
నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన తర్వాత వైట్‌హౌస్ నుంచి విమర్శల వాన కురిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కాకుండా వెనెజులా ప్రతిపక్ష నేత, ఆ దేశంలో ప్రజాస్వఘ్యానికి పాటుబడ్డ మరియా కొరీనా మచోడాకు నోబెల్ శాంతి పురస్కారం లభించడమే అందుకు కారణం.
నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్‌హౌస్. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్‌ను జోడించారని విమర్శించింది.
ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్‌పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వెనెజులా శాంతి స్థాపనలో ట్రంప్ కృషి వెలకట్టలేనిదని నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న మరియా ప్రశంసించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘ అంతా మీ చలవే.. ట్రంప్‌ను గుర్తుపెట్టుకుంటాం’ అంటూ ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి.
2025 నోబెల్ శాంతి పురస్కారం విజేత మరియా కొరీనా మచాడో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పలు సందర్భాల్లో కొనియాడారు. ముఖ్యంగా వెనిజులా ప్రజాస్వామ్య పోరాటానికి ఆయన మద్దతును కొనియాడారు.. ట్రంప్‌ను “వెనిజులా స్వేచ్ఛకు అత్యంత గొప్ప అవకాశంగా” ఆమె అభివర్ణించారు. ట్రంప్ పాలనలో మడురో ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు దోహదపడిందన్నారు.
President Trump,
Your unwavering support for Venezuela’s fight for democracy is deeply valued.
With extraordinary courage, the Venezuelan people have consistently defied fear and brutal repression, standing united to reject a criminal regime desperate to cling to power and… https://t.co/7EVCvHiQ2v— María Corina Machado (@MariaCorinaYA) January 11, 2025
ఇక ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంతో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ నా నోబెల్ నాకు కావాలి’ అంటూ ట్రంప్‌ను ట్రోల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: