ఈ–వీసాలు ఉంటేనే యూకే ప్రయాణం | UK makes eVisa compulsory under the new travel rule | Sakshi
Sakshi News home page

ఈ–వీసాలు ఉంటేనే యూకే ప్రయాణం

Feb 26 2026 4:56 AM | Updated on Feb 26 2026 12:16 PM

UK makes eVisa compulsory under the new travel rule

అమల్లోకి వచ్చిన డిజిటల్‌ ట్రావెల్‌ వ్యవస్థ  

లండన్‌: యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) వీసాల విషయంలో కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. పూర్తిస్థాయిలో డిజిటలీకరణ ప్రారంభమైంది. డిజిటల్‌ ట్రాన్సిట్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారతీయ పర్యాటకులు ఇకపై తప్పనిసరిగా ఈ–వీసాలు పొందాల్సి ఉంటుంది. వీసా అవసరం లేని పర్యాటకులైతే ఎల్రక్టానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌(ఈటీఏ) తీసుకోవాలి. 

పేపర్‌ ఆధారిత వీసా స్టిక్కర్లు ఇకపై ఉండవు. అయితే, బయోమెట్రిక్‌ రిజి్రస్టేషన్‌ కోసం దరఖాస్తుదారులు వీసా జారీ కేంద్రానికి స్వయంగా వెళ్లాల్సిందే. యూకే వెళ్లాలంటే కచ్చితంగా డిజిటల్‌ అనుమతి తీసుకోవాలి. ఈ–వీసా గానీ, ఈటీఏ గానీ, సరైన డాక్యుమెంటేషన్‌ గానీ లేకపోతే విమానం ఎక్కడానికి అనుమతి ఉండదు. ఈ–వీసా వ్యవస్థను యూకే ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించింది. దశల వారీగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటిదాకా ఫిజికల్‌ డాక్యుమెంట్లు కూడా స్వీకరించారు. 

ఇకపై ప్రక్రియ మొత్తం యూకే వీసా, ఇమిగ్రేషన్‌(యూకేవీఐ) సిస్టమ్‌లోనే పూర్తవుతుంది. ఒకవేళ ఈ–వీసా గనుక చోరీకి గురైనా, ఎక్కడైనా కనిపించకుండాపోయినా వెంటనే ఇమిగ్రేషన్‌ హక్కులు నిరూపించుకోవాలి. కొత్త నిబంధనల వల్ల యూకే ప్రయాణం మరింత సులభతరంగా మారుతుందని యూకే ఇమిగ్రేషన్, సిటిజెన్‌íÙప్‌ శాఖ మంత్రి మైక్‌ ట్యాప్‌ చెప్పారు. ఈ–వీసాలు పొందినవారు, ఈయూ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ స్టేటస్‌ ఉన్నవారు యూకేవీఐ అకౌంట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని యూకే హోంశాఖ సూచించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌ వంటి కొన్ని దేశాల పౌరులు యూకేలో పర్యటించాలంటే వీసా అవసరం లేదు. ఈటీఏ ఉంటే సరిపోతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement