదాకా గాబ్రియల్ బటిస్టుటా పేరిట ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును సమం చేశాడు. అలాగే జట్టు సాధించిన మరో రెండు గోల్స్‌లోనూ తన పాత్ర ఉండడం విశేషం. గోంజలో హిగువాన్ (8వ, 28వ నిమిషాల్లో), లమేలా (71వ నిమిషంలో) మిగతా గోల్స్ చేశారు. వెనిజులా నుంచి రోండన్ (70వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. బుధవారం జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు అమెరికాతో తలపడుతుంది. అంతకుముందు ప్రథమార్ధం నుంచే మెస్సీ తన మేజిక్‌ను చూపాడు. దీంతో 8వ నిమిషంలోనే జట్టు ఆధిక్యం సాధించింది. టచ్‌లైన్ నుంచి పెనాల్టీ ఏరియాలోకి మెస్సీ ఇచ్చిన అద్భుత పాస్‌ను అందుకున్న హిగువాన్ ఏమాత్రం అలక్ష్యం చేయకుండా గోల్ చేశాడు. ఆ తర్వాత కూడా వెనిజులా గోల్‌పోస్టుపై అర్జెంటీనా దాడులను కొనసాగించింది. అయితే 27వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు గోంజలెజ్ను అడ్డుకున్నందుకు నికోలస్ గైటాన్ ఎల్లో కార్డుకు గురయ్యాడు. దీంతో తను అమెరికాతో సెమీస్‌కు దూరం కానున్నాడు. వర్గాస్ నాలుగు గోల్స్... సాంటా క్లారా (అమెరికా): వరుస విజయాలతో దూసుకెళుతున్న మెక్సికో జట్టుకు డిఫెండింగ్ చాంపియన్ చిలీ బ్రేక్ వేసింది. ఫార్వర్ట్ ఆటగాడు ఎడ్వర్డో వర్గాస్ (44, 52, 57, 74వ నిమిషాల్లో) ఏకంగా నాలుగు గోల్స్‌తో అదరగొట్టడంతో పాటు పేలవమైన ఆటతీరుతో మెక్సికో మూల్యం చెల్లించుకుంది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిలీ 7-0తో మెక్సికోను చిత్తుగా ఓడించింది. ఓ మేజర్ టోర్నీలో ఈ జట్టు ఇంత ఘోరంగా ఓడడం ఇదే తొలిసారి. గతంలో 1978 ప్రపంచకప్‌లో మెక్సికో 0-6తో పశ్చిమ జర్మనీ చేతిలో ఓడింది. 70 వేలకు పైగా ఉన్న మెక్సికో మద్దతుదారుల మధ్య చిలీ ఈ మ్యాచ్‌లో అసమాన ప్రతిభను చూపింది. 13 నిమిషాల వ్యవధిలోనే వర్గాస్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఎడ్సన్ పూచ్ (16వ, 87వ ని.లో) రెండు గోల్స్, అలెక్సిస్ సాంచెజ్ (49వ ని.లో) ఓ గోల్ చేశాడు. -
వెనుజులాతో జర జాగ్రత్త: మెస్సీ
హవానా: కోపా అమెరికా కప్‌లో భాగంగా వెనుజులాతో జరుగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు అర్జెంటీనా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ సూచించాడు. పటిష్టమైన వెనుజులాతో జాగ్రత్తగా ఆడితేనే విజయం సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతీ ఆటగాడు గుర్తించాలన్నాడు. గ్రూప్-డిలో టాపర్ గా నిలిచామన్న అతి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనీయొద్దని ఆటగాళ్లను మెస్సీ హెచ్చరించాడు. 'వెనుజులా గట్టి ప్రత్యర్థి. ఆ విషయం అర్జెంటీనా ఆటగాళ్లు గుర్తించుకుంటే చాలు. వారు కూడా బలమైన జట్లను ఓడించే క్వార్టర్స్ కు చేరారు. ఆ జట్టును నియంత్రించాలంటే పూర్తిస్థాయి ప్రదర్శన ఒక్కటే మార్గం. అందుకోసం సాధ్యమైనంతవరకూ బాగా సన్నద్ధం కావాలి' అని మెస్సీ తెలిపాడు. మరోవైపు అర్జెంటీనా కోచ్ గెరార్డో మార్టినో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వెనుజులా జట్టు అసాధారణ ఆటగాళ్లతో పటిష్టంగా ఉందన్నాడు. మెక్సికోను ఓడించి క్వార్టర్స్ కు చేరిన వెనుజులాను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయొద్దని సూచించాడు. ఆదివారం అర్జెంటీనా-వెనుజులా జట్లు క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
గ్రూప్ ‘సి’ టాపర్‌గా మెక్సికో
* వెనిజులాతో మ్యాచ్ ‘డ్రా’ * కోపా అమెరికా కప్ హూస్టన్: ఆరంభంలోనే ప్రత్యర్థి ఆధిక్యం పొందినా ఒత్తిడిని అధిగమించిన మెక్సికో చివర్లో గోల్ కొట్టి మ్యాచ్‌ను కాపాడుకుంది. దీంతో గ్రూప్ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. కోపా అమెరికా కప్‌లో భాగంగా సోమవారం వెనిజులాతో జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ రెండు జట్లు ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరాయి. మ్యాచ్ ఆరంభమైన 10వ నిమిషంలోనే వెనిజులా గోల్ చేసి మెక్సికోకు షాక్‌నిచ్చింది. క్రిస్టియాన్ సాంటోస్ హెడర్ ద్వారా ఇచ్చిన పాస్‌ను అందుకున్న వెలాజ్క్వెజ్ చక్కటి వ్యాలీతో గోల్‌ను సాధించాడు. అయితే ద్వితీయార్ధం 49, 56వ నిమిషాల్లోనూ స్కోరును సమం చేసేందుకు వచ్చిన అవకాశాలను మెక్సికో వినియోగించుకోలేకపోయింది. ఇక 80వ నిమిషంలో జీసస్ మాన్యుయల్ టెకాటిలో కొరోనా చేసిన గోల్‌తో మెక్సికో ఊపిరిపీల్చుకుంది. 84వ నిమిషంలో వెనిజులా నుంచి జోసెఫ్ మార్టినెజ్ గోల్ కోసం యత్నించినా మెక్సికో కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఉరుగ్వేకు ఓ విజయం: కోపా అమెరికా కప్‌ను ఉరుగ్వే జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి ఇప్పటికే నాకౌట్‌కు దూరమైన ఈ జట్టు గ్రూప్ ‘సి’ నామమాత్రపు మ్యాచ్‌లో 3-0తో జమైకాను ఓడించింది. -
ఉరుగ్వేకు మరోషాక్
ఫిలాడెల్ఫియా: దాదాపు గత పది సంవత్సరాలుగా వెనుజులా చేతిలో ఓటమి ఎరుగని ఉరుగ్వేకు కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో తొలిసారి షాక్ తగలింది. భారత కాల మాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో వెనుజులా 1-0 తేడాతో ఉరుగ్వేను ఓడించింది. ఆట 36వ నిమిషంలో సలోమాన్ రాండాన్స్ గోల్ చేసి వెనుజులాను ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఉరుగ్వే దూకుడుగా ఆడిన వెనుజులా డిఫెన్స్‌ను ఛేదించలేక ఓటమి పాలైంది. దీంతో వెనుజులా క్వార్టర్స్ లో కి చేరింది. ఇది 2006 తరువాత ఉరుగ్వేకు తొలి ఓటమి కాగా, కోపా అమెరికా కప్‌లో వెనుజులా వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. గత మ్యాచ్‌ల్లో మెక్సికో చేతిలో ఉరుగ్వే ఓటమి పాలుకాగా, మెక్సికోపై వెనుజులా విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మగువలూ.. హెయిర్ డ్రైయర్స్ ఆపితే పవర్ ఫుల్లు!
వెనిజులా: విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో మహిళలకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు. కరెంటు సమస్యల నేపథ్యంలో మహిళలు హెయిర్డ్రైయర్స్ వాడటం మానేయాలని సూచించారు. విద్యుత్ ఉపయోగించి చేసే ప్రతిపనికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు. ఇలా కనీసం ఓ రెండు నెలలపాటు పాటించాలని డిక్రీ జారీ చేశారు. దీంతోపాటు ఎయిర్ కండిషనర్స్ వంటివి ఉపయోగించడం కూడా తగ్గించాలని చెప్పారు. మహిళలకు సంబంధించి ఆయనేం చెప్పారంటే 'మహిళలు జుట్టును ఆరబెట్టుకునే యంత్రాలు(హెయిర్ డ్రైయర్స్) ఉపయోగించడం కంటే వారి జుట్టులోకి చేతి వేళ్లను పోనిచ్చి సరిచేసుకోవడం ద్వారా సహజంగా ఆరిపోతుందని చాలా కాలంగా నాకున్న ఆలోచన. ఇదొక్కడే నా దగ్గర ఉన్న ఉపాయం కూడా' అని అన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనూహ్యంగా మారిన నేపథ్యంలో ఇప్పటి వరకు వెనిజులా వాసులు అనుసరిస్తున్న విధానాల్లో స్వల్ప మార్పులు చేసుకుంటే మంచిదని కూడా ఆయన చెప్పారు. అయితే, ఆయన అభిప్రాయంతో పలువురు విభేదించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఒక వేళ అలాంటిదే చేస్తే అంతకన్నా చెత్తపని ఇంకేం ఉండదని అంటున్నారు. -
అందాల రాశిని హత్య చేసి 30 ఏళ్లు జైలు పాలు
కారాకస్: వెనెజులా సుందరి మోనికా స్పేర్ (29) హత్య కేసులో ముగ్గురు వ్యక్తులకు ముప్పై ఏళ్ల జైలు శిక్షపడింది. వారికి కఠినకారాగార శిక్ష విధిస్తూ ఉత్తర కారాబోబోలోని కోర్టు తీర్పు చెప్పింది. 'ఒక దొంగతనానికి పాల్పడే క్రమంలో వారు చేసింది ఉద్దేశ పూర్వక హత్యే' అని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. మోనికా స్పేర్ 2004లో మిస్ వెనిజులా అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. అదే మిస్ యూనివర్స్ పోటీలో కూడా పాల్గొంది. అనంతరం పలు టీవీ కార్యక్రమాల్లో కూడా నటించింది. ఆమె ఒక రోజు తన భర్త హెన్రీ బెర్రీ (39) కూతురుతో కలిసి ఓ టూర్‌కి వెళ్లి తిరిగొస్తుండగా ఓ ఎజెన్సీ ప్రాంతంలో ముగ్గురు దొంగలు వారి వాహనాన్ని ఆపేశారు. వారికి సహాయం చేద్దామని ఓ ట్రక్కు డ్రైవర్ ప్రయత్నించినా అప్పటికే ఆ ముగ్గురు వారి కారుపై విచ్చల విడిగా కాల్పులు జరిపి వారిని దోచుకొని వెళ్లారు. ఈ కాల్పుల్లో మోనికా, ఆమె భర్త మరణించగా కూతురుకు గాయాలయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు అంతకు ముందు ఇందులో కొంత పాత్ర ఉన్న 15, 17 ఏళ్ల ఇద్దరు యువకులకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు మరో ముగ్గురుకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో మహిళకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
వెనిజులాలో ప్రతిపక్ష పార్టీ విజయం
కారకస్: వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ యూనిటి రౌండ్‌టేబుల్ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఎంయూడీ సాధించినట్టు ఆ దేశ నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. వెనిజులా ప్రజలు అధ్యక్షుడు నికోలస్ మడురోకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. జాతీయ అసెంబ్లీలో 167 సీట్లు ఉండగా ఆదివారం నాటికి ప్రతిపక్ష ఎంయూడీ 99 సీట్లు గెలిచింది. అధికార యునైటెడ్ సోషలిస్ట్స్ పార్టీ ఆఫ్ వెనిజులా 46 సీట్లకు పరిమతమైంది. మరో 22 స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సివుంది. -
అధ్యక్షుడి భార్య మేనల్లుళ్ల అరెస్టు
న్యూయార్క్: వెనిజులా అధ్యక్షుడి భార్య సిలియా ఫ్లోర్స్ మేనల్లుళ్లను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల వద్ద కొకైన్ ఉన్నట్లు గుర్తించి తాము అరెస్టు చేసినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 కేజీల కొకైన్ అనే మత్తుపదార్థం అక్రమ రవాణాకు వారు కుట్రచేశారని ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ అరెస్టులతో మరోసారి వెనిజులా, అమెరికాల మధ్య విభేదాలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య పొరపొచ్చాలు ఏర్పడి ఇరు దేశాల్లో కూడా తమ తమ విదేశాంగ ప్రతినిధులను వెనక్కి పిలుచుకున్నారు. మళ్లీ ఇప్పటివరకు నియామకం చేయలేదు. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం ఈఫ్రెయిన్ ఆంటోనియో కాంపో ఫ్లోర్స్, ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ప్రెయితాస్ అనే వెనిజులా అధ్యక్షుడు మధురో సతీమణి మేనళ్లులను న్యూయార్క్ పోలీసులు హైతీ వద్ద అరెస్టు చేశారు. వీరిద్దరికి మత్తుతపదార్థాల అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉందని చెప్పారు. వారిద్దరిని గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. గత అక్టోబర్ నెలలో వీరిద్దరు కూడా అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫోన్ చేసి 800 కిలోల కొకైన్ తరలించేందుకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై అమెరికాలోని అధికార యంత్రాంగం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి మొత్తం ఆధారాలు రికార్డు చేసినట్లు సమాచారం. -
జైలులో అగ్నిప్రమాదం.. 17మంది మృతి
కార్కాస్: వెనిజులాలోని ఓ జైలులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 17మంది మృత్యువాతపడ్డారు. పదకొండుమంది గాయాలపాలయ్యారు. చనిపోయినవారిలో తొమ్మిదిమంది పురుషులు ఉండగా ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. రాత్రిపూట ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, అగ్నిప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలేమిటో ఇప్పటి వరకు తెలియలేదు. దర్యాప్తు చేపట్టారు. కారాబోబో రాష్ట్రంలోని టోకియుటో వద్ద ఉన్న జైలులో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక అంచనాల ద్వారా తెలుస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వెనిజులాలోని చాలా జైళ్ల నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థలు చూస్తుంటాయి. -
గెలిచి నిలిచిన పెరూ
వెనిజులాపై 1-0తో విజయం కోపా అమెరికా కప్ వాల్పరైసో (చిలీ): కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ లో పెరూ జట్టు తమ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ చేతిలో ఓడిన ఈ జట్టుకు గురువారం వెనిజులాతో జరిగిన కీలక పోరులో వెటరన్ స్ట్రయికర్ క్లాడియో పిజారో (72వ ని.) కీలక విజయాన్ని అందించాడు. దీంతో గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పెరూ 1-0తో నెగ్గింది. ఈ ఫలితంతో ఈ గ్రూపు నుంచి క్వార్టర్స్‌కు చేరే విషయంలో అన్ని జట్లకు సమాన అవకాశాలు లభించినట్టయ్యింది. నాలుగు జట్లు మూడేసి పాయింట్లతో ఉన్నాయి. ఇక తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో కొలంబియాతో పెరూ; వెనిజులాతో బ్రెజిల్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రారంభం నుంచి హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత వెనిజులా ఆధిక్యం ప్రదర్శించింది. ఆరో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా విఫలమైంది. దూకుడుగా ఆడే క్రమంలో 30వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడు గెరీరోను ప్రమాదకరంగా ఢీకొనడంతో వెనిజులా డిఫెండర్ అమోరెబీటా రెడ్‌కార్డ్‌కు గురై మైదానం వీడాడు. దీంతో 10 మందితోనే ఆ జట్టు ఆడాల్సి రావడంతో లయ దెబ్బతింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్న పెరూ విజృంభించింది. మ్యాచ్ మరో 18 నిమిషాల్లో ముగుస్తుందనగా పిజారో కొట్టిన షాట్ గోల్ పోస్టు పై నెట్‌కి తాకుతూ లోనికి చేరడంతో జట్టు సంబరాల్లో మునిగింది. కోపా అమెరికా కప్‌లో నేడు ఉరుగ్వే ఁ పరాగ్వే రాత్రి గం. 12.30 నుంచి అర్జెంటీనా ఁ జమైకా తెల్లవారుజామున గం. 3.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పైలట్ దూకేసాడు.. విమానం కూలింది
బొగోటా: వెనెజులాకు చెందిన ఓ అక్రమ మత్తుపదార్థాల రవాణా విమానం కొలంబియాలో కూలిపోయింది. దాదాపు టన్నుకు పైగా కొకైన్‌తో బయలుదేరిన విమానాన్ని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించేలోపే అందులో నుంచి పైలట్ దూకేశాడు. తదనంతరం ఆ విమానం మోటార్లు విఫలమై కొలంబియా తీరంలో కూలిపోయింది. దూకిన పైలట్ ప్రాణాలు కోల్పోగా అతడి మృతదేహాన్ని కొలంబియా తీరప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకొంది. అయితే, పైలట్ ఏ దేశానికి చెందినవాడనే విషయాన్ని గుర్తించలేదు. ఉత్తర ప్రాంతాల నుంచి మధ్య అమెరికాకు మత్తుపదార్థాలను ఎక్కువగా వెనెజులా రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ గగన తలంపై వచ్చే చిన్న విమానాలపై కొలంబియా వైమానిక సంస్థ ప్రత్యేక దృష్టిని సారించింది. -
ఊపిరి సలపనివ్వని ఇష్టం
‘‘వదల బొమ్మాళీ... వదులు కానివ్వ బొమ్మాళీ’’ అంటూ అందరూ విస్తుపోయేలా చేస్తోంది మోడల్ అలైరా. వెనిజులాలోని కార్కాస్కు చెందిన ఈ మోడల్... అత్యంత బిగుతైన కార్సెట్ (శరీరాన్ని లోపలికి నొక్కిపట్టి ఉంచే డ్రెస్) తరహా గౌన్‌ను ధరించడంలో తనతో ఎవరూ పోటీపడలేరంటోంది. అలైరా... అతి బిగుతైన ఈ డ్రెస్‌ను కొంతకాలంగా దాదాపు రోజంతా వినియోగిస్తూ వార్తల్లోకి ఎక్కింది. తద్వారా తన నడుమును 20 అంగుళాలకు తగ్గించుకోగలిగింది. అయితే నడుము దగ్గర కాసింత బిగుతుగానైనా బెల్ట్ పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని, అలాంటిది ఇలా అతి బిగుతైన తొడుగును ధరించి ఎక్కువ సేపు ఉండడం ప్రమాదకరమని ఓ పక్క డాక్టర్లు హెచ్చరిస్తున్నా... అలైరా మాత్రం అదేమీ పట్టించుకోనంటోంది. ‘‘నేను వీడని తొడుగులవి... నన్ను కట్టిపడేసే గొడుగులవి’’ అంటూ బెల్ట్, కార్సెట్ల పట్ల తన మక్కువను వెల్లడిస్తోంది. నిద్రపోయే టైమ్‌తో సహా రోజంతా తాను వాటితోనే ఉంటానని, స్నాన పానాదుల సమయంలో మాత్రం ఓ గంట వాటి విరహాన్ని అతి కష్టమ్మీద భరిస్తానని అంటోంది అలైరా. -
నీటి కొలనులో పడిన బస్సు..11మంది మృతి
కారకాస్: వెనిజులాలో బస్సు ప్రమాదం సంభంవించి 11 మంది మృతిచెందారు. 36 మంది గాయాలపాలయ్యారు. దాదాపు 50 మందితో బయలుదేరిన బస్సు ఒకటి వెలన్సియా వెళుతుండగా అనుకోకుండా నియంత్రణ తప్పింది. వెంటనే రోడ్డు నుంచి పక్కకు జారీపోయే అక్కడే ఉన్న ఓ నీటి కొలనులో పడిపోయింది. దీంతో ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయ సిబ్బంది రంగంలోకి దిగి బస్సులో చిక్కుకున్నవారిని ఎంతో శ్రమతో బయటకు తీశారు. -
భారీ బ్రెడ్
మీటర్లకొద్దీ పొడవున్న బ్రెడ్‌ను మీరెప్పుడైనా చూశారా. చూడలేదేమో. అయితే ఇక్కడ చూడండి. ఈ బ్రెడ్ పొడవు ఏకంగా 20 మీటర్లు. లోపలి వైపు పంది మాంసం ఉండే ఈ పొడవైన బ్రెడ్ బరువు 284 కేజీలు. శనివారం వెనిజులా దేశంలోని కారకస్ నగరంలో నిర్వహించిన ‘కుక్ ఎ థాన్’ కార్యక్రమంలో ఇంతటి భారీ బ్రెడ్‌ను తయారుచేశారు. గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్ సంస్థ నిర్వాహకులు దీనికి అధికారికంగా రికార్డు పత్రాన్ని ఇవ్వాల్సి ఉంది. క్రిస్మిస్ సంబరాల్లో భాగంగా దేశ ఆహార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 120 మీటర్ల పొడవైన లాటిన్ అమెరికా సంప్రదాయ వంటకం హల్లకా, 12,000 లీటర్ల చెరుకు, నిమ్మరసం మిశ్రమాన్ని సైతం గిన్నిస్ రికార్డులను బద్దలుకొట్టేందుకు తయారుచేశారు. -
రెండేళ్లలో డాక్టర్ రెడ్డీస్ మార్జిన్ గెడైన్స్ 25%
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్: ఫార్మా వ్యాపారంలో లాభదాయకత పెంచేందుకు తక్కువ మార్జిన్లున్న ఉత్పత్తులను వదిలించుకొని, వ్యయాలను నియంత్రించేందుకు నిర్మాణాత్మక వ్యూహ రచన చేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మార్జిన్ గెడైన్స్ 25 శాతంగా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో మరిన్ని కొత్త ఔషధ ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని బుధవారం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత వివిధ ఈక్విటీ రీసెర్చ్ సంస్థలకు చెందిన విశ్లేషకులతో జరిపిన కాన్ఫరెన్స్‌కాల్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు.డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్‌కు నోటి ద్వారా తీసుకునే మందుల (ఓరల్ సాలిడ్స్) తయారీ సంస్థగా మార్కెట్లో పేరుంది. అయితే దీనికి భిన్నంగా కొన్నేళ్లుగా ఇన్జెక్టబుల్స్పై దృష్టి పెట్టామని, ఈ ఏడాది ఫైల్ చేసిన 11 ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్)లలో 50 శాతం ఇంజెక్టబుల్స్, టాపికల్స్, ప్యాచెస్, సాఫ్ట్ జెల్స్ ఉన్నాయని అభిజిల్ ముఖర్జీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది 60 శాతానికి పెరుగుతుందని, దీని వల్లనే పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వ్యయాలు పెరుగుతున్నాయన్నారు. చర్మ వ్యాధుల చికిత్సలో వాడే ఔషధాల తయారీలో పోటీ తక్కువగా ఉండటంతో పాటు లాభదాయకత అధికంగా ఉండటంతో ఆ మార్కెట్‌పై దృష్టి పెట్టామన్నారు. వెనిజులా ప్రధాన మార్కెట్? అమెరికా, రష్యా తర్వాత వెనిజులా దేశం తమకు అత్యంత ప్రధాన మార్కెట్గామారిందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధామార్థంతో పోలిస్తే ద్వితీయార్థం ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. అమెరికా మార్కెట్లో సరఫరా చేస్తున్న జనరిక్ ఔషధాల ధరలు గత రెండేళ్లలో అనూహ్యంగా పెరగడంపై దర్యాప్తు కోరుతూ అక్కడి ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన వివాదాస్పద అంశాలపై సాధికార వివరణలిచ్చామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సౌమెన్ చక్రవర్తి తెలిపారు. -
స్వర్ణ స్ఫటికం
న్యూయార్క్: కొన్నేళ్ల క్రితం వెనిజువెలాలో కనుగొన్న బంగారపు తునకను ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి స్ఫటికం(గోల్డ్ క్రిస్టల్)గా గుర్తించారు. దీని బరువు 217.78 గ్రాములు. విలువ 15 లక్షల డాలర్లు (మన కరెన్సీలో 9 కోట్ల రూపాయలపైనే). ఇంత పరిమాణం కలిగిన కూడిన గోల్డ్ క్రిస్టల్‌ను అధ్యయనం చేయడం ఇదే ప్రథమమని మియామీ యూనివర్సిటీ జియాలజిస్ట్ జాన్ రాకోవాన్ అన్నారు. వెనిజు లాలోని ఓ నదిలో నాలుగు దశాబ్దాల క్రితం ఇలాంటి నాలుగు క్రిస్టల్స్ దొరికాయి. అమెరికాలో నివసించే వీటి యజమాని ఒక క్రిస్టల్‌ను పరిశోధన నిమిత్తం మియామీ యూనివర్సిటీకి ఇచ్చాడు. దీన్ని గోల్డ్ క్రిస్టల్‌గా యూనివర్సిటీ ధ్రువీకరిస్తే, సహజసిద్ధంగా ఏర్పడిన ఈ స్ఫటికం విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. -
మాజీ బాక్సింగ్ ఛాంపియన్ కిడ్నాప్.. హత్య
వెనిజువెలాకు చెందిన మాజీ బాక్సింగ్ ఛాంపియన్ ఆంటోనియో సెర్మెనోను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. అనంతరం హతమార్చారు. సెర్మెనో గతంలో ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి సూపర్ బాంటమ్ వెయిట్, ఫెదర్ వెయిట్ ఛాంపియన్‌గా ఉండేవారు. 1980లు, 90లలో ఈ రెండు విభాగాల్లో ఆయనదే రాజ్యం. 44 ఏళ్ల సెర్మెనోను ఆయన కుటుంబ సభ్యులతో సహా అందరినీ సోమవారం నాడు అపహరించారు. మంగళవారం నాడు తూర్పు కారకాస్ ప్రాంతంలో ఆయన మృతదేహం జాతీయ రహదారి మీద పడి కనిపించింది. ఆయన మరణానికి వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సంతాపం తెలిపారు. వెనిజువెలాలో ఇటీవలి కాలంలో హింసాత్మక సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని అరికట్టేందుకు గాను ప్రభుత్వం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాల్లో సెర్మెనో శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. తద్వారా యువకులను వీధిపోరాటాలకు దూరం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే, సెర్మెనో హత్యకు కారణాలేంటన్న విషయాన్ని అధికారులు ఇంతవరకు వెల్లడించలేదు. -
బ్యాంకింగ్ అవగాహన
1. The World Trade Organization (WTO) deals with the global rules of trade between nations. Who is the Director General of WTO? a) Roberto Azevedo b) Christine Legarde c) Raghuram Rajan d) Oliver Ralph Kahn e) None of the above 2. RBI on October, 7th 2013, has reduced Marginal Standing Facility(MSF) rate from 9.5% to 9% to improve liquidity in the system. What is MSF? a) MSF rate is the rate at which banks lodge funds overnight with RBI buying approved government securities. b) MSF rate is the rate at which banks borrow funds overnight from other banks against approved government securities. c) MSF rate is the rate at which banks borrow funds overnight from RBI against approved government securities. d) MSF rate is the minimum rate at which banks lend to the borrowers. e) None of the above 3. Between 2007-08 to 2012-13,the value of Card spending rose to Rs.1.97 Lakh Crores. A raise in Cards spending indicates? a) Transformation to 'Cashless Economy' b) Low inflation c) Raising incomes d) Falling prices e) None of the above 4. What is NOT true with regard to 'Carbon Credit'? a) It is a tradable certificate or permit. b) It represents the right of an Industry to emit certain quantity of Carbon Dioxide. c) Carbon Credits mechanism was formalized in Kyoto Protocol. d) Carbon Credits are currently traded on 5 exchanges across the globe. e) None of the above. 5. Arundhati Bhattacharya is in news recently. She is going to be? a) 1st woman Deputy Governor of RBI b) 1st woman Chair Person of SBI c) 1st woman Deputy Chairman of Planning Commission d) 1st woman Finance Secretary to Govt. of India e) None of the above 6. National Spot Exchange (NSEL) is the news for defaulting payments to investors. Who is the founder promoter of FT? a) Jignesh Shah b) Harshad Mehta c) Ketan Parekh d) A K Telgi e) None of the above 7. Find the 'odd man out' of the following? a) Walmart b) Tesco c) Carrefour d) Big Bazar e) Ikea 8. One of the Primary functions of IMF is to provide short term capital assistance to member countries through SDR (Special Drawing Rights). What is NOT true about SDR? a) Currency code of SDR is XDR b) SDR is the Unit of Account of IMF c) Asian Development Bank (ADB) also uses SDR as its Currency d) SDR can be exchanged only for US Dollar, British Pound, Euro & Japanese Yen e) None of the above 9. Main functions of Money? a) Medium of Exchange b) Unit of Account c) Store of Value d) Only 'a' and 'b' of the above e) 'a', 'b' & 'c' of the above 10. M/s XYZ company has got an order to supply Machinery to M/s ABC Co of Nigeria. Who has to get a Letter of Credit issued from a Bank? a) M/s ABC since they are the importers b) M/s XYZ since they are the exporters c) Both since they are the parties to the agreement d) RBI since they regulate the Foreign Trade in India e) None of the above 11. What is 'Packing Credit'? a) Finance extended to Packing materials industry b) Finance extended to an Importer to pack the goods imported c) Finance extended to Warehouses for keeping the goods packages d) Finance extended to an Exporter to meet the costs of buying and/ or making products to be exported e) None of the above 12. What is NOT true with regard to Currency Chests in India? a) They are managed by different banks on behalf of RBI b) Deposits in Currency Chests are taken into account for calculation of CRR(Cash Reserve Ratio) c) Standard Chartered Bank a Foreign Bank also maintains Currency Chest d) Coins are also stored in Currency Chests e) None of the above 13. Recently Parliament has pass-ed Companies Act 2013. What is NOT true with regard to some of the features of the Act? a) An Individual can set up "One person Private Ltd Company" b) An independent Director can hold 3 consecutive terms of 3 years c) Listed Companies must have at least 1/3rd independent Directors d) Prescribed Companies must have at least 1 woman Director on the Board e) A Private Ltd Company can have a maximum of 200 members 14. What is 'Net Interest Margin' of a Bank? a) Margin of Interest earned on Trading in Govt Securities b) Difference between the Base Interest Rate and the Average Lending Rate c) Difference between the interest income and the amount of interest paid out d) Difference between Interest on Term Loans and Interest on Cash Credits e) None of the above 15. What is the World's largest functioning Oil Refinery? a) Reliance Refinery in Jamnagar, Gujarat b) IOC Refinery in Digboi, Assam c) HPCL Mumbai Refinery d) Paraguana Refinery, Venezuela e) Exxon Mobil Refinery, Singapore 16. IIFCL (India Infrastructure Finance Co. Ltd) is wholly-owned Govt. of India Company. Who is selected to take over as the Chairman and Managing Director? a) C B Bhave b) S B Nayar c) T S Vijayan d) Yogesh Agarwal e) None of the above 17. Till 30th June, 1955 State Bank of India(SBI) was known as? a) State Bank of British India b) Imperial Bank of India c) India Central Bank d) Central Bank of British India e) None of the above 18. Where is the Asian Development Bank(ADB) located? a) Mumbai, India b) Hiroshima, Japan c) Shanghai, China d) Manila, Philippines e) Jakarta, Indonesia 19. Structured Financial Messa-ging System (SFMS) is a secure messaging standard developed to serve as a platform for intra-bank and inter-bank applications in India. Which of the following have interface with SFMS? a) RTGS(Real Time Gross Settlement) b) Negotiated Dealing System (NDS) c) Security Settlement System (SSS) d) 'a' and 'c' of the above e) 'a', 'b' & 'c' of the above 20. Which Country is the largest producer of Tea in the world? a) India b) Brazil c) Peoples Republic of China d) Srilanka e) None of the above 21. Who is the CEO & MD of TCS(Tata Consultancy Servi-ces)? a) Cyrus Mistry b) S Ramdorai c) N Chandrasekharan d) Ratan Tata e) None of the above 22. Qualitative Credit Contro is one of the methods used by RBI to control credit. Which of the following is NOT a Qualitative Credit Control tool? a) Moral Suasion b) Marginal Requirement c) Rationing of Credit d) Bank Rate e) 'a' & 'd' of the above 23. Who is the Chairperson of 14th Finance Commission? a) Dr Yaga Venugopal Reddy b) Dr Vijay L Kelkar c) Dr C Rangarajan d) Dr Duvvuri Subbarao e) None of the above 24. The 12th Five Year Plan (2012-17) is approved by Union Cabinet on 4th October, 2012. The aims of the plan are? a) 8% average growth rate b) Reduce Poverty by 10% during the Plan c) Faster, Sustainable and More inclusive Growth d) All the 3 above e) None of the above 25. Which State is the largest producer of Cotton in India in the year 2012-13? a) Gujarat b) Maharashtra c) Andhra Pradesh d) Karnataka e) Madhyapradesh 26. Who sets up the Bench Mark Interest Rate for Germany? a) German Central Bank b) Deutsche Bundes Bank c) European Central Bank(ECB) d) Deutsche Bank e) None of the above 27. What is India's Apex Tax body? a) CBDT b) GAAR c) IT Department d) RBI e) None of the above 28. FICCI is an Association of Business Organizations in India. Who is the President of FICCI? a) Shikha Sharma b) Usha Thorat c) Naina Lal Kidwai d) Indra Nooyi e) None of the above 29. Banks in India are governed by BR Act 1949. What does 'BR' stands for? a) Banks Registration b) Banking Re-organization c) Banking Regulation d) Banking Rights e) None of the above 30. In India, Scheduled Commercial Banks are those Banks included? a) In the 2nd Schedule of RBI Act 1934 b) In the 2nd Schedule of BR Act 1949 c) In the 2nd Schedule of NI Act 1881 d) In the 2nd Schedule of Companies Act 1956 e) None of the above Answers: 1.a 2.c 3.a 4.e 5.b 6.a 7.d 8.e 9.e 10.a 11.d 12.e 13.b 14. c 15.a 16.b 17.b 18.d 19.e 20.c 21.c 22.c 23.a 24.d 25.a 26.c 27.a 28.c 29.c 30.a -
ఫ్రాన్సులో 1.3 టన్నుల కొకైన్ స్వాధీనం
ఎక్కడైనా కిలో, పది కిలోల కొకైన్ పట్టుబడటం చూశాం. కానీ ఫ్రాన్సులో కస్టమ్స్ ఏజెంట్లు ఏకంగా 1.3 టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించారు. వెనిజులా నుంచి ప్యారిస్ వచ్చిన ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఇది ఉన్నట్లు ఫ్రెంచి అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. చార్లెస్ డి గాలీ విమానాశ్రయానికి వచ్చిన కార్గో విమానంలో పలు సూట్‌కేసులలో ఈ కొకైన్ ఉంది. దీని విలువ దాదాపు 433 కోట్ల రూపాయలు!! కారకాస్ నుంచి ఈ విమానం ప్యారిస్ వచ్చింది. ఫ్రాన్సుకు తమ దేశంనుంచి కొకైన్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది ఎవరో తెలుసుకోడానికి తాము దర్యాప్తు చేయనున్నట్లు వెనిజులా అటార్నీజనరల్ కార్యాలయం తెలిపింది. డ్రగ్స్ రవాణాను అడ్డుకోడానికి అంతర్జాతీయ ఒప్పందాలపై వెనిజులా తగినవిధంగా స్పందించడంలేదని అమెరికా ఇటీవలే ఆరోపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కొకైన్‌ను ఉత్పత్తి చేసే కొలంబియాతో వెనిజులాకు 2,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది!!