అప్పుడు డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్.. నిషేధం! | China To Ban Half Steering Wheel After Flush Door Handles To Strengthen Vehicle Safety From 2027, Know The Details Here | Sakshi
Sakshi News home page

అప్పుడు డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్.. నిషేధం!

Feb 14 2026 4:24 PM | Updated on Feb 14 2026 4:48 PM

China To Ban Half Steering Wheel After Flush Door Handles Know The Details Here

చైనా ప్రభుత్వం వాహన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త భద్రతా ప్రమాణాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది.

ఇప్పటికే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధించిన చైనా, ఇప్పుడు యోక్ స్టైల్ హాఫ్ స్టీరింగ్ వీల్స్‌ సైతం నిషేధించింది. భద్రతా నియమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలేలా కఠినతరం చేయడం, ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ఈ నిషేధాల వెనుక ఉన్న ప్రధాన ఉదేశ్యం.

హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్‌ను టెస్లా ప్రారంభించింది. ఆ తరువాత చాలా చైనీస్ కంపెనీలు ఇలాంటి స్టైల్ ఫాలో అయ్యాయి. ఇలాంటి స్టీరింగ్ వీల్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు కలిగే గాయాలలో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణంగా సంభవిస్తున్నాయి. సాధారణ రౌండ్ స్టీరింగ్ వీల్ ప్రమాద సమయంలో.. డ్రైవర్ ముందుకు ఒరిగినప్పుడు శరీరానికి కొంత పట్టు లభిస్తుంది. హాఫ్ స్టీరింగ్ వీల్ శరీరానికి కొంత ప్రమాదం కలిగిస్తుంది.

కొత్త ప్రమాణాల ప్రకారం.. 2027 నుంచి చైనాలో అమ్మకానికి వచ్చే కొత్త కార్లు హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ పొందకూడదు. అంతే కాకుండా.. ఇలాంటి స్టైల్ స్టీరింగ్ వీల్ కలిగిన వాహనాల్లో కూడా చేంజ్ చేసుకోవడానికి 13 నెలల గడువు ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే.. కార్లను తప్పకుండా నియమాలను పాటించాల్సిందే అని అవగతం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement