డొనాల్డ్ ట్రంప్.. ‘‘వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని బంధించి గెలిచేశాం. ఇక వెనెజువెలా అంతా మా చేతుల్లోనే’’
ట్రంప్‌లోని మరొక మనిషి.. ‘‘ఇక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన వెనెజువెలా ప్రతిపక్ష నేత మచాడో కూడా ఆ పురస్కారాన్ని నాకు ఇస్తానంటుంది.. ఇక తీసుకోవడమే తరువాయి. ఆ బహుమతిని కూడా తీసుకుంటే నా కల తీరిపోతుంది’’
నోబెల్ ఇనిస్టూట్యూట్.. ‘ఒకరికి ఇచ్చిన పురస్కారాన్ని వేరే వాళ్లకు ఇవ్వడం కుదరదు. ఆ బహుమతి ఎవరికి ఇస్తే వారికే శాశ్వతం. బదిలీ కుదరదు’ అని స్పష్టం
ఈ క్రమంలోనే ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ట్రంప్.. భావోద్వేగాల పరంగా చూస్తే ఆయన మనసు కనీసం ఈరోజు సమావేశం అయ్యి ఉండొచ్చు. నోబెల్ కోసం ట్రంప్ మనసు లో సమావేశం జరిగితే ఇలానే ఉంటుందేమో. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ గోడలను వదిలిపెట్టి.. ఏకాంతంగా ట్రంప్ అంతరంగ మథనం ఎలా ఉంటుందో చూద్దాం.
ట్రంప్ ప్రధాన అజెండా: ‘నోబెల్ శాంతి బహుమతి నాకు వస్తుందా… లేదా?’
అంతర్మథన ప్రతినిధుల వాదనలు
ఆశావాద వర్గం: ‘ మచాడో ఇచ్చేస్తానంటుంది… ఇక బహుమతి నా చేతిలోనే!
నిరాశావాద వర్గం: ‘ నోబెల్ ఇనిస్టిట్యూట్ వద్దు అంటోంది. ఇవ్వరు… ఇవ్వనివ్వరు… ఇది అంతా కలగానే మిగిలిపోతుంది’
ప్రచార వర్గం: ‘బహుమతి రాకపోయినా, ట్విట్టర్‌లో ‘నేనే గెలిచాను’ అని చెప్పేస్తే సరిపోతుంది!’
తాజా సర్వే
ట్రంప్ మెదడులో నిర్వహించిన ఓటింగ్ ప్రకారం:
45% ఆలోచనలు ‘నోబెల్ వస్తుంది’ అని నమ్ముతున్నాయి.
55% ఆలోచనలు ‘ఇది కుదరదు’ అని నిరాశతో తలదించుకున్నాయి.
ట్రంప్ మనసు తుది తీర్మానం
నోబెల్ శాంతి బహుమతి రాకపోయినా, ‘నేను శాంతి ప్రతీకనే… కానీ నా మనసులో మాత్రం యుద్ధం కొనసాగుతుంది’ అని ట్రంప్ అంతర్మథన సమావేశం ముగిసింది.
మయసభ ఘట్టం మాదిరి..
మహాభారతంలో మయసభ ఘట్టం చాలా ముఖ్యమైంది. ప్రసిద్ధి పొందింది కూడా. పాండవులు అశ్వమేథ యాగం నిర్వహించినప్పుడు.. దుర్యోధనుడు బస చేసిన అద్భుత భవనం మయసభ. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అనేకానేక చిత్ర విచిత్రమైన ఏర్పాట్లతో విశ్వకర్మ దీన్ని నిర్మించాడని ప్రతీతి. అయితే దుర్యోధనుడు ఇక్కడ ఉండగా... నేల అనుకుని నీటి కొలనులో అడుగుపెట్టి కింద పడతాడు. అది చూసి... ద్రౌపది చెలికత్తెలు ఫక్కుమని నవ్వితే.. అది ద్రౌపదేనని నమ్మిన దుర్యోధనుడు అవమానానికి గురైనట్లు ఫీలవుతాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉండి ఉంటుంది.
నోబెల్ శాంతి బహుమతి అన్నది ఆయనకు ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. ఎన్నో యుద్ధాలు ఆపానని చెప్పుకునే ట్రంప్.. ‘నేను నోబెల్ శాంతికి’ అర్హుడినని పదే పదే చెప్పుకున్నారు కూడా. అయితే ఆ పురస్కారం ఆయన దరిదాపుల్లోకి కూడా చేరలేదు. ఇక్కడ కనీసం ఆ పురస్కారాన్ని గెలిచిన వెనెజువెలా ప్రతిపక్ష నేత కొరీనా మచోడా.. ఆ పురస్కారాన్ని ట్రంప్‌కు ఇస్తానని పదే పదే అంటున్నప్పటికీ అది కూడా తీరే పరిస్థితి లేదు.దాంతో తనకు అసలు నోబెల్ శాంతి పురస్కారం వస్తందా.. లేదా.. అది తన భ్రాంతియేనా? అన్నట్ల మారిపోయింది.


