ట్రంప్ వ్యాఖ్యలన్నీ అబద్దాలే..ఇరాన్ | Iran angered by Trump comments | Sakshi
Sakshi News home page

ట్రంప్ వ్యాఖ్యలన్నీ అబద్దాలే..ఇరాన్

Feb 25 2026 9:01 PM | Updated on Feb 25 2026 9:03 PM

Iran angered by Trump comments

టెహ్రాన్: "ట్రంప్ ది స్టేట్ ఆఫ్ ది యూనియన్" ప్రసంగంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ చేసిన వాఖ్యలన్నీ పెద్ద అబద్దాలనీ తెలిపింది. అణుకార్యక్రమంపై అమెరికా చేస్తున్న ఆరోపణల్లో అస్సలు నిజం లేదని వెల్లడించింది. జోసఫ్ గ్లోబల్స్ తరహాలో ట్రంప్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇరాన్ మండిపడింది.  అణుచర్చల పేరుతో ట్రంప్ దాడులకు దిగితే అస్సలు సహించేది లేదని తెలిపింది. 

ఇటీవల  ఇరాన్‌లో జరిగిన  నిరసనల్లో ట్రంప్ చెప్పిన మరణాల సంఖ్య పూర్తిగా కల్పితమే అని తెలిపింది.  మధ్యప్రాచ్యంలో అమెరికా తన బలగాలు మోహరించడంపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా త్వరలో అమెరికా- ఇరాన్ మధ్య అణు చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైతే అమెరికా దాడులు చేసే అవకాశాలే అధికంగా ఉ‍న్నాయి. ఈ నేఫథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాపై మండిపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement